ముంగిలి > శిరోభారం > మనం చేస్తే ఒప్పు – Russians చేస్తే తప్పు!

మనం చేస్తే ఒప్పు – Russians చేస్తే తప్పు!

విడుదల కాని చిత్రం పాట ఒకటి చెవిన పడింది. మొదలు – రాముడు లాంటి మొగుడొద్దు, కృష్ణుడు లాంటి పెనిమిటి కావాలి అని. ఇక మిగతా పాటంతా రాముడి లాంటి మొగుడైతే ఏమి కోరతాడు, కృష్ణుడు రకం మొగుడైతే ఏం చేస్తాడు అని. చాలా మంది వినే ఉంటారు; లేకపోతే త్వరలోనే వింటారు.

సంధర్భం ఎలాంటిదైనా కావొచ్చు. Vamp మీద చిత్రీకరించే పాటైనా అవ్వొచ్చు – కానీ ఇలాంటి దుందుడుకు సాహిత్యం హర్షనీయమేనా? ‘కీచకుడి’ పోలికలు చూపి, ‘కృష్ణుడు’ అని ఎలా అంటారు? అస్కలిత బ్రహ్మచర్యం పాటించిన కృష్ణతత్వం – ఆ పాటలో సాహిత్యం వంటిదా?

ఇక రేపో మాపో ఆరేళ్ళు కూడా నిండని పాపలను టీ.వీ.లలో స్టేజీలెక్కిచ్చి, ఈ పాటకు గగుర్పొడిచే Pelvic Thrustలున్న స్టెప్పులేయించి, నానా రబస చేస్తారు. తారక మంత్రంలా – కొంత కాలం ఇలాంటి పాటల్నే జపిస్తారు. పెళ్ళిళ్ళల్లో కూడా ఇలాంటి పాటలేయిస్తారు. ఏఁవండీ – వాడెవడో ఒకానొక అనువాదాన్ని నిషేదిస్తానంటే, అంతంత అల్లరి చేశామే, మనము చేస్తున్నదేమిటీ? రేపు Lady Gagaనో, Beyonce Knowlesఓ కృష్ణుడి మీద ఇలాంటి సాహిత్యమున్న పాటనే విడుదల చేస్తే, పార్లమెంటు దద్దరిల్లకుండా ఉంటుందా?

నూటికి 95% శాతం జనాభా తెలుసుకునేది – సినిమాలను చూసే. ‘దేవుళ్ళు’, ‘రామదాసు’ చిత్రాలు విడుదలయ్యాక కాణీపాకం, భద్రాచలాలో రద్దీ పెరగలా? సినిమాలు ఏది చూపితే అదే – ఎంత చెబితే అంతే. అంత శక్తున్న మాధ్యమం అని అందరికీ తెలుసు కదా, మరెందుకు ఇలాంటి పాటలు? ఆ సినిమా అభినేత చిత్రాలలో పాటలు సాధారణంగా బాగుంటాయి. అతనంటే పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకూ పిచ్చ క్రేజుంది. తన స్థాయిని దింపే విధంగా ఉంది ఈ పాట.

అంతర్జాతీయంగా కృష్ణుడిపై అవగాహనను పెంచే సంస్థ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఓహో! వీరు అంతర్జాతీయ సంస్థ కదూ? ఈ పాట కనీసం జాతీయం కూడా కాదు, లోకల్ పాటాయే! వీళ్ళకేం వినిపిస్తుంది?

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. SN
  10:18 ఉద. వద్ద జనవరి 4, 2012

  ఈ సందర్భంగా మీకు మరో పాట గుర్తు చెయ్యాలి.. పదేళ్ళ కిందట అనుకుంటా. “అక్కా ఎవరే అతగాడు..”. అంటూ ఇంచుమించు ఇలా కృష్ణుడికీ రాముడికి పోలికలు తెస్తూ పాట ఉంది…భావం కూడా దాదాపు ఒక్కటే. కాని ప్రెజెంటేషన్ లో ఎంత తేడా ఉంది.?
  ఈ పాట విన్నపాటి నుంచి నాక్కూడా రక రకాలు గా, చిరాగ్గా ఉంది.. మీకు బోలెడు థాంక్సులు.ఈడొచ్చిన పిల్లలు ఈ పాట హమ్ చేస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తోంది…..నేనయితే మా ఇంట్లో దాదాపు, ఇలాంటి ముమైత్ఖాన్ పాటలు నిషేధించాను. కానీ ఎన్నాళ్ళు? అసలీ దర్శకులకి సమాజం పట్ల కాస్తయినా బాధ్యతలుండవా.
  పోనీ పాడిన సింగర్ కయినా అనీజీ అనిపించలేదా.? తల్లి దండ్రుల ముందు తలెత్తుకొని ఎలా జీవించగలుగుతారు? ఇలాంటి పాట క్రెడిట్ దక్కుతున్నప్పుడు? ఇదేనా కెరీర్ లో విజయం సాధించడమంటే?
  ఇంకోపాట ప్రస్తావిస్తాను ఇక్కడ… “సార్ వొస్తారా …….”
  అచ్చంగా, బిచ్చగత్తెల మాడ్యులేషన్లో…బిచ్చగాళ్ళు క్షమించుగాక… ఖర్మ….. ఖర్మ…..
  -SN

 2. SHANKAR.S
  11:00 ఉద. వద్ద జనవరి 4, 2012

  హ్మ్!!

  “ఇక రేపో మాపో ఆరేళ్ళు కూడా నిండని పాపలను టీ.వీ.లలో స్టేజీలెక్కిచ్చి, ఈ పాటకు గగుర్పొడిచే Pelvic Thrustలున్న స్టెప్పులేయించి, నానా రబస చేస్తారు.”

  ఇప్పటికే మీరు చెప్పిన అభినేత ముందటి సినిమాలో ఇదే స్థాయి పాటకు పిల్లల చేత మీరు చెప్పినదానికన్నా ఇంకా దారుణంగా స్టెప్స్ వేయిస్తున్నారండీ. ఛానెల్ మార్చడం ఒక్కటే మనం చేయగలిగేది. మొన్నామధ్య ఎవరో వీటి మీద మానవ హక్కుల కమీషన్ లో కేసు వేశారు కదా. ఏం జరిగింది? ఓ రెండు రోజులు న్యూస్ చానెల్ల చర్చలు, పేపర్లలో వార్తలు అంతే. మళ్ళీ మామూలే.

  @ SN గారు

  “పోనీ పాడిన సింగర్ కయినా అనీజీ అనిపించలేదా.?”

  వాళ్లకి భాష తెలిస్తే కదండీ. పచ్చి బూతులు రాసిచ్చినా యాంత్రికంగా పాడేసి వెళ్ళిపోతారు.

 3. SN
  11:57 ఉద. వద్ద జనవరి 4, 2012

  శంకర్ గారు!
  ఆ గాయని మరెవరో కాదండి. మన తెలుగుతల్లి ముద్దుబిడ్డ. గీతామాధురి!!!
  గుర్తుందా? అలనాడు అప్పుడెప్పుడో, ఒకానొక రియాలిటీ షో లో పాల్గొంటూ, రఘు కుంచె లాంటి ఒక సీనియర్ గాయకుడిని **** బూతులతో సన్మానించిందిలెండి. పెద్దంతరం చిన్నంతరం లేని ఇటువంటివాళ్ళని, పరిశ్రమ ఇంకా ఆదరిస్తున్నందుకు ఏమనాలో తెలీడం లేదు.
  -SN

  అన్నట్టూ.. ఈ సినిమా సెన్సార్ వగైరాలు కూడా పూర్తి చేసుకుందట….

 4. 12:29 సా. వద్ద జనవరి 4, 2012

  I am also heard the song … “సార్ వొస్తారా …….” It is also very bad lyrical values.

  At the time of movie audio release function I observed the lyrics

  Sir ఒస్తరోస్తారా “ధ” వత్తే ఇస్తారా?

  if a matured alphabets learner (Zee Sa ri ga ma champs)

  what they will think about this?

  Particularly these type off issues, we cant do any thing sir,

  http://endukoemo.blogspot.com/2011/12/puri-is-real-business-man-i-think-see.html

  this type of “Business man” means nothing selling values

  that’s it

  😦

  ?!

 5. 1:19 సా. వద్ద జనవరి 4, 2012

  అసలీ దేశంలో సినిమాలని నిషేధించాలి. ఏ ఒక్కణ్ణి విమర్శించినా.. తమ సృజనాత్మకతకి సంకెళ్ళు వేస్తున్నారంటూ గగ్గోలు పెడతారు. సిగరెట్లు, మందు తాగించొద్దంటే రచ్చ చేస్తారు. పైగా ప్రజల డిమాండ్ మేరకే తీస్తున్నామంటూ అశ్లీల దృశ్యాలు ఇరికిస్తారు. ఛీ.

  • Sri
   1:49 సా. వద్ద జనవరి 4, 2012

   My viewpoint is it wont work in hugely populated countries like us. The more things are banned the more they are abused. Censorship should do actually, however members of these committees can be influenced\lured. No solution I guess till we have smaller states in population for better governance(BTW, I am not fighting for Telangana).

 6. Sri
  1:28 సా. వద్ద జనవరి 4, 2012

  “నూటికి 95% శాతం జనాభా తెలుసుకునేది – సినిమాలను చూసే”. This is so true. But, nobody is even willing to look into it quoting freedom of expression. Expressions do cause impressions in impressionable minds. And majority of the population are impressionable minds. Who will bell the cat?
  I find most telugu people always value money, films, power, and politics then anything else in life. So, I dont expect any value add from telugu movies. The worse trend happening now is in TV; anchors coming from film background and the participants also coming from film background…add sleaze and double entendre comedy…get more eye balls…make more money…get called successfull…get felicitated.

 7. Sri
  1:39 సా. వద్ద జనవరి 4, 2012

  May there be more messages condemning these kind of things in Internet….If a woman on Facebook can cause a revolution in a country…cant we persist to pull down these kind of dirty minds?

 8. తాడిగడప శ్యామలరావు
  2:23 సా. వద్ద జనవరి 4, 2012

  అప్పుడప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువు దగ్గరకు పోయి లబలబ లాడతారు. ఎప్పడి కీ రాక్షసడి పీడ విరగడ చేస్తావు స్వామీ అని గగ్గోలు పెడతారు.

  శ్రీమహావిష్ణువు ఒక చిరునవ్వు చిందిస్తాడు. ఇంకా ఆసమయం రాలేదు. ప్రస్తుతానికి వెళ్ళండి. కొన్నాళ్ళు నిరీక్షించక తప్పదు మరి అని పంపిస్తాడు వాళ్ళని.

  కొన్నాళ్ళకి భూదేవి అమ్మవారు వస్తుంది. ఈ రాక్షసుడి అకృత్యాలనుండి విముక్తి ప్రసాదించవయ్యా అని అభ్యర్ధిస్తుంది. ఈ లోగా బ్రహ్మేంద్రాదులు, దేవ గణాలతో సహా వచ్చి చేరుకుని పాహి పాహి అని అరుస్తూ ఉంటారు.

  శ్రీమహావిష్ణువు మళ్ళీ ఒక చిరునవ్వు చిందిస్తాడు. సమయం ఆసన్న మయింది దేవీ! ఆ రాక్షసుడి పాపం పండటం కోసం యెదురు చూసానిన్నాళ్ళూ. ఇదిగో భూలోకానికి విచ్చేస్తున్నాను. వాడికి అంతం సమీపించింది అంటాడు.

  జయ జయ ధ్వానాలు.
  రాక్షస సంహారం.
  కథ సుఖాంతం.
  శుభం.

  ఈ సినిమా రాక్షసుడు మరీ విజృంభిస్తున్నాడు.
  ఇంకా సమయం రాలేదా స్వామీ!

  ఈ లోగా మీడియా రాక్షసుడు కూడా వీడి అండ చూసుకుని చెలరేగి పోతున్నాడే!
  ఇంకా సమయం రాలేదా స్వామీ!

  ఇలా ప్రార్ధిస్తూ ఉందాం. ఈ రాక్షసులు మరీ తింగరతింగరగా రెచ్చిపోయి తమతప్పులకు తామే బలై పోయే
  రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

 9. 2:54 సా. వద్ద జనవరి 4, 2012

  I fully agree with Sri. Syamala rao garu.

 10. V V Ganesh
  3:00 సా. వద్ద జనవరి 4, 2012

  _______________________________________
  I find most telugu people always value money, films, power, and politics then anything else in life.
  _______________________________________

  I completely agree.

 11. vhhp
  3:12 సా. వద్ద జనవరి 14, 2012

  ఇలా వ్రాస్తే మన నోరు చేతులు నొప్పి పుట్ట వలసిందే కాని వారి రోతలకు, చేతలకు అడ్డు వేయగలమా? మీ అందరి sincerity కి వందనాలు.
  Vellala Hari hara Prasad- proddatur

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s