ముంగిలి > పిచ్చాపాటి > సుఖదుఃఖాల కీలకం ఏది?

సుఖదుఃఖాల కీలకం ఏది?

క్రితం టపా (నిర్వచనం | సుఖం – దుఃఖం) రాసిన తరువాత, ఆలోచనలు కాస్తంత ముందుకు కదిలాయి. నా ప్రశ్న వచ్చి ‘దుఃఖం పాళ్ళు తగ్గించి, సుఖాన్ని పెంచుకోవచ్చా?’ ఆ ప్రశ్నకొక ఆకారాన్నిస్తే, ఇలా ఉంటుంది.

దుఃఖం పాళ్ళు తగ్గించి, సుఖాన్ని పెంచుకోవచ్చా?

దుఃఖం పాళ్ళు తగ్గించి, సుఖాన్ని పెంచుకోవచ్చా?

దుఃఖాని తగ్గించడానికి సుఖాన్ని పెంచుకోవడమే కాదు, Status quo ను కూడా పెంచుకోవచ్చును కదా? అంటే…

దుఃఖాన్ని తగ్గించుకోవడం

దుఃఖాన్ని తగ్గించుకోవడం

కాబట్టి దుఃఖాన్ని తగ్గించుకుంటే, అది సుఖానికి మాత్రమే దారి తీయక, యథాస్థితిగానైనా రూపాంతరం చెందవచ్చు. మార్గాన్వేషణ సుగమం చేసుకోడానికి – కేవలం దుఃఖాన్ని తగ్గించే వైపే ఆలోచిస్తాను. యథాస్థితి మరియూ సుఖాలు – రెంటినీ దుఃఖానికి వ్యతిరేకమైన స్థితులకింద పరిగణించి ఆలోచిస్తే తేలికగా ఉంటుందేమో! నిజానికి రెండూ వేర్వేరు.

సుఖం, దుఃఖం, యథాస్థితి – సమీకరణంయొక్క ఫలితాలు. వాటి జోలికి వెళ్ళనవసరం లేదు. అనుభవం/అనుభవించకపోవడం ఇంకా నచ్చినది/నచ్చనిదీ అనే చరాంశాల సంయోగమే ఈ ఫలితాలు. అంచేత ఈ రెండు చరాంశాలను పరిశీలించాలి.

ప్రయత్నం – అనుభవం

సమీకరణంలోని ఈ భాగంయొక్క అర్థం ఏమిటి? మన నిత్య జీవితపు ప్రయత్నాల పరియవసానమా? డబ్బు ఆర్జించడానికి ఉద్యోగం చేయడం, ఒక సినిమాకి వెళ్ళడం, వ్యాయామాలు చేయడం, చదువుకోవడం వంటివి. కొన్ని ‘పెట్టుబడి’ రూపంలో కాస్తంత సమయంతరువాత ఫలితాలకు దారి తీస్తే, కొన్ని తక్షణ ఫలితాలనిచ్చేవి.

ప్రస్తావించిన ఉదాహరణలను పరిశీలిస్తే, విత్తాన్ని ఆర్జించే ప్రయత్నం ఎందుకు చేస్తాము? ఆ డబ్బును ఖర్చు పెట్టి మనకు చేతకానివి మరొకరితో చేయించుకోడానికి (buy). ఉదాహరణకు ఒక Air Conditioner కొన్నామనుకోండి. అది కొన్నాముగానీ, దానిని సరిగ్గా అమర్చడం మనకు రాదు – అంచేత ఒక technician సేవలు పొందడానికి డబ్బును వాడుకుంటాము (buy the service). అసలు మనకు తయారు చేయడం రాక మరొకరు తయారు చేసిన దానిని కొన్నదెందుకు (buy the product)? దాని నుంచి వీచే చల్లగాలిని అనుభవిస్తూ హాయిగా నిద్రపోడానికి (experience comfort).

ఒక సినిమాకు వెళతాము. ఎందుకు? సినిమాకు వెళ్ళడమనేది మన ప్రయత్నం. ఆ సినిమా ఎలా ఉన్నదని మన మనసు భావిస్తే, బయటకు వచ్చేసరికి మన ప్రయత్నంయొక్క ఫలితం అలా ఉంటుంది.

వ్యాయామం ఎందుకు చేస్తాము? ఇది ‘పెట్టుబడి’ తరహా ఉదాహరణ. ఇప్పటి మన ప్రయత్నం, రాబోయే కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని. చదువుకోవడం దేనికి? ఇది కూడా ‘పెట్టుబడి’కి సంబందించిన ఉదాహరణ.

తెలివి తేటలు, బద్ధకం, పరిఙ్ఞానం, మూర్ఖత్వం, దూర దృష్టి, మునుపటి అనుభవాలవంటివి – ఈ ప్రయత్నాలపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రయత్నాల పరియవసానమైన అనుభవం – నచ్చిన/నచ్చనివాటితో కలిసినపుడు సుఖదుఃఖాలు కలుగుతాయి. నా దృష్టిలో ఈ అంశం మనిషి మనిషికీ వేరుగా ఉంటుంది. ‘ప్రయత్నం’ అనేది సమిధతో పోల్చదగ్గది. బాగా ఎండి ఉన్నదా, లేక పచ్చిగా ఉన్నదా? అంటే, ప్రయత్నం మనఃపూర్తిగా చేశామా లేక ప్రయత్నలోపమున్నదా?

ప్రయత్నాల పరియవసానమైన అనుభవం –  కీలకాంశమా? ‘కర్మణ్యేవాఽధికారస్తే మా ఫలేషు కదాచన…’ అని గితాచర్యుడు ఎప్పుడో మార్గదర్శకత్వం చేశాడు. ఫలితాల గురించి ఆలోచించక, కర్మలు అంటే ప్రయత్నాలు చేయమని కదా దాని అర్థం?!? జయాపజయాలు దైవాధీనాలు అని కూడా అంటుంటారు. కాబట్టి, అగ్నిహోత్రం ప్రజ్వలితం కావాలంటే, సమిధలు వేయవలసినదే. సమిధ లేనిదే అగ్ని పుట్టదు. ఇది కనీస అవసరం – minimum requirement. కానీ పైన చెప్పినట్టు, ఆ సమిధలు బాగా ఎండినవా లేక పచ్చిగా ఉన్నాయా? అగ్ని రాజుకున్నతరువాత జాగ్రత్తగా వేస్తున్నామా లేక ఏమీ పట్టనట్టు వేసేస్తూ వెళ్ళిపోతున్నామా? అగ్ని ప్రజ్వరిల్లడానికి ఆర్జ్యం వాడుతున్నామా లేదా? ఇవి కూడా గమనించదగ్గ విషయాలే!

కాబట్టి ప్రయత్నాలనేవి అధారం మాత్రమే. కీలకాంశం కాదు.

నచ్చడం నచ్చకపోవడం

సమీకరణానికి ఏడమవైపున్న మొదటి అంశం – కీలకం కాదు. కాబట్టి రెండవదైన ‘నచ్చడం/నచ్చకపోవడం’ కీలకాంశమా? ఉదాహరణకు ‘కాకరకాయ కూర తినడం’ అనే అనుభవాన్ని పరిశీలిద్దాము. తినడం అనేది ‘ప్రయత్నం’. కాకరకాయ అంటే ఇష్టం లేదు – ఫలితం దుఃఖం. కాకరకాయ అంటే ఇష్టం – ఫలితం తృప్తి లేదా సుఖం. So, ‘కాకరకాయ కూర తినడం’ అనే ఒకే ప్రయత్న పరియవసానం – సుఖంగానో దుఃఖంగానో తోచడానికి కారణం – కాకరకాయ నచ్చడం/నచ్చకపోవడం అనే అంశం – నిర్ణయిస్తుంది.

ఒకడు ఇష్టపడి కష్టపడి – ఎంతో ఆసక్తిగా Chemical Engineering చదివాడనుకోండి; కానీ ఉద్యోగమేమో Procurement Department లో చేస్తున్నాడనుకోండి – ఎంత జీతం సంపాదిస్తున్నా, తను కష్టపడి చదివినదానికి పరియవసానంగా సంతోషాన్ని పొందుతాడా? Procurement function నచ్చితే సంతోషం, నచ్చకపోతే no job satisfaction!

ఏ రకంగా ఆలోచించినా, ‘నచ్చడం / నచ్చకపోవడం’ అనేదే కీలకాంశంగా కనిపిస్తోంది. ప్రయత్నాల పరియవసానమైన అనుభవాన్ని సమిధతో పోలిస్తే, అగ్నిహోత్రాన్ని నియంత్రించగల ఆజ్యం – ఈ అంశం. సుఖదుఃఖాలకు కీలకాంశం దొరికినట్టే తోచినా, వెంటనే ఈ ప్రశ్న మరింత జటిలమైనట్టు కనిపిస్తోంది. అసలు నచ్చడం, నచ్చకపోవడం అంటే ఏమిటి? ఏ విషయమైనా ఎందుకు నచ్చుతుంది? కొన్ని కొన్ని ఎందుకు నచ్చవు?

మరో టపాలో ‘ప్రయత్నించే’ ప్రయత్నం చేయాల్సిందే!

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 10:37 సా. వద్ద ఏప్రిల్ 22, 2012

  Hello Sir,

  Yesterday I mentioned this Subject on our Online Satsang

  I got the response (essence) as follows

  1. కోరికలే దు:ఖానికి మూల కారణం – భగవాన్ బుద్ధ
  2. సుఖేచ్చ : నేను బాగుండాలి సత్వగు ణం కారణం – పతంజలి మహర్షి
  3. జన్మ దుఖం జరా దుఖం జాయా దుఖం పునః పునః సంసార సాగరం దుఖం – అది శంకర
  4. శాంతము లేక సౌఖ్యము లేదు – త్యాగ బ్రహ్మ
  5. తన సంతోషమే స్వర్గము, తన దుఖమే నరకము – సుమతి శతక కర్త
  6. సుఖం (సౌకర్యం) శరీరానికి, సంతోషం మనసుకి, ఆనందం ఆత్మకి – అంతర్యామి (ఈనాడు)
  7. బాధే సౌఖమనే భావన రానీవోయ్ – దేవదాసు
  8. సుఖము దుఃఖము అనేవి మనో వికారాలు – వేదాంతం
  ఇవి ఒక cycle లా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయని ఒక వర్గం వారంటే,
  లేదు అసలు సృష్టిలో దుఖమే తప్ప సుఖం లేనే లేదు,
  ఒక దుఃఖానికి మరో దుఃఖానికి మధ్య గ్యాప్ నే మనం సుఖం అని పిలుస్తున్నాం అని మరో వర్గం.
  10:36 PM

  స్వామి ఇంతకు సుఖం అంటే ఏమిటి ? దుఖం అంటే ఏమిటి ?

  నివారనోపాయం ఏమిటి ?

  ఇది ఎవరికీ ?
  10:37 PM
  Vidya: దుఖం అంటే సమత్వం లో నించి చంచలత్వం వల్ల, ఆసక్త మైన విషయం ఆవేశించి ప్రత్యేకత ఆపాదించ బడి అసంతృప్త అహంకారం సంతృప్తి చెందే స్థితి
  10:38 PM
  me: ఇంత process ఉన్నాదా?

  Vidya: దుఃఖము యొక్క లేమి ని సుఖమని, సమము అని పిలుస్తున్నాం

  me: oh

  Vidya: ఇది గుణ ప్రేరణ లో ఏర్పడుతున్న సమ స్థితి
  10:39 PM
  అల కి అల కి మధ్య సముద్రం కదులుతుంద లేదా

  అసలు కదలిక కు మూలం చూస్తేనే అది నివారణ అవుతుంది

  me: 🙂

  అవును స్వామి

  Vidya: మూల కారణంస మందు కదలికలు లేవని తెలిస్తే అదే నీవు
  10:40 PM
  కదిలే కదలికలే నీవు అయితే జీవుడు

  కదలికలను భిన్నత్వం గా చూస్తూ విభిన్న అన్వయం చేస్తే అహంకారం

  అహం యొక్క సంతృప్తి కి పాటు పడటం కర్మ
  10:41 PM
  కర్మ కోసం ఇంద్రియాలు

  ఇంద్రియాల వల్ల అనుభవము

  అనుభవము నించి జ్ఞాపకం

  జ్ఞాపకం మళ్ళా కదలిస్తుంది

  ఇది చక్రం అంటే
  10:42 PM
  me: 🙂

  sadhakudu@googlegroups.com
  Sairam

 2. 8:13 సా. వద్ద ఏప్రిల్ 23, 2012

  తనది కాని దాని తనది అని భావించుట వలన ‘దుఃఖము’ కలుగును.
  సంస్కృతి లోనో భక్తి లోనో
  సుందర చైతన్యానందుల వారో లేక శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వాముల వారో ఎవరో చెప్పారు మొత్తానికి
  ఎక్కడో గీత ఉపన్యాసాలలో విని మా ఇంట్లో గోడపై అంటించి ఉన్న ” గీతసారాంశం ” చార్టు పై రాసాను
  ఇప్పుడు తళుక్కున స్ఫురించినది…!!

  kindly add some more relative data which you known

  Its a life time question I think,

  any time we can come to a perfect clarification

  at that time this info will be useful for reference purpose

  thanks

  ?!

 3. 12:04 ఉద. వద్ద ఏప్రిల్ 24, 2012

  conscious mind-decides what we like and dislike.I think…

  We also set destinations in our mind when we have “expectations” and with lot of hard work and sometimes by will power we always work towards acheiving those expectations. Wating for your next post.

  • 1:34 సా. వద్ద ఏప్రిల్ 24, 2012

   Perhaps…

   ఇది చాలా జటిలమైన ప్రశ్న. ‘అ’, ‘ఆ’, ‘ఇ’ కారణాలు అని తేల్చిచెప్పలేను. ఏదో నాకొస్తున్న ఆలోచనలను అక్షర రూపంలో నిక్షిప్తం చేసుకుంటున్నాను… Thank you…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s