ముంగిలి > జ్యోతిష్య శాస్త్రం, మన సంస్కృతి > జ్యోతిష్య శాస్త్రం – నమ్మవచ్చా లేక బూటకమా?

జ్యోతిష్య శాస్త్రం – నమ్మవచ్చా లేక బూటకమా?

నా స్వానుభవం

జీవితమంటే ఏమిటో తెలిసొస్తున్న రోజులు. మా నాన్నగారి ఆఫీసులో సహోద్యోగి ఒకరికి జ్యోతిష్యం తెలుసునని – నా జాతకం చూపించారు. ఆ చూసినతను – నా జాతకచక్ర ప్రభావం వల్ల, త్వరలో మా నాన్నగారికి మరణగండమున్నదని చెప్పారు. ఆ విషయం నాకు తెలిసింది. అప్పుడు నేను పడ్డ క్షోభ వర్ణనాతీతం. ఏమీ చేయలేని అసహాయస్థితి. నా వల్ల మా నాన్నగారికి గండం! కానీ నాకు తెలిసి నేను చేసినదేమీ లేదు!

పైవాడు నా పరిస్థితిని చూసి జాలి పడ్డాడో ఏమో – మా ఇంట్లో ఉన్న పుస్తకాలలో ఒకదాని చివరి పుటలో ఉన్న విషయంపై – కాకతాళీయంగా నా కళ్ళు పడ్డాయి. ఒక గొప్ప స్తోత్రం మీద ఆది శంకరుల భాష్యం, దాని మూలం – తెలుగు అనువాదం ఉన్న పుస్తకమది. స్తోత్ర పారాయణం – విధిగా నమ్మి గనక చేసినట్లయితే, గ్రహ పీడల వంటివి కూడా తొలగిపోతాయని ఆ చివరి పుటలో ఉంది. నా గురువు కూడా మా తండ్రిగారే గనుక, ఆయన అనుమతి తీసుందామని అడిగాను. నేను రోజూ ఆ స్తోత్ర పారాయణం చేయవచ్చా అని. ఆయన సంతోషంగా సరేనన్నారు.

శ్రద్ధగా పారాయణ చేస్తుండటం చూసి – కారణం కనుక్కుందామని – ఆ స్తోత్రం వైపు నా మనసు ఎందుకు మళ్ళిందని అడిగారు. కారణం చెప్పాను. దానికి – ఆయన నా భయాన్ని తేలికగా కొట్టి పారేశారు. ఏ జాతకాన్నయితే చూసి మా నాన్నగారికి నా కారణంగా గండమున్నదని చెప్పారో, అది సరైన జాతకం కాదట. నా చిన్నతనంలో వేయించిన జాతకం సరైనది కాదు. నా నక్షత్రం ‘ఆ’ అయితే ఆ జాతకంలో ‘శ’ అని ఉంది. పొరబాట్న, సరైన జాతకం బదులు – ఆ తప్పు జాతకాన్ని చూపించారట.

అప్పుడు – నా జీవితాన్నే మార్చేసిన సంఘటన జరిగింది. ఏ కారణం లేకుండా – ఆ జోస్యం చెప్పినతను ఆసుపత్రిపాలయ్యాడట. రోగం ఏదీ లేదు – కానీ మనిషి ఉన్నట్టుండి కుప్ప కూలిపోతే, ఆసుపత్రిలో చేర్పించి సెలైన్లూ గట్రాలు ఎక్కించి తేరుకున్నాక రెండ్రోజుల తరువాత విడుదల చేశారట. “మీ అబ్బాయి వల్ల మీకు మరణగండం” అని ఖరాఖండిగా తేల్చి – నా బాధకు కారణమైన ఆ జ్యోతీష్కుడు నిష్కారణంగా ఆసుపత్రి పాలయ్యాడా లేక ఆయన ఆసుపత్రిపాలవ్వటం ఒక యాదృచిక సంఘటనా? స్తోత్ర పారాయణం చేయటం వల్ల గండం లేదని తెలిసిందా లేక చేయకపోయినా ఆ బాధ నన్ను అంత తేలికగా వదిలేదా? ఆ స్తోత్రం – నా జీవితంలో అంతర్భాగమవ్వటానికి అలా జరిగిందా? Or was it all mere coincidence?

Astronomy, Astrology, Palmistry, Numerology, Fortune telling, Tarrot card reading వంటి పదాలకు సరిగా అర్థం తెలియని రోజులు. అన్నీ ఒకటే అనుకునే వాణ్ణి. ఆ దెబ్బకు జ్యోతిష్యశాస్త్రం అంటే ఏమిటో తెలుసుకోవాలనన్న కోరిక పుట్టింది. అప్పటినుండీ నా ప్రయత్నం నడుస్తూనే ఉంది.

జ్యోతిష్యం – జ్యోతిష్కులు

‘వైద్యో నారాయణో హరిః’ అంటుంది మన సంస్కృతి. త్రికరణశుద్ధిగా సనాతనధర్మాన్ని నమ్మే నేను, లెక్క ప్రకారం ఏ వైద్యుడిలోనైనా నారాయణుడిని చూడగలగాలి. కానీ నా స్వానుభవంలో – నాకు వివిధ పరిస్థితులలో ఎదురుపడ్డ Doctors లో ఒక పది శాతం కన్నా తక్కువ మంది మాత్రమే – కనీసం మనుషుల్లాగా కనిపించారు. దారుణాతిదారుణంగా అవతలివారి పరిస్థితిని సొమ్ము చేసుకునే డాక్టర్లే ఇంచుమించు 90 శాతం మంది. ఒక రోగిలో లక్ష్మీదేవిని మాత్రమే చూడగలిగే “నారాయణో హరిః”కి వక్రభాష్యాలయిన డాక్టర్లను మాత్రమే పరిగణనలో తీసుకొని – మొత్తం Medicine రంగమే బూటకం అని అంటే – నాకన్నా పెద్ద మూర్ఖుడుండడు; నేను సనాతనధర్మాన్ని నమ్ముతానని చెప్పుకోగలిగే అర్హతా నాకు ఉండదు.

ఒకే కాళాశాలలో చదివి వ్యాపారమో లేక ప్రాక్టీసో పెట్టిన ఏ ఇద్దరు వైద్యులూ ఒకేలా పైకి రారు. ఒకరికున్న “హస్తవాసి” మరొకరికి ఉండకపోవచ్చు. తప్పుడు వైద్యం చేసి, ప్రాణాపాయస్థితి అన్నదే లేని రోగి ప్రాణాలు తీసిన డాక్టర్లెంతమంది లేరు? వారి కారణంగా MBBS చదువును తప్పు పడుతున్నామా?  అధునాతన శాస్త్రాన్ని చదివి గుర్తింపు పొందిన డాక్టర్లకే ‘హస్తవాసి’ ఉంటుందే, మరి క్రమబద్ధీకరించబడని జ్యోతిష్య శాస్త్రాభ్యాసం చేసినవారి సంగతో?

నేను ‘డాక్టరు’ అని చెప్పుకోవాలంటే ఒక పట్టా ఉండాలి. లేకపోతే, బొక్కలో తోస్తారు. అటూ-ఇటూ వైద్యం చేస్తే – చట్టం చేతిలో తప్పించుకోవచ్చునేమో, కానీ బాధితులు వదులుతారా? అదే ‘జ్యోతిష్కుడు’ అని చెప్పుకోవాలంటే ఏం కావాలి? తప్పుడు జోస్యం చెబితే ఏమన్నా శిక్ష ఉన్నదా? జోస్యం చెప్పేవారి అసమర్ధత – ఆ శాస్త్రానికి అంటగట్టడం మూర్ఖత్వం. అసలు జ్యోతిష్యమంటేనే తెలియని వారు వ్యాఖ్యానించడం  అంతకన్నా!

ఈ అసంపూర్ణ వ్యాసం ఎందుకు?

నేను జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక గురువు వద్ద పద్ధతిగా అభ్యసించలేదు. బెంగళూరు వెంకట్‌రామన్ వంటి పండితులు రచించిన పుస్తాకాలు చదివి అర్థం చేసుకునే ప్రయత్నాలు మాత్రమే చేశాను. అంచేత నేను ఒక జ్యోతిషుడిని అని చెప్పుకునే అర్హత లేని వాడిని. అయినా కూడా – నేను తెలుసుకున్న విషయాలేమిటి, పూర్వాపరాలు, నిత్య జీవితంతో అనుసంధానం చేసుకోగల విషయాలను కూర్చి, మరి కొన్ని టపాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి మటుకు ఈ టపా అసంపూర్ణమే!

ఎనకటికి ఎవడికో తన తల్లి పాతివ్రత్యంమీదే అనుమానం పుట్టుకొచ్చింది. “ఎందుకురా ఈ అనుమానం?” అని అడిగితే – తన పుట్టుక నిజమయితే, తన తల్లి పతివ్రత ఎలా అవుతుందని ఎదురుప్రశ్న వేశాడట! గత కొద్దిరోజులగా, జ్యోతిష్య శాస్త్రంపై బ్లాగ్లోకంలో జరిగిన తర్జన భర్జనలు చూసి/చదివి కొంత బాధ కలిగింది – ఎందుకో ఈ పాతివ్రత్యం కథ గుర్తుకొచ్చింది.

ప్రకటనలు
 1. 1:12 ఉద. వద్ద మార్చి 11, 2012

  ఏమండోయ్ తెలుగు భావాలు గారు,

  మీరూ మొదలెట్టేసారూ!! శుభం.! వెల్కం. నా ప్రయత్నం నెరవేరిందని అనుకుంటాను. !

  చీర్స్
  జిలేబి.

  • 9:05 ఉద. వద్ద మార్చి 11, 2012

   నిజానికి ఈ టపా నాకైతే నచ్చలా. ఉచ్చులో దిగినట్టుంది. దిక్కుమాలిన కామెంట్లు చదివినప్పుడు కలిగిన కంపరాన్నీ వదిలిచ్చుకోవటానికి రాసినది మాత్రమే!

   • Snkr
    10:16 ఉద. వద్ద మార్చి 11, 2012

    దిక్ మాలిన కామెంట్లు మీలో ప్రేరణ కలిగించిడం కొంచెం ఆశ్చర్యకరమే! 🙂 జిలేబి గారి ప్రయత్నం దిక్కుమాలినదని మీరు చెప్పకచెప్పడం బాఓలేదు. పాపం ఆవిడ ఫీల్ అవుతారేమో. :))

    • 10:27 ఉద. వద్ద మార్చి 11, 2012

     ఈ గుడిసెలంటించే కామెంట్లు వద్దు మహాప్రభో!

     • Snkr
      11:27 ఉద. వద్ద మార్చి 11, 2012

      సరే, జిలేబి గారి ప్రయత్నం ఏదో ఒహ దిక్కుమాలిన దిక్కును సూచిస్తోందనే అనుకుందాం. అది మీకు ప్రేరణ కాదనీ అనుకోవడం కన్నా చేసేదేముంది? 🙂

  • తాడిగడప శ్యామలరావు
   10:06 ఉద. వద్ద మార్చి 11, 2012

   జిలేబిగారి ప్రయత్నం యేమిటో, అది నెరవేరటం యేమిటో అర్థం కాలేదు. మరింత విశాలమైన చర్చ జరగాలని వారి అభిలాష అనుకుంటాను. కాని అర్ఠవంతమైన చర్చ యేదీ నాకు కనిపించటం లేదు!

 2. Snkr
  8:20 ఉద. వద్ద మార్చి 11, 2012

  :)) బాగుంది.

 3. తాడిగడప శ్యామలరావు
  10:03 ఉద. వద్ద మార్చి 11, 2012

  జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న విషయం మీద చర్చలు జోరందు కోవటం నాకైతే యేమీ సంతోషం కలిగించటం లేదు. ఈ చర్చలవలన శాస్త్రీయమైన ప్రయోజనం యేమీ ఒనగూరే అవకాశం కనిపించటంలేదన్నదే నా ఉద్దేశం. పైగా, జ్యోతిషమో, సైన్సో తెలుసుననుకునే వారూ, ఆ రెండూ కూడా తెలుసుననుకునే వారూ రంగంలోకి దిగి వీరంగం వేయటం వలన, యెంతోమంది యొక్క విలువైన కాలం వృధా అవుతోంది. ఆవేశకావేశాలు పెరగటం చూస్తున్నాం. ఈ చర్చల వలన కొంతమందికి పదిమంది దృష్టిలోనికీ వచ్చే అవకాశం కలగవచ్చును. అంతకు మించి ఇవి సాధించేది యేమీ లేదు. నమ్మకాలూ, స్వానుభవాల ఆధారంగా దేనికీ శాస్త్రప్రతిపత్తిని కట్టబెట్టడమో ఊడగొట్టడమో కుదరదని మఖ్యంగా వాదనకు దిగే రెండు వర్గాలవారూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. అయితే యెవరైనా తమ బ్లాగులో తమ స్వానుభవాలో నమ్మకాలో పదిమందితో పంచుకుందుకు అభ్యంతరం చెప్పటానికి కారణాలు లేవు. కాని, అపోహలు కల్పించకుండా వారు కొంచెం జాగ్రత తీసుకోవలసి ఉంటుందని సూచన.

  • 10:52 ఉద. వద్ద మార్చి 11, 2012

   శ్యామలరావుగారు: ఇతరులు – మీరిచ్చిన వ్యాసాన్ని సరిగా చదవలేదని జిలేబిగారి టపాలో వ్యాఖ్య వేశారు. అది మీకూ వర్తిస్తుంది కదా? ఇదివరకు వాలి-రావణుల టపాలో కూడా ఇలాంటి వ్యాఖ్యే పుసుక్కున చేశారు.
   .
   నా ఈ టపా నాకే నచ్చలేదని పైన రాశాను. సమయం తీసుకొని జాగ్రత్తగా రాసిన టపా కాదు. పైపెచ్చు అసంపూర్ణమని కూడా తెలిపాను. గుంపులో గోవిందా అని సరిపెట్టుకొని చెవిటివారి ముందు శంఖం ఊదే విధంగా వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకుపోయే రకాన్ని కాదని నా మునుపటి టపాలు చదివితే తెలుస్తుంది. దయచేసి నిరీక్షించగలరు. Patience is a virtue…

  • Snkr
   11:29 ఉద. వద్ద మార్చి 11, 2012

   / ఆ రెండూ కూడా తెలుసుననుకునే వారూ రంగంలోకి దిగి వీరంగం వేయటం వలన/
   Exactly! You nailed it, sir.

 4. తాడిగడప శ్యామలరావు
  12:57 సా. వద్ద మార్చి 11, 2012

  జిలేబీగారి టపాలో నేను సూచించిన వ్యాసాన్ని గొట్టిముక్కలవారు ఆదరాబాదరాగా చదివేసారు. ఆ మాట వారే అన్నారు కూడా. అయితే మీ టపా సరిగా చదివాననే అనుకుంటున్నాను. తొందరపాటు వ్యాఖ్యలు చేయటం నా అలవాటూ కాదు, అభిమతమూ కాదు. మీ విషయంలో అలా జరిగితే మన్నించండి. ప్రమాదో ధీమతా మపి. నేనెంత. కాని మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను మిమ్మల్ని ఉద్దేశించి యేమీ వ్యాఖ్యానించలేదని అర్థంచేసుకోగలరు. నేను ప్రస్తుత పరిస్థితిని సమీక్షించానంతే. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షంతవ్యుడను.

  • Jai Gottimukkala
   12:28 సా. వద్ద మార్చి 12, 2012

   సార్, నేను పైపైకి స్పీడ్ రీడింగ్ పద్దతిలో చదివాననే మాత్రమె మీతో అన్నాను. అంటే ప్రతి పేరాలో మొదటి వాక్యం చదివి, అది నా ప్రశ్నకు సమాధానం ఇస్తుందనుకుంటే సాంతం చదివా. లేకపోతె ముందుకు వెళ్ళా.

   మీరు తప్పుల తడకగా వర్ణించిన మరో టపాలో (you know which one) నా ప్రశ్నకు సమాధానాలు ఉన్నట్టుగా అనిపించాయి కానీ అతికించినట్టుగా ఉంది.

 5. 3:57 సా. వద్ద మార్చి 11, 2012

  ఇక్కడ శంకర్ గారెవరో గుడిసెలు అంటించే కార్యక్రమానికి ‘స్వీకారం’ చుట్టారని అంటే వచ్చాను. ఇంకా అంటలేదన్న మాట అగ్ని కణాలు

  జిలేబి.

  • Snkr
   5:35 సా. వద్ద మార్చి 11, 2012

   అబ్బే గుడిసెలు కాదండి, జిలేబిగారి స్పూర్తి టపా, దిక్కులేనిది అంటే వారు దిక్కులు పిక్కటిల్లేలా బాధ పడతారేమో అని చెప్పాననతే, మీకే సపోర్ట్, మీకే …. 🙂

 6. 4:12 సా. వద్ద మార్చి 11, 2012

  అదృష్టదురదృష్టాలని నమ్ముకోమని చెప్పడం ఎన్నడూ అభివృద్ధికరం అవ్వదు. కనుక జ్యోతిష్యం మూఢనమ్మకమే అవుతుంది.

 7. 8:19 సా. వద్ద మార్చి 11, 2012

  డైరెక్ట్‌గానే చెపుతున్నాను. మనిషి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా జాతకంలో ఏమి వ్రాసి ఉంటే అది జరుగుతుంది అని అనుకుంటే బాగుపడతాడా? మీ వ్యక్తిగత నమ్మకాలు మీ ఇష్టం. రేపు మీ పిల్లలు కూడా ఇలాంటి నమ్మకాలని నమ్మి చెడిపోతే మీరు చూసి ఆనందిస్తారా? మాకు చెప్పడానికి నువ్వు ఎవరు అని నన్ను అడుగుతారు. మనిషి యొక్క అభివృద్ధి భౌతిక ఆలోచనలతోనే జరుగుతుంది. అంతే కానీ జాతకంలో ఏమి వ్రాసుంటే అదే జరుగుతుంది అనుకుని జాతకాల మీద ఆధారపడితే అది అభివృద్ధి నిరోధకమే అవుతుంది. మంచి ముహూర్తంలో పుట్టినవాడు ఆఫీసర్ అవుతాడు, దుర్ముహూర్తంలో పుట్టినవాడు దొంగ అవుతాడు అనుకుందాం. రేపు మీ పిల్లవాడు కూడా నేను దుర్ముహూర్తంలో పుట్టాను కనుక నాకు చదువు అబ్బదు, నేను స్కూల్‌కి వెళ్ళను అని అంటే ఎలా ఉంటుంది? కుటుంబ విషయాలు ప్రస్తావించొద్దు అని మీరు అంటారని నాకు తెలుసు. ఎందుకంటే వ్యక్తిగత విషయాలకొచ్చేసరికి ఇలాగే మాట్లాడిన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.

 8. 9:26 సా. వద్ద మార్చి 11, 2012

  ఎక్కడెక్కడి చెత్త పట్టుకొచ్చి అదేంటి – ఇదేంటి అని ఈ ప్రశ్నలేమిటి? పైన రాసిన మాటరేంటి – ఈ సంభంధం లేని ప్రశ్నలేంటి?
  .
  ఇక నా స్వవిషయానికి వస్తే, అందరూ చీదరించుకుంటున్నా పట్టనట్టు ఎకేవిధంగానయితే పెరగడన్న గ్యారంటీ నాకున్నది.
  .
  తెలిసీ తెలియకుండా మిడి మిడి ఙ్ఞాననంతో ఇలా ఎక్కడ బడితే అక్కడ, ఎవరితో బడితే వారితో గొడవలు పెట్టుకోవడం అభివృద్ధికి తోడ్పడుతుందా?
  .
  సమాజానికి మీరు సేవలందించాలనుకుంటే – ఏ విధంగానయినా – వారిలో ఒకరై, సాధికారికంగా నిరూపించాలి లేదా సాధికారికంగా ఖండించగలగాలి.

 9. RKV
  9:57 సా. వద్ద మార్చి 11, 2012

  @@ తెలుగు భావాలు
  సంబంధం ఉన్న కామెంట్లు రాస్తే అతను ప్రవీణ్ శర్మ ఎందుకవుతాడూ సార్. మీరు మరీనూ.

 10. 4:54 ఉద. వద్ద మార్చి 12, 2012

  రెండేళ్ళ క్రితం అబ్రకదబ్ర అనే ఒక ఆయన నేను సంబంధం లేని కామెంట్లు వ్రాస్తుంటానని అంటే మీరు అతని స్టైల్‌ని కాపీ కొట్టి పాచిపళ్ళ దాసరిలాగ అదే పాట పాడారు. కొత్త పాట పాడితే అర్థమవుతుంది. గ్రహాలకీ, జీవితానికీ సంబంధం ఏమిటి అని అడిగినప్పుడు జ్యోతిష్యులు సమాధానం చెప్పారా? సంబంధం లేని విషయాల గురించి జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు అడగడం చూస్తే నవ్వు పుడుతుంది.

  • 9:29 ఉద. వద్ద మార్చి 12, 2012

   అబ్బో! రెండేళ్ళగా ఉందా ఈ యవ్వారం! అంత బాగా గుర్తు పెట్టుకొని చెప్పారంటే, చూడలనిపిస్తోంది. ఆ లంకె కూడా ఇస్తే బాగుండేది.

 11. 5:04 ఉద. వద్ద మార్చి 12, 2012

  ఎక్కడెక్కడి చెత్తో నేను పట్టుకురాలేదు. ఒక టివి చానెల్‌లో జ్యోతిష్యంపై చర్చా కార్యక్రమం జరిగినప్పుడు “మంచి ముహూర్తంలో పుట్టినవాడు ఆఫీసర్ అవుతాడు, దుర్ముహూర్తంలో పుట్టినవాడు దొంగ అవుతాడు” అనే దాంట్లో నిజముందా అని అడిగారు. ఆ విషయమే ఇక్కడ వ్రాసాను. మీ కొడుకు జాతకం బాగాలేదనీ, అతను దొంగ అవుతాడనీ జ్యోతిష్యుడు చెపితే మీరు నమ్మేసి, రేపో మాపో దొంగ కాబోయేవానికి చదువు ఎందుకు అనుకుని, అతన్ని వీధి రౌడీలతో తిరగమని పంపించగలరా? దీన్ని మీరు సంబంధం లేని ప్రశ్న అంటారని నాకు తెలిసే నేను ఈ విషయం వ్రాసాను. కానీ ఇది సంబంధం ఉన్న ప్రశ్నే. ఎందుకంటే వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం వేర్వేరు అంశాలు కావు. మనం వ్యక్తిగతంగా నమ్మని వాటిని సమాజం మాత్రం నమ్మాలి అని అంటే అది హిపోక్రిసీయే అవుతుంది. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఎవడైనా సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నావు అని సమాధానం చెపుతాడు.

  • 9:39 ఉద. వద్ద మార్చి 12, 2012

   Do not post any further comments on this blog. I think your problem is something else. Get well soon…

  • guttinasrinivas
   12:29 సా. వద్ద మార్చి 15, 2012

   ఆసక్తి ఉన్నవారికోసం మాత్రమే:

   Kindly split the “karma siddhantam” from “jyOtiSaM”.

   JyotiSam tries to predict what can come our ways. Never says, it has to happen that way. For example, it can predict at some point you get a chance to go overseas. Now, whether I really go or not is upto me. But, the prediction itself is never wrong.

   On the other hand, “karma siddhantam” becomes completely differet: it states “what you sow is what you reap”. What you recieve is exactly what you throw out. Nothing different.

   Let me explain you: the very fundamental rule of “hindu” sanatana dharmam is “what you get is what you give”. In other words, “you will be what you try to be” or “your life is completely in your hands”.

   You may ask, then why should we talk about “deva” and “worships”? This is what Sanatana Dharma Saastram proposes:
   The “devataa sakthi” are proposed to be a set of natural forces beyond our physical abilities to percieve. They are proposed to be in charge of returning what we throw out. So, just like pleading at the “income tax” office about the penalties on the overdue tax payments, one is pleading those forces to help overcome their mistakes. The “income tax” officer, at his discretion, can forgive one’s penalties and ask him to pay just the dues. Just like it, the forces “may” choose to forgive penalties and just return what we have thrown out.

   The hightlight here is that – we cannot escape what we have done. It will come back. Only the penalties can be forgiven.

   BTW, good karma (puNyaM) and bad karma (paapaM) never cancel with each other. Each has to be received separately.

   Here is where the free-will (జిలేబీ గారి free-will గురించిన ప్రశ్న ఎక్కడో చూసినట్లు గుర్తు) comes in to the picture. We do have the free-will but we only have free-will to choose what we do/give – we do not have the complete freedom to choose what we receive/get.

   So, even if there is a prediction by a “jyOthiSha” expert, assuming he has all correct inputs and correct calculations, highest degree of accuracy (I am about to write about these on blog) – it *might* fail if there is no “karma” balance in one’s account. E.g. if a prediction says one has to meet with an accident, if he did not do much harm to others (knowingly or unknowingly also), he will not receive it. In other words, he will not meet with the accident.

   So, in order for a prediction to become real life events:
   * The “jyOthiSa” expert should be really expert
   * The calculations should be of highest accuracy
   * He/she received correct input data as precise as humanly possible
   * The predictions are properly applied to the person (just like a mathemetical equation is properly applied based on given environment).
   * And the person is having exact required “karma” balance

   A typical “jyOtiSa” expert can have all the above in control (more or less) but cannot reliably predict the person in question’s karma balance.

   As many said: timing is of utmost importance and is the most volatile variable in the entire prediction equation.

   • Sri
    2:15 ఉద. వద్ద మార్చి 19, 2012

    This is a lot of good explanation. However, you have used the phrase – Hindu Sanatana Dharmam, the non-believers do not believe in Hinduism rather thay hate Hinduism. So, your explanation will never go into their heads.

 12. Jai Gottimukkala
  12:33 సా. వద్ద మార్చి 12, 2012

  “నా జాతకచక్ర ప్రభావం వల్ల, త్వరలో మా నాన్నగారికి మరణగండమున్నదని చెప్పారు.”

  అదృష్టం బాగుండి ఆయనకేమీ జరగలేదు, చాలా సంతోషం.

  అయితే మీ జాతకం మీ నాన్న గారి జీవితానికి primary document కాదు. మీరు వారి జాతకాన్ని చూస్తె ఆ గండం నిజం కాదని తెలిసి పోయేది.

 13. Snkr
  6:37 ఉద. వద్ద జూలై 28, 2012

  /జ్యోతిష్యమంటేనే తెలియని వారు వ్యాఖ్యానించడం అంతకన్నా!/
  దీనికి మరింత వివరణ అవసరం. శాస్త్రం తెలియకున్నా ఫలితం అర్థమవుతుంది కదా. ఫలితం పై చర్చించడం తప్పెలా అవుతుంది? నేనూ ఒకతని ఫలితాలను ప్రశ్నించాను. ఎందుకంటే ఆయన “ఇది ఖచ్చితంగా సైన్సే”, “వాతావరణ, సీస్మిక్ స్టడీ చేసే వాళ్ళపై ఖర్చు దండగ, జ్యోతిష్కులను అందుకు వినియోగించుకోవాలి,” టైపు వాదనలను ప్రశ్నించాను. అందుకాయన నన్ను ‘ బృహత్ పరాశర హోర శాస్త్రాన్నీ చదివి రమ్మన్నారు. అక్కడ నేను ఆ శాస్త్రాన్ని ప్రశ్నించలేదు, ఈయన స్టేట్మెంటును మాత్రమే.

  ఆగ్నేయంలో జరిగిన భూకంపాలన్నిటికీ శని-అంగారక కలియిక అంటే మరి కలయిక లేకున్నా ఏడాదీ పొడవునా ఇండోనేషియాలో భూకంపాలుంటాయే? ఆయన సరిగా చెప్పలేక, శాస్త్రాన్నే దూషిస్తావా? పరాశరుణ్ణే ప్రశ్నిస్తావా? వెధవా… అంటూ బెత్తంతో ఆ మేస్టారు, వెంటబడితే పారిపోయాను, ఆయన నాకు వచ్చే ప్రశ్నలు వేసే వాళ్ళనే బడిలోకి రానిస్తానూని తలుపేసుకోగా, బడి వదిలేశాను. నాది తప్పా మాస్టారూ?!

  • 11:09 ఉద. వద్ద జూలై 28, 2012

   తప్పు కానే కాదు. 😉

   మిమ్మల్ని బడి వదిలిపెట్టేతంటగా బెత్తంతో బెదిరించినవారెవరై ఉంటారబ్బా! 🙄

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s