ముంగిలి > పిచ్చాపాటి > నిర్వచనం | సుఖం – దుఃఖం

నిర్వచనం | సుఖం – దుఃఖం

‘నాకు నచ్చినది చేయడం’ – సుఖం. ‘నాకు నచ్చినవి చేయకపోవడం’ ఇంకా ‘నాకు నచ్చనివి అనుభవించడం’ దుఃఖం. ఈ రెంటి నడుమనుండేది ‘నాకు నచ్చనివాటికి దూరంగా ఉండడం’ – ఇది యథాస్థితి లేదా Status quo. తికమకగా తోస్తోందా? సరే కాస్తంత తేలికగా అర్థమవ్వాలంటే…

నచ్చింది + అనుభవిస్తాను = సుఖం
నచ్చలేదు + అనుభవిస్తాను = దుఃఖం
నచ్చింది + అనుభవించను = దుఃఖం
నచ్చలేదు + అనుభవించను = యథాస్థితి

ఇంచుమించుగా ఒకో సంభావ్యతకు 25 మార్కులు తగిలిస్తే, మన జీవితాలలో ఒక పాతిక వంతు మాత్రమే సుఖాన్ని అనుభవించే అవకాశం కనిపిస్తోంది. మరో పాతిక వంతు యథాస్థితి అంటే, సుఖం కానీ దుఃఖం కానీ లేని స్థితి. మిగతా యాభై శాతం దుఃఖం.

సుఖదుఃఖాలు

సుఖదుఃఖాలు

గాలిలో వేసినా, ఇంచుమించుగా – లెక్క నిజ జీవితపు అనుభవంతో సరితూగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సంధర్భంలో ‘సుఖము’ ‘దుఃఖము’ అనే పదాలకు వివిదార్థాలున్నాయి – అవేమిటో వివరించాల్సిన పనిలేదనుకుంటాను.

ఇప్పుడొక మిల్లియన్ డాలర్ క్వష్చన్‌! ఈ సమీకరణాన్ని లేదా లెక్కలను మనకు అనువుగా మార్చుకోవచ్చా? అంటే – దుఃఖం పాళ్ళు తగ్గించి, సుఖాన్ని పెంచుకోవడం అని నా ఉద్దేశ్యం.

నేను మనోవైఙ్ఞానికుడినో లేక సామాజిక శాస్త్రవేత్తనో కాదు. బుఱ్ఱలో వచ్చిన ఆలోచనకు అక్షరరూపమిచ్చి టపాలో పొందుపరిచాను. ఇదే అంశంపై సమాధానాలేవన్నా తడితే, మరో టపా. తట్టలేదా, ఈ టాపిక్కుకు ఇదే నా ‘టా-టా బై-బై’…

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 10:09 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2012

  బాధే సౌఖ్యమనే భావనరానీవోయ్……

 2. 11:40 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2012

  తెలుగు భావాలు నిండిన హృదయాలకు వందనములు.
  ముందుగా
  ఉన్నతమైన అంశం ఎంపిక చేసి post చేసినందులకు కృతజ్ఞతలు.

  అయిదు వేల యేండ్ల క్రితం శ్రీ కృష్ణుడు చెప్పినా
  రెండున్నర ఏండ్ల క్రింద బుద్ధుడు “కోరికలే దు:ఖానికి మూలం” అని బోధించిన
  పదేళ్ళ క్రితం మా 9th class teacher “మానవుడు సుఖ జీవనం కోసం చేసిన ప్రయత్నమే చరిత్ర” అని history కి definition చెప్పిన
  ఇవాళ నిన్న అనునిత్యం అందరికి అనుభవం లో ఉన్న,
  ఎప్పుడు మానవజాతిని వెన్నంటి ఉండేది
  ఈ సుఖం దుఖం అనేది.

  టాటా బై బై కి చెప్పేది కాదు కూలoకషం గా ఒక నిర్ధారణకు రావలసిన అంశం అని నా మనవి.
  త్రిపురా రాహస్యం జ్ఞాన ఖండం హేమలేఖో పాఖ్యానం లో
  ఇదే అంశం పై
  ఒక ప్రహసనమే సాగింది.
  మీకు వివరాలు సాయంత్రం post చేస్తాను

  మీదైన నిత్య జీవితానుభవం లో ఎదురైనా వాటి సారాంశం గా ఒక అభిప్రాయాన్ని స్థిరపరచ గలరు.

  త్రిపురా రహస్యం లేవనెత్తిన అమశాలు:
  ఏది సుఖం?
  ఏది దుఖం ?
  నిన్న సుఖం గా అనిపించినది, ఇవాళ దుఖం గా ఎందుకు పరిణమించినది?
  నిన్న దుఃఖ మనిపించినది నేడు సుఖ కారణ మేలా అయినది?

  ఏది నిత్య సుఖం?
  సమయాభావం వాళ్ళ పూర్తి గా comment చేయలేకున్నాను
  సాయంత్రం మరో comment లో నా అభిప్రాయాన్ని వెల్లడి చేసెదను
  సాయిరాం !!

  http://sadhakudu.blogspot.in

  • 8:30 సా. వద్ద ఏప్రిల్ 21, 2012

   చాలా కాలమయింది మీరు కామెంటు పెట్టి!

   మీకు టపా నచ్చినందుకు చాలా సంతోషం. కానీ మీ వ్యాఖ్యలో, నా ప్రశ్నకు సమాధానం దొరకడం అంత తేలిక కాదనే హెచ్చరిక కనిపిస్తోంది. నిజమే! నాకు తోచిన ప్రయత్నం చేస్తాను.

   • 10:40 సా. వద్ద ఏప్రిల్ 21, 2012

    నమస్తే సర్,
    ఈమధ్యన కాస్త మునపటి తరహా blogging తగ్గించాను లేండి!
    అందుకే కనిపించలేదు కామెంట్ రూపంలోకూడా!

    సరే !! నా ఈ తెలుగు భావానికి వస్తే ,
    1. కోరికలే దు:ఖానికి మూల కారణం – భగవాన్ బుద్ధ
    2. సుఖేచ్చ : నేను బాగుండాలి సత్వగు ణం కారణం – పతంజలి మహర్షి
    3. జన్మ దుఖం జరా దుఖం జాయా దుఖం పునః పునః సంసార సాగరం దుఖం – అది శంకర
    4. శాంతము లేక సౌఖ్యము లేదు – త్యాగ బ్రహ్మ
    5. తన సంతోషమే స్వర్గము, తన దుఖమే నరకము – సుమతి శతక కర్త
    6. సుఖం (సౌకర్యం) శరీరానికి, సంతోషం మనసుకి, ఆనందం ఆత్మకి – అంతర్యామి (ఈనాడు)
    7. బాధే సౌఖమనే భావన రానీవోయ్ – దేవదాసు
    8. సుఖము దుఃఖము అనేవి మనో వికారాలు – వేదాంతం
    ఇవి ఒక cycle లా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయని ఒక వర్గం వారంటే,
    లేదు అసలు సృష్టిలో దుఖమే తప్ప సుఖం లేనే లేదు,
    ఒక దుఃఖానికి మరో దుఃఖానికి మధ్య గ్యాప్ నే మనం సుఖం అని పిలుస్తున్నాం అని మరో వర్గం.

    ఐ will be in touch with this post please give some more time to express my views on it.

    ?!

 3. 7:19 సా. వద్ద ఏప్రిల్ 21, 2012

  మీ pie chart representation చూసాక, సుఖం ఎలాగు 25% కాబట్టి, దుఖం 50% , యథాస్థితి 25% చూసాక, సుఖం వద్దు, దుఖం అంత కంటే వద్దు, యథాస్థితి 100% పాళ్ళు ఎలా పెంచుకోవాలా అని అలోచనలో పడ్డానండి. బాగుంది పోస్ట్.

  • 8:31 సా. వద్ద ఏప్రిల్ 21, 2012

   మరీ complicate చేయకూడదని వివరంగా రాయలేదు కానీ Status quo కూడా ఒక్కోసారి depression కు గురి చేస్తుందని నా భావన.

 4. 9:02 సా. వద్ద మే 4, 2012

  Very recently I got one more definition

  మన వాసనలకు అనుగుణం గా నడిస్తే ఏదైనా అది సుఖం గా అనిపిస్తుంది,
  మన వాసన లకు విరుద్ధం గా జరిగితే అది దుఖం లా తోస్తోంది అట !
  రెండు జీవ భావాలే అని conclude చేసేప్పటికి call disconnected సర్,

  🙂

  ?!

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s