ముంగిలి > శిరోభారం > భగవద్గీతను అనవసరపు రాద్ధాంతంలోకి ఎందుకు లాగడం?

భగవద్గీతను అనవసరపు రాద్ధాంతంలోకి ఎందుకు లాగడం?

మాసానాం మార్గశీర్షోఽహం‘ (10.35) ‘మాసాలలో మార్గశిరమాసం నేను’ అన్నాడు గీతాచార్యుడు. ఆ మాసంలోనే ఇలాంటి దుమ్ము రేగడం గర్హనీయం.

ఉపనిషద్ సారాంశమైన భగవద్గీత, నేడొక వ్యాపార సాధనమైపోయిందా అని సందేహం కలుగుతూ ఉంటుంది.

తొమ్మిదవ అధ్యాయం (రాజ విద్యా గుహ్య యోగం) మొదటి రెండు శ్లోకాలు ఏం చెబుతున్నాయి? మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయంలో (మోక్ష సన్యాస యోగం) 63, 64 శ్లోకాలలో ఉన్నదేమిటి? “గుహ్యాద్ గుహ్యతరం” – “గోప్యాతి గోప్యమైన” జ్ఞానం. సరే గీతాచార్యుడు పొరబడి భగవద్గీత గోప్యమని చెప్పుంటారు అని అనుకొనుండొచ్చు – ఈ గీతా పంపిణీదారులు. కానీ, 67వ శ్లోకంలో అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ – ఇష్టంలేనివారితో ఈ రహస్య జ్ఞానాన్ని పంచుకోవద్దని. ఎవడికి పట్టింది?

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి || 18.67 ||

ఎన్ని రకాలుగా, ఆయన ఎం చేయవద్దని చెప్పారో అదే చేయ్యాలా? ఇదా భగవద్గీతను ఆరాధించడమంటే?

నేను చివరిసారిగా భగవద్గీతను విన్నది, వై.ఎస్‌.ఆర్‌. దుర్ఘటనలో మరణించినపుడు – సంతాప సభల background music లాగా. అంతకు ముందు, మా తల్లిగారి అంత్యక్రియలు చేయడానికి స్మశానానికి వెళ్ళినపుడు. ఇదేనా భగవద్గీత ప్రయోజనం?

ఈ పరమోత్కృష్టమైన గ్రంథానికి శంకర భగవద్పాదులు, శ్రీమద్ రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి ప్రజ్ఞాశాలురు భాష్యాలను అందించారు. వాటి సాధికార అంగ్ల అనువాదాలూ ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు, అ, ఆ, ఇ, ఈ వచ్చిన ప్రతి వాడూ భాష్యాలను ఏ భాషలో పడితే ఆ భాషలో ప్రచురించడమే? భాష్యాలలో ఒక్క పదం తారుమారయితే, అర్థాలే మారిపోతాయి. అటువంటిది, ఎంతటి ప్రజ్ఞ ఉందని వేరే భాషల్లో అనువాదాలను రచించడం? నిజంగా హైందవ ధర్మం మీద ఇతర దేశస్తులకు వల్లమాలిన నమ్మకం ఏర్పడితే, సంస్కృతమో లేక హిందీయో నేర్చుకొని తెలుసుకోవచ్చును కదా? ఇది విడ్డూరం కాదు సుమా! కొన్ని కొన్ని ప్రాచినా గ్రంథాలు online లో సంస్కృతభాషలో అందించే భాగీరథ యత్నాలు చేసింది పర దేశస్తులే.

మన ఇంట్లో భగవద్గీత పుస్తకముండదు. ఉన్నా చదవము. Valentine’s day అథమపక్షంలో Halloweenలు కూడా తెలుసు – కానీ గీతా జయంతి ఉంటుందని మనకు తెలుసా?

మనం గడ్డి తిని వేరేవాళ్ళకి బుద్ధి చెప్పడంలా ఉంది – ఇప్పుడు జరుగుతున్న తంతు.

నిజానికి, అసలు కుళ్ళు ఎక్కడుందో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలనున్నా, అర్థం చేసుకునేవారుంటారా అన్న అనుమానంతో పంచుకోవటం లేదు. త్వరగా ఈ దుమ్ము-దుమారం సద్దుమణిగి, భగవద్గీత ఓ రాజకీయ అవకాశంగా మారకుండా ఉండాలని ఆకాంక్ష.

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. 7:52 సా. వద్ద డిసెంబర్ 21, 2011

  ఆఖరిగా ప్రస్తావించిన మీ మా అందరి ఆకాంక్ష నేరవరాలే కోరుతున్నాను,
  కాని
  “నిజానికి, అసలు కుళ్ళు ఎక్కడుందో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలనున్నా, అర్థం చేసుకునేవారుంటారా అన్న అనుమానంతో పంచుకోవటం లేదు”

  అర్థం చేసుకునే వాళ్ళము ఉన్నాము దయ చేసి పంచగలరు అని మనవి

  ?!

 2. voleti
  10:46 సా. వద్ద డిసెంబర్ 21, 2011

  ఆకాశం వైపు చూసి వుమ్ము వేసే వాళ్ళను చూసి మనం తిట్ట నక్కరలేదు…. మన ఆనందాన్ని, మన అనుభవాల్ని మనలోనే పదిల పరుచుకుని భగవద్గీత పఠనంలో మునిగి తేలుదాం…

 3. 2:51 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

  నాహం కర్తా హరిహి కర్తా!

  జిలేబి.

 4. Anon
  9:14 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

  మనం గడ్డి తిని వేరేవాళ్ళకి బుద్ధి చెప్పడంలా ఉంది – ఇప్పుడు జరుగుతున్న తంతు

  True! Well said.

 5. Niharika
  9:27 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

  లౌకిక దేశమని చెప్పుకుంటూ హిందువుల మత గ్రంధమైన భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమని అంటున్నారు.

  ఇది చాలదన్నట్లు “భగవద్గీత” ని జాతీయ గ్రంధం చేయమని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేస్తున్నారు.

  ఇండియాలో ఒక్క హిందువులు తప్ప ఎవరూ ఉండకూడదని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తారు.

  ఒక్క బి జె పి వల్లే హిందూమతం నాశనమైపోయేలా ఉంది.

  • Anonymous
   10:39 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

   కురాన్/బైబిల్ మీద కూడా చేయొచ్చు, ఓ సారి బోనెక్కి రండి, తెలుస్తుంది.

   • 11:33 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

    భగవద్గీతని జాతీయ గ్రంథం చేసినా హిందువులలో ఎక్కువ మంది భగవద్గీత చదవరు, చదివేవాళ్ళని సత్తెకాలపు మనుషులంటూ వెక్కిరిస్తారు కూడా. [Remark truncated.]

  • Sri
   2:42 సా. వద్ద డిసెంబర్ 23, 2011

   Hinduism did not die when Muslims ruled India for around 500 years and the Christians ruled it for around 200 years.

   What is wrong if it is given a “National” stamp? It is a very secular book. Just because it has characters with Hindu names do not object to it.

   Eelanti mahaa granthalu chadivi poorthiga daani artham chesukunnavadu jeevitham lo eppuddu duhkhamu erugadu.

   Do not equate Hinduism with Casteism!!!

   Casteism is more an output of greed among human beings or rather animals!!

 6. 10:12 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

  >>>>>
  మన ఇంట్లో భగవద్గీత పుస్తకముండదు. ఉన్నా చదవము.
  >>>>>
  ఒకవేళ చదివినా “సన్యాసంలో కలిసిపోవాలనుకుంటున్నావా?” అని అడుగుతారు. మత గ్రంథాలు చదవడం మీద ఆసక్తి లేనప్పుడు మత భక్తులమని చెప్పుకోవడం, మతం కోసం కొట్టుకోవడం ఎందుకు?

  • Anony
   1:58 సా. వద్ద డిసెంబర్ 22, 2011

   బాగా చెప్పారు ప్రవీణ్ గారు. ఏదో నాలుగు బూజుపట్టిన ఎర్రపుస్తకాలు తిరగేసినంత మాత్రాన కమ్యూనిస్టైపోలేరు కదా.

 7. 3:56 సా. వద్ద డిసెంబర్ 23, 2011

  నా అభిప్రాయానికి కాస్తంత ఆవేశం తోడై ఈ post గా మారింది

  http://endukoemo.blogspot.com/2011/12/non-terrerism-non-githaism.html

  please go through the above link for

  నిషేదము, భగవత్ గీతా అను పదములను జోడించుట వలన జనించిన తీవ్రవాదము

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s