ముంగిలి > పిచ్చాపాటి > మబ్బుల్లో రకాలు

మబ్బుల్లో రకాలు

పెద్దగా పట్టించుకోముగానీ, మబ్బుల్లో ఎన్నెన్ని రకాలో! అలా కదులుతున్న మబ్బులు, రగులుతున్న నిప్పు, పారుతున్న నీరు, పున్నమి చంద్రుడు – ఇట్టే ఆకర్షించి మన ధ్యాసను పట్టేసుకుంటాయి. నా చిన్నతనంలో నా వద్ద ఒక Atlas ఉండేది. దానిలో చూశాను మొదటిసారి – మబ్బుల రకాలు. మొన్న మొన్నే – మా ఆఫీసు బయట ఒక అందమైన మబ్బు రకం కనిపిస్తే, ఈ విషయం గుర్తుకొచ్చింది. ఎలాగూ Internet ఉందిగా – మళ్ళీ గుర్తు తెచ్చుకోడానికి. ఈ టపాలో ముఖ్యమైన రకాలు మాత్రమే చూపాను. వీటిలో సంకర రకాలు, ఉప రకాలు ఇంకా చాలా ఉన్నాయిలెండి.

సిఱ్ఱోక్యుమ్యులస్ రకం (Cirrocumulus)

భూ ఉపరితలానికి చాలా ఎత్తులో ఉండే మూడు రకాలలో ఇదొకటి. 5 నుండి 12 కిలోమీటర్ల పైన తేలియాడుతుంటాయి.

సిఱ్ఱోక్యుమ్యులస్ రకం (Cirrocumulus)

సిఱ్ఱోక్యుమ్యులస్ రకం (Cirrocumulus)

సిఱ్ఱస్ రకం (Cirrus)

లాటిన్ బాషలో ఉంగరాల జుత్తుని Cirrus అంటారట. అలా ఉండటం వల్ల, వీటికి ఆ నామకరణం చేశారట. మన భారతదేశంలో ఇవి బాగానే ఏర్పడుతుంటాయి. సంద్యా సమయాల్లో అస్తమిస్తున్న సూర్య కిరణాలవల్ల, అబ్బుర పరిచే రంగులతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సిఱ్ఱస్ రకం (Cirrus)

సిఱ్ఱస్ రకం (Cirrus)

ఆల్టోక్యుములస్ రకం (Altocumulus)

పైరెండురకాల కన్నా, కాస్తంత తక్కువ ఎత్తులో ఏర్పడే రకం. ఆరు వేల నుండి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో తేలియాడుతుంటాయి.

ఆల్టోక్యుములస్ రకం (Altocumulus)

ఆల్టోక్యుములస్ రకం (Altocumulus)

ఆల్టోస్ట్రాటస్ రకం (Altostratus)

సర్వసాధారణంగా మనము చూడగలరకం. సూర్యోదయం అయిన తరువాత, ఇటువంటి మబ్బులవెనుకనున్న సూర్యుడిని తిన్నగా చూడవచ్చు. ఓ వంద నిండు పున్నమి చంద్ర బింబాలు ఒకేచోట ఉన్నట్టు – భలే ఉంటుంది.

ఆల్టోస్ట్రాటస్ రకం (Altostratus)

ఆల్టోస్ట్రాటస్ రకం (Altostratus)

స్ట్రాటోక్యుమ్యులస్ రకం (Stratocumulus)

తక్కువ ఎత్తులో – అంటే శుమారు 6000 అడుగుల ఎత్తులో ఏర్పడే దట్టమైన మబ్బు రకం ఇది. ఋతుపవనాలు ప్రవేశించినపుడు, మనకు కనిపించే పరిగెడుతుండే మబ్బుల రకం.

స్ట్రాటోక్యుమ్యులస్ రకం (Stratocumulus)

స్ట్రాటోక్యుమ్యులస్ రకం (Stratocumulus)

స్ట్రాటస్ రకం (Stratus)

కదులుతూ చాలాసేపు పడుతూ – బాగా పనికివచ్చే జల్లులు వీటి పుణ్యమే. ఇవి కూడా తక్కువ ఎత్తులో తేలియాడుతుండే రకం.

స్ట్రాటస్ రకం (Stratus)

స్ట్రాటస్ రకం (Stratus)

క్యుమ్యులస్ రకం (Cumulus)

తక్కువ ఎత్తులో ఏర్పడే దట్టమైన మబ్బులు. కొన్నిసార్లు ఒంటరిగా ఒకటో రెండో కూడా కనిపిస్తుంటాయి. అందంగా గుబురుగా కనిపిస్తుంటాయి.

క్యుమ్యులస్ రకం (Cumulus)

క్యుమ్యులస్ రకం (Cumulus)

క్యుమ్యులోనింబస్ రకం (Cumulonimbus)

మబ్బులకే రారాజు రకం. ఇవికానీ కుళాయి తెరిచాయంటే, విపరీతమైన వానలు పడతాయి. భూమికి అతిదగ్గిరగా మొదలయి, 50,000 అడుగుల ఎత్తువరకు దట్టంగా ఏర్పడగలవు. తుపానులు గట్రా వచ్చినప్పుడు, వీటి ప్రతాపాన్నే, మనము అనుభవించేది. కొన్ని కొన్ని సార్లు, ఆకాశాన్ని మొత్తం కప్పకుండా, ఒకే చోట కేంద్రీకృతం అయికూడా కనిపిస్తుంటాయి – ఎంతో అందంగా.

క్యుమ్యులోనింబస్ రకం (Cumulonimbus)

క్యుమ్యులోనింబస్ రకం (Cumulonimbus)

2012 రకం

ఈ మబ్బు కేవలం 2012 జనవరి ఒకటో తేదీన – నమ్మకం ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. ఏది? ఒకసారి బయటికెళ్ళి చూడండి మీకూ కనిపిస్తుందేమో? కనపడకపోతే, ఇక్కడ దాని ఫోటో ఒకటి పెట్టాను.

2012 రకం

2012 రకం

మీకూ, మీవారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు… Wish you and yours a Happy, Prosperous and Wonderful New Year – 2012.

ప్రకటనలు
 1. ankush
  3:25 సా. వద్ద జనవరి 2, 2012

  Thank you and I wish a very happy, peaceful, and propserous new year to you and all your family, Sir!!
  That was a very good story build up with a lovely ending!!

 2. 6:36 సా. వద్ద జనవరి 11, 2012

  It is good. Interesting information to learn.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s