ముంగిలి > పిచ్చాపాటి, మన సంస్కృతి > అష్ట దిగ్గజాలు – Tectonic Plates

అష్ట దిగ్గజాలు – Tectonic Plates

సాధారణంగా ‘అష్ట దిగ్గజాలు’ అంటే శ్రీకృష్ణదేవరాయలవారి అస్థాన కవులు జ్ఞప్తికి వస్తారు. ‘దిగ్గజాలు’ అనే పదాన్ని హేమాహేమీలను సంభోదించడానికి కూడా వాడుతుంటారు. నిజానికి ‘అష్ట దిగ్గజాలు’ ఆంటే, భూమిని ఎనిమిది దిక్కులా మోస్తున్న ఏనుగులు. నిజంగా ఏనుగులు మోస్తుంటాయా అని అడక్కండేఁ? భూమి మీద సంచరించే అతి పెద్ద జీవి ఏనుగు – అందుకని భౌగోళిక శక్తులను దానితో పోల్చాయి మన సనాతన శాస్త్రాలు.

ఆష్ట దిగ్గజాలు ఏవి? వాటి పేర్లేంటి? ఏవేవి ఏ దిక్కులో ఉంటాయి? దీనికి సమాధానం విష్ణుధర్మోత్తర పురాణం 50వ అధ్యాయంలో దొరుకుతుంది.

కుముదైరావణౌ పద్మం పుష్పదంతోఽథ వామనః – సుప్రతీకాఽoజనౌ నీల ఏతేఽష్టౌ దేవయోనయః ||

 1. ఈశాన్యం (Northeast) – కుముదం
 2. తూర్పు (East) – ఐరావతం
 3. ఆగ్నేయం (Southeast) – పద్మం
 4. దక్షిణం (South) – పుష్పదంతం
 5. నైఋతి (Southwest) – వామనం
 6. పశ్చిమం (West) – సుప్రతీకం
 7. వాయవ్యం (Northwest) – అజనం
 8. ఉత్తరం (West) – నీలం
అష్ట దిగ్గజాలు

అష్ట దిగ్గజాలు

ఇప్పుడిదెందుకూ – అన్న ప్రశ్నా? వీటికీ భూవిజ్ఞాన శాస్త్రంలో (Geology) ఉన్న Tectonic plates కి సంబంధం ఏమన్నా ఉందా అన్న అనుమానం వచ్చింది కాబట్టి.

భూమి పొరల్లో పైనున్నది భూపటలం (Crust). ఈ భూపటలం అగ్ని శిలలు (Igneous rocks), అవక్షేప శిలలు (Sedimentary rocks), రూపాంతర శిలలతో (Metamorphic rocks) కూడి ఉంటుంది, సముద్రాల కింద 5 నుండి 12 కిలోమీటర్లలోతువరకు – అదే భూఖండాల కిందనైతే 35 నుండి 60 కిలోమీటర్ల లోతువరకూ ఉంటుంది. భూపటలం క్రింద ఉండేది భూప్రావారం (Mantle); దాని క్రిందిది భూకేంద్రము లేదా కేంద్ర మండలం (Core).

భూపటలం ఇంకా భూప్రావార పైపొరలను కలిపి శిలావరణం (Lithosphere) అంటారు. ఈ శిలావరణం క్రిందనుండే దానిని Asthenosphere అంటారు. Asthenosphere మీద తేలుతున్నట్టుగా భావించదగ్గ శిలావరణాన్ని, Tectonic Plates గా విభాగించారు. ఈ గందరగోళం సరిగా అర్థమవడానికి క్రింది చిత్రం చూడండి.

భూమిపొరలు

భూమిపొరలు

గమనించదగ్గ విషయమేమిటంటే, నేటి శాస్త్రవేత్తలు ముఖ్యమైన Tectonic Plates ఏడో – ఎనిమిదో ఉండి ఉండవచ్చునని అంచనా వేశారు. సనాతన శాస్త్రం, ఈ అష్టదిగ్గజాలు కదిలినపుడు భూకంపాలవంటివి వస్తుంటాయి అని చెబుతోంది. నేటి అభిప్రాయం కూడా అదే.

Tectonic Platesలో ముఖ్యమైన పెద్దవి ఏన్ని? అవి ఏవి? ఈ విషయంలో ఏకాభిప్రాయం కనబడటంలేదు. కొందరేమో ఏడు అంటారు – కొందరు ఎనిమిది.

 1. ఆఫ్రికా ఫలకం – African Plate
 2. దక్షిణధ్రువ ఫలకం – Antarctic Plate
 3. ఆస్ట్ఱేలియా ఫలకం – Australian Plate
 4. ఐరోపా-ఏషియా ఫలకం – Eurasia Plate
 5. భారత ఉపఖండ ఫలకం – Indian Plate
 6. ఉత్తర అమెరికా ఫలకం – North American Plate
 7. పసిఫిక్ ఫలకం – Pacific Plate
 8. దక్షిణ అమెరికా ఫలకం – South American Plate

ఈ టపాద్వారా నేనేమీ నిరూపించే ప్రయత్నం చేయటం లేదని గమనించగలరు. ఒకానొక విషయంలో సనాతన – ఆధునిక శాస్త్రాల మధ్య నాకు కనిపించిన సారూప్యాన్ని పదిమంది ముందుంచడమే ఈ ప్రయత్నం. సనాతన దర్మానికి ఇటువంటి నిరూపణల అవసరం లేదు. మనకు అర్థంకానివన్నీ అబద్ధాలు కాదు కదా!

ఈ టపా రాయటంలో, English పదాలకు – తెలుగు పదాలను వెతకడానికి చాలా సమయం పట్టింది. తప్పులేమన్నా కనిపిస్తే, నిర్మొహమాటంగా తెలియజేయగలరు. అలాగే, ఈ విషయంలో మీకు ఏమన్నా తోస్తే, తెలియజేయమని మనవి.

ప్రకటనలు
 1. 8:49 ఉద. వద్ద డిసెంబర్ 28, 2011

  మనవారికి మనం చెప్పినది రుచించదు. విషయం పరిశీలించమన్నా, వినరు. వారికి పడమటి వారు చెప్పిందే వేదం. ఏ చేస్తాం. వందనం.

 2. 10:21 ఉద. వద్ద డిసెంబర్ 28, 2011

  కుముదౌ …

  అన్నదానికి ఈశాన్యం అన్నది ఎట్లా నిర్ణయించారు. ? దీనికి ముందు వాక్యం ఏదైనా వరుస క్రమమును తెలియ చేస్తున్నదా ? విశదీకరించండి.

  జిలేబి.

 3. ankush
  10:55 ఉద. వద్ద డిసెంబర్ 28, 2011

  I have read a book which says there are 9 tectonic plates – 6 named on continents and 3 named on oceans. Keeping this controversy aside, the origin of these elephants is itself a very interesting read.

  About looking towards the “West”, let’s not become hyper about it. One should peep into one’s own life and family and they will realize that they are no Saints themselves. “Holier than thou” attitude is unwarranted. Cheppedhi SriRangaNeethulu, Dooredhi ******* Gudiselu annattu unda koodadhu jeevitham.

 4. R
  11:10 ఉద. వద్ద డిసెంబర్ 28, 2011

  చాలా చక్కటి, అబ్బుర పరిచే విషయాలు తెలియజేస్తున్నారు…కృతజ్ఞతలు!!!
  మరొక్క సారి మన మహోన్నతమయిన సంస్కృతి కి, సనాతన ధర్మానికి మనసారా నివాళులర్పిస్తూ.

  ఆర్

 5. 11:45 ఉద. వద్ద డిసెంబర్ 28, 2011

  నమస్తే తెలుగుభావాలుగారూ..!

  నేనడిగిన ప్రశ్నకి బదులుగా చాలా శోధించి, ఈ టపా రాసినట్టు అనిపిస్తోంది. ధన్యవాదాలు..!
  సరిగ్గా నేను భావిస్తున్న విధంగానే మీరూ రాసారు. (లేదా ఈ భావన ఎవరి పుస్తకంలోనైనా చదివానో గుర్తులేదు.)

  కొంతమంది, 6 ఉంటాయని, కొందరు 7 అని, ఇంకొంతమంది8,9,….ఒకరికొకరు పొంతనలేని విధంగా చెప్పుకుంటూ ఉండడం వల్ల “అష్ట దిగ్గజాలు” ఏవిటన్నది రాయలేదు. మొత్తానికి “భారత ఫలకం(indian plate)”, “ఆస్ట్రేలియా ఫలకం (Australian plate)” అనే రెండు ఉప ఫలకాలున్న పెద్ద ఫలకం “భారత-ఆస్ట్రేలియా ఫలకం (Indo-Australian)” విడగొట్టి లెక్కని 8కి చేసారన్నమాట..! వికీపీడియాలోని వ్యాసం చూసి అంటున్నాలెండి.

  //సనాతన శాస్త్రం, ఈ అష్టదిగ్గజాలు కదిలినపుడు భూకంపాలవంటివి వస్తుంటాయి అని చెబుతోంది.// అన్నారు కదా..! దానికి కొన్ని References ఇవ్వగలరా..?

  “కష్టే ఫలే”గారి వ్యాఖ్యతో విభేదించక తప్పదు. పడమటి దిక్కులో భారతీయులు కూడా ఉంటున్నారు. వారి వల్లనే మన పురాణాలకి ఆ మాత్రమైనా విలువ దక్కుతోంది అంతర్జాతీయంగా..!

  అష్టదిగ్గజాల గురించి రాసారు. మరి ఇప్పటికీ మోస్తున్న “ఆది కూర్మం”, “ఆది వరాహం” గురించి కూడా రాస్తారని ఆశిస్తున్నాను.అలాగే “ఉల్క/గ్రహశకలం” గురించి, “ఆది వరాహం” టపాలో వ్యక్తం చేసిన సందేహాలపై కూడా వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను.

 6. ankush
  12:31 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  Matangaleela by Neelakanta Shastri give all details about elephants as per Hindu mythology.

 7. ankush
  12:39 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  About Tectonic plates, this might be useful: http://www.platetectonics.com/book/page_2.asp

 8. ankush
  1:11 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  I thought you may be interested in here Rare Sanskrit E-Books – http://www.sanskritebooks.blogspot.com/

 9. 3:10 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  ‘కష్టేఫలే శర్మ’ గారు: మీ భావనను అర్థం చేసుకోగలను. కానీ అందరూ ఆ కోవకు చెందరు కదండీ!
  —–
  ‘జిలేబి’ గారు: “ఏవేవి ఏ దిక్కులో ఉంటాయి?” అన్నాను కానీ, దానికి ప్రామాణం ఇవ్వలేదని చక్కగా గుర్తు చేశారు. పై శ్లోకం ఒక sequence అని ఒప్పుకుంటారనుకుంటాను! దాన్ని దిక్కులతో అలా synchronize చేయటానికి రెండు కారణాలు. ఈ అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల వాహనాలు కూడా. ఇంద్రుడి వాహనమవటంచేత, ఐరావతం తూర్పుకు ఉంటుంది అని లెక్క కట్టొచ్చు. ఇక మిగతావన్నీ వాటి వాటి స్థానాల్లో పెట్టడం తేలికే కదా! మరొక ప్రామాణం ఏమిటంటే, అదే అధ్యాయంలో ఈ అష్టదిగ్గజాల ‘ఆవాహన’ మంత్రాలున్నాయి. అవి కూడా ఈ అమరికనే సూచిస్తున్నాయి. Hope this answers your query…
  —–
  వామనగీత శర్మ: నాకెందుకో మీ వ్యాఖ్య ఛిద్రాన్వేషణ చేస్తున్నట్టు అనిపిస్తోంది. మీకు సమాధానం నేను రాసిన “కైకేయి మంథరల” వృత్తాంతం. అది చదవండి ముందు.
  —–
  Ankush: Dude, I did mention clearly about ambiguity in the count of tectonic plates in my post. As Vamanagita mentioned of 7 and you of 9 and below URL for 8, it is still an evolving theory. Modern science, undoubtedly a great achievement of mankind, is still an evolving science. All of a sudden, Pluto is no longer a planet and we are OK to live with this! Whereas our ancient science is a resolved science. All that is needed is interest and patience. Your mention ‘Matangaleela by Neelakanta Shastri’ – does it mention something similar to what I thought? If so, would be happy to get a copy! Thanks for the Sanskrit Document link. Sounds useful…

  http://www.blatantworld.com/feature/the_world/tectonic_plates.html

 10. ankush
  6:39 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  Manyavar, dont get offended. Nenu mee tapaanu Khandisthunanu ani did not write. Meeru “I hurted” ayyinattunaru. I just mentioned what I read. To me Science is Science, modern or ancient(sic). Karma enti ante in current\modern times modern ane sciencenu chadavadaniki, discuss, debate cheyyadaniki English as a language is learnt and the vocabulary expanded right from birth (or even womb days) till you die where as ancient(sic) science you need to know Sanskrit which is very barely taught. Ee lanti case lo naa boti meetho ekkada vaadhana cheyyagalamu cheppandi….saahasamu kooda cheyyalemu, cheyyanu kooda.
  Finally if you say ancient science is from Gods and not mankind then there is no debate. If it is not then there is always debate.
  Oka vaipu ambiguity undhi ani mention chesthunnaru…maro vaipu saarupyam choopisthunaru.

  • 7:29 సా. వద్ద డిసెంబర్ 28, 2011

   Now I should apologize if I sounded offending. I felt an urge of inquiry in your remarks which I do appreciate and would not negate – which is why I published them all.

   Coming to origins of the ancient science, it is a firm belief that it was taught by Rishis who were Drashtas.

   I agree with your observation of Sanskrit and English.

   Ambiguity is in the count of tectonic plates as per modern times; but the count as per Vishnu Dharmottara purana is firm and is 8. Who knows; in future it might get fixed as 8 even as per modern science.

   BTW, I am not against modern science or a blind advocate of ancient science. If I were, no point in using a Laptop and invisible Internet to engage with so many people. No science is good or bad. It is the practioners and believers who can make it look like something to others.

   • ankush
    7:58 సా. వద్ద డిసెంబర్ 28, 2011

    That is a very nice detailing from you, Dude. My confidence in myself to follow your blogs is reinforced.

    Is there anything you can do to popularize Sanskrit or disseminate the knowledge in Sanskrit? I never understood why Hindi is India’s national language and not Sanskrit. Murky topic I guess….

 11. ankush
  8:13 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  I understand you saying beyond your capability..very frank and instantaneous response….I cannot stop writing that the whole knowledge is in Sanskrit and the education system does not bother….pathetic people ran, run, and will continue to run this Holy Land. In another mode of thinking when Lord Krsna could not save his own Yadavas from pathanam…what can silly, stupid, greedy men can do.

 12. 8:14 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  @అంకుశ్‌
  నా ఉద్దేశ్యం కూడా అదే.., ఈ దేశంలో “జాతీయ భాష” అవదగిన కలిగిన భాష ఏదైనా ఉందంటే అది సంస్కృతమే..! దేశంలో ఉన్న అన్ని భాషలతోనూ పెనవేసుకొని పోయి, ఆయా భాషల సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న భాష కేవలం “సంస్కృతం” ఒక్కటే..!
  BTW, “హిందీ” మన జాతీయ భాష కాదు.. అసలు “జాతీయ భాష”గా దేనినీ ప్రకటించలేదింకా..! (చాలా పోటీ పరీక్షల్లో కూడా ఇది అడుగుతూ ఉంటారు. చాలామంది ఈ విషయంలో పొరబడుతూ ఉంటారు)
  “హిందీ” కేవలం “అధికార భాష” మాత్రమే., అది కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే., హిందీయేతర రాష్ట్రాలకి అధికార భాషగా “ఇంగ్లీషు” వాడుతున్నారు.

  • ankush
   8:33 సా. వద్ద డిసెంబర్ 28, 2011

   True…take back the “national” thing….however Article 351 has provisions to promote Hindi as a national language.
   Anyways I will stop here because I have already deviated from the blog topic of TBLUgaru.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s