ముంగిలి > పిచ్చాపాటి > ఇడ్డూరం – A Paradox!

ఇడ్డూరం – A Paradox!

ఇదేదో సినిమా టైటిల్లా ఉందేఁ?

నిన్న ఏదో కొనడానికి చిన్న కొట్టుదగ్గిర బండాపినపుడు, గుప్పుమని సుగంధం. మంచి నెయ్యితో – ఎండిన సమిధలతో హోమం జరిగినట్టు ఆ సుగంధం చెప్పకనే చెబుతోంది. ఏంటా?!? అని పరికిస్తే, పక్కనే ఉన్న ఓ ఖాళీ దుకాణంలో అప్పుడే హోమం పూర్తయినట్టు తెలుస్తోంది. సామాగ్రి సద్దుకుంటున్న పురోహితుడు; ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవిలా ఉన్నతను; ఓ ముత్తైదువ – ఇంకా అగ్నిహోత్రం వెలుగుతున్న హోమ గుండం. ఆ ఖాళీ దుకాణంలో కొత్తగా ఏదో వ్యాపారం మొదలుపెట్ట బోతునట్టు తెలుస్తోంది. బహుశః మొదలు పెట్టే ముందు, వ్యాపారం బాగా జరగాలని యజమాని చేయించిన పూజలో భాగంగా హోమం జరిపించుంటాడు. నాకు పనున్న కొట్టువాడిని అడిగా “ఏంటి – పక్కన ఖాళీగా ఉన్న దుకాణంలో ఏదన్నా కొత్త వ్యాపారం మొదలెడుతున్నారా?” అని. అతను అవును అని చెబితే పోయేది. నాకీ టపా రాసే పని తప్పేది! ‘అవును’ అని మాత్రమే కాకుండా, ఏ వ్యాపారం పెట్టబోతున్నారో కూడా చెప్పాడు. అప్పుడు బుఱ్ఱలో మెదిలిన భావన – “What a Paradox?” అని.

ఏ రకంగానూ ఎవరి తప్పూ కనబడట్లేదు – కానీ అదొక Paradox. దక్షిణ లభిస్తుందని యజమానితో హోమం చేయించిన పురోహితుడి తప్పేమన్నా ఉందా? లేదు. వ్యాపారం మొదలుపెట్టే ముందు ‘దేవుడి దయ వల్ల – అన్నీ కలిసిరావాలీ’ అని సంకల్పించి నమ్మకంతో హోమం చేయించిన వ్యాపారస్తుడి తప్పేమన్నా ఉందా? ఎమీ లేదు. తన భర్త వ్యాపార నిమిత్తం పూజలో భాగంగా హోమం చేయిస్తున్నందున, ధర్మపత్ని కాబట్టి ఆవిడ – ఆయన పక్కన కూర్చొని హోమంలో పాల్గొనడం తప్పా? కాదు సరిగదా తను చేసింది ఎంతో సబబు. కానీ మొత్తం యవ్వారం ఓ పెద్ద విడ్డూరం.

నేనడిగినపుడు కొట్టువాడు చెప్పిన సమాధానం – “అవును, ఆ ఖాళీ దుకాణంలో ఒక Bar & Restaurant తెరవబోతున్నారు” అని.

‘ఇందులో ఇడ్డూరం యాడుంది? అసలు ఈ టపాయే ఓ ఇడ్డూరం కాదేంటీ’ అంటారా?

పాపాలలో తలమానికాలు ‘పంచమహా పాతకాలు.’ వాటిలో ‘మధ్యపానం’ ఒకటి. ఇప్పుడు చూడండి విడ్డూరం ఎక్కడుందో?

 1. గట్టి నమ్మకముంది కాబట్టే పూజతో ఆపక, హోమం కూడా చేయించారు. సనాతన ధర్మంపై అంత నమ్మకమున్నప్పుడు, మహాపాతకాలతో ఒక దానిని జీవనాధారంగా ఎంచుకోవడం విడ్డూరం కాదా?
 2. సరే – ‘ఆ వ్యాపారస్తుడికి తెలియదేమో’ అని డిస్కౌంట్ ఇద్దాం. మరి ‘పురము యొక్క హితముకోరేవాడైన’ ఆ పురోహితుడికన్నా తెలియాలి కదా? అటువంటి దానితో ముడిబడియున్న విషయం అభివృద్ధికై హోమం ఎలా చేయిస్తాడు? ఇది ఇంకా విడ్డూరం కాదా?
 3. హోమాదికాలు – భార్య పక్కన లేకుండా, ఫలించవు. ఆ హోమం పూర్తి ఫలితానివ్వటానికి ఆవిడ పాత్రా ఉంది. భార్య ధర్మం ఒక కోణంలో సవ్యంగా నిర్వర్తించినా, తన భర్త పాపాల ఖాతా ఇక నుండి దినదిన ప్రవర్ధమానంగా పెరగటానికి తోడ్పడి – మరో కోణంలో ధర్మం తప్పినట్టే కదా? పై పెచ్చు, రేపు ఎవరన్నా ఆ Barలో మందు తాగి బండి నడిపిస్తూ ప్రమాదానికి లోనైతే, మరొక సువాసినీ సౌభాగ్యాన్ని దూరం చేయటంలో – తెలిసో, తెలియకో తనకూ భాగం ఉన్నట్టే కదా? పై రెంటికన్నా ఇది పెద్ద Paradox ఏమో?
 4. Mother of all Paradoxes – రేపెప్పుడో సుడి కలిసొచ్చి – Bar మాంచి లాభాలు తెచ్చిపెడితే “అంతా దేవుడి దయ” అన్నాడనుకోండి – పాపం ఆ దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు?

Ignorance is bliss అనిపిస్తోందా? ఈ టపా ఎందుకు చదివానురా అనిపిస్తోందా? నేనేం రాయలేదు – మీరేం చదవలేదు. ఎవరికీ చెప్పను లెండి.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 9:01 ఉద. వద్ద డిసెంబర్ 15, 2011

  🙂

  ఒహ్హో! నాకో సంగతి అర్థం అయ్యింది !
  అసలు ఇక్కడ హైదరాబాదులో medical shop లతో సమన సంఖ్యలో (ఇక్కాస్త) ఎక్కువేనేమో లెండి,
  మందు షాపులు ఉన్నాయ్, కానీ యిది (మద్యపానం) పంచమహా పాతకాలలో ఒక్కతనే స్పృహ కలగలేదు,
  కాబట్టే వాటిని ప్రోతహిస్తున్న ప్రభుత్వం ఇంత అధ్వన్నంలో ఉందన్నమాట
  దేశంలో రూపాయి విలువ పది పోవటానికి ఈ పతాకమే కారణమేమో అనిపిస్తున్నది
  అవునండీ దుష్కర్మకు live లోనే ఇంత effect ఉంటె దాని పర్యవసానం వారి గతి తరువాత ఎమౌతున్దంటారు?

 2. 10:09 ఉద. వద్ద డిసెంబర్ 15, 2011

  వైనతేయ సోమం పిబ !

  చీర్స్
  జిలేబి.

 3. 12:31 సా. వద్ద డిసెంబర్ 15, 2011

  మీరు చెప్పిన స్పృహ ఉంటే అసలౌ తాగేవాడే లేడు. మద్యం వాపారం సంగతటుంచి. దేశకాలాలల్లాఉన్నాయి సార్!

 4. panyala jagannath das
  7:42 సా. వద్ద డిసెంబర్ 15, 2011

  పిబరే సోమరసం…

 5. 1:47 సా. వద్ద డిసెంబర్ 16, 2011

  ‘ఎం.ఏ.’, ‘క.ఫ. శర్మ’ గార్లు: రాష్ట్రఖజానాకు ఆబ్కారివల్ల బాగా కలిసొస్తుంది. నేను ‘మందు’ మంచిదీ-కాదు అని ఏమీ రాయలేదు. ఒక ధర్మాన్ని కేవలం పాక్షికంగా నమ్మడాన్ని మాత్రమే ఒక ‘Paradox’ అని చిత్రీకరించా!

  ‘జిలేబి’ గారు: లా పాయింటా? “సుతపాత్రో సుతా ఇమే శుచయో యన్తి వీతయే| సోమరసో దధ్యాశిరః:||” (ఋగ్వేదం). అర్థం చెప్పమంటారా?

  ‘జగన్నాథ్‌’ గారు: ఏమీ తప్పులేదు. పెరుగు-పాల మిశ్రమమైన సోమరసాన్ని ఎంతైన ‘పీబొచ్చు’…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s