ముంగిలి > పిచ్చాపాటి > మొదటి సంవత్సరం

మొదటి సంవత్సరం

ఈ బ్లాగుకు నేటితో సంవత్సరం పూర్తయింది. 2011 సంవత్సర సంకల్పం (resolution) – ఏదన్నా కొత్తగా చేయాలి అని. ‘నా గురించి’లో రాసుకున్నట్టు, మాతృబాష అయినా – నా తెలుగు అంతంత మాత్రమే. అప్పుడనిపించింది – కాస్తన్నా మెరుగుపరుచుకోడానికి, తెలుగులో బ్లాగ్ ఎందుకు రాయకూడదూ – అని. Social Mediaకి మొదటినుంచీ నేను దూరమే. కాబట్టి బ్లాగింగ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. గొప్ప కారణమేమీ లేదు – ఎందుకో WordPress లో ఖాతా తెరిచాను. అజ్ఞాతంగానే బ్లాగ్ రాయాలనిపించింది. నా ఊరూ పేరూ పెడితే, స్వాతంత్ర్యం ఉండదేమో అని. ఎవరు చూస్తారులే అని ఏవేవో బరికేవాణ్ణి.

మాధవరావు పెబ్బరాజు గారికి ఎలా తటస్థించిదో తెలియదు – ఆయనే మొదటి Comment పెట్టారు. కాస్తంత ఖంగు తిన్నాను. ఈయనెవరు? ఈయన నా బ్లాగుకు ఎలా వచ్చారు? అంటే మరింకెవరన్నా నా బ్లాగ్ చదువుతున్నారా? ఆ దెబ్బకు జ్ఞానోదయం అయింది – ఒళ్ళు దగ్గిరపెట్టుకొని బరకాలని. WordPress settings లో వెతికినప్పుడు, రహస్యంగా ఉంచాలంటే ఒకానొక Option మీట నొక్కాలని తెలుసుకున్నాను. ఎలాగో కొందరు చూసేశారు కదా – ఇక రాసేదేదో publicగానే రాసేస్తే పోలా అనిపించి, aggregators గురించి తెలుసుకొని, వాటిలో నా బ్లాగ్ నమోదు చేసుకున్నాను.

Subscribers

ఒకానొక సందర్భంలో, ‘నేను బ్లాగింగ్ మొదలు పెట్టాను’ అని పుసుక్కున నోరు జారడం – ఈ బ్లాగ్‌కు మొదటి Subscriberను తెచ్చిపెట్టింది. వెంటనే తప్పు చేశానేమో అనిపించింది. చదివే వారిలో నాకు తెలిసినవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, నా అజ్ఞాతానికి అవధులు ఏర్పడినట్టనిపించింది. ఆ వ్యక్తిది కేవలం కుతూహలమే కానీ ఆసక్తి కాదని తెలిశాక, మళ్ళీ నా అజ్ఞాతం నాకు తిరిగి దొరికినట్టనిపించింది.

కానీ తెలిసినవారు చదువుతున్నారు అన్న భావన, నా రాతలను కాస్తంత క్రమబద్ధీకరించిందనే చెప్పాలి. ‘అక్షరం పరబ్రహ్మ స్వరూపం’ అని త్రికరణశుద్ధిగా నమ్ముతాను. అలాంటి అక్షరాలను కూర్చి – నా భావనలను అజ్ఞాతంగానైనా బహిరంగంగా రాస్తున్నందున, కాస్తో కూస్తో నియంత్రణ అవసరం అనిపించింది. కాబట్టి, మరో వ్యక్తికి కూడా నా బ్లగ్ గురించి చెప్పాను. అలా రెండో Subscriber. కావాలనే, చేజేతులా నా అజ్ఞాతానికి అవధులు కల్పించుకున్నాను.

కొన్ని టపాలు ప్రచురించినపుడు, ఉన్నట్టుండి ఇద్దరో ముగ్గురో subscribers చేరేవారు – అంతే తెలికగా కొన్ని కొన్ని టపాలు పెట్టినప్పుడు unsubscribe చేసేశారు. మొదట్లో, subscribers సంఖ్య పెరగాలని ఆశించేవాడిని.

వ్యాఖ్యలు

మొదలుపెట్టిన కొన్ని నెలల తరువాత, కామెంట్ల వ్యామోహం పట్టుకుంది. ఒక టపా ప్రచురించాక, వ్యాఖ్యలకోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. నా Mobile Phone లో comment notification వచ్చినప్పుడు వచ్చే శబ్ధంకోసం వేయి కళ్ళతో (చెవులతో లెండి) ఎదురుచూసేవాణ్ణి. మెల్లిగా, వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చేట్టు రాయాలన్న దిశలో ఆలోచనలు బయలుదేరాయి. ఈ బ్లాగ్ మొదలుపెట్టింది దేనికి? చేస్తున్న పనేమిటి? అన్న ప్రశ్న రెండు మూడు వారాల తరువాత ఎదురయింది. వెంటనే స్పృహ వచ్చి, నేను రాయాలనుకున్నవే రాయటం తిరిగి మొదలు పెట్టను.

నాకు నచ్చే విషయాలపై ఆసక్తి చూపేవారి సంఖ్య స్వహతాగానే కాస్తంత తక్కువ. చాలామంది సరదాగా ఉండేవాటిమీదో లేక current affairs గురించిన విషయాలపైనో ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయినా, నాకు నచ్చిన విషయాలపైనే టపాలు రాయటం మళ్ళీ మొదలయింది. ఈ అనుభవంవల్ల ‘వ్యాఖ్యలు అనే మిఠాయి’ వ్యామోహం నుంచి బయటపడ్డాను.

‘వ్యాఖ్యలు అనవసరం’ అనను – కానీ నేను చదివిన ఎన్నో టపాలు నన్ను అబ్బురపరిచినా, నేను అక్కడ Comments పెట్టలేదు. కాబట్టి వ్యాఖ్యలు రాలేదంటే, మనము రాసింది చెత్త అని అనుకోవటం సబబు కాదనిపించింది. పైపెచ్చు WordPress బ్లాగ్ వల్ల, పైసా లాభం లేదు. ఎంత మంది subscribe చేశారు? ఎంతమంది చదువుతున్నారు? మొత్తం eye balls ఎన్ని – అన్న ప్రశ్నలు, నా ఈ బ్లాగువంటివాటికి అంత ముఖ్యం కాదేమోననిపించింది. అందులోనూ అజ్ఞాత బ్లాగుకైతే, అర్థమే లేదు.

2011లో నా అదృష్టం బాగుండి, దిక్కుమాలిన కామెంట్లను ఎదుర్కోవలసిన అగత్యం పట్టలేదు. ఒక వ్యాఖ్య మాత్రం అసంధర్భంగా అనిపించి కాస్తంత చిరాకు కలిగించింది. One word కామెంట్లను సాధారణంగా ప్రచురించను – direct delete. “బాగుంది”, “nice post” వంటివి. బాగుంటే, ఎం బాగుంది చెబితే బాగుంటుంది కదా?

ఇతర బ్లాగ్‌లు

కూపస్థం నుండి బయటపడ్డ మండూకంలాగా, మెల్లిగా వేరే బ్లాగ్‌లు కూడా చదవటం మొదలు పెట్టాను. కొన్ని కొన్ని అబ్బురపరిస్తే, కొన్ని సంధర్భాలలో అసహ్యం కలిగింది. నన్ను అబ్బురపరిచిన కారణాలు ఎన్నో.

 • తన బుజ్జిపండుకి ఏడుగురు రాజకుమారుల కథ చెప్పినప్పుడు, ఈ కాలపు ‘అమ్మ’ ఎలాంటి ప్రశ్నలెదురుకుందో వివరించిన శైలి ముచ్చటగొలిపింది.
 • తన పేరంటే తనకెందుకు భయమో చెబుతూ రాసిన టపా – చదివిన ప్రతిసారి కడుపుబ్బా నవ్వించగల నైపుణ్యం చాలా నచ్చింది.
 • ‘పేడ బిరియాని’ రుచి చూపించిన టపా తెగ నచ్చింది.
 • O=BR2 అన్న సమీకరణం, నా ముక్కు మీద వేలేసుకునేట్టు చేసింది.
 • బెండకాయ, ఆలుగడ్డల మధ్యన కథ అల్లగలిగే చతురత భలే నచ్చింది.
 • గాంధీగారు నృత్యం చేస్తున్న ఫోటో సంపాదించిన బ్లాగరు ఆసక్తి నన్ను ముచ్చటగొలిపింది.
 • అసలు ఆర్ముగం ఎలా ఉంటాడో అన్న ప్రశ్న రేకెత్తిచ్చిన వైనం అబ్బురపరిచింది.
 • ఎందుకో ఏమో అంటూ, don’t careగా నచ్చినవన్నీ, తనకోసమే అన్నట్టు – రాసే పద్ధతి మహా నచ్చింది.
 • రిటైర్ అయి, బ్లాగింగ్ చేస్తూ చక్కటి కాలక్షేపం చేయొచ్చని చూపిన Senior Citizenలు భలే అనిపించారు.

ఎన్నో – ఎన్నెన్నో. ఒక సాధారణ విషయాన్ని, ఇలా కూడా చూడవచ్చునని నేర్పిన టపాలు, కాస్తో కూస్తో న్యూనతా భావాన్ని కలిగించాయి. నేను కూడా ఎప్పటికైనా ఇలా రాయగలనా అనిపించే విధంగా! మొదటిసారి – గొర్రెల మధ్య కాదు, అజ్ఞాతంగా ఉండే మేధావుల మధ్యనున్న అనుభవం – ఇతర బ్లాగులు చదివినప్పుడు కలిగింది. అప్పుడప్పుడు “ఇంతకీ మీరెవరండీ?” అని అడగాలనిపించేది. కానీ తెలియకపోవడమే అసలైన మజా. అందుకే, చెప్పినా తెలుసుకోవాలన్న కుతూహలం లేదు.

ఇక కొందరి బ్లాగ్‌లుంటాయి – 100% స్వచ్ఛమైన గరళాన్ని జనాల్లో చిమ్మేవి. ఏ ముహుర్తంలో పుట్టుంటారో వీళ్ళు – అనిపించేవిధంగా ఉంటాయి వీరి రాతలు. ఒక గొప్ప విషయాన్ని కూడా – వంకర టింకర పద్దతుల్లో చూపించే పనికిమాలిన ప్రజ్ఞ. ఇటువంటివారి గురించి రాయటం కూడా waste.

కొన్ని విశేషాలు

Conclusion

పూర్తి నమ్మకం లేకుండా మొదలు పెట్టినా, మొదటి సంవత్సర విశేషాలు సింహావలోకనం చేయగలిగానంటే – ఫరవాలేదన్న మాట. కనీసం 150 టపాలు రాయాలని మొదలుపెట్టి, 96 మాత్రం రాయగలిగాను. Scope for improvement eh! తెలుగులో ఆలోచించటం, చదవటం – రాయటం కూడా మెరుగైనట్టు ఓ చిన్ని సంతోషం.

ప్రకటనలు
 1. 8:41 ఉద. వద్ద జనవరి 3, 2012

  ఆత్మావలోకనం బాగానే చేశారు.

 2. వేణు
  10:31 ఉద. వద్ద జనవరి 3, 2012

  మొదట మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బ్లాగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగ Congratulations.
  మీ బ్లాగ్ regular గా చదివే వాళ్ళల్లో నేను ఒకడిని. మీరు ఎంచుకొనే అంశాలు ఆలోచిమ్పచేసివిగా వుంటాయి, నాకు చాలా నచ్చుతాయి.

 3. 1:49 సా. వద్ద జనవరి 3, 2012

  చాలా సంతోషం

  🙂

  ?!

  తెలుగు భావాలకు subscribe అయ్యాను, ప్రతి పోస్ట్ మెయిల్ రూపం లో వస్తుంది, వచ్చీ రాగానే title చూసి respond అవుతాను,
  నాకు అది (తెలుగు భావాలూ) ఒక open forum లా ఒక్కరు కాక వేరే వేరే ఎవరో కలిపి నడుపుతున్నట్లుగా అనే భావమే ఉండేది.
  అయిన అక్కడ వ్యక్తి భావం ఎన్నడు స్ఫురణ కు అవకాసం లేదు.సమిష్టి తెలుగు వారి హృదయ స్పందనలే వినవచ్చేవి.
  నాకు సంతోషం గా ఉంది. ఎవల mail లో feed తొలి పేరా మటుకే వచ్చింది. అది చూసి చాలా సంతోషం అని ఒక స్మైల్ ఇచ్చి వెళ్దామనుకున్నాను
  కానీ మిగితా analysis చూసాక మళ్ళీ హృదయం పై చిరుగాలి వీచింది.
  ఒహ్హో ! టపా లపై కమెంట్లపై మీ మా మన తెలుగు భావం ఒక్కటే
  सौ सयाने एक माता అని 7th class లో హిందీలో ఒక lession ఉండేది.
  రాజుగారు మంత్రి సలహా మేరకు పెద్ద కుండలో ఊళ్లోవరందరినీ పలు పోయామంటే,
  (ఎవరికీ వారు తమలో తాము) అందరు పాలే పోస్తారు మనం నీళ్ళు పోస్తే ఎలా తెలుస్తుంది అని భావించి
  ప్రజలంతా నీళ్ళే పోస్తారు అప్పుడు మంత్రి practical గా అందరి అభిమతం ఒక్కటే అని తెలియ పరుస్తాడు.
  అదీ కథ
  మీ మనో భావం నా మనో భావం దరి దాపు similar గా ఉంటె
  మీ post చూసాక, ఇలా కామెంటు రాయాలని తోచినది.

  నాకు చిన్న ప్పటి నుంచి పెద్ద doubt
  (upto ఇంజనీరింగ్ వరకు telugu medium సో
  మా teacher లు తెలుగే గొప్ప అనే భావాలూ నాలో సుస్థిరం చేసారు )
  ఏమంటే
  నిజంగా మనో భావాలూ ఉన్నది ఉన్నట్లు పంచుకోవటం ఒక్క తెలుగు భాషలోనే maximum వీలైనంత
  అనుభవానికి ఒచ్చినంత అనుభూతిని పంచె టంత level లో
  express చేసే అవకాసం ఉంటుందేమో?
  కతిమా భాషల్లో అంత సౌలభ్యం ఉండదేమో అని !
  మీరేమన్న మీ భావం చెప్పండి ఈ నా అనుమానం (చిన్న నాటి నుండీ నాతో పాటు పెరిగిన పెనుభూతం ) గురించి
  దయ చేసి

 4. Piska Satyanarayana
  1:54 సా. వద్ద జనవరి 3, 2012

  బ్లాగు ప్రారంభించి సంవత్సరకాలం పూరి అయిన సందర్భంగా, మీ సింహావలోకనం చాలా బాగుంది. మీ నిజాయితీకి ముచ్చటేసింది. అభినందనలు.

 5. 5:48 సా. వద్ద జనవరి 3, 2012

  ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నా జ్ఞాపకాలు దాచుకు౦దామని బ్లాగు రాయడం మొదలు పెట్టాను..కాని <> నాకూ ఇదే అనుభూతి కలిగింది..
  బుజ్జిపండును ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను..ధన్యవాదాలు…

 6. 6:19 సా. వద్ద జనవరి 3, 2012

  ఈ సమీక్ష చాలా నచ్చింది. నా బ్లాగ్ రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పుడు నేనూ ఇలాంటి సమీక్ష (ఇంత నిజాయితీ గానూ) రాయటానికి ప్రయత్నిస్తాను.

  వెరీ నైస్. ఇక మీరన్న ఒక పదం కామెంట్ విషయం లో మీతో పూర్తిగా ఏకీభవించలేను.. ఒక్కోసారి నిజంగా అలాగ ‘హ్మ్. బాగుంది’ అనిపిస్తుంది, అప్పుడు చటుక్కున ఆ చిన్న కామెంట్ రాయటం జరుగుతుంది. మీరన్నట్టు ఇకనుండీ ఏది బాగుందో చెప్తాను..

 7. ankush
  7:30 సా. వద్ద జనవరి 3, 2012

  Congratulations, TBLUgaru. However, I had mixed feelings reading this particular blog in the sense I thought you were selling your blog under the guise of an honest look-back. Anyway, in the end I concluded that I may not be fully true. And all you bloggers deserve a fair enough appreciation and respect for your talent.
  Way to go!!

 8. జ్యోతి
  7:37 సా. వద్ద జనవరి 3, 2012

  అభినందనలు…మీ సింహావలోకనం చాలా బాగుంది.

 9. 9:47 సా. వద్ద జనవరి 3, 2012

  ‘శర్మ’ గారు, ‘వేణు’ గారు, ‘సత్యనారాయణ’ గారు, ‘జ్యోతి’ గారు: కృతజ్ఞతలు
  —–
  ‘ఎం.ఏ’ గారు: ఎవరి బాష వారికి ముద్దు! నా మటుకు నాకు, ఉర్దూ + హిందీ బాషలు కలిపి వాడే Bollywood పాటలలో ఉన్న Depth తెలుగు పాటలలో కనిపించదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మనలో ఎవరికన్నా, తెలుగు కాక మరో భారతీయ బాషపై పట్టు ఉండి బ్లాగింగ్ చేస్తుంటే కనక, మీ ప్రశ్నకు సాధికార సమాధానం చెప్పగలరనుకుంటున్నాను.
  —–
  ‘జ్యోతిర్మయి’ గారు: బుజ్జిపండు ఇతర బ్లాగుల్లో కూడా ఉన్నాడు కదా!?!
  —–
  ‘కృష్ణప్రియ’ గారు: కామెంట్ల విషయంలో, మీరు రాసిందీ సబబే! నా మటుకు నాకు, ఎందుకో అలా one word వ్యాఖ్యలు పెట్టబుద్ధి కాదు. ఇంకో చిరాకు blogspot లో authenticate చేసుకోవడం. WordPress blogger లను మహా చిరాకు పెడుతుంది.
  —–
  ‘Ankush’ గారు: Well, since you figured out my hidden agenda, any recommendations from you – as to how I can improve my marketing skills so that the blog becomes further more popular resulting in increased margins?

  • ankush
   12:48 ఉద. వద్ద జనవరి 4, 2012

   TBLUabbayi, you seem to be more hot-headed than me….okasari nenu emi conclude chesano choodandi…every blogger’s spirit is highly commendable….better than me in the least….especially the women bloggers who find time for blogging while taking care of their family and professional lives…and all you guys who are writing in Telugu keeping it alive….
   In your reply to En.Emo I trust you were referring to majority of the Telugu songs over the last 25 -30 years….which is I guess due to lack of skilled writers and nothing to do with the power of expression in Telugu language per se. Why there is a decline in quality is a different story altogether. Urdu is in the path of decline…Hindi might still be alive till the Hindi speaking states develop economically. To me a language is alive as long as there is quality writing and it is available to general public. Ippudoche (ante naaku thelisi for the past 20-22 years) telugu weeklies or monthlies have given more importance to titillating stories that too as center-spreads. Inka novels sangathi cheppali ante maree most of them are copyright violations only. Creative thinking or creativity anedhi nil…
   Evanni pakkana pedithe…sweet ga unde (ante vinadaniki madhuranga) languages lo Telugu, Urdu, Bengali, Spanish…

   • 1:34 ఉద. వద్ద జనవరి 4, 2012

    Did you find my response “Hot Headed?” Now that’s unfair! Since you suspected ‘marketing’ as underlying tone in this blog post, I just reaffirmed it by inquiring of any further tips. My response oozes as much candor as your remark does. That’s not hot headedness! Or may be, I’d need to refine my CRM skills eh!?

    Of course, I already cautioned “కొద్దిగా కోపిష్టివాడినేనని చేప్పుకోవాలి…” under “నా గురించి…”

    Coming to the depth of expression, I did put a disclaimer as “ఇది నా అభిప్రాయం మాత్రమే” since I know – this may not be acceptable to everyone as perhaps you yourself as an example. No arguments…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s