ముంగిలి > జ్యోతిష్య శాస్త్రం, మన సంస్కృతి > జోస్యాలు నిజం కాకపోవటానికి కారణాలు

జోస్యాలు నిజం కాకపోవటానికి కారణాలు

తప్పు జాతకాలు

జోస్యం నిజం కాకపోవటానికి ప్రథమ కారణం – జాతక చక్రం సరైనది కాకపోవడం. జాతకం తప్పుగా ఎందుకుంటుదన్న ప్రశ్నకు సవాలక్ష కారణాలు!

ఏమీ కలిసిరావట్లేదని ఒక తండ్రి తన కొడుకు జాతకం చెప్పించుకుందామని మంచి పేరున్న జోస్యుడివద్దకు వెళ్ళాడు. జాతకం లేదు. అంచేత, జాతకాన్ని కూడా వేయమని అడిగాడు. జోస్యుడు పుట్టిన తేదీ అడిగితే, “మా వాడు పుట్టినపుడు ‘ఇందిరా గాంధి’ మరణించిన వార్త విన్నాను. కాబట్టి మావాడి వివరాలొచ్చి 31 అక్టోబర్ 1984, ఉదయం 10 గంటల ప్రాంతంలో పుట్టాడు” అని చెప్పాడు. ఆవిడ మరణించిందని ప్రపంచానికి తెలిసినది మధ్యాహ్నం మూడూ ప్రాంతంలో కదా అని ఆ జోస్యుడు అడిగితే, ఆ తండ్రి తను తెలిపిన వివరాలు సరి చేస్తూ “సరిగా గుర్తులేదు. ఎందుకైనా మంచిది averageగా మధ్యాహ్నం పన్నెండు గంటలేసుకొని జాతకం తయారు చేయండి” అని చెప్పాడు. ఇక చెప్పబోయే జోస్యం – చంకనాకిపోతుందని చెప్పడానికి పెద్ద పాండిత్యంతో పనిలేదనుకుంటాను!?!

అదే కొడుకు, విడిగా ఇంకో జోస్యుడిని కలిశాడు. వివరాలేంటని అడిగితే, 31 అక్టోబర్ 1985, మధ్యాహ్నం మూడు గంటలని తొట్రుపడకుండా చెప్పాడు. ఒక సంవత్సరం కలిసొస్తుందని Birth Certificateనే అటూ-ఇటూ చేసి, official గా ఆ కుర్రాడి వయసును ఒక సంవత్సరం తగ్గించారు. ఆ కుర్రాడి దృష్టిలో తను పుట్టుంది 1985లో. పై జోస్యం చంకనాకితే, ఈ జోస్యం ఏమి నాకిపోతుంది?!?

సాధారణీకరణ / Thumb-rule Generalization

అప్పుడు ఆ జాతకంలో అలా ఉండటంవల్ల అలా జరిగింది కనుక, ఇప్పుడూ ఈ జాతకంలోనూ అలాగే జరుగుతుంది అనుకోవటం.

రాశులు పన్నెండు. జన్మ లగ్నం, జన్మ రాశి వీటిలో ఎదో ఒకటై ఉంటుంది. గ్రహాలను పక్కన పేడితే, ఈ లెక్కన ప్రపంచంలో 12×12=144 రకాల జీవితాలు మాత్రమే ఉండాలి! ఇది నిజమా?

ఫలానా భావంలో శని గ్రహం ఉన్నది కనుక – ఈ మనిషికి జీవితాంతం సుఖమనేదే ఉండదు అని చెప్పే జోస్యాలు నిజమవుతాయా అంటే, బొమ్మా బొరుసు వేసి చెప్పాల్సిందే! ఆ భావంలో ఏ Degreeలో గ్రహమున్నది (నవాంశ)? దానిపై ఇతర గ్రహాల ప్రభావమెలా ఉన్నది? స్వక్షేత్రమా? మిత్ర క్షేత్రమ? శత్రు క్షేత్రమా? లగ్నాత్ – ఆ గ్రహం యోగ కారకమా కాదా? ఆ గ్రహమున్న భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది? ఇవే ప్రశ్నలు దానితో కూడుకొనున్న ఇతర గ్రాహాలకూ పరిశీలించాలి. శని భుక్తి నడుస్తున్నా, దశ ఏ గ్రహానిది? అంతర్దశ దేనిది నడుస్తున్నది? ఇలా మరికొన్ని ప్రశ్నల సమాధానం పరిగణనలోకి తీసుకోకుండా చెప్పే జోస్యాలు నిజమయ్యే అవకాశాలు అంతంత మాత్రమే!

గ్రహచార ఫలితాలు చెప్పడంలో కూడా – ఈ సాధారణీకరణ కనిపిస్తుంటుంది. ఫలానా గ్రహం ఇక్కడుంది కనుక, విపరీతంగా కలిసొస్తుంది అని చెప్పిన జోస్యాలు కొందరికి నిజమవుతాయి, కొందరికి కావు. కారణాలు అనేకం. ఇతర గ్రహాల వల్ల ఈ గ్రహానికేదన్నా వేధ కలుగుతోందా? కలిగితే, ఎంతకాలం? గురు, శని వంటి గ్రహాల వల్ల వేధ కలిగితే, సంవత్సరం మొత్తం నిరీక్షించినా, దాని శుభ ఫలితాలు ఇంచుమించుగా కనబడవు. గ్రహచారం బ్రహ్మాండంగా కలిసొచ్చేవిధంగా ఉన్నా, దశాంతర్ధశలు కలిసొచ్చే విధంగా ఉన్నాయా? జోస్యం నిజమవ్వకపోతే, తప్పు గ్రహానిదా? జ్యోతిశ్శాస్త్రానిదా? ఖర్మ కాలి చెప్పించుకుంటున్నతడిదా లేక చెప్పిన జోస్యుడిదా?

నియంత్రణ లేకపోవడం

ఉగాది రాబోతోంది. బజారుకెళ్ళి, గంటల పంచాంగం ఇవ్వండి అని అడిగితే, ఏ గంటల పంచాంగం అని ఎదురు ప్రశ్న రావచ్చు. ఈ కాలంలో ప్రతీ పంచాంగం ‘గంటల పంచాంగమే’! ఒకే ప్రదేశానికి తయారు చేసిన ఏ రెండు పంచాంగాలలో తిథులు, నక్షత్రాల సమయాలు ఒకేలా ఉండవు. నక్షత్రారంభం సమయంతో ముడిబడి ఉన్నది అమృత-విష ఘఢియల నిర్ధారణ. ఒకో పంచాంగం ఒకో సమయాన్ని సూచిస్తున్నపుడు, సరైన వర్జ్య సమయం ఏది? అమృత ఘఢియలు ఎప్పుడు మొదలవుతాయి? చెప్పటం కష్టం!

అవగాహనారాహిత్యం

మంచి ఉదాహరణ C-Section అదే Caesarean ఆపరేషన్లు. ప్రసవానికి మంచి ముహూర్తం ఉండాలని ఆశపడుతుంటారు. ఈ సంధర్భంలో ‘మంచి ముహూర్తం’ అంటే ఏమిటి? పుట్టబోయే బిడ్డ జాతకం బ్రహ్మాండంగా ఉండాలనా? ప్రసవం సునాయాసంగా జరగాలనా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసి అడిగేవారు ఎంతమంది? Can we play God?

ఉగాదికి కొత్త పంచాంగం తెచ్చారంటే, అందరూ ముందుగా చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూసేది ఆదాయ-వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు. తన Date of Birth బట్టి 22 July నుండి 22 August మధ్యన పుట్టినందున తన Zodiac Sign Leo కనుక, సింహరాశివారి ఫలితాన్ని చూసేవారు కోకొల్లలు. ఈ ఉదాహరణలో Leo అనేది సాయన రవి స్థానం. పంచాంగంలో మీరు పుట్టిన సమయానికి నిరయన పద్ధతిలో లెక్కగట్టిన చంద్ర (చంద్రగ్రహం ఉన్న రాశి) రాశికి సంబందించినది. నక్కకి-నాగలోకానికీ ఉన్న తేడా. రెండు వేరు వేరు పద్ధతులు. ఒక పద్ధతిలో వేసిన లెక్కలు మరో పద్ధతికి సంబందించిన లెక్కలతో సరితూగుతాయా?

చిత్రమైన పోకడలు

మాటల్లో, ఒక పురోహితుడు హాస్యాస్పదమైన విషయం ఒకటి చెప్పారు. హోమం చేయిస్తుంటే – పొగ వచ్చి ఇల్లంతా కమ్మేలా చేయాలని యజమానులు అడుగుతుంటారట. అందుకని గ్రహ శాంతులు గట్రా చేసిన తరువాత చేసే హోమాలలో కావాలని పొగ వచ్చేట్టు అగ్నిహోత్రాన్ని నియంత్రించాల్సి వస్తుందట. క్షీణించిన హవ్యవాహనుడు! ఎక్కడినుండి పుట్టుకొచ్చిన ఆచారం ఇది? చెప్పినా వినిపించుకోరు. ఎంత ఖర్చు పెడితే మాత్రం ఏం లాభం?

పెళ్ళి ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 3:04. జీలకర్ర బెల్లం పెట్టేదేమో 4:10. లగ్నం మారిపోయి ఉంటే? ‘ఇదీ సుముహూర్తం’ అని నిర్ణయించబడిన తరువాత, పెళ్ళి వంటి ముఖ్యమైన తంతులలోసైతం జాప్యం చేయడం సబబేనా? దుష్ఫలితాలు కలిగితే, ఎవరిది తప్పు?

అయితే ఏం చేయాలి?

కనీస అవగాహన ఉండాలి. ఇక అవగాహన ఉండాలి కదా అని విపరీతంగా సమయాన్ని వ్యత్యించి, జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించమని కాదు. కనీసంలో కనీసం – తిథులు, మాసాలు, ఆయనాలు, సంవత్సర నామాలు తెలిసుండాలి. బ్రహ్మ విద్యేమీ కాదు. జాతకరిత్యా – చెయ్యమనో లేక చేయవద్దనో ఎవరన్నా చెప్పినపుడు, ‘ఎందుకు’ అని తెలుసుకోవాలన్న తపన ఉండాలి. ఒక తంతు జరుగబోయే ముందు, దాని వివరాలు కనుక్కోవాలి.

మూఢ విశ్వాసం తగదు. ముఖ్యంగా అత్యాశలకు పోయి మొదటికే మోసం తెచ్చుకోకూడదు. ఫలించనపుడు కలిగే బాధ కన్నా, మోసపోయినపుడు కలిగే బాధ ఎన్నో రెట్లు అధికం. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు.

మార్కెట్లో నకిలీ వస్తువు ఉన్నదంటే, దాని అసలు కూడా ఎక్కడో అక్కడ ఉన్నట్లే కదా? అసలు నకిలీల తేడా తెలుసుకోగలిగి – అటువంటి అసలు సిసలైన పండితుడు దొరకాలంటే రాసుండాలి. దొరికితే, గౌరవాన్నిచ్చి పద్ధతిగా ఉండాలి.

ఒక చిన్న నీతి కథ

చివరిగా ఒక చిన్న అక్బర్ బీర్బల్ కథ. నిజం కాదు – కేవలం నీతి బోధ కథ.

ఒకప్పుడు అక్బర్ చక్రవర్తికి తన జాతకం చెప్పించుకోవాలన్న కోరిక పుట్టింది. ఆస్థాన పండితులను పిలిచి, జాతకం చూడమని ఆఙ్ఞాపించాడు. మరునాడు బీర్బల్ అలా వెళుతుంటే, వణికిపోతున్న పండితులు కనిపించారు. వారి దుఃస్థితికి కారణమేమిటని అడిగితే, “మా తలలు తెగుతాయేమోనని భయంగా ఉన్నదని” వారు చెప్పారు. “ఏమి జరిగిందని” బీర్బల్ అడిగితే వారు కారణం చెప్పారు. “అక్బర్ చక్రవర్తి గారి జాతకం చూశాము. అందులో, తన వారందరి మరణం చూడాల్సి వస్తుందని కనిపిస్తోందని” చెప్పారు. “ఓస్ అంతేనా! ఏం భయం లేదు – నేను చూసుకుంటానులే” అని అభయమిచ్చాడు. సభతీర్చి పండితులను ప్రవేశ పెట్టినపుడు, బీర్బల్ అందుకున్నాడు. “జహాఁపనా! ఏమి జాతకం! ఏమి జాతకం! తమరి జాతక చక్రం చూసి ఈ పండితులు చెప్పినది విన్నాక నాకే ఇంత సంతోషంగా ఉన్నదంటే, మీరెంత సంతోషిస్తారో” అని ఊరించాడు. వెలిగిపోతున్న ముఖంతో అక్బర్ “ఏమి తెలిసిందని” అడిగాడు. “జహాఁపనా! మీవారందరికంటే తమరి ఆయుష్షే పెద్దదట. అందరికంటే ఎక్కువ కాలం జీవించి ఉంటారని తెలిసింది” అని చెప్పాడు. సంతోషంగా ఆ పండితులందరిని సత్కరించి పంపించాడు. సేం మాటర్‌! డిఫరెంట్ ప్రెసెంటేషనన్న మాట.

నిన్న ఆవేశంగా రాసిన టపాకి – ఇది కవరింగ్ టపా. ఇప్పుడు కొద్దిగా బెటరనిపిస్తోంది. అసలు ప్రశ్న వచ్చి ‘జ్యోతిష్యం’ శాస్త్రమా కాదా? వివరణాత్మకంగా, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, కాస్తంత సమయం పడుతుంది. నాకు తెలిసిన విషయాలతో పాటు, మరికొన్ని విషయాలు సేకరించి, ఒక టపా రాయగలను.

ప్రకటనలు
 1. astrojoyd
  11:50 ఉద. వద్ద మార్చి 12, 2012

  wether u r aware r not “raajapoojya-avamaanamulu” should b applied only at the time of birth only,not for every year.99 out of 100 astrologers doesnt know this (Unsubstantiated claim – believe at your own risk).saastra will always says correctly but the final result depends on the astrologer who analyses ur chart wth a systemic aproch[as gvn in our jyothir sastram].u can easily decide wether the chart gvn by the client is correct r not wth a single glance.several astrologers r not following this simple technique.if the chart shows good longivity only,he must proceed for analysis,otherwise he should nt accept that client nd reject in a decent maner.if the chart is right means we have to chk for lagna next.wether its correct r not should b decided by astrologer..finally wat u said nd observed was 100% correct,i..e..మార్కెట్లో నకిలీ వస్తువు ఉన్నదంటే, దాని అసలు కూడా ఎక్కడో అక్కడ ఉన్నట్లే కదా? అసలు నకిలీల తేడా తెలుసుకోగలిగి – అటువంటి అసలు సిసలైన పండితుడు దొరకాలంటే రాసుండాలి. దొరికితే, గౌరవాన్నిచ్చి పద్ధతిగా ఉండాలి.

  -జాతకం చెప్పించుకోవాలి అనుకునే వారి సైకాలజీ ఎలావుంటు౦దంటే “వొక రూపాయికి ఇంటిల్లిపాది వారి జాతకాలూ జ్యోతిష్కుడు చెప్పాలి”.అసలు జ్యోతిష్కుని తప్పుదోవ పట్టించేది కూడా వీరే.ఉదాహరణకు నీ సమయం ప్రస్తుతం బాగాలేదండీ అనగానే మరి మా అబ్బాయి/కోడలు/భార్యా జాతకాలు బానే ఉన్నాయన్తిరిగా అంటూ వితండ వాదం మొదలు పెడతాడు.అసలైన పందితులున్నారు కాని అణాకీ అర్ధణాకి ఈ విలువైన విద్యనూ అడ్డమైన వారికి చెప్పలేక, అమ్ముకోలేక మౌనంగా జరిగే ఆటను గమనిస్తున్నారు.

  మరికొన్ని కామెంట్లు మీ పోస్ట్లను బట్టే వేయగలను..

  • 5:00 సా. వద్ద మార్చి 12, 2012

   Without a doubt, I am one of those 99. Could you substantiate the claim with a firm quotation from any authentic text regarding “Varsha Phal?”
   .
   Undoubtedly, the Vedic Astrologers of the times are going through a tough time. Your mention of additional expectation is also correct.

 2. astrojoyd
  11:58 ఉద. వద్ద మార్చి 12, 2012

  sorry to say u r not that much aware of cmbinations in astrology frnd.its not stop at 12 x 12..there r 150 naadee amsaas,27 x 4 star paadaas,16 x 12 x 9 x 108 x 360 degrees..and much much more combinations one should chk nd follow deeply while saadhana of this vidya.u cant imagine wth ur limited brain nd knowledge the combinations in astrology,its a very very difcult task even for great pandits too..

 3. తాడిగడప శ్యామలరావు
  12:46 సా. వద్ద మార్చి 12, 2012

  ప్రశ్న: రాశులు పన్నెండు. జన్మ లగ్నం, జన్మ రాశి వీటిలో ఎదో ఒకటై ఉంటుంది. గ్రహాలను పక్కన పేడితే, ఈ లెక్కన ప్రపంచంలో 12×12=144 రకాల జీవితాలు మాత్రమే ఉండాలి! ఇది నిజమా?

  జవాబు: ఇలా లెక్కకట్టటం దారుణాతిదారుణమైన తప్పు.

  గ్రహాలను పక్కన పేడితే ఇక రాశిచక్రంతో యేమి పని? కేవలం లగ్నం ఆధారంగా జ్యోతిశ్శాస్త్రం పనిచేస్తుందని యెవరు చెప్పారు మీకు?

  లగ్నమూ, నవగ్రహాలూ కలిపి మొత్తం పది. ఇందులో యేదయినా ద్వాదశరాశులలో దేనిలోనయినా ఉండవచ్చుననుకుందాం. (నిజానికి ఇది ఉజ్జాయింపు లెక్క కాబట్టి). అప్పుడు మొత్తం విభిన్న జాతకాల సంఖ్య 12 to the power of 10 అవుతుంది. దీని విలువ 6191,73,64,224 అంటే 6190కోట్లకు పైన అన్నమాట. ఇదేమీ చిన్న సంఖ్యకాదు. ప్రపంచ జనాభా కన్నా యెక్కువే ననుకుంటాను.

  అదీ కాక, కేవలం రాశి చక్రం ఆధారంగా జాతకం చెప్పరు. సాధారంగా నవాంశ చక్రంకూడా పరిగణలోనికి తీసుకుంటారు. నవాంశ చక్రం అంటే గ్రహాలను వాటి నక్షత్రపాదాలతో సూచించటం అన్నమాట. మొత్తం 108 నక్షత్రపాదాలుంటాయి పీఠికమీద. ఈ ప్రకారం మొత్తం 108 to the power of 10 ( 21589249972727,86,69,824) విభిన్న జాతక చక్రాలు సాధ్యం అన్నమాట. ఇదెంత పెద్దసంఖ్యో ప్రత్యేకంగా వివిరించాలా?

  అయితే, రాశి (30 degrees duration) , నవాంశలు (3degree 20min duration) ప్రమాణాల్లోనే కాక మరింత సూక్ష్మప్రమాణాల్లోనూ అనేక చక్ర విభజనల ఆధారంగా ఫలభాగం పనిచేస్తుంది. కాబట్టి పరిమిత జాతక చక్రాలతో అపరిమిత జాతకులకు అమాయకంగా జ్యోతిషం ఫలనిర్ణయం చేస్తోందని భ్రమ పడకండి.

  వీలు వెంబడి మిగతా విషయాలను స్పృశిస్తాను.

  • 3:08 సా. వద్ద మార్చి 12, 2012

   శ్యామలరావు గారు: టాపిక్కేంటి? “జోస్యాలు నిజం కాకపోవటనికి కారణాలు.” అంటే లెక్క కట్టటంలో తప్పుగా interpret చేసి జ్యోతిశ్శాస్త్రాన్ని తప్పుబట్టడుతున్న వైనాలను ఎత్తి చూపటం. 144 కాదు, మీరిచ్చిన సంఖ్యా కాదు – ఇప్పటికీ నా లెక్కలకు ఆ Combination చిక్కటం లేదు, Permutations పక్కన పెడదాం. నేను వేశినది ప్రశ్నా? లేక తప్పును ఎత్తి చూపడమా?

 4. తాడిగడప శ్యామలరావు
  1:24 సా. వద్ద మార్చి 12, 2012

  “తప్పుడు జాతకాలు” జోస్యాలు నిజం కాకపోవటానికి కారణాలలో ఒకటిఅ న్నది 100% నిజం.

  జనన సమయాలను పెద్దవాళ్ళు సరిగా గుర్తించకపోవటం తరచూ జరుగుతుంది. జననసమయానికి ఇంట్లోని పెద్దగడియారం ముళ్ళు సరయైన సమయాన్ని సూచిసున్నాయని నమ్మకం లేదు. ఒక వేళ గడియారం సరిగానే ఉన్నా, కలౌ భూ పతనమ్ స్మృతమ్ అన్నారు కాబట్టి సరిగా జననసమయంలోనే వెంటనే గడియారంలో సమయం చూసి రికార్డు చేస్తున్నారా? అనుమానమే. హాస్పిటల్ జననాల్లో డాక్టరో నర్సో సరిగా సమయాన్ని నమోదు చేసున్నారా? అనుమానమే కదా? రికార్డు చేసిన జననసమయాలు సెకను తప్పులేకుండా ఉంటేనే సరయిన చక్రం వేయవచ్చును. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం, జననసమయాన్ని – వచ్చిన చక్రాన్నీ పరిశీలించి, జననకాలసవరణ చేయటం అనే ప్రక్రియ ఉంది. అలా సరిజేసిన సమయానికి వేసిన చక్రాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఇలా సవరణ చాలమంది మిడిమిడి జోస్యులు చేయలేరు. కాబట్టి చేయరు. జాతక చక్రాన్ని వేయటానికి గ్రహాలూ లగ్నమూ స్ఫుటం చేసుకోవలసి ఉంటుంది. దానికి పంచాంగాలు నిజానికి ఉజ్జాయింపుగానే పనికి వస్తాయి. ఖచ్చితత్వం రావాలంటే కష్టం. పైగా చాలా వరకు పంచాంగాలే తప్పులు. ఎందుకంటె ఇంకా చాలామంది దృగ్గణితం కాక పాతపద్ధతిలో గణిస్తున్నారు. కొందరు గడుసు వాళ్ళు పాతపధ్ధతిలో గ్రహగణనం చేసి, గ్రహణాలు మాత్రం దృగ్గణితంతో చేస్తున్నారు. లేకపోతే స్పర్శమోక్షకాలాలు ప్రత్యక్షఫలితాలకు విరుద్ధంగా ఉండి మాట వస్తుంది కాబట్టి. సరే, శాఖాచంక్రమణం వద్దు. ఇక పోతే కంప్యూటరు మీద ఇచ్చిన సమయానికి చక్రం వేయవచ్చునే కాని, ఇటువంటీ సవరణ చేయటం ఆ సాఫ్ట్-వేర్ ప్రోగ్రాములు చేయలేవు నాకు తెలిసి. ఈ చిక్కులన్నీ కాక సాయనస్థానాలను నిరాయణ స్థానాలుగా మార్చటానికి వాడే ఆయనాంశలవిషయంలోనే అభిప్రాయబేధాలున్నాయి. వాటితో చక్రాలు మొత్తం మారిపోతాయి. ఏ పద్ధతి చక్రాలు సరయినవి అన్నది పెద్ద కొట్లాట. ఇక ఫలభాగం దగ్గరకు వస్తే, వింశోత్తరీ దశలు గుణించటానికి చంద్రుని స్థితి పరమ నిర్ధుష్టంగా ఉండాలి. అలా ఉండటం అనుమానం కాబట్టి తరచుదశాగణనంలో తప్పు వస్తుంది. ఉదాహరణకు శుక్రమహర్దశలో జన్మించిన వారికి ఆ నక్షత్రపు 800 నిముషాల ఆర్క్ కు 20సంవత్సరాల (అంటే 7305 రోజుల) జననకాలశుక్రదశ. చంద్రుని స్థానం ఒక్క నిముషం ఆర్క్ తప్పితే దశాగణితం 9 రోజులు తప్పు వస్తుంది. చంద్రుడు రమారమి గంటకు అరడిగ్రీ కదులుతాడు. కాబట్టి, సమయం ఒక రెందు నిముషాలు తప్పితే దశాగణితంలో తొమ్మిది రోజుల తేడా వస్తున్నది. అదీ చంద్రుడి నక్షత్రమే మారిపోతే యీలోగా జననకాలదశ అన్నదే మారిపోతుంది!

  ఇలా అనేకరకాలుగా జాతక చక్రాలు తప్పుగా ఉంటాయి. అందుకే, సమర్థులయిన జ్యోతిష్కులు స్వయంగా చక్రం తయారుచేసుకొని జాతకుని అనుభవాలతో పోల్చుకున్నాకే ఫలిత నిర్ణయం చేస్తారు.

 5. Jai Gottimukkala
  1:40 సా. వద్ద మార్చి 12, 2012

  ఒకే సమయంలో పక్క పక్కనే పుట్టిన ఇద్దరు మనుషులు జీవితాంతం ఒకే రకంగా ఉంటారా? వారి అనుభవాలన్నీ ఒకటేనా?

  ఎద్దేవా చేయాలని కాదు, ఈ ప్రశ్నలు నాకు న్యాయంగా అనిపించినందుకే అడుగుతున్నాను.

  • 5:07 సా. వద్ద మార్చి 12, 2012

   జై గారు: నా ముందరి టపాలో మీరు వేశిన ప్రశ్న – దీనికి సమాధానం. కింద శ్యామలరావు గారు చక్కగా వివరించారు. మీ ప్రశ్న ఎద్దేవా కాదులెండి. “ఛస్‌! మొత్తం భోగస్‌” అని కొట్టిపారేసేకన్నా, ఏమిటీ-ఎందుకు అని ప్రశ్నించి తెలుసుకోవాలన్న తపన మంచిదే కదా?

 6. తాడిగడప శ్యామలరావు
  2:09 సా. వద్ద మార్చి 12, 2012

  పంచాంగాల ప్రసక్తి తెచ్చారు. సంతోషం. ఒకప్పుడు అన్ని పంచాంగాలలోనూ అన్నిరకాల సమయాలనూ ఘడియలలో చూపేవారు. 24 గంటలకు 60ఘడియలు. ఇవి యెప్పుడూ సూర్యోదయాదిగా లెక్కపెడతారు. ప్రజల సౌకర్యార్థం ప్రస్తుత కాలంలో అన్ని పంచాంగాలలోనూ అన్నిసమయాలనూ గంటలలో చూపుతున్నారు. దృగ్గణితం చేసి పంచాంగం గణిస్తున్న పంచాంగాలు శాస్త్రీయం – అంటే – అన్ని గ్రహస్థానాలను modern cientific calculations కు సరిపోయేలా చూపుతాయి యీ పంచాంగాలు. పాత పద్ధతులలో వారివారి అనువంశిక కరణగ్రంధాలు ఆధారంగా గణనం చేసే పాతపధ్ధతి పంచాంగాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. అవి అంగీకారం కావు. వాటిలో చూపే గ్రహస్థానాలు ఆకాశంలో సరిపడవు. తిధులు గంటలకొద్దీ వ్యత్యాసం వస్తాయి. పండగలు పోలవు. దానితో అన్ని TVల్లో గొప్ప గొప్ప చర్చలు! మరొక విషయం యేమిటంటే పంచాంగం ప్రదేశాన్ని బట్టి మారుతుంది – అన్ని ప్రాంతాలలోనూ సూర్యోదయం ఒకేసారి కాదు గదా. స్థానిక longitude & latitude ని బట్టి పంచాంగంలో మార్పులుంటాయి. విజయనగరం పట్టణానికి గణించబడిన పంచాంగం హైదరాబాదుకు యధాతధంగా వర్తించదు. అయితే హైదరాబాదు పంచాంగం తెచ్చుకోండి. లేదా విజయనగరం పంచాంగంలో సూచించినట్లు దేశాంతరసంస్కారాలు చేసుకోంది. మీ యిష్టం. మరొక చిన్న విషయం. రాహుకాలం తెలుగువాళ్ళకు పట్టింపులేదు. అరవవాళ్ళకు అది ఉంది. అదికూడా సూర్యోదయాదిగా సంస్కరించి వర్తింపజేయాలి. ప్రతి ఆదివారమూ సా.4:30ని. రాహుకాలం కాదు. కాని యెవ్వరూ గమనికగా ఉన్నట్లు తోచదు. ఇలా సవాలక్ష విషయాలు ఉన్నాయి.

  • 3:14 సా. వద్ద మార్చి 12, 2012

   శ్యామలరావు గారు: పైన ప్రస్ఫుటంగా “ఒకే ప్రదేశానికి తయారు చేసిన ఏ రెండు పంచాంగాలలో తిథులు, నక్షత్రాల సమయాలు ఒకేలా ఉండవు” అని రాశాను కదా? ఖర నామ సంవత్సర మాఘ బహుళ అష్టమి మాధ్యాహ్నిక తిథికై ఇటీవలే నేను పడ్డ కష్టం నాకు తెలుసు. నా వద్దనున్న పంచాంగం తిథి శుమారు 2:30 వరకు అని చెబితే, అదే ప్రదేశానికి చెందిన మరొక పంచాంగం 11:35 ప్రాంతాలు అని చెప్పింది. ఏది correct?

   • తాడిగడప శ్యామలరావు
    3:20 సా. వద్ద మార్చి 12, 2012

    నిజానికి ఒకేప్రదేశానికి తయారుచేసిన పంచాంగాలు అన్నీ ఒకేలా ఉండాలి – అవన్నీ దృగ్గణితం చేసి ఉంటే. వేరు వేరు పథ్థతుల పంచాంగాలైతే తేడాలు తప్పని సరిగా ఉంటాయి. ఇది నేను స్పష్టంగానే చెప్పాననుకుంటున్నాను. మీరడిగిన specific case గురించి verify చేసి చెప్పవలసి ఉంటుంది.

    • 3:24 సా. వద్ద మార్చి 12, 2012

     “ఉండాలి” అన్న ఆపేక్ష పక్కన పెట్టండి. “ఉన్నాయి” అని ౠఢీగా చెప్పగలరా?

     • తాడిగడప శ్యామలరావు
      3:33 సా. వద్ద మార్చి 12, 2012

      క్షమించండి. నేను ‘ఒకేలా ఉండాలి’ అన్నది నిర్ణాయక వాక్యం. అలాగే ఉండి తీరాలి సరేనా?
      ఒకే గణనం చేస్తే యెందరు చేస్తే నేమి? ఫలితాంశం అదే కదా? సిధ్ధాంతులు వేరు వేరుగా గణితం చేస్తే ఫలింతం వేరుగా వస్తుంది. .

      • 3:46 సా. వద్ద మార్చి 12, 2012

       పట్టించుకునే నాథుడులేక ఎవరికి తోచినట్లు వారు లెక్కలేసేస్తున్నారు. కొందరు ఒకటి రెండు నిమిషాలను అటు ఇటు చేసి పునః ముద్రణలకు ఒడిగడుతున్నారు. ఇది జరుగుతున్న తప్పు.

 7. తాడిగడప శ్యామలరావు
  2:33 సా. వద్ద మార్చి 12, 2012

  గొట్టిముక్కలవారి ప్రశ్న: ఒకే సమయంలో పక్క పక్కనే పుట్టిన ఇద్దరు మనుషులు జీవితాంతం ఒకే రకంగా ఉంటారా? వారి అనుభవాలన్నీ ఒకటేనా?

  చాలా మంచి ప్రశ్న. కొందరు అపోహపడుతున్నట్లు జాతకచక్రం అనేది మనిషిని నూటికి నూరుపాళ్ళు స్వయంగా శాసించేది యేమీ కాదు. అనేక యితర paramaters కూడా జీవితంపై ప్రభావం కలిగి ఉంటాయి. అందుకే కుటుంబ సభ్యుల జాతకాలతో కలిపి ఆలోచిస్తారు. తలిదండ్రులజాతకాలప్రభావం బిడ్డలజాతకాలపైనా , బిడ్డలజాతకాలప్రభావం తలిదండ్రులజాతకాలపైనా కూడా ఉంటుంది. అలాగే భార్యాభర్తల విషయమూ . ఇదంతా చర్చకు పెడితే చాల గ్రంధమౌతుంది.

  ఒక తమాషా ఉదాహరణ. ఒక సంపన్న మరియు మరొక నిరుపేద శిశువులు యేకకాలంలో యేకప్రదేశంలో జన్మించారనుకుందాం. జాతకం ప్రకారం మంచి విద్య అని ఉంటే, సంపన్న శిశువు Cambridge లో చదివితే నిరుపేదకు ఇక్కడ IITలో చదివే అవకాశం అన్నమాట. అలాగే ౩వ యేట వాహనంప్రమాదం అని ఉంటే, సంపన్నశిశువు తండ్రి కారు ప్రమాదం చేస్తే పిల్లవాడికి గాయాలు. అలాగే పేదవాడు, కొడుకుతోసహా సైకిల్ పైనుంది పడి గాయపడటం. అలాగే జాతకంలో రాజయోగ దశ ఉంటే, సంపన్నుడి కొడుకు యేదో కంపెనీకి MD కావచ్చును. పేదవాని కొడుకు యేదయినా పెద్దపదవిలో స్థిరపడవచ్చును. ఇలాగు అన్వయించుకోండి. Patterns పోలికలు ఉండవచ్చును. వివరాలు పరిస్థితులను బట్టి జరగవచ్చును.

  అయితే కొన్ని ఒకేలా అచ్చుగుద్దినట్లే ఉండవచ్చును. కొన్ని ప్రత్యేకమైన రవి,శనుల స్థితికారణాంగా ఇద్దరకూ గుండెలో రంద్రం ఉందవచ్చును. (కాని దీర్ఘాయుజాతకం కాబట్టి ఒకడు Corporate hospital లోను, ఒకడు ప్రభుత్వాసుపత్రిలోనూ మంచి చికిత్స పొందవచ్చును.)

 8. 2:45 సా. వద్ద మార్చి 12, 2012

  బ్లాగావరణంలో పునః పునః చర్చలు జరిగే టాపిక్కులో జ్యోతిషం ఒకటి. నాకు చర్చలమీద ఆసక్తి నశించి చాలా కాలమైంది. ఎవరికైనా ఉపయోగపడగలదనే అభిప్రాయంతో మాత్రమే నేను ఇదివరకు జ్యోతిషం గురించి రాసిన వ్యాసావళికి మళ్ళీ ఇక్కడ లింకులు ఇస్తున్నాను.
  http://www.eemaata.com/em/issues/200803/1212.html
  http://www.eemaata.com/em/issues/200805/1238.html
  http://www.eemaata.com/em/issues/200807/1294.html
  http://www.eemaata.com/em/issues/200809/1327.html

  • spArrow
   4:35 ఉద. వద్ద మార్చి 13, 2012

   అదేంటి అలా ఆసక్తి లేదంటారు? మొన్ననేకదా “పందులు కూజాలు” అన్న పండిత మాగంటి విరచిత సాంస్కృతీసేవాకుసుమాన్ని ఆస్వాదిస్తూ, ఆఘ్రాణిస్తూ మిత్రవాత్సల్యాన్ని ప్రదర్శిచుకునే సదవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ, తమ అమూల్య అభిప్రాయాలను పంచుకున్నారు? మీలాంటి సంస్కృత పండితులు ఇలా నీరుగారిపోతే ఎలా? సంస్కృతీ ఉద్ధరణ ఎలా జరుగుతుంది?
   తమ వ్యాసావళి జ్యోతిష్యం మీద జరిగే చర్చల్లో దీపావళిలో చిచ్చుబుడ్డీలా ప్రకాశించుగాక.

 9. తాడిగడప శ్యామలరావు
  3:25 సా. వద్ద మార్చి 12, 2012

  నాగమురళిగారూ, మీ “జ్యోతిషమూ – లోపలి సంగతులూ” ౪ భాగాల వ్యాసాన్ని ఒకటి రెండు రోజుల క్రిందట నేను వేరొక బ్లాగులో ప్రస్తావించటం కూడా జరిగింది. మీ రన్నట్లు చర్చలకు అంతూ పొంతూ లేకుండా ఉంది.

  • 3:37 సా. వద్ద మార్చి 12, 2012

   శ్యామలరావు గారు: ఒకసారి మీరే ఆత్మావలోకనం చేసుకోండి “అంతూ పొంతు” ఎందుకు దొరకట్లేదో? నేను రాసిన టపాను మొత్తం తలక్రిందులుగా కనిపించ్చేట్టు మీరు చేసిన వ్యాఖ్యలు వల్ల ఒదిగిన లాభమేమిటి? ఒక్క సారి సరిగా చదివి – వ్యాఖ్యలు చేసుంటే, ఇన్నిన్ని ఉత్తర ప్రత్యుత్తరాల అవసరం ఉండేదా?

   • తాడిగడప శ్యామలరావు
    3:56 సా. వద్ద మార్చి 12, 2012

    మన్నించాలి. “మీరు చేసిన వ్యాఖ్యలు వల్ల ఒదిగిన లాభమేమిటి?” అనిపించుకున్నాక నేను వ్రాయటం భావ్యంకాదు. ఆత్మావలోకనం చేసుకో అన్నారు. నిరుపయోగమైన విషయం యేదీ ప్రస్తావించకపోయినా ఆ మాట యెందుకు పడవలసి వచ్చిందో తెలియదు. మీరు నా వ్యాఖ్యలో అనవసరమైన దానిని నాకు యెత్తిచూపితే చాలా సంతోషిస్తాను. నేను అవసరం అనుకున్న విషయాలు వ్రాసాను కాని మీకు నచ్చుతాయా అని ఆలోచించి వ్రాయలేదు. అది తప్పని నేను అనుకోవటం లేదు.

    విరమించేముందు ఒక చిన్నమాట. మీ టపాను నేను తలక్రిందులుగా కనిపించేటట్లు చేయటమన్న దానికి నాకు మీ భావం బోధపడలేదు. మీ తప్పులు కొన్ని యెత్తిచూపటం జరిగి మీరు నొచ్చుకున్నారేమో తెలియదు. ఇకముందు నా వ్యాఖ్యలు ఇక్కడ అనవసరం అని మీరు యెందుకు అభిప్రాయపడినా, అనవసరప్రసంగాలు మానటం నాకూ హితమే కాబట్టి అలాగే కానివ్వండి.

    స్వస్తి.

    • 4:48 సా. వద్ద మార్చి 12, 2012

     శ్యామలరావు గారు: ఈ టపాలో నేను చూపించినవి జరుగుతున్న తప్పులు! ఏ తప్పుల వల్ల జ్యోతిశ్శాస్త్రం మాటలు పడవలసి వస్తోందో వాటిని ప్రస్తావించాను. జ్యోతిశ్శాస్త్రం ఇదీ అని చెప్పినది కాదు. ఇన్నిన్ని తప్పులు జరుగుతుంటే, వాటిని పట్టించుకోకుండా, కొందరు జ్యోతిశ్శాస్త్రాన్ని ఏకరవు పెట్టాడం నచ్చక రాసిన టపా. మీ వంటి ప్రాఙ్ఞులు ఇటువంటి – ఇతర తప్పులను మరి కొన్ని జత చేస్తారని ఆశించాను. కానీ, నేను ప్రస్తావించిన తప్పులలోని విశేషాల మీద దృష్టి కేంద్రీకరించి, ఈ టపాకు జ్యోటిశ్శాస్త్రవ్యతిరేకతను ఆపాదించిబెట్టడం జరిగింది. ఇది చాలా బాధ కలిగిస్తున్న విషయం. అందునా మీ వంటి పండితులు అలా వ్యాఖ్యానించడంతో మరీ బాధ కలిగింది.

 10. ASTROJOYD
  4:42 సా. వద్ద మార్చి 12, 2012

  at jai gottimukkala-no two horoscopes wii not at all identical in nature,even the twins born in the same birth time.we have to look for finer predictions in such type of cases wth their D-60 CHARTS..

  • 6:42 సా. వద్ద మార్చి 12, 2012

   The person who asked question has clarified by stating that his question is a genuine one. Your reply is at 30,000 feet. Does an answer with jargon like D-60 help the individual derive a satisfactory answer?
   .
   Now I am reposing the question in a more technical way. Could you clarify which aspects of D-60 would be helpful in understanding the differences? Particularly which of the D-60 charts are useful? Feel free to answer using as much jargon as you want.

 11. Jai Gottimukkala
  5:07 సా. వద్ద మార్చి 12, 2012

  @తాడిగడప శ్యామలరావు On (సోమ ) 12 మార్చి, 12 at 14:33:

  మీ దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి సార్!

  మీ వ్యాఖలో నేను అర్ధం చేసుకున్నది నా “భాషలో” రాస్తున్నాను. నా అవగాహన సరి కాకపొతే సవరించగలరని మనవి.

  1. జ్యోతిషం ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని (deterministic approach) కాక ఇలా జరగవచ్చని సూచనాత్మకంగా చెబుతుంది (probabilistic model).
  2. జోస్యాన్ని స్తూలంగా అర్ధం చేసుకోవాలి (broad or macro level interpretation) కానీ సూక్ష్మంగా (micro level) చూడకూడదు.

  • తాడిగడప శ్యామలరావు
   5:42 సా. వద్ద మార్చి 12, 2012

   గొట్టిముక్కలవారు,
   సరిగా అర్థం చేసుకున్నారు. సంతోషం. “జ్యోతిషం యేమి జరగవచ్చునో సూచించగలదు. కచ్చితంగా యేమి జరుగునో బ్రహ్మకు తప్ప యెవరికి తెలుసు” అని ఒక శ్లోకం ఉన్నది.

 12. తాడిగడప శ్యామలరావు
  5:28 సా. వద్ద మార్చి 12, 2012

  జాగ్రత్తగా గమనిస్తే జరుగుతున్న తప్పులన్నీ శాస్త్రదోషాలవల్లకాక, శాస్త్రాన్ని అన్వయించుకోవటంలో జరుగుతున్న తప్పుడు విధానాలవలన అని బోధపడుతుంది. నేను యిచ్చిన వివరణలు ఆ విషయాన్ని నొక్కి చెప్పటానికే. మీ టపాకు జ్యోటిశ్శాస్త్రవ్యతిరేకతను ఆపాదించటం లేదు. మీరు కూడా మానవతప్పిదాలనే యెత్తిచూపారుకదా! అది నాకు మిక్కిలి ఆనందం కలిగించింది. నేను కొంచెం clarify and magnify చేసానంతే.

  నేను యీ విషయకమై యేమయినా చేయగలనా అని ఆలోచిస్తున్నాను.

  కొన్నాళ్ళ నుండి (౧) పంచాంగ గణనం (౨) పంచసిధ్దాంతిక మరియు కొన్ని విషయాలను ధారావాహికగా వ్రాసేందుకు ఒక జ్యోతిషవిషయక బ్లాగు మొదలు పెట్టాలని యోచిస్తున్నాను. చాలా సమస్యలు clarify అవుతాయని నా ఆశ. అయితే ప్రస్తుతం శ్రీమద్భాగవతమాహాత్మ్యం కావ్యరచనలో నిమగ్నుడనై ఉన్నాను. అయినా ఫరవాలేదేమో.

  కొన్ని విషయాలు ప్రణాళికలు గురించి మీతో విడిగా చర్చించాలని భావిస్తున్నాను,

 13. astrojoyd
  8:17 సా. వద్ద మార్చి 12, 2012

  regdng authentic quote for varshphal,pl refer taajakaneelakanteeyamu written by neelothpala bhattu.regdnd d-60 matter,in d-60 chart the individuals educational stautus wil be clearly seen nd its one of the major difference that can b read from it.Even in twins,u can experiment wth d-60 nd u wil finally knows that no two horoscopes wth the same birth time cant show the same predictions in several angles.Hope u r clarified..frnd..

 14. astrojoyd
  8:20 సా. వద్ద మార్చి 12, 2012

  Not only education u can extract tremendrous results from d-60 chart for all 12 bhaavaas.Try first wth ur own chart frnd..

 15. astrojoyd
  9:34 సా. వద్ద మార్చి 12, 2012

  one can guide u r gv a ref frnd.I cant work for u.its the duty of the student to do homework.i cant fill ur blog wth my pages of text from my library.one can strive nd find out from my guidense nd references.Astrology is my research topic from past 2 decades[as iam in electronic media,icant spare time to educate u in the form of comments frnd..sorry] nd i also find out some truths as i advised to u like above.If u r asking the qstn how to DO& proceed D-60 ANALYSIS MEANS,THAT U R NOT MUCH LEARNED STUDENT OF ASTROLOGY.u r posing qstns based on ur experience nd incidents nd thats not the way to know this subject.knowledge will not available freely just by typing ur qstns online.sorry to say but u hav to do ur sincere home-work in it.u said my answer is 30000ft high,one must reach more than that hight to find out the truth[thats the rael work nd intrest].”ANYTHING THATS AVAILABLE TO US WIL NT B A USEFULL ONE”.When u reach medium level in this subject,then u contact me for further guidence nd clarifications in D-60 QSTN frnd.wish u all the best nd good night..

  • 10:14 సా. వద్ద మార్చి 12, 2012

   Expected response…
   .
   పైన జై గారు వేసిన ప్రశ్న – సమంజసమైనది. శ్యామలరావుగారు దానికి సమాధానమూ ఇచ్చారు. మీరేమో D-60 అని వెళ్ళిపోయారు. మీరు ఇంతగా research చేసినవారు కదా, అర్థమయ్యేట్టు సమాధానం ఇచ్చిఉంటే బాగుండేదేమో? పది మందీ చదివే బ్లాగులో కొత్తగా “వర్ష ఫలము / సంవత్సర ఫలితాలు” అంటే ఎవరూ వినని ప్రస్తావన తెచ్చారు. సాధికారికత తెలుపవలిసిన అవసరం లేదంటారా?
   .
   మీడియాలో పనిచేస్తారన్నమాట. సంతోషం. ఇంక నేను ప్రశ్నలేవీ వెయ్యను లెండి.

 16. 2:33 సా. వద్ద సెప్టెంబర్ 6, 2014

  నా పేరున జాతకం ఎలాఉన్నది

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s