ముంగిలి > సరదాగా, హాస్యం > ఆడవారి hinting భాష

ఆడవారి hinting భాష

నిన్న పొద్దున, ఓ చిన్న సంఘటన జరిగింది. Kitchen Sink pipe “ఇక నుంచి నేను పనిచేయను” అని గట్టి నిర్ణయానికి వచ్చి, ఊడి కింద పడింది. మాయావిడ దర్శకత్వంలో, పన్నమ్మాయి దానిని బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టింది. పనమ్మాయి దాన్ని sinkకు జోడించి తన పని మొదలుబెట్టడం, వెంటనే అది ఊడి పడి, పనికి ఆటంకం కల్పించటం. ఇలా ఒక పావుగంట – అరగంట తంటాలు పడ్డారు.

అప్పుడు నా better half వచ్చి నాతో చెప్పినదేమనగా – “Kitchen Sink పైపు ఊడి పడెను.

ఎందుకో నాకు ఆ వాక్యం అసంపూర్ణంగా అనిపించింది. జరిగినది చెప్పి, తరువాత జరగాల్సినది కూడా చెప్పాలి కదా? అదే నేను మా ఆవిడ స్థానంలో ఉంటే “Kitchen Sink పైపు ఊడి పడింది. ఒకసారి వచ్చి సరిచేసి పెడుదురూ!” అనేవాణ్ణి. పొద్దున్నే మాంచి హుషారుమీదుండి – సరే చూద్దాం అని నిర్ణయించుకున్నాను. మా ఆవిడ చెప్పినదానికి అంతే తాపీగా “ఓహో అలాగా!” అని మళ్ళీ నా పనిలో జారుకున్నాను – నిజానికి జారుకున్నట్టు నటించాను లెండి. వినపడీ వినపడనట్టుగా ఒక చిన్న “ప్చ్‌” అన్న నిట్టూర్పు వదిలి, మళ్ళీ పనమ్మాయి ప్రయత్నానికి దర్శకత్వం వంహించడానికి వెళ్ళిపోయింది.

ఒక అరగంట ఆగి, మరో ప్రశ్న. “ఇంట్లో M-Seal ఎక్కడ ఉంది?” అని. అదెక్కడ ఉంటుందో నాకన్నా తనకే బాగా తెలుసు. అయినా ఆ ప్రశ్న ఎందుకు వేసినట్టు? దీన్నే ఆడాళ్ళ hinting భాష అనేది. నేనేమన్నా తక్కువ తిన్నానా? “మొన్నే దేనికో వాడేశాననుకుంటా!” అని అమాయకంగా సమాధానమిచ్చా. ఈసారి “ప్చ్‌” అన్న నిట్టూర్పు ప్రస్పుటంగా వినిపించింది. కళ్ళళ్ళో కూడా కనిపిస్తోంది – “అడిగితే కానీ చేయరా?” అన్న ప్రశ్న. ఏమీ తెలీనట్టు, “ఇంతకీ ఏంటి మీ గొడవ?” అని రంగప్రవేశం చేశా. చిన్ని మరమ్మత్తే! అలా వెళ్ళి నా toolbox లోనుంచి ఓ అస్త్రాన్ని తీసి ప్రయోగిస్తే, సరిగ్గా 45 సెకెండ్లలో పని పూర్తయింది.

ఇదేదో నా ఒక్కడితోటే జరుగుతుందనుకునేరు బాంచన్‌! ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది. భార్యా భర్తలే కాదు, సోదరీ సోదరుల మధ్య కూడా వ్యవహారాలు ఇలానే ఉంటాయి. ఒక్క తల్లి అవతారం మినహా, మిగతా అన్ని పాత్రల్లో ఆడవారి వ్యవహారం ఇలాగే ఉంటుంది. తల్లిగా కూడా ఊహ తెలిసే వరకే, పిల్లలకు ఆ మినహాయింపు. Life-long guarantee ఏమీ లేదు. అడపా-దడపా exceptions అనేవి ఎక్కడైనా ఉంటాయి లెండి.

మగాడి బుఱ్ఱ Computer లాంటిది. చెప్పింది చేస్తుంది – ఆశించినది కాదు. ఆశించినది సరిగ్గా చెప్పగలిగితే, కోరుకున్నది చేస్తుంది. ఆ కళనే programming అంటారనుకుంటా! ఎవరో అన్నారు – programming లో స్వహతాగా ఆడాళ్ళు మగాళ్ళతో అంతగా సరితూగలేరని. అంటే, వేరే కొన్ని రంగాల్లో, మగాళ్ళకన్నా ఆడాళ్ళే మేలనుకోండి. మగాళ్ళు కనీసం అప్పుడప్పుడన్నా అర్థం చేసుకోగలరు – పాపం యంత్రాలకేం తెలుస్తుంది hinting భాష? అదేదో మగాళ్ళు gadgets అంటే పడి చస్తారన్నట్టు, Boys Toys అంటుంటారు. Boys Toysఆ – వంకాయ పులుసా?

ఉదాహరణకు “బాగుంది” అనే పదం తీసుకోండి. సగటు మగాణ్ణి “‘బాగుంది’ అంటే అర్థమేమిటి?” అని అడగండి! సమాధానం “‘బాగుంది’ అంటే ‘బాగుంది’ అని అర్థం” అని చెబుతాడు. అదే ప్రశ్న – ఒక స్త్రీని అడిగారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో సమాధానం. ఇది ఊహ కాదండోయ్ – పరిశోధనలు చేసి నిర్ధారణకొచ్చాను.

నాకప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది – దేవుడు ఆడవారి గొంతులో ఒక Encryptor, చెవుల్లో ఒక Decryptor పెట్టుంటాడేమో అని. ఈ అమరికలు మగాళ్ళకుండవు. ఊహతెలిసిన కూతురూ – కొడుకు ఉన్న తల్లి, ఇలా hinting భాషలో ఏమన్నా చెబితే, కూతురు ఇట్టే పట్టేస్తుంది. పాపం కొడుకుకి కాస్తంత సమయం పడుతుంది.

వయసుతో నిమిత్తంలేదు. పళ్ళూడిన భార్యా-భర్తల మధ్యనకూడా ఈ hinting భాష అవధి అలాగే ఉంటుంది. విధి వక్రించినపుడు, hinting భాషని అర్థం చేసుకున్నానని భ్రమించి “ఓహో! బహుశః తను ఇది చెప్పాలనుకుందేమో” అని ఒక పని చేసుకొస్తే “శహబాష్‌” కు బదులు, “నన్నో మాట అడిగుండొచ్చు కదండీ!” అని నీరు గార్చే feedback. హతవిధీ.

ఏమో! మగాడి నిత్య జీవితం రంగులమయమై ఉండటానికే, దేవుడు ఈ hinting భాషని ఆడవారికి మాత్రమే నేర్పాడేమో! ఓ తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా, భార్యగా, కూతురుగా – రోజూ నిత్య నూతనంగా వారి పొడుపు కథల్లాంటి hinting భాషని ఛేదించే ఆనందాన్ని మగాడికే అనుగ్రహించాడేమో!

ప్రకటనలు
వర్గాలుసరదాగా, హాస్యం ట్యాగులు:,
 1. వేణు
  10:18 ఉద. వద్ద జనవరి 6, 2012

  బాగుంది Hinting భాష. అప్పుడప్పుడు Denting భాష కూడా ఉపయోగిస్తారండి వాళ్ళు…అదే దెప్పి పొడవడం….:)
  మరి ఆడ వారి మాటలకు అర్థాలే వేరులే అని ఎందుకన్నారో…
  ఆడవారు-భాష అనే అంశం కాబట్టి నేను గమనించిన ఒక విషయం చెబుతాను…మేము చెన్నై లో పది సంవత్సరాల నుండి ఉంటున్నాము…అయిన నా తమిళం అంతంత మాత్రమే…కాని మా ఆవిడ అనర్గళంగా మాట్లాడుతుంది.. నేను ఎక్కడో చదివాను కూడా ఆడవారు భాష ను త్వరగా నేర్చేసుకున్తారని….

 2. 11:30 ఉద. వద్ద జనవరి 6, 2012

  ఒట్టి మట్టి బుర్ర !

  చీర్స్
  జిలేబి.

 3. Indian Minerva
  11:58 ఉద. వద్ద జనవరి 6, 2012

  😀

 4. Sri
  12:34 సా. వద్ద జనవరి 6, 2012

  Bhale maanchi moodlo vrasinattuunnaru….oka 20 mins. nunchi navvu aagatledhu. Nannu choosi janalu picchodini choosinattu choosthunaru.
  Adhurs!! Meeku Joharlu!!

 5. తాడిగడప శ్యామలరావు
  12:45 సా. వద్ద జనవరి 6, 2012

  చూసారా మరి. జిలేబీ గారి హింటింగ్ వ్యాఖ్య.
  బుఱ్ఱ బద్దలు కొట్టుకున్నా అర్ధం కావటంలేదు నాకు.
  ఇంతకూ మట్టి బుర్రలు యెవరు?
  తప్పకుండా మగాళ్ళనే ఆవిడ ఉద్దేశం అయుంటుంది.

 6. 2:47 సా. వద్ద జనవరి 6, 2012

  LOL

 7. 7:51 ఉద. వద్ద జనవరి 7, 2012

  ఆడవాళ్ళకి ఈ హింటింగ్ భాష జన్మతః వస్తుందా లేక పెళ్ళయ్యాక వస్తుందా? ఎక్కడయినా నేర్పిస్తారా?

 8. 10:44 ఉద. వద్ద జనవరి 7, 2012

  ‘వేణు’ గారు: బాగుంది Denting భాష! 🙂
  —–
  ‘జిలేబి’ గారు: మాయావిడ కళ్ళలో, ఈ భావన అప్పుడప్పుడూ చదువుతూనే ఉంటాను లెండి. I am immune to your remark…
  —–
  ‘శ్యామలరావు’ గారు: డౌటేమీ లేదు. జిలేబిగారి వ్యాఖ్యలో ‘స్త్రీ అహంకారం’ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 🙂
  —–
  ‘శ్రీ’ గారు: ధన్యవాదాలు.
  —–
  ‘Indian Minerva’, ‘ఫణీంద్రా’ గార్లు: 🙂
  —–
  ‘రసజ్ఞ’ గారు: నాకన్నా, మీ ప్రశ్నకు సమాధానం మీరైతేనే సరిగ్గా చెప్పగలరనుకుంటాను.

 9. 10:55 ఉద. వద్ద జనవరి 7, 2012

  జన్మతః అయితే రాలేదు నాకు మరి పెళ్ళయ్యాక వస్తుందేమో నాకు తెలియదు! కనుక అబుభవజ్ఞులయిన మీరు చెపితే బాగుంటుంది!

  • 11:22 ఉద. వద్ద జనవరి 7, 2012

   ‘రసజ్ఞ’ గారు: మనకుండే టాలెంట్లు, ఈక్నెస్లు అన్నీ మనకు తెలియాలని లేదు కదండీ! నాకైతే, మీ పరిప్రశ్నలోనే కొట్టొచ్చినట్టుగా ‘hinting భాష’ కనిపిస్తొంది. 🙂

 10. 12:36 సా. వద్ద జనవరి 7, 2012

  అమ్మాయ్ రసజ్ఞ,

  జన్మతః ఇది రాక పోయినా, పెళ్లి అయ్యాక తప్పక వచ్చేస్తుంది. ‘వారెప్పుడూ’ మట్టి బుర్రే’ అన్నది ప్రతి రోజూ కళ్ళముందు సాక్షాత్కారిస్తూంటే! అయినా చోద్యం ఈ మగవారు పెళ్లి అయ్యాక ఎందుకింత మట్టి బుర్ర ఐపోతారో నాకు తెలియదు! ‘ఆవిడ’ ఇచ్చే భరోసా, ‘సేఫ్టీ’ అనుకుంటా !

  చీర్స్
  జిలేబి.

 11. 1:54 సా. వద్ద జనవరి 7, 2012

  ‘రసజ్ఞ’ గారు: నా పరిశోధనలో ఆడవారి చెవుల్లో Decryptor ఉంటుందని గ్రహించాను కానీ చదివే కళ్ళళ్ళో ఉంటుందో లేదో తెలీదు. ఎందుకైనా మంచిది, అనుభవపూర్వకంగా ‘hinting భాష’లో పైన జిలేబి గారు రాసినదేమిటంటే “ఆరు నెలల్లో వారు వీరవుతారు – వీరు వారవుతారు.” ఇప్పుడు అర్థమయిందనుకుంటా! So పెళ్ళైన ఆర్నెల్లవరకూ మీకే ప్రాబ్లం ఉండదులెండి. నా భరోసా!

 12. 3:56 సా. వద్ద జనవరి 7, 2012

  ఏదో ఆవిడ గారిని సంతోషపెడటానికే ” మట్టిబుర్ర ” అనే టైటిల్ తగిలించుకుంటారు . కాని ఆ మాత్ర హింట్ అర్ధం చేసుకోలేక కాదు కదూ 🙂 పాపం ఆడవాళ్ళు 🙂

 13. 4:53 సా. వద్ద జనవరి 7, 2012

  అదేమిటో నండీ, ఓ తల్లి కొడుకుని బెష్టు బుర్ర చెయ్యడానికి ఇరవై ఒక్క ఏళ్లు తీసుకుంటుంది. వాణ్ని మట్టి బుర్రని గావించడానికి ఆరు నెలలు మాత్రమె సుమా శ్రీమతి వారు . సో, నేచురల్ బుర్ర లెవెల్ ఎంతో దీన్ని బట్టి తెలిసి పోతోంది, !!

  ఎంత బెష్టు చెయ్యటానికి ప్రయత్నం చేసినా, ‘ఆపిలు పండు కింద పడును, న్యూ టనుని గురుత్వాకర్షణ సిద్ధాంతము ప్రకారము !

  చీర్స్
  జిలేబి.

  • 9:55 సా. వద్ద జనవరి 7, 2012

   మీ ప్రతీ వ్యాఖ్య, hinting భాష అర్థం చేసుకోడానికి case study సుమండీ. 💡 అదేదో చెవులూ – తరువాత కొమ్ములూ అన్న సామెతని ఎంతబాగా hint చేస్తున్నారు?!? వాహ్‌! ఎంతయినా కొమ్ములు చేసే డామేజ్ పాపం చెవులు చేయలేవుకదా! 💡 మరో అనుమానం – కొంపతీసి న్యూటన్ పేరు చెప్పి, Adam & Eve వృత్తాంతాన్ని hint చేయట్లేదు కదా? Apple అంటే – ఎందుకో డౌట్ వస్తోందిలెండి.

 14. 5:58 సా. వద్ద జనవరి 7, 2012

  తెలుగు భావాలు గారూ మీరు చెప్పిన విషయం ‘మగవాళ్ళకు ఏ విషయమైనా సూటిగా చెప్పాలి’ అక్షరాలా నిజం. కావలసినది ‘వివరంగా’ చెప్తే వెంటనే జరిగిపోతుంది. బోలెడు ‘టీ కప్పులో తుఫానులయ్యాక’ ఈ విషయం అర్ధం చేసుకున్నాము..ఇద్దరం ఒకటయ్యాక ‘మట్టిబుర్ర’న్నా నాన్నే, ‘denting’ అన్నా తననే కదండీ…

  • 10:07 సా. వద్ద జనవరి 7, 2012

   థాంక్స్‌అండి – బుజ్జిపండు తల్లిగారు. ఎంతటి పురుష సింహమైనా, అప్పుడప్పుడు భార్య hinting అర్థంకాక denting చేయించుకొని – తనలోతాను మురిసిపోతుంటాడు. అదో తుత్తి లెండి.

 15. 10:04 సా. వద్ద జనవరి 7, 2012

  ఆదాము ఓ ‘ఈవ్’ , నింగు ఈవ్ ని నింగి కింద కలిసి ఈవెంటు కావించడం అది ఆపిలు కథ గా మనకందరికీ తెలిసిందే. కాని ఆ ఆపిలు అసలు ఎందుకు అంత రుచికరమైనది అని ఎప్పుడైనా ఆలోచించారా ?

  అందుకే నండి ఒట్టి మట్టి బుర్ర !

  చీర్స్
  జిలేబి.

  • 11:15 సా. వద్ద జనవరి 7, 2012

   ‘ఆపిల్ రుచి’ అంటే? ఏ ఆపిలు? ఆపిల్ పండా లేక వండుకునే కూరగాయ రకమా? పైపెచ్చు ఏ Apple వెరైటీయో చెప్పనే లేదు? Cortland రకమా, Empire రకమా, Honeycrispఆ, Idaredఆ, Jonagold వెరైటీయా, లేక McIntoshఆ? Also, ఏ రుచి బాగుంటుంది అని అడుగుతున్నారు? తియ్యదనమా, పులుపా లేక వగరు రుచా?

 16. 11:57 సా. వద్ద జనవరి 7, 2012

  ఈ తెభా గారికి ఎన్నని చెప్పవలె , ఇంత మట్టి బుర్ర! అనుకోలేదు సుమీ !

  ‘ఆ పిల్ల’ రుచి ఆదాము కనుక్కోన్నాడండీ మహానుభావా ! ఆ కాలము లో ఈ కార్ట్లాండు లేవు ఉన్నది ఒక్కటే లాండు , అది ఆపిళ్ళ లాండు!- ఆపిల్ల లాండు!

  చీర్స్
  జిలేబి.

  • 12:57 ఉద. వద్ద జనవరి 8, 2012

   అద్గో మళ్ళీను! మీ ప్రశ్నలో అన్నన్ని హింటింగులు పెట్టి నాది “మట్టి బుఱ్ఱ” అని డెంటింగులు వేయడం సబబేనా?

   “… అసలు ఆదాముకు ఎందుకు…” అని రాసుంటే మీ కీబోర్డేమీ అరిగిపోయేది కాదు కదా! అక్కడ ‘ఆదాము’ అన్న పదం మీరు hintingకు వదిలి ఉండకపోతే – సరైన వ్యాఖ్య సమాధానమేం ఖర్మ, ఓ టపాయే రాసుందును మీరు O=BR2 అని సమాధానం ఇచ్చే విధంగా!

 17. Sri
  12:38 ఉద. వద్ద జనవరి 8, 2012

  Wow!! This is becoming a battle of genders. From my general observations in life, ultimately in the end if the Man applies balm to his wife’s hands or legs for giving her the trouble of throwing things or kicking him then that family lives happily forever. If he does not then I dont have to explain…

 18. 1:56 ఉద. వద్ద జనవరి 8, 2012

  హమ్మయ్య, మళ్ళీ O=BR2 కి వచ్చేసామన్న మాట

  చీర్స్
  జిలేబి.

 19. 10:24 ఉద. వద్ద జనవరి 8, 2012

  బలే పోస్ట్ అండీ …నాకు బాగా నచ్చింది.మీ శ్రీమతి గారి మాటలు మీరు అర్ధం చేసుకోగలగడం సూపర్ అసలు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s