ముంగిలి > పిచ్చాపాటి > స్నేహమంటే?

స్నేహమంటే?

ఆ రోజు స్కూలునుండి ఇంటికి తిరిగి వస్తున్న తన ముద్దుల పాపను చూసిన వాళ్ళమ్మకు – మూర్ఛవచ్చినంత పనైంది. UKG లో చదివే ఆ ముద్దులొలికే పాప షర్టుకాలరంతా ఎండిన రక్తపు మరకలు. తలకు కాస్తంత పెద్ద కట్టు కట్టి ఉంది. చేస్తున్న పనాపేసి ఆదుర్దాగా అడిగింది అమ్మ “ఏమయిందే బంగారూ? ఎంటీ రక్తం? తలకు కట్టేంటి? ఏం జరిగిందమ్మా?” వచ్చీ-రాని బాషలో పాప సమాధానం “నా ఫ్రెండూ…పెన్సిల్ ఇవ్వలేదని తోసేస్తే…కింద పడుతూ పక్క బల్ల తగిలి…ఆయయ్యిందమ్మా! మా టీచరు కట్టు కట్టించారు!”

ఎవరే ఆ ముదనష్టపు ఫ్రెండు?” అడిగింది అమ్మ. పాప సమాధానం – “నా క్లాసులో ప్రెండమ్మా!” మళ్ళీ అమ్మ ప్రశ్న “ప్రెండు పేరేంటే?” దానికి పాప సమాధానం “అదే ‘రెడ్ ఫ్లాప్స్’ వేసుకునే ఫ్రెండు…” చిరాకుగా మరుతున్న ఆదుర్దాను అణుచుకుంటూ మళ్ళీ ప్రయత్నించింది అమ్మ “ఇప్పుడూ…ఆ రెడ్ ఫ్లాప్స్ వేసుకునే పాప నీ ఫ్రెండు కదా! ఫ్రెండైతే పెన్సిలివ్వలేదని ఎందుకు తోసేస్తుంది? ఇంతకీ తన పేరేంటే?” దానికి సమాధానం “తెలీదమ్మా…అసలే నొప్పేస్తుంటే, ఇన్నిని కొచ్చన్లు ఎందుకడుగుతున్నావు?”

దానికి అమ్మ ప్రతిక్రియ ఏంటో చెప్పనక్కర్లేదు “ఒసే వెర్రి మొహందానా! పేరు తెలీకుండా ఫ్రెండేంటే? కనీసం ‘సారీ’ అన్నా చెప్పిందా ఆ రాక్షసి?” చిరాకుగా పాప సమాధానం “లేదు.”

‘సర్లే, పాప UKGఏ కదా – పాపం Friend అన్న పదానికి అర్థం తెలిసుండదు’ అని పక్కన పెట్టుండొచ్చు. Friend అనే పదానికి అర్థం, ఏ తరగతికెళ్ళాక తెలిసొస్తుంది?

స్నేహం

స్నేహం

కొన్నేళ్ళ క్రితం దాకా, భూమ్మీద ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా – మహా అంటే ఆరుగురి దూరం ఉంటుందని లెక్కకట్టారు. అదే ‘Six degrees of separation.’ ఈ మధ్యకాలంలో Facebook లెక్క ప్రకారం, అది 4.74కు తగ్గిందట. Facebook పుణ్యమా అని – Friend అన్న పదం అర్థమే మారిపోయిందేమో అని అనిపిస్తోంది. Facebookఏ కాదు – ఇతర Social Networking మాధ్యమాలన్నిటి ప్రభావం కలిపి చూస్తే! ‘Friend‘ ఇంకా ‘Acquaintance‘ అన్న పదాల మధ్యనున్న వ్యత్యాసం చెరిగిపోతోంది. ‘పరిచయం’ = ‘స్నేహం’ అవుతున్న రోజులివి.

Spanish బాషలో ఎంత బాగా చెప్పారో! మెక్సికన్ల సామెత ఒకదాని ఆంగ్ల అనువాదం చాలా మందికి తెలిసిందే – Tell me who your friends are and I will tell you who you are. స్నేహితుల బట్టి, ఒకరెలాంటివారో అంచనా వేయొచ్చు. తేలికగా తేల్చేసినట్టున్న లోతైన విషయం.

మన జీవితంలో ఎన్నో విషయాలు మన అదుపులో ఉండవు. ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టామో – మనము నిర్ణయించుకోలేదు; దొరికే జీవిత భాగస్వామి ఎలాంటి వ్యక్తో, అనుకుంటాం కానీ, మన చేతిలో ఉండదు; మనకు ఎలాంటి సంతానం పుడుతుందో – మనము నిర్ణయించలేము. చివరికి ఎటువంటి వ్యక్తులతో పనిచేస్తామో, మన ఇరుగుపొరుగువాళ్ళెలాంటి వారోకూడా – అన్ని వేళలా మనము కోరుకున్నట్టు దొరకరు. ఎంతో ముఖ్యమైన – మనము ఎంచుకొని ఏర్పరుచుకోగల ఏకైక సంభంధం ‘స్నేహం’ మాత్రమే! కాని ఎంత మంది, ఈ విషయానికివ్వవలసిన గంభీరమైన విలువనిచ్చి, స్నేహాలను కలుపుతారు?

స్నేహితులనెంచుకోవడానికి చూడవలసిన అర్హతలెలాంటివి? మన తప్పులనెత్తిచూపకపోగా – ఒక్కోసారి వాటినే గొప్పగా చూపించే వందిమాగదులా స్నేహితులంటే? కుక్కలుచింపిన విస్తరిలాంటి చరిత్ర ఉన్నా, ఎల్లప్పుడూ మన ముఖస్తుతే చేస్తుండే వారితో స్నేహం చేయొచ్చా? వ్యక్తిత్వం, చరిత్ర వంటివి పరిశీలించాలా? ఆ వ్యక్తికున్న స్నేహితులను పరిగణనలోకి తీసుకోవాలా? శత్రువు యొక్క శత్రువు మిత్రుడా? నేను తామరాకు వంటి మనిషిని – అంచేత నాతో ఎవరు స్నేహం చేసినా, నాకు నష్టం ఉండదనుకోవడం – సబబేనా?

తెలిసినవెంటనే తేరుకోగలిగినా, వ్యక్తులను అంచనా వేయటంలో కొన్నిసార్లు తప్పులు చేసిన నేను, ప్రామాణికంగా నిర్ణయించి ‘ఇదీ పద్దతి’ అని చెప్పే అర్హత ఉన్నవాడిననుకోను. అంచేత, అంతగా ఆసక్తికి నోచుకోని ఇతిహాసాలలోని స్నేహాలను కాస్తంత లోతుగా విశ్లేషిస్తే బాగుంటుందనిపించింది.

రామాయణ-భారతాలలో రామ-కృష్ణావతార సమకాలికులైన వాలి, అర్జునులు ఇంద్రాంశతో పుట్టినవారు. అలాగే, సూర్యంశ కలిగినవారు – సుగ్రీవ, కర్ణులు. రాముడు సూర్యాంశ సంభూతుడైన సుగ్రీవునితో స్నేహం చేసి, ‘ఇంద్రాశ’ అన్న అర్హత ఉన్నా, వాలిని ఎందుకు దూరంగా పెట్టాడు? అదే కృష్ణుడిగా తిరుగాడినపుడు, సూర్యాంశ ఐన కర్ణుడికి తన స్నేహమనే కటాక్షానికి దూరం చేసి, ఇంద్రాంశతో పుట్టిన అర్జునుడిని దగ్గిరకు చేర్చుకున్నాడు. చిత్రంగా కనిపించినా, ఆయా అంశల ధర్మబద్ధత, వారి స్నేహాలు ఇందుకు కారణం. వాలి చేసిన తప్పు – రావణుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేయటం. ఈ వివరాలున్న లేఖతో రేపు కలుస్తా.


స్నేహమంటే?

రామాయణంలోని స్నేహాలు

1. వాలి రావణులు
2. శ్రీరామ సుగ్రీవులు
3. శ్రీరామ గుహులు
4. కైకేయి మంథరలు
5. హనుమ సుగ్రీవులు
ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 5:46 సా. వద్ద డిసెంబర్ 19, 2011

  “Degrees of Separation” అనే concept మొదటి సారి వింటున్నాను.

  స్నేహితులెంచు కోడానికి అర్హతలు ఉండవనుకుంటాను. మనం మన గుణానికి తగిన స్నేహితులని ఎంచుకున్టాము కాని అర్హతలని చూడము. కొందరి perception ఒక్కొక్క సారి తప్పు కావొచ్చు, అలాంటప్పుడు వారి స్నేహం ఎక్కువ కాలం నిలవదు.

  నాకు కొందరు మిత్రులున్నారు వారి తో పరిచయం కొన్ని రోజులు లేక కొన్ని నెలలు మాత్రమే, కాని ఆ స్నేహం ఇప్పటికి అలాగే ఉంది, ఎన్నో ఎల్లింది వారిని చూసి కానీ, ఆ ఆప్యాయత ఇంకా తగ్గలేదు. Facebook పుణ్యమా అని నేను పోగొట్టుకున్న స్నేహాన్ని పది సంవత్సరాల తరువాత పొందగలిగాను, కాని మా మధ్య పరిచయ కాలం ఒక నెల మాత్రమే..

  స్నేహం మరియు సూర్యంశ, ఇంద్రంశ గూర్చి మీరు గమనించింది బాగున్నది.

  “మాయ బజార్” cinema లో కృష్ణుడు శశి రేఖ కు ఇచ్చిన “ప్రియ దర్శని” (దాని పేరు గుర్తుకు లేదు) పెట్ట లో కృష్ణుడికి శకుని కనిపిస్తాడు కదా? ఇది సినిమా కథో లేక మహాభారతం లో వ్రాసిందో తెలియదు. వీరిద్దరికీ ఏమి సంబంధం? వీరి మధ్య స్నేహం ఉందని విన్దలేదేక్కడ… నాకు అర్ధమైన్దేమంటే వీరిద్దరి objective ఒక్కటే …అదే…కౌరవ నాశనం…..మీరేమంటారు…?

  ఇంకొక విషయం ఏంటంటే ఒక ఆడ, మగ మధ్య స్నేహం గురించి రామాయణ, మహాభారతాల్లో వినలేదు.

 2. 6:43 సా. వద్ద డిసెంబర్ 19, 2011

  అందుకే Six Degrees విషయానికి లంకే ఇచ్చాను. చూశారా?

  Arranged marriages లాగా, కొన్ని సార్లు అవసరార్థం కొన్ని స్నేహాలు చేస్తాము. అవి గాలి బుడగలాగా తక్కువకాలం నిలవొచ్చు లేక కొన్ని సార్లు జీవితాంతం.

  Cinemaలలో commercial factor ఎక్కువ గనక, కొన్ని కొన్ని సార్లు ఎవేవో చూబిస్తారు. సాధికారికంగా గ్రంథాలలో ఉన్నదే నిజం.

  శకుని కౌరవుల నాశనం కోరుతాడనేది అబద్ధం.

  ఈ శీర్షిక పూర్తయితే, సమాధానాలు అన్నీ దొరుకుతాయి. నిరీక్షించగలరు.

  • Kalyan
   7:36 సా. వద్ద డిసెంబర్ 20, 2011

   “Arranged marriages లాగా, కొన్ని సార్లు అవసరార్థం కొన్ని స్నేహాలు చేస్తాము. అవి గాలి బుడగలాగా తక్కువకాలం నిలవొచ్చు లేక కొన్ని సార్లు జీవితాంతం.”
   Ekkada “arranged marriages” context explain cheyya galara.

   • 8:34 సా. వద్ద డిసెంబర్ 20, 2011

    శ్రీరామ సుగ్రీవ స్నేహం ఒక ఉదాహరణ. అవసరార్థం మొదలైనవి. నా తదుపరి లేఖలో దీని గురించి మరిన్ని వివరాలు పొందుపరచగలను.

 3. 6:58 సా. వద్ద డిసెంబర్ 19, 2011

  చాలా ఆసక్తిగా ఉంది. మీ తర్వాత టపా కోసం ఎదురుచూస్తాను.

 4. 8:50 సా. వద్ద డిసెంబర్ 19, 2011

  Interesting! Will wait for the next post!

 5. 12:09 సా. వద్ద డిసెంబర్ 20, 2011

  వెరీ నైస్ పోస్ట్. తర్వాతి టపా త్వరగా రాసేయండి మరి… 🙂

 6. 10:47 ఉద. వద్ద డిసెంబర్ 27, 2011

  స్నేహం మరియు సూర్యంశ, ఇంద్రంశ గూర్చి మీరు గమనించింది బాగున్నది.

  వేణుగారూ!

  మీకు వీలైతే “ఆంధ్రాఫోక్స్.నెట్” లోని నా ఆర్టికిల్ “మహావిష్ణువుకు మనోవైకల్యమా?!” చదవండి.

  మీ పై వాక్యానికి రిలేటెడ్ గా ఉంటుంది.

  చదివినాక మీ అభిప్రాయం తెలపడం మర్చిపోవద్దని మనవి.

  సత్యనారాయణ పిస్క.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s