ముంగిలి > తెలుగు వెలుగులు > కొత్త ఖతులు / Telugu Unicode Fonts

కొత్త ఖతులు / Telugu Unicode Fonts

కొత్తగా విడుదలైన ‘లక్కిరెడ్డి’, ‘పొన్నాల’, ‘రవిప్రకాష్‌’ తెలుగు యూనీకోడ్ ఫాంట్ల మీద తర్జన భర్జనలు బాగానే జరిగాయనుకుంటాను. ఎట్టకేళకు నిన్న దొరికాయి (teluguvijayam.org/fonts.html). ఎలా ఉన్నాయో చూద్దామని, వీటిని download చేసి వీటితో ఒక చిన్న ప్రయత్నం చేశా.

వీటిని యథాతదంగా Microsoft Wordలో గౌతమితో పోల్చడం సబబు కాదనిపించింది. అంచేత, PDFలా Save చేసి చూశా. అప్పుడు ఫరవాలేదనిపించాయి.

మొదటి పరిశీలన

కేవలం ఆ ఫాంటు అక్షరాలతో మాత్రమే కూర్చితే ఎలా ఉంటుందో చూడాలని ప్రయత్నించాను.

గౌతమి - size 10

గౌతమి - size 10

లక్కిరెడ్డి - size 10

లక్కిరెడ్డి - size 10

పొన్నాల - size 10

పొన్నాల - size 10

రవిప్రకాష్ - size 10

రవిప్రకాష్ - size 10

గౌతమిని పక్కన పెడితే, మొదటి పరిశీలనలో ఆ మూడీటికి నేనిచ్చే Rank లొచ్చి…

1. రవిప్రకాష్
2. లక్కిరెడ్డి
3. పొన్నాల

రెండవ పరిశీలన

నా రెండవ పరిశీలన – రెండేసి ఫాంట్లను కలిపి చూస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. వీటి పేర్లూ, అక్షరాల లిపి శైలులను చూసినపుడు, ఎందుకో ముత్యాల ముగ్గు సినిమాలో ‘కాసింత కలాపోసనుండాలయ్యా!’ డైలాగ్ గుర్తుకొచ్చింది.  కిందనున్న images పై click చేస్తే, మసకలేకుండా స్పష్టంగా కనబడతాయి.

లక్కిరెడ్డి (11) + రవిప్రకాష్ (12) ఫాంట్లతో

లక్కిరెడ్డి (11) + రవిప్రకాష్ (12) ఫాంట్లతో

పొన్నాల (11) + రవిప్రకాష్ (12) ఫాంట్లతో

పొన్నాల (11) + రవిప్రకాష్ (12) ఫాంట్లతో

పొన్నాల (11) + లక్కిరెడ్డి (11) ఫాంట్లతో

పొన్నాల (11) + లక్కిరెడ్డి (11) ఫాంట్లతో

నా రెండవ పరిశీలనలో నేనిచ్చే Ranking…

1. పొన్నాల + రవిప్రకాష్
2. లక్కిరెడ్డి + రవిప్రకాష్
3. పొన్నాల + లక్కిరెడ్డి

అంకెలు

ఇక అంకెలు ఎలా ఉన్నాయో, చూశాను. ఇక్కడ మాత్రం పొన్నాల మొదటి స్థానం. తరువాత రవిప్రకాష్ ఫాంట్ బాగుంది.

అంకెలు

అంకెలు

కోరిక

ఈ జిగేల్-భిగేల్ ఫాంట్లు బాగున్నాయి కానీ, దేవనాగరికి మంగల్ తరువాత Vista/Windows 7 లో ఉత్సాహ్ ఫాంట్ Microsoft ఇచ్చినట్లు, తెలుగుకు గౌతమి తరువాత నిత్య వాడకానికికో మంచి ఫాంట్ వస్తే బాగుంటుందని ఆశ. మంగల్ తరువాతది ఉత్సాహ్ ఐతే, గౌతమి తరువాత వచ్చేది కృష్ణవేణి కాబోలు. పన్లో పని ఆ ఇచ్చే కొత్త ఫాంట్‌లో అర్ధ విరామము, పూర్ణ విరామము అలాగే అనుదాత్త, ఉదాత్త, స్వరితాలు కూడా తెలుగు యూనీకోడ్ ఫాంట్ టేబుల్లో “separation”గా పెట్టేస్తే బాగుంటుంది.

టూకీగా నాకనిపించినది

వెబ్‌సైట్‌లలో యథా తధంగా వాడటం కష్టం – అంటే చూడటం కష్టమని నా ఉద్దేశ్యం. కానీ ముద్రణకైతే, బాగానే ఉంటాయి. ఈ మూడిటిలో రవిప్రకాష్ ఫాంట్, మిగతా రెంటికంటే బాగుంది. దాని తరువాత స్థానం లక్కిరెడ్డిది.

లక్కిరెడ్డి, పొన్నాల ఫాంట్లు, శీర్షికల వంటి హెడ్డింగులకైతే బాగుంటాయి. In-line text కు బొత్తిగా నప్పట్లేదు. Body text కు రవిప్రకాష్ ఫాంటు ఫరవాలేదు.

గమనిక: ఒడ్డున కూర్చోని, ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు. పాపం ఎంతమంది కష్టపడ్డారో – అలా రాంకులిచ్చేసి తేల్చేశా! పైవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. నా పరిశీలనలకు వాడిన PDF ఇక్కడ జత చేస్తున్నాను. Download చేసుకొని మీ రాంకులు మీరే ఇచ్చుకోండేఁ?

కొత్త ఖతులు

ముత్యాల ముగ్గు డైలాగులు in-line text లా కింద జతపరిచా.

సెగెట్రీ: నారాయణొచ్చాడండి
రావుగోపాలరావు: వొచ్చాడా – తీసుకొచ్చావా?
సెగెట్రీ: ఎస్సార్‌! తీసుకొచ్చాను. చూస్తారా?
రావుగోపాలరావు: అబ్బా సెగెట్రీ! ఎప్పుడూ పనులూ – బిజినెస్సేనా? ఆఁ? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్త్యెచ్ఛ నారాయణుడి సేవ సేసుకోవద్దూ?!?
సెగెట్రీ: ఎస్సార్
రావుగోపాలరావు: ఎస్సార్ గాదు! కళ్ళెట్టుకు సూడూ. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ – ఆకాసంలో? సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ?
సెగెట్రీ: అధ్బుతం సార్
రావుగోపాలరావు: ఆఁ! మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా! ఉత్తినే తిన్తొంగుంటే మడిసికీ-గొడ్డుకీ తేడా ఏటుంటది?
సెగెట్రీ: ఎస్సార్‌. మీరోస్సారి చూసి సరే అనేస్తే, మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయ్
రావుగోపాలరావు: సరే లేద్దూ! ఎదవ నూసెన్సూ
ప్రకటనలు
వర్గాలుతెలుగు వెలుగులు ట్యాగులు:
 1. 8:34 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2012

  సర్,
  నాకు ఈ UNICODE ఫాంట్ పెద్దగ రుచించదు, అంచేత నా వీడియో ల లోను BLOG POST HEADINGS లోను ANUSCRIPT వారి Fonts నే ఉపయోగిస్తుంటాను,

  ఈ మధ్య వచ్చిన anu 7 version ని మొదట్లో వాడలేదు,
  ఎందుకంటే నేను గతం లో చేసినవి ఈ కొత్త దానిలో మార్పులు చేస్యటం వీలు కావటం లేదు కాబట్టి కాని ఇప్పుడు ANU 7 వెర్షన్ వాడుతున్నాను అద్భుతమైన FONTS

  దీనితో పాటు మా వంటి వారి కోసం ఒక SOFTWARE వచ్చింది అది ఏమి చేస్తుందంటే అనుస్క్రిప్ట్ తెలుగు లో టైపు చేసిన సమాచారాన్ని UNICODE లోకి CONVERT చేస్తుంది..
  మీకు వీలైతే ఆ సమాచారాన్ని జత పరచండి.. అయితే దానివిలువ 1000 రూపాయిలు అని విన్నాను అప్పుడు మాకు ఇంకా నచ్చే అమ్సమే మీరు ప్రతిపాదించిన విషయం

  thanks
  ?!

 2. తాడిగడప శ్యామలరావు
  11:33 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2012

  నేను పోతన–2000 Unicode fonts వాడుతున్నాను. ఇవి బాగుంటాయి.
  దేశికాచారిగారు పోతన, తిక్కన అని రెండు ఫాంట్స్ ఇచ్చారు. కీ-మెన్ IME కూడా.
  అయితే దేశికాచారిగారి కీ బోర్డ్ మేపింగ్ వేరేగా ఉంటుంది. అయితే యిది విండోస్-7 లో సరిగా install కాదు.
  ఈ మధ్య ప్రముఖ్ వాడుతున్నాను. బాగానే ఉంది.

 3. Satyanarayana Piska
  1:08 సా. వద్ద ఫిబ్రవరి 28, 2012

  పై శ్లోకం లోని 2వ పాదములో “సహస్రనామ తత్తుల్యం” అని ఉండాలనుకుంటాను.

 4. D, Venu Gopal
  1:12 సా. వద్ద ఫిబ్రవరి 28, 2012

  దేశికాచారి గారు తయారు చేసిన ఫాంటులు పోతన, వేమన. దీని ఆధారంగానే వేరే ఫాంటు సుగుణ అనేది తయారు చేశారు. ఇది చూడడానికి బాపు చేతి వ్రాతలా ఉంటుంది. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ విండోస్ ౭ తో నో మైక్రోసాప్ఠ్ ఆఫీసు తోనో వాణి అనే ఖతి ఇస్తున్నాడు. ఇది బాగుండలేదు. నేను ఇంతవరకు ౩ పుస్తకాలు సెట్ చేసాను వాటికి పోతన, గౌతమి, వేమన లను వాడాను. ఇంకొక పుస్తకం తయారీలో ఉంది దానికి ఈ క్రొత్త ఖతులు మరియు రమణీయ (దానిలో సూచించిన వమార్పులు

 5. 3:00 సా. వద్ద ఫిబ్రవరి 28, 2012

  Gautami and Potahana are good for text fonts. We felt that there is a void to make nice looking headings/subheadings (Titles). These three fonts have been developed to fill that gap. By Telugu Bhasha Dinotsavam August 2012), we hope to come up with a few other nice looking text fonts that could be better than Gautami. Your inputs are most welcome.

 6. తాడిగడప శ్యామలరావు
  4:25 సా. వద్ద ఫిబ్రవరి 28, 2012

  ఆనంద్ గారూ, మా inputs అడిగారు కాబట్టి.
  దయ చేసి, కొత్త తెలుగు fontsకు తెలుగు సంస్కృతికి, భాషకు విశిష్టసేవ చేసిన మహానుభావుల పేర్లు లేదా మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాల పేర్లు పెట్టండి.

 7. 4:32 సా. వద్ద మార్చి 4, 2012

  తెలుగు భావాలు గారూ,
  మీ బ్లాగు మంచి విజ్ఞానదాయకంగా ఉంది. మీ ఫాంట్ల పరిశీలన చూశాను. కొత్తగా వచ్చిన మూడు ఖతులూ గద్యల్లో (paragraphs) అంత బాగున్నట్టు అనిపించలేదు. అయితే అక్కడక్కడా కోట్ చెయ్యటానికి పొన్నాల ఖతి నాకు నచ్చింది. అలాగే తెలుగు ఖతులకు తెలుగునేల చారిత్రక ప్రదేశాల పేర్లు, భాషకు సేవ చేసినవారి పేర్లు పెట్టుకుంటే బావుంటుంది. ఈ విషయములో శ్యామలరావు గారితో ఏకీభవిస్తున్నాను.

  అచంగ.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s