ముంగిలి > సందర్శన > కాశీలో సంక్రాంతి

కాశీలో సంక్రాంతి

మహా స్మశానం, ఆనంద వనం, వారణాసి, బెనారస్ లేదా కాశీ – ఏపేరుతోనైనా పిలవండి – అన్నీ ఒకటే. ఈ సంవత్సర సంక్రాంతి, ఈ అవిమోచన క్షేత్రంలో గడపాలని నా భాగ్యంలో రాసుంది. ప్రయాగ, కాశీ మరియూ గయా క్షేత్రాల తీర్థ యాత్రలో ఉన్నాను. ఏదో కాస్తంత ఖాళీ సమయం లభించేసరికి, నేటి సంక్రాంతి అనుభవాలను చిత్రాలతో ప్రచురించాలనిపించింది. మకర సంక్రమణ పుణ్య సమయం, ఇక్కడి వారికి ఎంతో ముఖ్యమైన రోజు. ఎక్కడెక్కడినుండో వచ్చి, గంగలో పుణ్య స్నానాలాచరిస్తారు. నూటికి ముప్పై మంది మన తెలుగు వాళ్ళే! ఎక్కడ చూసినా, తెలుగులో మాట్లాడే కుటుంబాలే – వారిలో నేనొకడిని. విపరీతమైన చలి ఉన్నా, భక్తులు పిల్లల్తో సహా, స్నానాలు చేసారు.

అలా ఒకవైపు భక్తులు స్నానాలు చేస్తుంటే మరో వైపు కాశీపట్టణవాసులు గాలి పటాలు ఎగరేస్తుంటే, ఎప్పడిలాగే వచ్చే మృత దేహాలు వస్తూనే ఉన్నాయి. ఇందాకే, ఒక 7 సీటర్ ఆటోపైన కట్టబడి, హరిశ్చంద్ర ఘాట్‌కు తీసుకెళుతున్న ప్రేతాన్ని చూశాను. ప్రతి ఐదు నిమిషాలకు ఒకటన్నా శవం కనబడుతుంది. వాటిని చూసి, ఇక్కడి వారు ఏమాత్రం ఏవగించుకోరు. అదో చిత్రమైన అనుభూతి. పూర్తి వివరాలు, మరో టపాలో సవివరంగా తెలియజేస్తాను.

వారణాసిలో సంక్రాంతి గంగ స్నానాలు

వారణాసిలో సంక్రాంతి గంగ స్నానాలు

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు - 1

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు – 1

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు - 2

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు – 2

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు - 3

కేదార్‌ఘాట్‌లో సంక్రాంతి గంగ స్నానాలు – 3

వారణాసిలో సంక్రాంతి గాలి పటాల సందడి - 1

వారణాసిలో సంక్రాంతి గాలి పటాల సందడి – 1

వారణాసిలో సంక్రాంతి గాలి పటాల సందడి - 2

వారణాసిలో సంక్రాంతి గాలి పటాల సందడి – 2

ప్రకటనలు
 1. 6:01 ఉద. వద్ద జనవరి 16, 2012

  కాశీ కి వెళ్లాను రామా హరే,
  బ్లాగు తీర్థమ్ము తెచ్చాను రామా హరే !

  వెల్కం బెక బేక !

  సంక్రాంతి శుభాకాంక్షలతో

  ఒన్స్ అగైన్ – చీర్స్
  జిలేబి. (కాశీ కి వెళ్లి వచ్చినా వదలరే !)

 2. Sri
  10:08 ఉద. వద్ద జనవరి 16, 2012

  Gayalo bloggingni thapppisthe inka edaina vadili vaeyyandi.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s