ముంగిలి > శిరోభారం > ఆస్తికులు నాస్తికులు

ఆస్తికులు నాస్తికులు

Da Vinci Code తరువాత, 2009లో వచ్చిన Angels & Demons చిత్రంలోని ఒక సన్నివేశం.

జరుగుతున్న సంఘటనల వెనుకనున్న రహస్యాలను చేదించడానికి, Professor Langdon, Vatican Archives లోనున్న ఒక గ్రంథాన్ని పరిశీలించే అనుమతి కోసం, Pope ఇక లేనందున Camerlengoను కలుస్తాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ…

Camerlengo: Do you believe in God – Sir?
Prof. Langdon: Father, I simply believe that religion… (Camerlengo మధ్యలో అడ్డుపడి, తన ప్రశ్నను మరోలా అడుగుతాడు)
Camerlengo: I did not ask if you believe what man says about God. I asked if you believe in God.
Prof. Langdon: I’m an academic. My mind tells me I will never understand God.
Camerlengo: And your heart?
Prof. Langdon: Tells me I’m not meant to. Faith is a gift that I have yet to receive.

కథను పక్కన పెట్టి చూస్తే, అద్భుతమైన కాల్పనిక సన్నివేశం. రెండు భిన్న ధ్రువాల మధ్య జరిగిన సంభాషణ. ముఖ్యంగా, Prof. Langdon చివర చెప్పిన విషయం, నిజాయితీతో కూడుకున్నది. Faith is a gift that I have yet to receive.

పుట్టడంతోనే – ఒక ధర్మం మీద నమ్మకంతో ఎవరూ పుట్టరు. కుటుంబ వాతావరణ ప్రభావం కొంత మేర ఉంటుంది – కానీ అది పూర్తి కారణం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టి, ఆ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినా, ఒకరు నాస్తికులవ్వవచ్చు, ఒకరు ఆస్తికులూ కావచ్చు. బుఱ్ఱలోకి బలవంతంగా చొప్పించాలని చూసినా లేక విశ్వాసాన్ని చెరిపేయాలని ప్రయత్నించినా, ఫలితం అంతంత మాత్రమే.

కొన్ని సంధర్భాలలో, వేరొకరి మాట ప్రభావం ఉంటుంది. కానీ, దానికీ అవధులు ఉన్నాయి. ఒకే గురువు వద్ద శిష్యరికం చేసిన వారందరూ, ఒకేలా తయారవరు కదా! ఏదో ఒక సంఘటన, ఒక మాట, ఒక అనుభూతి లేదా స్వతహాగా కలిగిన ప్రచోదనం – మనిషిని ఒక విశ్వాసం వైపుకు తిప్పుతుంది. అదే కారణం – వేరొకరి మీద పని చేయక పోవచ్చు.

నిజానికి, నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! నేను ఎంతగానో గౌరవించే నాస్తికుడు – దివంగత బెంగాల్ నాయకుడు జ్యోతి బసు. మరణానంతరం, తన మృతదేహానికి ఎటువంటి అంతిమ సంస్కారాలుకానీ, స్మారకాలుగానీ అవసరంలేదని, ఆ ప్రేతాన్ని మెడికల్ కళాశాలకు – విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా వాడాలని నిర్దేశించిన వ్యక్తిత్వం, నిజంగా హర్షనీయం. తానే స్వయంగా అనుమతించినా, బసు మృత కళేబరాన్ని తాకాలంటే – అక్కడి డాక్టర్లు జంకారు. ఇంతటి స్వచ్ఛమయిన విశ్వాసం బహు కొద్ది మందికే ఉంటుంది.  అవును విశ్వాసమే! దేవుడు లేడన్న బలమైన నమ్మకం – విశ్వాసం.

అటూ ఇటూ కాని వారితోనే తలనొప్పులన్నీ. ఆస్తికులైనా లేక నాస్తికులైనా.

ఏ మనిషైనా జీవితాంతం దేవులాడేది, మనఃశాంతి కోసమే! పైపైకి డబ్బు, పరపతి, హోదా వంటివాటిలాగా కనిపించినా, మనిషి మృగతృష్ణ – మనఃశాంతితో మాత్రమే తీరుతుంది. ఇది ప్రతి మనిషీ ఏదో ఒక సమయంలో తెలుసుకుంటాడు. అతి కొద్ది మందికి బాల్యంలోనే తెలిస్తే, కొందరికి యవ్వనంలో. మరికొందరికి వృద్ధాప్యపు కష్టాల వల్ల అవగతమయితే, కొందరికి తుది శ్వాశ వదిలే ముందు. కానీ, ఈ సత్యం తిరుగులేనిది. తెలిసో తెలియకో అందరూ వెంపర్లాడేది – తన మనసుకు శాంతిని చేకూర్చడానికే. మతమూ, ధర్మమూ, విశ్వాసమూ ఇవన్నీ, వ్యక్తిగత రాజ్యాంగంలాగా తోడ్పడతాయి. అతని ఆచార వ్యవహారాలను క్రమబద్ధీకరించి, అతని ప్రయాణాన్ని ఒక నిర్దిష్టమైన దారిలో నడిపిస్తాయి. తను నమ్మే ధర్మాన్ని – తన సౌలభ్యానికి అనుగూణంగా మార్చుకోకుండా, అది చూపిన దారిలో నడిచినవాడి ప్రయాణం తొందరగా పూర్తవుతుంది. ప్రలోభాలకు తలొగ్గి ‘అది కాస్తంత’ – ‘ఇది కాస్తంత’ సవరించి, అడ్డదిడ్డమైన దారిలో ప్రయాణించేవాడికి, ఎక్కువ సమయం పడుతుంది.

‘మనఃశాంతి’ దైవం అయితే, దానిని చేరుకొనటానికి రహదారులు అనేకం. ఒక్కో రహదారి, ఒకో మతం. నా రహదారి మాత్రమే గమ్యానికి చేరుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. వేరే రహదారి గురించి సరిగ్గా తెలియక, దాన్ని దూషించటం తప్పు. అలాంటి దూషణ – అది చేర్చే గమ్యాన్ని అంటే ఆ దైవాన్నే దూషించటం వంటిది.

అలా రహదారిలో ప్రయణిస్తున్న వారిని ‘తొందరగా గమ్యానికి చెరుకోవచ్చని’ ప్రలోభ పెట్టి, అడ్డదారులు పట్టిస్తుంటారు కొందరు. నిజానికి, గమ్యం ఉందని – ఆ ప్రబుద్ధులు నమ్మరు. పైపైకి మాత్రం నమ్ముతున్న వారి లాగా కనపడతారు. అలాంటి ప్రబుద్ధులను నమ్మి, మోసపోయి – అడ్డదారుల్లో పడిపోయి – ఎప్పుడో ఒకప్పుడు తేరుకున్నప్పుడు, “ఛీ! అసలు గమ్యమేమిటి, ఈ ప్రయాణమేమిటి?” అన్న నిరాసా-నిశ్పృహలు కలుగుతాయి. “లేదులే! వాడెవడినో బుద్ధిలేక నమ్మి, అడ్డదారి పట్టింది నేను. ఇందులో గమ్యం తప్పు ఏముంది?” అని ఆత్మావలోకనం చేసుకొని తేరుకున్నవాడు మళ్ళీ సరైన దారిలో పడతాడు. తేరుకోని వాడు నాస్తికుడై వెనుకబడతాడు. అలాంటి నాస్తికుడు, తనను అడ్డదారి పట్టించిన వాడి సంగతి పక్కన పెట్టి, అసలైన రహదారినీ, దానిమీద ప్రయాణిస్తున్న వారినీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు.

లోలోపల మాత్రం, యవ్వారం వేరేగా ఉంటుంది. వాస్తు లేదంటాడు – కానీ తూర్పు ముఖంగా ఉన్న ఇంటినే వెతికి మరీ కొంటాడు. దేవుడు లేడంటాడు – కానీ ఏదన్నా ఆపద కలిగితే, ఎవరికీ కనపడకుండా చేతులెత్తి మొక్కుతాడు. జ్యోతీష్యం బూటకం అంటూనే, మరెవరి బలవంతం మీదో ఒప్పుకున్నానని చెప్పి, పిల్ల పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టిస్తాడు. అందరూ దొంగ స్వాములే అంటాడు, మొలతాడుకు మాత్రం ఓ తాయెత్తు కట్టుకు తిరుగుతాడు. మరో విశేషం ఏమిటంటే, వీరికి హైందవ ధర్మంలో మాత్రమే ప్రపంచంలోని తప్పులన్నీ కనిపిస్తాయి. మరో మతంజోలికి వెళ్ళాలంటే మాత్రం జంకు. అది తెలియకో లేక భయానికొ?

వీరికి నమ్మకం లేకపోతే, తప్పేమీ లేదు. వీరికి నమ్మకం లేకపోవటానికి బలమైన కారణాలు ఉండే ఉండవచ్చు. కానీ ఆ భావనలను ఇతరులపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేయటం సబబు కాదు. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తెలిసినప్పుడు undo చెయ్యటం కుదరదు. Perhaps, Faith is a gift that you are yet to receive.

ఈ నాస్తికులకు పోటీగా, ఇట్టే అహం దెబ్బ తినే మిడి మిడి ఙ్ఞాననమున్న ఆస్తికులూ ఉంటారు. నా మతం, నా మతం చూపించిన దైవం మాత్రమే నిజం – మిగతా అన్ని మతాలు, ఆ మతాలు నమ్మే దైవ స్వరూపాలు అబద్ధం అని Brain Wash చేయబడినట్టుండే ప్రవర్తన, నిజంగా ఆస్తికత్వమేనా? పై పై విషయాలు తెలుసుకొని, ధర్మోద్ధారణకు బయలుదేరడానికి సదా సిద్ధం. టీ.వీ.లలో హేతువాదుల తింగరి ప్రశ్నలకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతూ, “వీడు ఈ ధర్మాన్ని support చేస్తున్నాడా లేక దాన్ని కించ పరచటానికి వచ్చిన మేక వన్నే పులా?” అని అనుమానం కలిగించే విధంగా ఉంటుంది వీరి శైలి. అగ్గిని నెయ్యితో చల్లార్చాలనుకునే అమాయకత్వం. కొన్ని కొన్ని బ్లాగుల్లో కూడా చూశాను ఇటువంటి చోద్యం – ఒక తింగరి టపాను ఖండిస్తూ చేసే వ్యాఖ్యలలో. తన ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే బద్ధకం – కానీ నమ్మకం.

బద్ధకం + నమ్మకం combination మా చెడ్డ ప్రమాదకారి సుమా!

ప్రకటనలు
 1. Mannu
  9:53 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2012

  I feel bad to see shows of debate between atheist vs. theist in news channels as soon some event like lunar eclipse occur. The focal point in these programs is to criticize Hinduism & its ideology and the news anchor enjoys these debates with sarcastic smiles. Can any one dare to host these kind of shows on other religions or events occurring with respect to other religions? e.g. the barbarian act of hurting themselves during a mourning day.

  Hinduism is too democratic and absorbs everything without much retaliations.

 2. Indian Minerva
  10:31 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2012

  దేవుడున్నాడనేదే నమ్మకమని నా అభిప్రాయం. తమమీద రుద్దబడే అభిప్రాయాలను తిరస్కరించలేను చిన్నతనంలో ఈ దేవుడు అనేభావం మనమీద రుద్దబడుతుంది. తీరా ఆలోచించేవయసువచ్చేసరికి అది స్థిరపడిపోయుంటుంది. ఇహ మన తర్కం అలా స్థిరపడిపోయిన అభిప్రాయాల ఛాయలక్కూడా రానంటుంది. నాస్తికత్వం నమ్మకమవుతుందనేది నాకర్ధంకాని వాదన. నిజానికి ఆస్థికత్వంలో దేవుడిపేరుతో జరిగే మోసాలు, పూర్వజన్మలు, వాటికర్మఫలాలూ లాంటి రుజువుచెయ్యలేని విషయాలనాధారంచేసుకొని అణచివేతని వ్యతిరేకిస్తూ పుట్టింది నాస్తికవాదమని నా అభిప్రాయం.

  నాస్తికుల గురించికూడా మీరన్నది నిజం. దేవుడులేడంటూనే, పూర్వజనం కర్మఫలాలు నిజం కావంటూనే, కులాలనీ, వాస్తునీ, జ్యోతిష్యాన్నీ, ముహుర్తాలనీ నమ్ముతుంటారు. కారణాన్నిమాత్రం తల్లిదండ్రులమీడకో, జీవిత భాగస్వామి మీదకో, “అందరి” మీదకో నెడుతుంటారు. వీళ్ళు నిజానికి పిరికివాళ్ళు, అవకాశవాదులు. ముహూర్తాలు చూసుకోకుండా ఏ నాసికుడూ ఇల్లుమారడంకూడా చెయ్యడనేది చాలావరకూ నిజం.

 3. 12:39 సా. వద్ద ఫిబ్రవరి 8, 2012

  very well said-

  బద్ధకం + నమ్మకం combination మా చెడ్డ ప్రమాదకారి సుమా!

  How about

  Dynamic Belief ?

  The dialogue of the professor is really thought provoking(in the sense that its the Heart that finally matters in the matter of God) and your this article is really marvellous. keep it up!

  cheers
  zilebi.

 4. Sri
  1:53 సా. వద్ద ఫిబ్రవరి 8, 2012

  Chaala Adhbuthanga vrasaru!! Kudos!! It’s a food for thought for both believers and non-believers.

 5. Krishna
  5:11 సా. వద్ద ఫిబ్రవరి 8, 2012

  ఆస్తిక నాస్తిక వాదనకీ, వాస్తు, జ్యోతిష్యాలకీ సంబంధం లేదని నా ఉద్ధేశ్యం. మా మామయ్య పకా ఆస్తికుడు. ఆయన ముహూర్తాలనీ, రాహు కాలం , వర్జ్యాలనీ నమ్మడు. ప్రతి క్షణం మంచిదే అని ఆయన నమ్మకం.

 6. 1:44 సా. వద్ద ఫిబ్రవరి 9, 2012

  ‘Mannu’ గారు: నిజమే! మీరు చెప్పింది అర్థం చేసుకోగలను.
  —–
  ‘Indian Minerva’ గారు: నా మటుకు నేను, ఒక హేతువాదినైన ఆస్తికుడిని. నిజానికి నాస్తికత్వానికి, హేతువాదానికి ఎంతో తేడా ఉంది. కానీ ఈ కాలంలో రెండూ పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. ఒక ధర్మంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి కావలిసినది నాస్తికత కాదని నా అభిప్రాయం. ఈ so called నాస్తికులు కేవలం ఒక ధర్మాన్నే తిరస్కరించడం – వారిని వారు నాస్తికులు, హేతువాదులు అని పిలుచుకోవడం – అంతా bogus.
  —–
  ‘Zilebi’ గారు: మొత్తానికి నేను రాసే రాతల్లో, ఒక్కటన్నా మీ మెప్పుకోలు సంపాదించగలిగిందన్నమాట. సంతోషం. ఇక “Dynamic Belief” అంటే చంచలమైన విశ్వాసం అనవచ్చా? అదే అయితే గనక, “No Belief” better అనుకుంటా. ఏమంటారు?
  —–
  ‘Sri’ గారు: కృతఙ్ఞతలు.
  —–
  ‘Krishna’ గారు: Exceptions ఉండనే ఉంటాయి. దేవుడిని నమ్మను కానీ, వాస్తుని మాత్రం నమ్ముతాను అనే వారు కూడా ఉంటారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. ఇతరులపై రుద్దకుండా ఉంటే, ఏదైనా మంచిదే అని నా అభిప్రాయం.

 7. Sri
  2:38 ఉద. వద్ద ఫిబ్రవరి 10, 2012

  Hinduism = Casteism ane bhaavana pettukoni dweshisthuntaru ani nenu anukuntanu.
  If scientists have been talking about matter which moves faster than light over the last year then they might also discover “God” one day which is the final truth. Preminchakunna, dweshinchakunte chaalu kada!!

 8. 1:43 సా. వద్ద ఫిబ్రవరి 10, 2012

  సత్యం శివం సుందరం

 9. 2:01 సా. వద్ద ఫిబ్రవరి 10, 2012

  యదస్తి తత్ సత్యం

  (ఏది ఉన్నదో అది సత్యము)

  సత్యం త్రికాల అభాదితం

  (మూడు కాలలోను ఏది ఉండునో అది సత్యము)

  అస్తి (ఉండుట – ఉన్నది)

  నాస్తి (లేదు – లేదనుట)

  భగవంతుడు (సత్యం – జ్ఞానం – అనంతం – బ్రహ్మ)

  సత్యం => ఉన్నది (ఎప్పుడూనూ)

  అస్తి వాదం -> ఉన్నదను వాదం

  నాస్తి వాడు -> లేడను వాదం

  అస్తి -> ౧.తాత్కాలికం & ౨. శాశ్వతం

  తాత్కాలిక అస్తిత్వం జీవుడు, శాశ్వత అస్తిత్వం దేవుడు…

  వ్యావహారిక సత్యం, పారమార్ధిక సత్యం -> ఆది శంకరులు

  ఆది యందు వాక్యము ఉండెను, (వాక్యము = జ్ఞానము)

  వాక్యము దేవుని వద్ద ఉండెను (దేవుడు = సత్యం)

  వాక్యము దేవుడి ఉండెను (జ్ఞానం=>సత్యం) ( ref : bible )

  యోహాను 14:6 ”యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును”

  ఆస్తికులైన హితులందరికి ఈ శివమే సత్యమట,

  నాస్తికులైన స్నేహితులకు ఆ సత్యమే శివమంట

  సత్యం శివం సత్యం శివం ||

  sairam

  ?!

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s