ముంగిలి > మన సంస్కృతి > మధుపర్కం అంటే బట్టలా?

మధుపర్కం అంటే బట్టలా?

దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ, చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అంటే బట్టలు పెట్టడం అని పెద్దలలో స్థిర పడిపోయింది కదా?

మొన్నెపుడో – టీ.వీ. చానళ్ళు తిరగేస్తుంటే, ఒక దానిలో అప్పుడే ‘మధుపర్కం సమర్పయామి’ అని వినబడేసరికి, ఒక్క క్షణం నా పరుగును ఆపాను. అదో సామూహిక పూజ. వెంటనే ఇద్దరు దంపతులు – పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఓహో! అనుకొని మళ్ళీ ముందుకు కదిలిపోయాను. పూజా పద్ధతులు అందించే బ్లాగులూ వెబ్‌సైట్‌లలో ‘మధుపర్కం సమర్పయామి’ అన్ని ఉన్నప్పుడు, ‘ఇప్పుడు రెండు దూది వత్తులు సమర్పించండి’ అని చూశాను. కొన్ని చోట్ల, శోడశోపచారాలలో ‘వస్త్రం సమర్పయామి’ని ‘మధుపర్కం సమర్పయామి’ అని కూడా ప్రచురిస్తున్నారు. పెళ్ళిళ్ళలో కూడా మధుపర్కం అనే పదం వినబడుతుంది. ‘మధుపర్కం బట్టలు’ మీరూ వినే ఉంటారు. దీపావళి అంటే ‘టపాసుల పండుగ’ అయినట్టేమో కదా? ఇది కరెక్ట్ కాదు అని తెలుస్తోంది. మధు అంటే ‘తియ్యని’ లేక ‘తేనె’ అని అర్థం. పర్కం అంటే మిశ్రమం. మరి మధుపర్కం అంటే బట్టలు అని ఎలా స్థిరపడిపోయింది? ప్రామాణికంగా మధుపర్కం అంటే ఏమిటి అని శోధించాను. మధుపర్కం గురించి నాకు తటస్థించిన వివరాలు…

అసలు మధుపర్కం అంటే ఏమిటి?

మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. ఆ మిశ్రమం వేటితో చేయాలి? దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్వ పంచభిః – అంటే సమపాళ్ళలో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇంకా జలం. వీటి మిశ్రమమే మధుపర్కం.

పంచామృతం మధుపర్కం తేడా?

పూజల్లో పంచామృతం వాడతారు కదా – మరి పంచామృతానికీ, మధుపర్కానికీ తేడా ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనే ఇంకా చెక్కెర – ఈ క్రమంలో ఆయా పదార్థాలను విడి విడిగా స్నపనం చేసి, అలా వచ్చిన పదార్థాన్ని అంటే పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించాలి. అన్నిటినీ కలిపేసి అభిషేకం చేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమటుకూ సరైనదో తెలియదు. పంచామృతంతో అభిషేకం చేస్తాము; మధుపర్కం స్వీకరించమని అంటే తాగమని సమర్పించుకుంటాము – అది తేడా.

మధుపర్కం ఎందుకు సమర్పిస్తారు?

గౌరవాన్ని సుచిస్తూ సమర్పించుకునేది మధుపర్కం. యజమాని అంటే పూజ చేయిస్తున్న గృహస్తు లేదా పెళ్ళిలో కన్యాదానం చేస్తున్నతను – మర్యాద పూర్వకంగా గౌరవాన్ని సూచిస్తూ మధుపర్కం సమర్పించుకోవాలి. పూజలో అయితే భగవంతుడికి, పెళ్ళిలో ఐతే నారాయణ స్వరూపమైన వరుడికి. మధుపర్కం సమర్పించుకోవటం ఎంతటి గౌరవ సూచకమో, దానిని పద్ధతిగా స్వీకరించటమూ అంతే మర్యాదతో కూడుకున్నది. సంస్కృత నిఘంటువులో  ‘A mixture of honey’, a respectful offering made to a guest or to the bridegroom on his arrival at the door of the father of the bride అని ఉంది.

ప్రకటనలు
 1. 11:01 ఉద. వద్ద ఫిబ్రవరి 27, 2012

  ఈ మధుపర్కం గురించి ఏఎన్నార్ నటించిన తెనాలి రామలింగడులోది నేనిన్నాళ్ళూ నిజమనుకుంటున్నాను. అందులో రామలింగకవి రాయలుని కలవడానికి వెళ్ళినపుడు మధుపర్కాన్ని తలకుచుట్టుకొని వెళతాడు. “నాకధుని” పద్యానికి దాన్ని రాయలుకి బహుమతిగా ఇవ్వబోయి ఏదోగుర్తొచ్చి ఆగిపోతే రాయలే దాన్ని గౌరవంతో స్వీకరించినట్లుగా చూపించారు.

  ఐతే మధుపర్కమంటే పానీయమన్నమాట. నేనిన్నాళ్ళూ తలకుచుట్టుకొన్న(/చుట్టుకొనే) చీర అనుకుంటున్నాను. Thank you.

  • prasad
   5:22 ఉద. వద్ద మార్చి 13, 2014

   నేనూ అలాగే అనుకొన్నాను అండీ. ఇపుడే తెలిసింది . కృతజ్ఞతలు

 2. 9:38 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2012

  ఇప్పటి వరకూ మధు పర్కం అంటే బట్టలు అనే అనుకున్నా.. ఇప్పుడే తెల్సుకున్నా సరి ఐన అర్ధం..
  ధన్యవాదములు..

 3. Seetharam
  11:52 ఉద. వద్ద మార్చి 1, 2012

  మధుపర్కాలు స్నేహ భావాన్ని పెంపొందిచడానికి ఇస్తారు. దానితో పాటుగా పెట్టిన బట్టలను కూడా మధుపర్కం చీర లేక పంచ అనే వ్యవహరిస్తారు. తెనాలి రామకృష్ణ లో కూడా ఇది మధుపర్కం చీర, కట్టుకోండి, శుభము జరుగుతుంది అనే అంటుంది రామకృష్ణుని భార్య.
  సీతారామం

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s