ముంగిలి > ఆధ్యాత్మికం, సందర్శన > సీతమ్మ అవతారం చాలించిన స్థలం

సీతమ్మ అవతారం చాలించిన స్థలం

ఇలాహాబాద్ వారణాసిలను కలిపే NH2 కు శుమారు నాలుగు కిలోమీటర్ల దక్షిణాన సీతమ్మ భూమాతతో ఐక్యమైన స్థలం ఉంది. NH2పై జంగీగంజ్‌నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీతా సమాహిత్ స్థల్ – సీతా మాఱీ’ అని పిలుస్తారు.

Google Maps - సీతా సమాహిత్ స్థల్ - సీతా మాఱీ

Google Maps - సీతా సమాహిత్ స్థల్ - సీతా మాఱీ

తమసానది పరిసరాలలో ప్రశాంతమైన వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన కట్టడం. గుడి అనలేము – ఒక స్మారకం.

సీతా సమాహిత్ స్థల్ కట్టడం

సీతా సమాహిత్ స్థల్ కట్టడం

పూర్తి స్మారక చిత్రం

పూర్తి స్మారక చిత్రం

ఈ స్మారక నిర్మాణం జరుగక ముందు, ఇక్కడ అమ్మవారి జుత్తుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడివారు చెప్పారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు మేసేవి కావట. స్మారకం నిర్మించినపుడు, ‘సితా కేశ వాటికను’ పాడు చేయక అలానే ఉంచారు. క్రింది చిత్రంలో చూడవచ్చు.

సితా కేశ వాటిక

సితా కేశ వాటిక

అతి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. పక్కనే, లవకుశులకు జన్మనిచ్చిన స్థలం ‘సీతా వట వృక్షం’ కుడా ఉన్నది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది రెండతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉన్నది.

అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం

అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం

క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ, ఎంతటివారికైనా కాస్తో కూస్తో బాధ కలిగించే విధంగా దర్శనమిస్తుంది. వెనుక గోడ మీద ఆ సంఘటనను ప్రతిబింబిస్తున్న సన్నివేశపు శిలాచిత్రం కినిపిస్తుంది.

సితా సమాహిత్ స్థల్

సితా సమాహిత్ స్థల్

ఇక ఈ కట్టడం గురించిన వివరాలలోకెళితే, దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థులవారి నిర్దేశం మేర M/s Punj Loyd సంస్థ వారు కట్టించారు. ఈయన పాకిస్తాన్‌లోని రావల్‌పిండీ నగరంలో అక్టోబర్ 19, 1926 నాడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1982లో సన్యాసం స్వీకరించి ఋషికేష్‌లోని అత్రి ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, దైవీ ప్రేరణ వల్ల 1992లో 900 కిలోమీటర్లు కాలినడకన నడిచి, ఈ స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక స్మారకాన్ని నిర్మించాలని ఆయనలో కలిగిన ప్రేరణకనుగూణంగా తనవారి నుండి ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేశారు. చివరికి ప్రకాష్ పున్జ్ గారి సహాయంతో ఈ కట్టడ నిర్మాణం సుసంపన్నమయింది. విద్య, వైద్య వంటి ఇతర సమాజ ఉద్ధరణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇక 1998లో ఇక్కడి నుండి మరో గమ్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్టోబర్ 16, 1998నాడు తనువు చాలించారు. పక్కనే జీవ కళ ఉట్టిపడేలా ఆయన సమాధి కూడా ఉన్నది.

స్వామీ జితేంద్రానంద తీర్థులవారి సమాధి

స్వామీ జితేంద్రానంద తీర్థులవారి సమాధి

ప్రకటనలు
 1. 10:10 ఉద. వద్ద ఫిబ్రవరి 1, 2012

  చాలా మంచి ప్రదేశాన్ని పరిచయం చేశారు! ధన్యవాదాలు!

 2. వేణు
  10:26 ఉద. వద్ద ఫిబ్రవరి 1, 2012

  ధన్యవాదాలండి ఒక చక్కని దర్శనీయ స్థలాన్ని గూర్చి వివరించినందుకు. ఛాయా చిత్రాలు కూడా బహు చక్కగా ఉన్నాయి.

 3. 10:36 ఉద. వద్ద ఫిబ్రవరి 1, 2012

  ‘సియా రాం ‘!
  సియా ఆరామ్!

  ఈ ప్రదేశం గురించి మొదటి మారు చదవడం. ఇప్పటిదాకా ఎక్కడా దీని గురించిన ప్రస్తావన చదవలేదు. చాలా మంచి విషయాన్ని తెలిపారు. మన దిన పత్రికల వారికి పంపించండి. ప్రచురణ అయితే చాలా మందికి ఈ విషయం తెలిసి వస్తుంది.

  జై సియా రాం
  జిలేబి.

 4. 11:04 ఉద. వద్ద ఫిబ్రవరి 1, 2012

  చాలా బాగుందండి…!

 5. 12:46 సా. వద్ద ఫిబ్రవరి 1, 2012

  సీతమ్మ శిలాచిత్రం నిజంగా అధ్బుతం. చాలా మంచి ప్రదేశాన్ని పరిచయం చేశారు, ధన్యవాదములు.

 6. 4:56 సా. వద్ద ఫిబ్రవరి 1, 2012

  ‘రసజ్ఞ’, ‘వేణు’, ‘జిలేబి’, ‘వామనగీత’, ‘కళ్యాణి’ గార్లు: కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే, ఈ స్థలాన్ని సందర్శించినపుడు కాస్తంత ఉద్విగ్నత కలిగింది. ఆ మూర్తులను చెక్కిన శిల్పులెవరో కానీ, జీవ కళ మరీ ఉట్టిపడుతూ ఉన్నాయి. అంత బాగా చెక్కి ఉండకుండా ఉంటే బాగుండేదేమో అనిపించేటంత!!!

 7. 6:05 సా. వద్ద ఫిబ్రవరి 1, 2012

  ఈ ప్రదేశం గురించి ఎక్కడా వినలేదు. విగ్రహాలన్నీ బావున్నాయి. ముఖ్యంగా స్వామివారి విగ్రహం అద్బుతంగా ఉంది. మంచి ప్రదేశాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

 8. bonagiri
  9:32 సా. వద్ద ఫిబ్రవరి 2, 2012

  ఈ ప్రదేశం చాలా కాలం క్రితం నేను కూడా చూసాను. చాలా బాగుంటుంది.
  మీరు ఇంకో ఫొటో పెట్టలేదు. మొత్తం మందిరం భూమి పగులులో ఉన్నట్టు ఉంటుంది. అది కూడా పెడితే బాగుండేది.

 9. 10:48 సా. వద్ద ఫిబ్రవరి 2, 2012

  ‘జ్యోతిర్మయి’ గారు: యాత్ర ప్రణాళిక సిద్ధంచేసుకున్నప్పుడు, ఇక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఉండబట్టలేక వెళ్ళాను.
  ‘భోనగిరి’ గారు: మీరు చెప్పిన ఆనవాళ్ళు నాకు కనిపించనేలేదు! కట్టడం చుట్టూ, నీరు – ఆ నీటిలో చిన్న చిన్న పడవలు కనిపించాయి. పూర్తి స్మారకాన్ని చూపిస్తున్న చిత్రాన్ని పైన జోడించాను. మీరు వేసవికాలంలోకానీ వెళ్ళారా?

 10. Piska Satyanarayana
  9:33 సా. వద్ద ఫిబ్రవరి 5, 2012

  మంచి విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు. ఇన్నాళ్ళుగా దీని గురించి ఎక్కడా చదవకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

 11. 4:20 ఉద. వద్ద మార్చి 1, 2012

  సీతమ్మవారి గురించిన విశేషాలు కళ్లకు కట్టినట్లు చూపించి ధన్యుల్ణి చేశారు.

 12. 11:01 సా. వద్ద మార్చి 1, 2012

  తెలుగు భావాలు…. చాల చక్కటి విషయాలు.. ఛాయా చిత్రాలతో సహా చక్కగా విశదీకరించారు.. చాలా చాలా ధన్యవాదాలు.. మేము నవంబరు నెలలో కాశీ నుంచి అలహాబాదు కారులోనే వెళ్ళాము.. ఐతే పాయింట్ టు పాయింట్ వెళ్ళడమే కాని … ఈ ప్రదేశం గురించి మాకూ తెలియదు..ఎవరూ చెప్పలేదు.. ఎన్నో విశేషాలు… ప్రక్కనుంచి వెళ్తూ కూడా మిస్సయిపోతున్నాము కదా…

 13. Snkr
  11:46 ఉద. వద్ద మార్చి 19, 2012

  nice…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s