ముంగిలి > సరదాగా > హంస పిల్ల హంసకెంత ముద్దు?

హంస పిల్ల హంసకెంత ముద్దు?

ఆ సుకుమారిని – పాలరాతి శిల్పంతో పోల్చటం కూడా తక్కువే. ఎవరన్నా పొరబాట్నైనా చూసారంటే, కళ్ళు తిప్పుకోలేరంతే!

చాలా పేరెన్నికగల హోటల్‌కు, సరదాగా సుందర్ – తన చిన్ని కుటుంబంతో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం; అందులో రోహిణీకార్తెను తలపించేటంతటి ఎండ.  ఆరగింపు ముగించి, బయటకి వచ్చారు. వాలే పార్కింగ్ టిక్కెట్ అప్పజెప్పి, కార్ కోసం నిరీక్షిస్తుండగా అప్రయత్నంగా చుట్టూ పరికించి చూశాడుకదా, ఆ అందాల బొమ్మ కనిపించింది. అంతే! అలా చూస్తూ నిలబడిపోయాడు. నిగ నిగా మెరిసిపోతున్న శరీర చ్ఛాయ. పాలరాతి బొమ్మ కుడా దిగదుడుపే. పద్మాల్లాంటి కళ్ళు. అంత దట్టంగా, పొడుగ్గా లేకపోయినా, కంచిపట్టు పోగులతో కూర్చినట్టున్న శిరోజాలు. ఇక ఆ ముక్కునెలా వర్ణించాలో తెలియటంలేదు. సన్నగా – అచ్ఛంగా Nicole Kidman ముక్కులాగే ఉంది. పాపం జలుబు చేస్తే, ఊపిరాడుతుందా అని అనుమానం వచ్చేట్టు. లక్క పిడత మూతి అంటే, తన మూతే సరైన నిర్వచనం. పూర్ణంబూరె తినాలంటే – ఎంతలేదన్నా పావుగంట పడుతుందేమో! ఓ ఇరవై అడుగుల దూరంలో ఉన్నా, చక్కటి పలువరస కనిపిస్తోంది. సన్నటి కంఠం. తను వేసుకున్న సన్నటి నాజూకైన హారం వల్ల కంఠానికి అందం వచ్చిందో లేక సన్నని నాజూకైన కంఠంవల్ల తనేసుకున్న హారం అందంగా కనబడుతోందో అర్థం కావటం లేదు. మధ్యాహ్నం వేళ గనుక, చిరు చెమట పట్టి, చెక్కిళ్ళు అద్దాల్లా మెరిసిపోతున్నాయి.

పింక్ కలర్ డ్రెస్ బహు భేషుగ్గా నప్పింది. మరింకెవరన్నా ఆ రంగు దుస్తులు ధరిస్తే, బహుశః అంతగా suit అవ్వవేమో! చేతి వేళ్ళు సన్నగా, పొడుగ్గా – అచ్చం ఒక Artist వేళ్ళలా ఉన్నాయి.

చేతిలో ఏదో పుస్తకం. పుస్తకంలోని పుటలు – నన్ను చూడు అంటే నన్ను చూడు అని ఎగబడుతుంటే, ఏది చూడాలో అర్థం కాక, అటూ-ఇటూ తిరగేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏమి చదువుతున్నదో చూడటానికి, తన శిరోజాలుకూడా ఉబలాటపడుతున్నాయా అన్నట్టు, ముఖం మీదకొచ్చి పుస్తకాన్ని అవి కుడా చదువుతున్నాయి. అబ్బా! ఏంటే మీ గోల, అన్నట్టు, చిరాగ్గా వాటిని పైకి సద్దడం, అవి – ‘ఉహూఁ! మేమూ చూస్తాము’ అని మళ్ళీ ప్రయత్నించడం. ఉండండి మీ పని చెబుతా అని, ఈసారి తలెత్తి వాటిని గట్టిగా పైకి అదిమింది. అప్పుడు తనను కన్నార్పకుండా చిరుమందహాసంతో మనవాడు చూస్తున్న చూపులను చూసింది. ‘సర్లే, ఇలాంటి చూపులు నాకలవాటేలే!’ అన్నట్టు, తనని చూస్తున్న సుందర్ చూపులను పట్టించుకోకుండా, మళ్ళీ పుస్తకం చూడటం, మధ్య మధ్యలో శిరోజాలతో కుస్తీ.

అప్పుడే పాత సినిమాల్లో చూపించినట్టు, సుందర్‌లో నుండి రెండు ప్రతిరూపాలు బయటకి వచ్చాయి. ఒకటేమో ఎఱ్ఱటి వర్ణం. రెండోది నీలి వర్ణం.  సుందర్‌కు మాత్రమే కనిపించే ఆ ప్రతిరూపాలు వాదులాటకు దిగాయి.

ఎఱ్ఱ ప్రతిరూపం: ఎందుకు ఆలోచన? ఎత్తుకొచ్చేయ్‌!
నీలి ప్రతిరూపం: ఎత్తుకు రావాలా? చౌమొహల్లా పాలెస్‌లో ఉన్న ప్రిన్సెస్ నీలోఫర్ చిత్రపటమా లేక సాలార్‌జంగ్ మ్యూసియమ్‌లో ఉన్న రెబెకా విగ్రహమా – తేలిగ్గా ఎత్తుకురావటానికి? ఇంకేదన్నా సలహా చెప్పు!
ఎఱ్ఱ ప్రతిరూపం: పోనీ పేళ్ళి చేసేసి ఇంటికి దర్జాగా తెచ్చేసుకో!
నీలి ప్రతిరూపం: పెళ్ళా? లోకం సంగతి అటుంచు. మీ ఆవిడను మరిచిపోయావా? కనీసం తనైనా ఒప్పుకుంటుందా?
ఎఱ్ఱ ప్రతిరూపం: కనీసంలో కనీసం – వెళ్ళి బుగ్గ గిల్లెయ్‌.
నీలి ప్రతిరూపం: ఇది OK. బుగ్గ గిల్లేయ్‌.

అలా ఆ రెండు ప్రతిరూపాలు ఏకాభిప్రాయానికి వచ్చి, మళ్ళీ సుందర్‌లో కలిసిపోయాయి. బుగ్గ గిల్లాలి అంటే, ముందుగా వెళ్ళి పలకరించాలి. ఏం మాట్లాడాలి? వెళ్ళి పలకరిస్తే – ఖచ్చితంగా response ఉండదు. కాబట్టి, ముందుగా తనతో ఉన్న వ్యక్తితో మాటలు కలిపితే బాగుంటుందేమో? సరే కానీ అని తెగించేశాడు. ఇప్పుడే వస్తానని పక్కనే ఉన్న భార్యతో చెప్పి, మెల్లిగా వారి వద్దకు చేరుకున్నాడు. తనూ – ఓ అపరిచితుడు (సుందర్‌) తమ వద్దకు రావటం గమనించింది. వారి వద్దకెళ్ళి, అతనితో మెల్లిగా మాటలు కలిపాడు. అతనితో మాట్లాడుతున్నా, సుందర్‌ ధ్యాసా – చూపులూ తన మీదే. అలా అతనితో ఓ మాట మాట్లాడటం – వెంటనే తనకేసి చూడటం. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచాయి. లోపల నుండి “బుగ్గ గిల్లు…గిల్లెహె!” అని వత్తిడి పెరిగిపోతోంది.

ఇక ఉండబట్టలేక సుతారంగా బుగ్గ గిల్లి సంధర్భోచితంగా “నీ పేరేంటి” అని ప్రశ్నించాడు. సమాధానం లేదు. చిరాగ్గా ముఖం పెట్టి, మెల్లిగా వేళ్ళను పక్కకు జరిపి, మళ్ళీ పుస్తకం చూడటం మొదలు పెట్టింది.

పంక్తిలో తమ వంతు పిలుపుకై నిరీక్షిస్తున్నందున, పక్కనున్న వాళ్ళ నాన్న “ఇంకా భోజనం చేయలేదండి. అందుకే చిరాగ్గా ఉంది” అని సర్దిచెప్పాడు. “ఫరవాలేదులెండి” అని అర్థం చేసుకున్నట్టు తిరిగి సమాధానం ఇచ్చాడు. తను ఏ తరగతి చదువుతోందో అడిగాడు. “రెండవ తరగతి” అని సమాధానం ఇచ్చేసరికి, మళ్ళీ ఎఱ్ఱబాబు సంతోషం పట్టలేక బయటకొచ్చి “పెళ్ళి ప్రస్తావన ఎత్తు” అని బలవంతం పెట్టడం మొదలు పెట్టాడు. ఎంతయినా సుందర్‌ వాళ్ళ అబ్బాయి అప్పటికి మూడో తరగతి కదా! ఆ పాపని తమ వాడికిచ్చి పెళ్ళి చేసేసి, ఎంచక్కా ఆ ముద్దులొలికే పాపను ఇంటికి తెచ్చేసుకోవచ్చని ఎఱ్ఱబాబు ఆలోచనన్నమాట. ఎఱ్ఱబాబుకు స్వార్ధం ఎక్కువలెండి. కానీ వెంటనే నీలంబాబు కూడా బయటికి వచ్చేసి, ఎఱ్ఱబాబును గదమాయించాడు. “ఒరే! నీ స్వార్థం కాకపోతే…అంత ముద్దులొలికే పాప కనపడగానే, బాల్య వివాహ ప్రస్తావనకే సిద్ధ పడ్డావే, మరి ఆ పాపను కన్న వారి సంగతో?

కొడుకుకోసం వెంపర్లాడే తల్లిదండ్రుల తపన అందరికీ తెలిసిందే. కానీ, “ఓ కూతురు లేదే” అని తపించే తల్లిదండ్రులూ ఉంటారు సుమండీ! ఎదుటివారి కూతురు బాలా త్రిపుర సుందరిలా ఉంటే, అలా తపించేవారు – ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చేసుకోవాలని చూస్తారు. కానీ “కాకి పిల్ల కాకికి ముద్దయితే, హంస పిల్ల హంసకెంత ముద్దై ఉండాలి?” అని తమను తాము సమాధాన పరుచుకుంటుంటారు. కూతుళ్ళున్న తండ్రులకీ అగచాట్లుండవేమో కదా?!?!

గమనిక: నా పేరు సుందర్‌ కాదు లెండి – కానీ అతని లాగే ఆలోచిస్తుంటానని మాత్రం ఒప్పుకుంటాను.

ప్రకటనలు
వర్గాలుసరదాగా ట్యాగులు:
 1. 1:58 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  Her Photo is here

  thanks
  🙂

  ?!

 2. సుభ/subha
  2:19 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  బాగుందండీ 🙂 🙂

 3. 2:32 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  hha hha hha

 4. సుభ/subha
  2:56 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  Woooooow శివ గారూ పాప భలే ఉంది.. Soooo cute.

 5. 5:36 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  :))

 6. 5:49 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  తల్లులకి కూడా వస్తుంటాయండీ ఇలాంటి ఆలోచనలు 🙂
  ఉదాహరణ నేనే. (అంటే నిజంగా అడగాలని అనుకుంటానని కాదు. కోడలిని ఊహించుకుంటానన్నమాట:))
  ఐతే ఆ విషయం మీ టపా చదివాకే ప్రకటితమైంది (అంటే నేను అవును కదా, నేనూ ఇలా ఊహించుకుంటాను అనుకోవడం, ఆ విషయం ఒప్పుకోవడం):) బలే సరదాగా చెప్పారు.
  అమ్మాయిలు ఉంటే ఆ అందమే వేరు.

 7. వేణు
  6:20 సా. వద్ద ఫిబ్రవరి 24, 2012

  కాకి పిల్ల కాకికి ముద్దు..
  హంస పిల్ల హంసకు ముద్దు..
  కొడుకు కావలి కాని కూతురు వద్దు… (ఇంకా ఉన్నారు ఇలాంటి వారు)
  తల్లి కూడా ఒకరి కూతురే అని మరువద్దు….

  మీరు వ్రాసిన style భలే బాగుంది …మొదట మీరు అమ్మాయిని వివరిస్తుంటే…ప్రతి ఒక్కరు ఏదో ఊహా లోకంలో విహరించి …రెండో తరగతి అమ్మయనే సరికి..మళ్ళీ మన లోకానికి వచ్చే వుంటారు……
  ఎర్ర, నీలి ప్రతిరూపాలను కూడా చేర్చేసరికి మీకున్న దర్శకత్వ ప్రతిభ కనపడింది……అది కాదనుకుంటే …. ఈ మధ్య మీరు ఒక పాత తెలుగు సినిమా తప్పక చూసుండాలి…….ఏమంటారు….

 8. Sri
  1:53 ఉద. వద్ద ఫిబ్రవరి 25, 2012

  superrrrr…..nice light hearted reading!!

  Sundar aa pilla koona address edaina cheppithe…maatho kooda share chesuko galaru? Sundar ki nenu asalu competitorni kaadhu ani thelupa-galaru
  😀

 9. 9:34 ఉద. వద్ద ఫిబ్రవరి 25, 2012

  ‘ఎం.ఏ.’ గారు: ఫోటొను భలే పట్టారే. అచ్చంగా సుందర్ చూసిన పాపలా ఉంది.
  ——
  ‘శుభ’, ‘ఫణీంద్ర’, ‘జ్యోతిర్మయి’ గార్లు: 😮
  ——
  ‘లలిత’ గారు: ఇంతకాలం ఇది తండ్రులకు మాత్రమే వర్తిస్తుందనుకునేవాడిని. By the way, మీ తెలుగు4కిడ్స్ సైట్ చాలా బాగుందండి.
  ——
  ‘వేణు’ గారు: నేనైతే, మొదటినుండి, పాపను మాత్రమే వర్ణించాను సుమండి! కొత్త సినిమాలకే దిక్కు లేదు, ఇక పాత సినిమాలు చూడటం ఏం కుదురుతుంది?
  ——
  ‘శ్రీ’ గారు: ఆ పాప ఫోటో, పైన ‘ఎందుకో ఏమో’ గారు జత చేశారు.

 10. Hari
  6:14 సా. వద్ద మార్చి 9, 2012

  Wow….So nice…..Naku oka hamsa puttindi….so nenu ippati nunchi jagratta padali anta saramsanni naku anda chesaru….thanks meeku 🙂

 11. Snkr
  12:08 సా. వద్ద మార్చి 19, 2012

  స్వార్థం! జగమంతా స్వార్థం!!
  కంటికి కుదురుగా కనిపిస్తే చాలు వాళ్ళకు పెళ్ళి చేసి సమస్యల్లోకి నెట్టాలనే పైశాచిక ఆనందం. 🙂

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s