జ్యోతిష్యం శాస్త్రమా?

క్రితం టపా రాసిన తరువాత, మరిన్ని విషయాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందనిపించింది. జ్యోతిష్యం గురించి కాదు. అసలు జ్యోతిష్యమంటే – సగటు మనిషి అవగాహన ఏమిటి అని. ఈ టపా రాసే ముందు, కొందరిని రెండు ప్రశ్నలు అడిగాను.

1. Science అంటే ఏమిటీ?
2. జ్యోతిష్యం అంటే ఏమిటి?

ఉన్నట్టుండి ఈ ప్రశ్నలు వేసినపుడు – ఎవరూ ఠక్కున సమాధానం చెప్పలేకపోయారు. మీరూ ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా ‘జ్యోతిష్యం’ అంటే ఏమిటని ప్రశ్నించినపుడు, Science అన్న పదాన్ని వివరించడానికన్నా – కాస్తంత ఎక్కువ సమయం తీసుకున్నారు.

జోస్యాలు / Predictions

నిత్య జీవితంలో, తెలిసీ తెలియకుండానే – మనమందరమూ జోస్యాలు చెబుతుంటాము; ఇతరులు చెప్పిన జోస్యాలు వింటుంటాము కూడా! ఉదాహరణకు, సిటీకి కొత్తగా వచ్చి – అద్దేకొంప వెతుక్కుంటున్న వ్యక్తికి సలహా రూపంలో “ఫలానా కాలనీ మంచిది – అద్దెలు కూడా రీజనబుల్‌గా ఉంటాయి. అంచేత అక్కడ ప్రయత్నించండి” అని సలహా ఇచ్చారనుకుందాం. మీరు సలహా ఇవ్వడానికి సరైన ఆధారాలు ఉండే ఉంటాయి. మీరు ఎప్పుడో ఒకప్పుడు, అక్కడ ఉండి ఉండడం వల్లనో, లేక ఇప్పుడు మీరుంటున్నది అక్కడే కాబట్టో, లేక మీకు తెలిసిన వ్యక్తి ఒకరు అక్కడ నివసిస్తూ చెప్పిన మాటల వల్లో – ఆ లొకాలిటీ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అవసరంలో ఉన్నాడు కనుక, ఆ వ్యక్తికి – మీకు తెలిసినంతమటుకు ఒక సరైన సలహానే ఇచ్చారు. కానీ – మీ సలహా నూటికి నూరుపాళ్ళూ నిజమవుతుందని గ్యారంటీ ఉన్నదా?

సలహా – జోస్యం. ఈ రెండు పదాలతో ఆటలాడుతున్నాననిపిస్తోందా?

స్టాక్ మార్కేట్ కుప్ప కూలిన తరువాత, ఎన్నికల ఫలితాలు వెలువడినపుడు, భూకంపాలు – సునామీలవంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన తరువాత – కారణాలను విశ్లేషించే నైపుణ్యం ఈ కాలం శాస్త్రవేత్తలైన చాలా మందికి ఉంటుంది. ఎటొచ్చీ – ఇటువంటి విశేషాలను జరుగకముందు ఖచ్ఛితంగా ఊహించడమే కష్టం. ఎన్నో prediction models ఉన్నాయి. కానీ, ఏవీ సరిగ్గా అంచనా వెయ్యలేవు. వాతవరణాన్ని అంచనా వేశే శక్తి సామర్థ్యాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయనటం అతిశయోక్తి కాదు – కానీ ఈ models కు కూడా ఒక పరిమితి ఉన్నది.

కానీ, ఇటువంటి Scientific predictions నూటికి నూరు శాతం ఖచ్చితంగా నిజమవ్వకపోయినా, ఒక సగటు వ్యక్తి Science అన్న విషయాన్ని అనుమానించడు. కానీ – జ్యోతిష్యం వంటి వాటిని మాత్రం అనుమానిస్తాడు. ఎందుకని? Science, జ్యోతిష్యం అన్న పదాల అర్థం గురించి నేను వేసిన ప్రశ్నలకు లభించిన సమాధానాలు – కారణాన్ని తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.

Science అంటే ఏమిటి?

టూకీగా ‘ఇది’ అని చెప్పడం కష్టం. నిఘంటువులు వెతికినా, చుట్టుపక్కల వారిని ప్రశ్నించినా – రక రకాల నిర్వచనాలు. కానీ, Science అంటే ఏమిటని నేను ప్రశ్నించినపుడు వచ్చిన సమాధానాలను పరిశీలిస్తే, నాకు దొరికిన అర్థాలు.

 1. పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు, R&D ల వల్ల నిత్యం అభివృద్ధి చెందేది
 2. Repeatability ఉన్నది
 3. కనిపించేది / భౌతికమైనది
 4. మనకు కనీస అవగాహన ఉన్నది. అంటే చిన్నతనంనుండీ పాఠశాలలో మనము తెలుసుకున్నది
 5. Which defines/explains or at least attempts to define/explain every phenomenon rationally
 6. మనం స్వయంగా తెలుసుకునే అవకాశం లేనపుడు, ఏదో ఒక సంస్థచేత ప్రామాణికంగా నిరూపించబడిందన్న నమ్మకం ఉన్నది
 7. పుస్తకాలు, Internet వంటి మాధ్యమాలలో కనీస అవగాహనకు తోడ్పడే విధంగా సమీక్షలు లభించేది
 8. అందరూ, ముఖ్యంగా మేధావులు, నమ్మేది
 9. Conflicting theories లేనిది

ఇలా మరి కొన్ని వివరణలు. మొత్తానికి Science అనేది ఒక ఆధునిక, ప్రామాణిక, హేతుబద్ధమైన విషయం – ఇదీ నేను గ్రహించినది.

జ్యోతిష్యం అంటే?

చిత్ర విచిత్రమైన సమాధానాలు.

 1. చేయ్యి చూసి చెప్పేది
 2. చక్రాలు చూసి చెప్పేది (ఏ చక్రాలు అన్న ప్రశ్నకు ఒక్కరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు)
 3. పంచాంగం చూసి చెప్పేది
 4. Date of birth, Time of birth కావలసినది
 5. గ్రహాల కలయికలవల్ల తెలిసేది
 6. Mathematical
 7. కొందరి జీవనాధారం
 8. నమ్మకం

జోస్యాలను ఎంతశాతం నమ్ముతారన్న ప్రశ్నకు, 0% నుండి 40% వరకు అని సమాధానాలు వచ్చాయి. కానీ, ఒక మంచి సంఘటన జరుగుతుందని చెప్పే జోస్యాన్ని, చెడు జరుగుతుందని చెప్పే జోస్యానికన్నా ఎక్కువగా నమ్ముతారని తెలిసింది. నిజానికి, రెంటినీ నమ్మక పోయినా, మంచి జరుగుతుందని చెప్పినపుడు – ఆశ యొక్క పరిణామమే ఆ కాస్తా నమ్మడమట.

జ్యోతిష్యం శాస్త్రమా / Science?

The Science of the movements of the heavenly bodies and divisions of time dependant thereon, short tract for fixing the days and hours of the Vēdik sacrifices.

ఒక సగటు మనిషి – జోతిషాన్ని శాస్త్రం అని అంగీకరించలేకపోవటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాషాపరంగా – ‘జోస్యం’ అనే పదం చాలా తేలికగా వాడబడుతున్నది. అందువల్ల ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిశ్శాస్త్రం, ఇతరత్రాలు ఐన హస్త సాముద్రికం, చిలక జోస్యం, Numerology, Fortune Telling – అన్నీ ఒకటేనన్న అపోహ ఉన్నది!

హస్త సాముద్రికం గురించి నాకు బొత్తిగా తెలియదు. చిలక జోస్యం – నిజమో కాదో తెలియదు. Tarrot Card reading గురించి కూడా తెలియదు. Mathematics ఆధారంగా వీటికి ఏదన్నా Software program సృష్టించవచ్చా?

Numerlogy కు గణిత సంబంధం ఉన్నా, దాని లెక్కలన్ని Gregorian Date of birth లేదా English Alphabets నో వాడుకుంటాయి. కాబట్టి దీని గురించి కూడా ఏమీ చెప్పలేను.

కానీ Astrology కోసం అన్నన్ని Software programs ఉన్నాయంటే – ఆలోచించండి! ఈ programs లోని astronomy module ను (అంటే, ఏ గ్రహం ఎక్కడ ఉందో తెలిపే logic) పక్కన పెట్టండి. ఈ programs – planetary positions, associations, aspects వంటి అంశాలను Mathematical గా లెక్క గట్టి, ఏదోకొంత స్థాయి వరకు జోస్యాలను చెబుతాయి. ఆ programs లో Artificial Intelligence వంటివేమీ ఉండవు. కేవలం గణితం. గణిత శాస్త్రంలో మూఢ నమ్మకాలు ఉంటాయంటారా?

సరే! ఈ programs నూటికి నూరు శాతం ఖచ్చితమైన జోస్యాలు చెబుతాయా? చెప్పలేవు! క్రితం టపాలో ఎత్తి చూపిన తప్పిదాలే కాకుండా, ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. Input data లో తప్పులు; high precision computation errors, Uranus – Neptune – Pluto వంటి గ్రహాలను పరిగణించడం, వివిధ సిద్ధాంతాల కలగూరగంప logic ఇత్యాదులు.

Science కున్న వనరులు – జ్యోతిషానికి ఉన్నాయా?

Scientific term అయిన ‘Meteorite’ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కోరికను తీర్చుకోవడానికి – ఒక సగటు వ్యక్తికున్న సులభసాధ్యమైన వనరులు, జ్యోతిశ్శాస్త్రంలోని ‘అస్తంగత దోషం’ గురించి తెలుసుకోడానికి ఉన్నాయా?

మంచి నీటితో నడిచే Scooter సృష్టించినట్టు నమ్మబలకాలనుకునే బూటకపు శాస్త్రవేత్త భయపడేట్టు – ఒక మోసకారి అయిన జ్యోతిష్కుడు ఎవరికన్నా భయపడే పరిస్థితులు ఉన్నాయా?

చిన్నతనం నుంచీ అంచలంచెలుగా Science గురించి నేర్పినట్లు, జ్యోతిశ్శాస్త్రం గురించిన అవగాహన, కనీసం తల్లిదండ్రుల వద్దనైనా దొరుకుతుందా?

తెలుసుకోవాలనే జిఙ్ఞాస ఉండి, కాస్తంత అర్థమయ్యేట్టు తేలికగా ఎవరన్నా చెబుతారా అంటే, D-60, ఢాం, ఢూం అని jargon ప్రయోగించే పండితులే అధికంగా ఉన్నారు. అది అందని ద్రాక్ష అయి కూర్చుంటుందే తప్ప, పది మంది అర్థం చేసుకొని, తెలుసుకోవాలనే ఆసక్తికి నోచుకోలేక పోతుంది.

జ్యోతిషం ‘Science కాదు’ అని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఖగోళ శాస్త్రం Science అయితే, జ్యోతిషం కూడా ముమ్మాటికీ ఒక శాస్త్రమే.

ఈ టపా ద్వారా ఎవరినీ నమ్మించే ప్రయత్నం చేయటంలేదు. అటువంటి ప్రయత్నం కూడా వ్యర్థమే అని తెలుసు! కానీ ఇటీవల బ్లాగ్లోకంలో ఏవేవో సిద్ధాంతాలు, గాలిలో వాదనలు చదివి కాస్తంత బాధ కలిగింది. జ్యోతిషం నిజమనేవారి వాదనలు కూడా కొన్ని సంధర్భాలలో కాస్తంత హాస్యాస్పదంగా కనిపించాయి. అదో నమ్మకం మాత్రమే అని కొన్ని వ్యాఖ్యలు / టపాలు చదివినపుడు అనిపించింది. ఏదో – నాకు తెలిసిన ఒకటీ-రెండు విషయాలు పంచుకునే ప్రయత్నమే – ఈ మూడు టపాలు. టపా రాయటం కన్నా, వచ్చే వ్యాఖ్యలతో బుఱ్ఱ హీటెక్కిపోతోంది. ఇక చాలు…

చివరిగా ఒక చిన్న ప్రశ్న. జ్యోతిశ్శాస్త్రంలో ‘జ్యోతిః’ ఉన్నది కదా? జ్యోతి అంటే? ఆలోచించండి!!!

No man is entitled to pronounce an opinion on the merits of any science unless he has devoted much time to its study and investigation…Astrology is holding its head so proudly under the greatest disadvantages and neglect which are extended for its villification and it is high time that sufficient patronage is extended for its revival…
— Dr. B.V.Raman
ప్రకటనలు
 1. 11:20 ఉద. వద్ద మార్చి 20, 2012

  Excellently written post Telugu Bhaavaalu gaaru.

  What BV Raman says is two hundred percent correct.

  Unfortunately, what is of ourselves for that we never give any patronage/importance.

  దూరపు కొండలు నునుపు అంతే చెప్పాలి. !

  ఇక D-60 డాం, డూం గురించి, ఎంత తక్కువ చెబితే అంత మంచిది !!!

  చీర్స్
  జిలేబి.

  • 1:45 సా. వద్ద మార్చి 20, 2012

   జిలేబి గారు – కృతఙ్ఞతలు. అంతకన్నా ఎక్కువగా, నిన్నటి మీ వ్యాఖ్యకు hats-off. ఏదో పొరబాటు జరిగిందని ఊహించ గలిగే మేధస్సు, సంస్కారం అందరికీ ఉండవుగా!!!

 2. Jai Gottimukkala
  12:01 సా. వద్ద మార్చి 20, 2012

  The major obstacle to pronouncing astrology as science does not lie in the accuracy of its forecasts.

  All other known prediction models are based on a theoritical foundation but astrology does not have one. Astrology assumes impact of celestial movements on human life but does not provide a basis for this impact. There can be no science without a cause-effect mechanism.

  Some enthusiasts try to come up with elabarate explanations. These “retrofit” arguments often harm the case for astrology.

  • 2:08 సా. వద్ద మార్చి 20, 2012

   Jai: I beg to differ. Not every ‘so called’ scientific proposition is based on fully established cause and effect mechanism. For example, Cancer is still a hard-to-crack nut. Lymphoma is another example. The effect and symptomatic treatment is the only knowledge available. There are very many things, that rational approach alone cannot decipher.
   .
   By the way, the answer to my concluding question “జ్యోతిశ్శాస్త్రంలో ‘జ్యోతిః’ ఉన్నది కదా? జ్యోతి అంటే? ఆలోచించండి!!!” holds the key to cause-effect phenomenon of Astrology. I might be sounding incomplete, but I am purposefully refraining myself from commenting on such a serious and relevant question. This needs a proper forum and more than that someone authoritative (unlike a “Nobody” like me) to comment. Let me not be another “foolish friend” of the topic!

   • Jai Gottimukkala
    2:46 సా. వద్ద మార్చి 20, 2012

    Well, I guess I will have to wait for an “authoritative” answer.

    I continue to maintain a theoritical foundation is essential to science. This can be rudimentary, partially stablished or even based on a premise proven wrong subsequently. Further empirical evidence can be used to refine (or redefine) the model.

    The theoritical foundation sets the baseline for validation testing. Mere evidence is insufficient if we don’t even know what we are testing.

 3. Jai Gottimukkala
  4:55 సా. వద్ద మార్చి 20, 2012

  “No man is entitled to pronounce an opinion on the merits of any science”

  With due respect to BV Raman, this is applicable to art but not science. I may not criticize classical music unless I am aware of its nuances. But it does not need a scientist to criticize Ramar Pillai’s “science” (sorry if the analogy is offensive).

 4. తాడిగడప శ్యామలరావు
  5:08 సా. వద్ద మార్చి 20, 2012

  జ్యోతిషం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే చర్విత చర్వణంగా నా అభిప్రాయాలు వివరించాను. నేను యీ చర్చలో కొత్తగా చెప్పవలసినది యేమీ కనబడటంలేదు.

  జ్యోతిశ్శాస్త్రంలోని జ్యోతి/జ్యోతుల గురించిన ప్రశ్నబాగుంది. నా సమాధానం కొంచెం ఆగి చెబుదామని అనుకుంటున్నాను.

 5. Sri
  2:03 ఉద. వద్ద మార్చి 21, 2012

  Thanks for writing this blog. After reading the comments on this topic over the last 3 blogs, I am reminded of two very famous quotes from Albert Einstein :-

  “Few people are capable of expressing with equanimity opinions which differ from the prejudices of their social environment. Most people are even incapable of forming such opinions.”

  “Information is not knowledge.”

  Hope you are efforts are fruitful in detesting or cautioning impressionable minds not to be carried away by so called rationalists and so called astrologists and their ilk who have half (or even less than that) knowledge.

  My belief is this is a lost science. If it has existed or atleast one is aware that something like this exists over thousands of years of history then you cannot really write it off. At the same time I do not encourage people going to so called famous astrologists and their ilk who have half (or even less than that) knowledge as I personally know someone who has spent lakhs of rupees and further ruined himself.

 6. 10:27 సా. వద్ద సెప్టెంబర్ 23, 2012

  Nice but very difficult to understand astrology.But i believe because so many proofs i saw.I read Walden welch astrologer biography. He is international famous astrologer.proof means his biography.i am also interested in astrology.just basics only i know.Any way people believe or not we dont want Law of karma will decide the things.Thanks.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s