ముంగిలి > పిచ్చాపాటి > DGP చెప్పింది తప్పా?

DGP చెప్పింది తప్పా?

నా జీవితంలో జరిగిన ఓ యథార్థ ఘటన.

కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో దోంగతనం జరిగింది. తాళాన్ని విరక్కొట్టి, ఇంట్లో ఎవరూ లేనపుడు మిట్ట మధ్యాహ్నం దొంగలు పడ్డారు. తెలుసుకున్న వెంటనే, దగ్గిరలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేశాము. వెంటనే, పోలీస్ సిబ్బంది వారొచ్చారు. మొత్తమంతా పరిశీలించిన తరువాత, వారిలో ఒకరు నాతో ముచ్చటించారు.

బాగుంటుందని, అందరిలాగే మా ఇంటి సింహద్వారానికి ఇత్తడితో (brass) చేసిన గొళ్ళాలు పెట్టిచ్చాము. ఇత్తడి గోళ్ళాల పెళుసుదనం (brittleness) వల్ల విరక్కొట్టడం చాలా తేలికట. ఆ విషయాన్ని నాతో ముచ్చటిస్తున్న పోలిసతను వివరించాడు. మరొక విషయం కూడా చెప్పాడతను. సాధారణంగా వాడే తాళం కప్పల మధ్య – గునపాన్ని దూర్చడం తేలిక. అంచేత, మామూలు వంటివి కాకుండా, కాస్తంత ఖరిదైన గుండ్రటి తాళాలు వాడితే, అసలు మా ఇంట్లో దోంగతనం – అంత తేలికగా జరిగుండేది కాదని అభిప్రాయపడ్డాడు. నిజమే, ఓ గునపాన్ని తాళానికి – గొళ్ళానికి మధ్యన పెట్టి, బలంగా లాగి విరక్కొట్టినట్టు, కనిపిస్తోంది.

సింహద్వారానికి మరమ్మత్తులు చేయించినపుడు, అతను చెప్పినట్టే, Steel Alloy తో చేసిన గోళ్ళాలు పెట్టిచ్చాను. ఆయన చెప్పినట్టే, ఆ గుండ్రటి తాళాలనూ కొని, వాడుతున్నాను. వీటి వల్ల ఇంకెప్పుడూ దోంగతనం జరిగే అవకాశం లేదు – అని ఎవరూ guarantee ఇవ్వలేరు కానీ, మునుపటంత తేలికైతే కాదని ఎవరైనా చెప్పగలరు.

నిన్న DGP గారు చెప్పినదానికి – నేను పైన ప్రస్తావించిన సంఘటనకీ – పోలిక కనిపిస్తోందా? ఆయన చెప్పింది ఆడదాని మానం గురించి. నేను చెప్పింది మా ఇంటి భద్రత గురించి. రెండూ ఒకటే అనను కానీ, ఇతివృత్తం మాత్రం ఒకటే. నాతో ముచ్చటించిన పోలీసతనితో – నేనూ వాదులాటకు దిగుండవచ్చు. దొంగలను పట్టుకోకుండా, ఈ హితబోధలేమిటీ అని. కానీ అతను చెప్పింది నన్ను కించపరచటానికో లేక తన బాధ్యతనుండీ తప్పించుకోడానికో కాదు. తన అనుభవంలో చూసినవి, సంధర్భోచితంగా ఒక సలహా రూపంలో చెప్పాడు. ఆ చిట్కాలు నాకు ముందే తెలిసి – నేను అవి పాటించి ఉండిఉంటే, బహుశః మా ఇంట్లో దొంగతనం జరిగుండేది కాదేమో!

ఒక సరైన కారణాన్నే DGP గారు కాస్తంత తేలికగా చెప్పి ఇరుక్కుపోయారు పాపం. తినే తిండి విషయం, సల్వార్ కమీజ్‌ల సంగతేమోకానీ, provocative dressing and behaviour ఖచ్చితంగా పెరుగుదలకు కారణమే. మొన్న “పీశాచాలుంటాయా” అన్న టపాలో చూడొచ్చు – జీవంలేని అందమైన ఆడదాని బొమ్మను సైతం చెరపాలనే పైశాచికత్వం గలవారి చేష్టలు. ఇక జీవమున్న పుత్తడిబొమ్మల సంగతి చెప్పాలా?

ఇందుకు, ఇందుకు, అందుకు లేక అందుకు, అందుకు, ఇందుకు రేప్ కేసుల్లో పెరుగుదల వచ్చి ఉంటుంది – అని అందరిలాగే కుంటి సాకులు చెప్పుంటే, కనీసం చివరి పుటలో కూడా వేయకుండా light తీసుకొనుండేవారు. అయినా, DGP గారంతటి అనుభవంలేని నాకే తెలుసు, నిజ జీవితంలో అనుభవపూర్వక సలహాలు ఇవ్వటం మంచిది కాదని. పాపం – ఆయనకెప్పుడు తెలిసొస్తుందో!?!?

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 8:58 ఉద. వద్ద డిసెంబర్ 31, 2011

  nenu kuda DGP garine samardhistaanu,,,ayana idi kudaa oka karanam kavochhu annaru tappa ide karanam analedu,,,anavasaramaina vyakhalaku ee mahila samghaalu maddatu baaga istayi,,

 2. 9:02 ఉద. వద్ద డిసెంబర్ 31, 2011

  no body will hear you, sir

 3. 9:46 ఉద. వద్ద డిసెంబర్ 31, 2011

  డీ.జీ.పీ చెప్పినదానిలో కొంత మాత్రమే వాస్తవం వుంది. కానీ పొలీసు వైఫల్యాలు రాజకీయనేతలకు సలాంకొట్టడం , అవసరమైన కేసులు కాకుండా లాభాలు తెచ్చే కేసులు పై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా ప్రధాన కారణం. పోలిస్ శాఖలో ఎక్కడో చుక్క తెగి పడినట్టు వుండే మంచి అధికారుల సంఖ్య పెంచాలి. దీనికి అందరూ ప్రయత్నించాలి. పోరాడాలి .

  • ankush
   6:43 సా. వద్ద డిసెంబర్ 31, 2011

   Evari meedha poratam cheyyalo artham avvaledhu!!! Policelu different speciesu kaadhu, different planetnunchi kooda raledhu…..vallu mana lonchi puttinavallu. Manchi adhikaarlulu penchaali ante ela penchali? Appudappudu eelanti prashnalaku samadhanalisthundandi.

 4. 10:55 ఉద. వద్ద డిసెంబర్ 31, 2011

  ఫాషన్ పెరేడ్‌లలో చూపించే అశ్లీల దుస్తులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మగవాళ్ళైనా అశ్లీల దుస్తులు వేసుకునే ధైర్యం చెయ్యరు. వైజాగ్ బీచ్‌కి వచ్చిన విదేశీయుడు నిక్కర్ వేసుకుని కైలాసగిరి మీద తిరిగాడని నేను కూడా కైలాసగిరి మీద అదే వేషంలో తిరిగితే పగటి వేషం అనుకుంటారు. అమెరికా లాంటి దేశాలలో ఆడవాళ్ళు మోకాలు కనిపించే దుస్తులు వేసుకుంటున్నారని ఇండియాలో కూడా అలాగే వేసుకుంటారనుకుంటే అది జోకే.

 5. ankush
  2:27 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  If somebody says that there is zero percent truth in what the DGP said then it is simple denial defence mechanism. However, when it is coming from the mouth of a police officer who is in charge of security of 8 crore people it would be better or more responsible with some facts or figures that say provocative and skimpy dressing is root cause of some x percentage of rapes. If you are in a responsible position then act responsibly, sensitively, and sensibly as even 1% of 8 crores get offended then it is a sizable amount for public discussion and news channels.
  It’s a different story that a wise man enjoying healthy sexual life with his beautiful wife also drools, even if momentarily, when he sees provocative and skimpy dressing. Brahmarshuluku saitham thappaledhu.
  Castration ane punishment decide chesthe thakkuvanna avuthayi emo? ledhante chastity locks vesukoni thirgalsindhe.
  With growing population and female foeticide, God save us all!!

 6. 3:11 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  తమిళనాడులో స్త్రీలు ఒంటి నిండా చీర కట్టుకుంటారు. కానీ తమిళనాడులో కూడా రేప్‌లు ఎందుకు జరుగుతున్నాయి? రేప్‌లకి వస్త్రధారణ కారణం కాదనడానికి ఇది ఎవిడెన్స్ కాదా?

 7. ankush
  4:05 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  For all those who react and say this is not the reason or that reason, when they say that they should also be able to come up with what the reason(s) is(are). Do not put comments just for the sake of grabbing attention or 2 penny contribution or bcoz it is your democratic right. If the causes spelled by you are more major reasons for rape crime then we can ask the DGP to eradicate or control those causes.
  Oorike enti pani -paata leni sollu…..Asalu pani-paata leni vallu ekkuva rapelu including marital rape chestharu anukunta.

 8. 5:57 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  ఇక్కడా ప్రవీణు డున్నాడూ!!!!

  ఎక్కడ మిగతా వారు కాన రాలేదే !

  • ankush
   6:29 సా. వద్ద డిసెంబర్ 31, 2011

   Mee Bhaashalo Kooda Praveenudu pongi porluthunaduuu……..Ika leni chotu edho?

   • కాకినాడ కాజా మొఇనుద్దిన్
    8:30 సా. వద్ద డిసెంబర్ 31, 2011

    అయ్ బాబోయ్ ఏం సెప్పారండి. ఆడి బూతులు చూసి ఆడి కోసం ఎతుక్కుంటు వచ్చేత్తున్నారండి బాబూ. ఆడు తప్ప పైన కామెంటెట్టినోళ్ళెవరూ కానరాలేదట థూ ఈ మడుసులు

 9. anrd
  6:35 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  అసభ్యంగా దుస్తులు వేసుకునే ఆడవాళ్ళు ఎక్కువగా డేరింగ్ నేచర్ కలవారు అయ్యుంటారు. ….అలాంటివారిని అవమానించే ధైర్యం లేక ….అసహాయులైన ఆడవాళ్ళను అవమానపరుస్తారు కొందరు మగవాళ్ళు. ……

  అసభ్యంగా దుస్తులు వేసుకునే డేరింగ్ నేచర్ ఉన్న ఆడవాళ్ళకు కూడా …. వాళ్ళకన్నా డేరింగ్ నేచర్ ఉన్న మగవాళ్ళ వల్ల ప్రమాదముంది. ..

 10. ankush
  6:55 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  Ayya TBLUgaru, meeru thappu cheyyani vaadu evadanta ani eppudo vrasaru!!!LOL!!! eela anukoni sardukupovaccha? nenu oppukonu…nenu oppukonu….chinna thappu vs pedda thappu ani antara?? civil society unnate gaani….it’s something like traffic signals\rules….paatinchedhi evaru…..manaku oka rule…pakkodiki oka rule…:-O

 11. 8:42 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  ‘మంజూష’, ‘anrd’ గార్లు: మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు
  —–
  ‘శర్మ’ గారు: దెబ్బలు తిని నేర్చుకునే వ్యక్తిది సాధారణ ప్రజ్ఞ; పక్కవారి అనుభవాలను చూసో లేక బుఱ్ఱను ఉపయోగించి నేర్చుకునే వ్యక్తి మేధావి. ఎవరి ప్రజ్ఞకొద్దీ వారు తెలుసుకుంటారు.
  —–
  ‘కోండల రావు’ గారు: ఒప్పుకుంటాను. అన్ని రంగాలలో ఉన్న పరిస్థితే మీరు చెప్పింది.
  —–
  ‘ప్రవీన్ శర్మ’ గారు: విదేశీ పట్టణాలైన హైదరాబాదు, ఢిల్లీ, ముంబై వంటి మేముండే నగరాల్లో, మీరు చెప్పినవి సర్వ సాధారణంగా కనిపిస్తుంటాయి. మీరు చెప్పినదానిబట్టి, భారతదేశంలో పరిస్థితులు ఇంకా కృతయుగంలాగా ఉన్నాయన్నమాట. ఇంతకీ మీరుండే ఊరుపేరేంటో?
  —–
  ‘అంకుష్‌’ గారు: మీ వ్యాఖ్యలు పూర్తిగా అర్థం కాలేదు కానీ, అర్థమైనంతమటుకు మీ ఆలోచనలతో నేను ఏకీభవిస్తాను.
  —–
  ‘జిలేబి’ గారు: ప్రావిణ్యం చాలా చోట్ల ఉందండోయ్‌…

 12. 11:54 సా. వద్ద డిసెంబర్ 31, 2011

  నేను puritanకాను.స్త్రీలు వారి ఇష్ట మైన దుస్తులు ధరించే హక్కు వారికుంది. .కాని వారి మంచికోసమే కొన్ని కఠిన సత్యాలు గమనించాలి.సమాజంలో అందరూ మంచివాళ్ళు కాదు.దుర్మార్గులు,సైకోలు కూడా చాలా మంది ఉన్నారు.మా కోడలు,డాక్టర్ అన్నది; అర్ధరాత్రి నా కొడుకును ఏదైనా పనిమీద పంపగలను ,కాని నా కూతురిని పంపలేను అని.అంతెందుకు ?మగవాళ్ళయినా డబ్బుతో కొన్ని చోట్లకి ,కొన్ని సమయాల్లో వెళ్ళడం ప్రమాదకరమని తెలిసిందే.అందువల్లనే తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో ఎక్కువ జా గ్రతలు తీసుకొంటారు.అది అమ్మాయిల మంచికి,రక్షణకే.డీ.జీ.పీ. గారు పై కారణాలవలననే హెచ్చరించిఉంటారు,కాని దుస్తులు ఒక్కటే కారణమని ఆయన అభిప్రాయం కాదనుకొంటాను.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s