ముంగిలి > పిచ్చాపాటి > తప్పు ఒప్పుకోవడం

తప్పు ఒప్పుకోవడం

ఆ రోజంతా వాన పడి, ఆఫీసులనుండి ఇళ్ళకు బయలుదేరే సమయానికి వెలిసింది. నేను ప్రయాణించే రోడ్లన్నీ బాగానే ఉంటాయి కానీ, ఒక చోట మాత్రం గతుకులూ – గుంతలూ. అక్కడికి చేరుకోగానే, కారు గతిని తగ్గించి మెల్లిగా ముందుకు సాగుతున్నాను. అప్పుడే ఒక బైక్ – నా కారు పక్కకు వచ్చింది. ఎంత నెమ్మదిగా వెళుతున్నా, కారు చక్రం ఒక చిన్న గుంతలో దిగడంవల్ల, అక్కడ చేరుకున్న వాన నీరు పక్కకు చిమ్మింది. ఆ బైక్ మీద ప్రయాణిస్తున్నతనూ, అతని వెనుకనున్న అమ్మాయీ – ఇద్దరి మీద కాస్తంత బురద పడింది. గమనించాను, కానీ ఏమీ చేయలేను.

బైక్ వెనుక కూర్చున్నది పడుచమ్మాయి! ‘వానా వానా వెల్లువాయే’ సెట్టింగ్‌! ప్రేమికులను చులకనగా చూసే ఈ ప్రపంచం మొత్తానికి ‘Whole and sole’ ప్రతినిధిగా అపార్థంచేసుకోదగ్గ పరిస్థుతలలో నేను! నన్ను చూసిన తీక్షణమైన చూపుల్లో, వెయ్యి బూతులు వెతుక్కోవచ్చు. “రా! ముందున్న కూడలిలో సిగ్నల్ పడినప్పుడు ఆగుతావుగా? అప్పుడు చూసుకుంటాను” అని అర్థం వచ్చేట్టు చేతిసైగలు చేస్తూ నా కారు ముందే బండిని పోనిస్తున్నాడు. కూడలి వచ్చింది. నా కారు పక్కగా బైక్‌ ఆపి, అరవడం మొదలుపెట్టాడు.

పనికిమాలిన గొడవలు

పనికిమాలిన గొడవలు

అప్పుడు నాకున్న వికల్పాలు.

ఒకటి కారు దిగకుండా, ‘ఏం పీక్కుంటావో పీక్కో’ అన్నట్టుగా చూడటం. అద్దాలు మూసుండడంతో, అతను ఏమి అరిచినా వినపడదు.

రెండవది, అద్దాలు కిందకని ‘గయ్ఁ – గయ్ఁ’ మని నేనూ అరవడం. కంఠశోష మిగిలేది.

మూడవ వికల్పం, బాహాబాహీకి కారులోనుంచి నేను దిగడం. పరియవసానం – చుక్కైనా తడవకుండా ఉన్నవాడిని, దిగగానే కాస్తో కూస్తో తడుస్తాను. పై పెచ్చు రోడ్డుమీద Circus విన్యాసాలు.

నాల్గవది – క్షమాపణ చెప్పడం. వెనుక పడుచమ్మాయి ఉన్నది కాబట్టి, ఏ కొద్దిపాటి తిరస్కారమైనా, అతనికి భరించలేనంతగా ఉండేది. ఆమె ముందు – తనను తాను నిరూపించుకోడానికి, ఎంతకైనా దిగజారవచ్చు. నిజానికి నా తప్పుకూడా ఉంది. గతుకులుంటాయని తెలిసి, మరి కాస్త నెమ్మదిగా కారు నడిపుంటే, వారి మీద బురద పడుండేది కాదేమో! అంచేత, తాపీగా అద్దాన్ని కిందకని ‘I am sorry’ అని క్షమాపణ చెప్పాను. అంతే, సీన్ అడ్డం తిరిగింది. ఆక్రోషం, ఉక్రోషం, హీరోగిరీ అన్నీ దెబ్బకు పఠాపంచలై ‘It’s OK’ అని కాస్తంత ‘అతిశయం’, ‘విజయ గర్వం’, ‘అపార్థం చేసుకున్నానా’ అనే ఫీలింగ్స్ అన్నీ కలగలిసిన బురద చిందినట్టు ముఖం పెట్టాడు. తరువాత ఎవరి దారి వారు పట్టాము.

నా అనుభవంలో తమ తప్పు ఉన్నప్పుడు ‘I am sorry’ అని క్షమాపణ చెప్పే వారు కనబడటం మహా అరుదు. చాలా మందికి – క్షమాపణ అంటే కురుక్షేత్ర యుద్ధం ఓడినట్లు భావిస్తుంటారు. అడ్డ దిడ్డంగా వాదనలకు దిగేవారే అధిక శాతం. రహదారుల మీద అడ్డంగా వాహనాలు నిలిపేసి, ఇతరులకు కష్టం కలుగుతుందేమో అని ఆలోచించగలిగే ఇంగితం కూడా ఉండదు. చివరికి ఒదిగేది ఏమీ లేకపోయినా, బీపీలు పెంచేసుకొని, అరుచుకుంటూ, అప్పుడప్పుడు చేతులూ-కాళ్ళతో సైతం సంభాషిస్తూ, పది మందికీ అసౌకర్యం కలిగించేకన్నా, I am sorry అని తప్పు ఒప్పుకోవడం – నిజానికి తేలికయిన సమాధానం.

ఎటొచ్చీ, మన తప్పు లేనపుడు ఏమి చేయాలో అన్నదే ప్రశ్న. ఒక టైర్ కంపెనీవారి Advertisement లో చెప్పినట్టు “Our roads are filled with idiots.” అటువాంటి వారితో కూడా ఈ చిట్కా వాడాలన్నది నా ఉద్దేశ్యం కాదు.

There are many animals roaming amongst us who are mere byproducts of their parents’ passion.There are many animals roaming amongst us who were reared only as part of some litter and not nurtured as a family member.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 9:44 ఉద. వద్ద ఏప్రిల్ 27, 2012

  తప్పు ఒప్పుకోవడం మీ ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఒక్కోసారి తప్పు ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తా, గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకువెళ్ళాక అసలు సమస్య మరుగునపడిపోవడం, అహాలు పరిస్తితిని తమ చేతిలోకి పోవడం చూస్తూ ఉంటాం. మంచి పోస్ట్ వ్రాశారు.

 2. 11:39 ఉద. వద్ద ఏప్రిల్ 27, 2012

  బాగా వ్రాసారండి. నిజమేనండి , ఒకోసారి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి.

  మరి కొన్నిసార్లయితే, మన తప్పు లేకపోయినా కూడా , కాకతాళీయంగా ఎదుటివారు మనల్ని అపార్ధం చేసుకోవటం జరుగుతుంది ఇలాంటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది..

  • 3:36 సా. వద్ద ఏప్రిల్ 27, 2012

   అవునండి. నేను ప్రస్తావించిన సంధర్భంలో నా తప్పు ఉన్నది కాబట్టి క్షమాపణ కోరగలిగాను. నా తప్పు లేకపోయినా అవతల వాడు గయ్ఁ గయ్ఁమంటే, అదే భాషలో సమాధానం ఇవ్వక తప్పదు.

 3. 3:36 సా. వద్ద ఏప్రిల్ 27, 2012

  మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన వల్ల ఇతరులకి ఇబ్బంది కల్గినప్పుడు .. క్షమించమని అడగడం.. హుందా తో కూడిన నడవడిక. విషయం ఏదైనా తప్పు ఒప్పుకునే ధైర్యం కూడా అందరికి ఉండాలి. మంచి విషయం ని చాలా చక్కగా వ్రాశారు.

  • 6:45 సా. వద్ద ఏప్రిల్ 27, 2012

   మొదట్లో కాస్తంత చిత్రంగా తోచినా, మెల్లిగా అలవాటు చేసుకుంటే, మనకు హాయి; పక్కవారికీ హాయే. Thank you…

 4. 7:14 సా. వద్ద ఏప్రిల్ 27, 2012

  “mere byproducts” — 🙂

 5. 8:00 ఉద. వద్ద ఏప్రిల్ 28, 2012

  మీరు క్షమాపణలు అడిగటం అన్నది కర్రెక్టే. ఇలాగే మనం , మనల్ని ప్రేమించే వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు కూడా, అహం అనేది అడ్డు రాకుండా తప్పు మనది ఉన్నా లేకపోయినా క్షమాపణ చెపితే, విభేదాలు పెద్దవి అవ్వవు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మన అభిమానం దెబ్బ తింటుంది అని మాత్రం నేను నమ్మను.”వెనుక పడుచమ్మాయి ఉన్నది కాబట్టి, ఏ కొద్దిపాటి తిరస్కారమైనా, అతనికి భరించలేనంతగా ఉండేది. ఆమె ముందు – తనను తాను నిరూపించుకోడానికి, ఎంతకైనా దిగజారవచ్చు.” చాలా బాగా analyze చేసారు.
  (But sorry to say that I did not like the last sentence ….But yeah…your blog, your opinions…so not a big deal అనుకోండి.)

  • 11:37 ఉద. వద్ద ఏప్రిల్ 28, 2012

   “నా బ్లాగు కాబట్టి నా ఇష్టం” అనే అభిప్రాయానికి వ్యతిరేకిని. పది మంది చదువుతారు – కాబట్టి “నా ఇష్టం” అనే ప్రవర్తన సబబు కాదని నా ఉద్దేశ్యం. ఒకటి రెండు సార్లు నా అభిప్రాయం మార్చే వ్యాఖ్యలు చదివి, నా టపాలను సవరించుకున్న సంధర్భాలున్నాయి.
   .
   రామ బ్రహ్మంగారు తమ వ్యాఖ్యలో రాసినట్టు, తెనుగుపదజాలం పదునుగా ఉంటుంది. అంచేత కాస్తంత తేలికగా ఉండాలని అంగ్లంలో నా మనోభావాన్ని వ్యక్తపరిచాను. దాని భావన మీకు నచ్చలేదన్నారు.
   .
   అంచేత, ఎందుకు నచ్చలేదో చెబితే, సవరించుకోగలను. నిజానికి ఒక టపాలో రాయాల్సిన విషయాన్ని – ఒక్క అంగ్ల వ్యాఖ్యలో ఇమడ్చాను. దానికి నిరూపణలు, కారణాలు ఉన్నాయి.

 6. rama Brahamam
  9:19 ఉద. వద్ద ఏప్రిల్ 28, 2012

  I AM SORRY అని ఆంగ్లంలో చెప్పటం చాలా తెలేకైన విషయం. కానీ తెలుగు లో “క్షమించు” అని అడగటం చాలా కష్టం. అదే తెలుగు భాషకున్న గొప్పదనం.

  • 11:41 ఉద. వద్ద ఏప్రిల్ 28, 2012

   “ఇదీ కారణం” అని ౠఢీగా చెప్పలేను కానీ, మీరు చెప్పింది నిజం. పైన టపాలో “తాపీగా అద్దాన్ని కిందకని ‘I am sorry’ అని క్షమాపణ చెప్పాను” అనే వాక్యాన్ని ఎందుకో సవరించాలనిపించింది – కానీ మార్చలేదు.

   • Snkr
    5:51 సా. వద్ద ఏప్రిల్ 28, 2012

    సవరించకున్నా, అలానే బాగుంది.
    హార్మోన్ల హోరు ఎక్కువై బలాదూరుగా తిరుగుతున్న అబాయిలు/అమ్మాయిలతో ఎలావ్యవహరించాలో చెప్పారు, బాగుంది. 🙂

 7. Sri
  8:51 ఉద. వద్ద ఏప్రిల్ 30, 2012

  Just felt that the sentence you used was pretty strong and rude! Meeru raasina post — tappu oppukovadam gurinchi. Chinna sanghatana. Sorry chepparu. Kaani conclusion alaa ….enduko ee post lo adi elaa fit avutundo ardham kaaka. If i said something which is not appropriate, sorry.

 8. Sri
  6:15 సా. వద్ద ఏప్రిల్ 30, 2012

  Lol…..ok andi…thank you so much for changing the sentence.. You don’t have to change it actually. Evari abhipraayaalu vaaru vaari blaags lo vyaktaparachvachu ani nammutaanu. Naa comment meeru positive gaa teesukunnanduku thanks….

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s