ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > రావణుడు సీతమ్మను ఎందుకు చెనకలేదు?

రావణుడు సీతమ్మను ఎందుకు చెనకలేదు?

యుద్ధకాండ పదమూడవ సర్గ. సంధర్భం – శ్రీరాముని ఏదుర్కొనడానికై రావణుడు వాడి సచివులతో సమాలోచన చేస్తుండడం.  వారిలో మహాపార్శ్వుడు అనే దౌర్భాగ్యుడు, ఒక సలహా ఇస్తాడు.

కోడిపుంజువలె ప్రవర్తించుచు బలాత్కారముతో సీతను ఆక్రమించుము. ఆవిధముగ నీవు పదేపదే ఆక్రమించుచు ఆమెను అనుభవింపుము. అట్లు నీ కోరిక తీరినపిమ్మట ఎట్టి ఆపదలు, భయము ఎదురైనను వాటినన్నింటిని నీవు సమర్థముగా ఎదుర్కొనగలవు. అవి నిన్ను ఏమియు చేయజాలవు.(4)

లంకకు – వానరసేనావాహినిని తోడ్కొని, శ్రీరాముడు సీతమ్మను విడిపించడానికే వస్తున్నాడని తలచి, ఆ మూలకారణాన్నే చెనకమని మహాపార్శ్వుడి సలహా.

సొదరులైన విభీషణుడు, కుంభకర్ణుడు, మాతామహుడు అంటే తన తల్లికి తండ్రి ఐన మాల్యవంతులు సైతం సీతమ్మని అప్పగించమని సలహా ఇచ్చినపుడు ప్రదర్శించిన చికాకు, మహాపార్శ్వుడి మీద చూపడు. ఎందుకంటే, తన మొండి పట్టుదలకు అనుకూలంగా వాడొక్కడే సలహా ఇచ్చాడు కాబట్టి. వాడి సలహాకు ప్రసన్నుడై, మెచ్చుకొంటూ ఒక రహస్యాన్ని చెబుతాడు.

ఓ మహాపార్శ్వా! చాలా కాలము క్రిందట నాకు ఒక చిన్న సంఘటనము జరిగియున్నది. ఆ రహస్య విషయమును ఇప్పుడు నీకు తెలిపెదను; శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మదేవుని అనుగ్రహమును పొందుటకై, పుంజికస్థలయను అప్సరస – అగ్నిజ్వాలవలె మెరయుచు, ఆకాశమున సాగిపోవుచుండగా నేను ఆమెను చూచితిని. అప్పుడామె నాకు భయపడి మబ్బులచాటున దాగికొనుచు వెళ్ళుచుండెను. అంతట నేను ఆమెను వివస్త్రను గావించి, బలవంతముగా అనుభవించితిని. పిమ్మట, ఆమె బ్రహ్మదేవునిభవనమునకు చేరెను. అప్పటి ఆమె స్థితి ఏనుగు నలిపి పడవేసిన తామరకాడవలె దయనీయముగానుండెను. నా వలన ఆమెకు పట్టిన దుర్గతినిగూర్చి బ్రహ్మదేవునకు తెలిసియుండునని నేను తలంతును. అందువలననే కాబోలు, ఆ బ్రహ్మ కుపితుడై నాతో ఇట్లు నుడివెను. “రావణా! ఈ క్షణమునుండి నీవు పరస్త్రీని బలవంతముగా అనుభవించినచో, వెంటనే నీ శిరస్సు నూరుముక్కలగుట తథ్యము.” బ్రహ్మదేవుడు పెట్టిన ఆ శాపమునకు ఎంతయు భీతిల్లి, విదేహరాజకుమారియైన సీతను బలవంతముగా అనుభవించుటకు పూనుకొనలేదు. (10 – 15)

ఇది – మహాకవి శ్రీ వాల్మీకిమహర్షి విరచిత శ్రీమద్రామాయణ మూల గ్రంథంలోనిదే!

శ్రీరాముని ఔన్నత్యం అర్థమవ్వలేని బుఱ్ఱలుంటాయని తెలుసు. కానీ రావణాసురుడు సీతమ్మను చెనకకుండా జాగ్రత్తగా చూసుకొన్నాడని – వాడిని ఆరాధ్యపురుషుడిగా ప్రచారం చేసేవారుకూడా ఉంటారని ఇటీవలే తెలిసింది. ఏ కోణంలో ఔన్నత్యం గోచరించిదో – కడుపుకి ఏది పడితే అది తినే మహిషాసురులకు తెలియాలి లేదా చచ్చిన ఆ రావణాసురుడికే తెలియాలి.

ఎలాగో సమయం దొరికి పూనుకున్నాను కాబట్టి, మచ్చుకి మరో రెండు మూడు సంఘటనలు కూడా ముందుంచుతాను. ముందరి సర్గ, అంటే పన్నెండవ సర్గలో కుంభకర్ణుడు రావణుడితో సవినయంగా చెప్పినది.

ప్రభూ! రామలక్ష్మణులను వంచించి, వారి ఆశ్రమమునుండి సీతాదేవిని అపహరించుకొనివచ్చుచున్నప్పుడే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన బాగుండేది. యమునానది భూమిమీదికి చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రియందుగల గుండమునునింపి, ముందుకు సాగినట్లు సకాలములో నీవు మాతో చర్చించియున్నచో సముచితముగా ఉండెడిది. మహారాజా! నీవు సీతాపహరణాది కృత్యములను ముందు వెనుకలాలోచింపక చేసితివి. ఇట్టి పాపకార్యములకు పూనుకొనకముందే మాతో ఆలోచించియుండవలసినది. ఇప్పుడు దానిని గూర్చి మాతో చర్చించుట గతజలసేతుబంధనము వంటిదేగాదా!(28 – 29)

తన కామాతురత తీర్చుకోడానికి, సీతాపహరణంవంటి దౌర్భాగ్యపు పనికి పూనుకొన్నపుడు ఎవరినీ సంప్రదించని వాడు – శ్రీరాముడు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడని తెలిసినపుడు మాత్రం, సచివులను పిలిచి మంతనాలు జరుపుతాడు. తీరితే వాడి కోరిక; బెడిసికొడితే వారందరి సమస్య!

యుద్ధకాండలోనే ముప్పైమూడవ సర్గలో, రావణుడు కుటిలోపాయం పన్ని సీతమ్మను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడి అనుచరులలో, టక్కుటమారవిద్యలు తెలిసిన విద్యుజ్జిహ్వుడితోకూడి అశోకవనసమీపానికి చేరి, ఒక ఆలోచన చేస్తాడు. “మనమిప్పుడు మాయలు పన్ని జనకమహారాజుకూతురైన సీతాదేవిని భ్రమింపజేయుదము. నిశాచరా! శ్రీరాముని శిరస్సువంటి ఒక మాయాశిరస్సును, ధనుర్బాణములను తీసికొని నా యొద్దకు రమ్ము” అని చెప్పి, రావణుడు సీతమ్మవద్దకు చేరతాడు.

కుటిల రావణుడు

కుటిల రావణుడు

మార్గాయాసంతో గాఢనిద్రలో ఉన్నప్పుడు, వాడి గూఢాచారులు వానరబలములను తుదముట్టించారని; నిదురిస్తున్న శ్రీరామునియొక్క శిరస్సును ప్రహస్తుడు ఖండించాడని; సుగ్రీవహనుమలు సైతం మరణించారని; మిగిలిన సైన్యంతోసహా లక్ష్మణుడు దిక్కులు పట్టి పోయాడని బుకాయిస్తాడు. పూర్తి విశ్వాసం కలిగించడానికి అక్కడే ఉన్న రాక్షసితో – విద్యుజ్జిహ్వుడిని రామ శిరస్సు, ధనుర్బాణములతో ప్రవేశపెట్టమని ఆదేశించి, వాడు తెచ్చినవాటిని సీతమ్మ ముందు విసురుతాడు. ముప్పైరెండవ సర్గలో, ఇవి చూసిన సీతమ్మ రాయడానికి కష్టంగా ఉండే రీతిలో విలపిస్తుంది. తననూ శ్రీరాముని వద్దకే చేర్చమని అంటే చంపమని వేడుకుంటుంది. ఇంతలోనే వాడి అంగరక్షకుడు ఒకడు, సేనాపతియైన ప్రహస్తుడు ఏదో ముఖ్యమైన విషయం తెలియజేయడానికి వేచిఉన్నాడని చెబితే, రావణుడు నిష్క్రమిస్తాడు. వాడు అక్కడినుండి వెళ్ళిపోగానే, ఆ మాయా శిరస్సు, ధనుర్బాణాలు అదృశ్యమైపోతాయి. అప్పుడు విభీషణుడి భార్య ఐన సరమ టక్కుటమారాలగురించి చెప్పి ఊరడిస్తుంది.

పాతివ్రత్యం అంటే ఏమిటో, ఒక స్త్రీకి తన భర్తమీద ఉండే ప్రేమ అంటే ఏమిటో తెలియని కామ పిశాచి. ఒక స్త్రీకి-పురుషుడికి మధ్యనుండేది శారీరికమైన సంభందం మాత్రమే అని భావించే వ్యక్తిత్వం. తన భర్త అనే అడ్డాన్ని తొలగిస్తే, ఏ స్త్రీ ఐనా మరొకరిని కోరుకుంటుందనే నీచమైన ఆలోచన. తను కామించిన స్త్రీ విలవిలలాడుతుంటే చూసి ఆనందించగలిగేవాడా ఆరాధ్యపురుషుడంటే?

ఇలాంటి మరెన్నో సంఘటనలు శ్రీమద్రామాయణంలో కనిపిస్తాయి. సరిగ్గా తెలియక సమాజంలో విషాన్ని చిమ్ముతుంటారో లేక అబద్ధమని తెలిసికూడా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారో అర్థం కాదు. అదే మూలంలో ఒకరికి కల్పవృక్షం కనిపిస్తే మరొకరికి విషవృక్షం కనిపించింది. ఎవరి పరిపక్వత వారిది. పెరట్లో ఉన్న తులసి మొక్కకిచ్చిన విలువనీయడం చేతకాకపోయినా, కనీసం వీధికుక్కకు పట్టిన గజ్జిలాగా వాక్‌స్వాతంత్ర్యాన్ని దిగజార్చకుండా జాగ్రత్తగా వాడటం సమాజానికే మంచిది. ద్వేషించేవారిని కించపరచడానికి, మూలాలను చెదల్లాగా కుళ్ళబొడవడమా?

In the circle of life, everything comes back in one form or the other. One should not spit venom; for it’d come back and poison the very source one day!

మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాఽన్యం దేవం నైవ జానే న జానే ||
ప్రకటనలు
 1. 9:01 ఉద. వద్ద ఏప్రిల్ 29, 2012

  Comment – 1

  మీ వ్యాసానికి నమస్సులు, పూవు సుగంధాన్ని విస్తరింప చేయదు, తాను స్వయంగా సుగంధాన్ని కలిగి ఉంటుంది, అది గాలి సాయం తో తత్ పరిసరాలకు వ్యాప్తం అవుతుంది.
  కాని దుర్వాసన విషయం లో కూడా ప్రకృతి యందు జరుగునది ఇదే అయినప్పటికీ నేటి కలి ప్రభావం దృష్ట్యా రెండవ రకపు వాసనకు వ్యాపకబలం వేగం ఎక్కువగా ఉండటం అందరి గమనింపులో ఉన్నదే !

  మంచిది !! మీ వ్యాసం పుణ్యమా అని “వివేకం” అనే అంశం పై అందరి మనస్సు ఒక్కమారు తిరుగుతుంది.

  ఇంత తెలిసిన వారికి ఆధ్యాత్మ రామాయణం తెలిసి ఉండక పోవచ్చునని నేను భావించుట లేదు.

  రావణుని పై ద్వేష భావన కాని రామునిపై రాగ భావం కాని లేవు.
  ఆ రెండు రెండు ఆదర్శాలు !!
  ఒకటి దుర్గతి కలిగించేది కాగా మరోది సద్గతి కలిగించేది
  సంస్కార బలం దృష్ట్యా శక్తి వంతులు ఆసక్తి వంతులు తదనుగుణ అంశాన్ని ఎంచుకోవచ్చును.

  సశేషం

 2. 9:50 ఉద. వద్ద ఏప్రిల్ 29, 2012

  Comment – 2

  మీ post లో నాకో ధర్మ సందేహం,
  వివేకం అనేది సత్వ గుణం వల్లనే కలుగుతుంది,
  “ఆమెనును అపహరింపక (ఆ దుష్కార్యం చేయక)మునుపే మమ్ములను సంప్రదించ వెలెను” అని నిజం గా కుంభ కర్ణుడే అన్నాడా? లేక విభీషణుడు అన్నాడ?
  మరేమీ లేదు
  విభీషణుడు సత్వాంశకు రావణుడు రజో గుణమునకు కుంభ కర్ణుడు తామసికానికి ప్రతీక కదా!
  అందుకే ఆ సందేహం కలిగింది …!!
  …….
  మరొక మాట !
  (ఇది సభ్యత ఉంటుంది అనుకుంటేనే post చేయండి లేకుంటే వేయన్నక్కర్లేదు అని మనవి.)
  పక్క వారింటి పెరటిలో కాసిన బాగా ముగ్గిన చిలక కొట్టిన జామ పండు రుచి సర్వులకు విదితమే.
  అలాంటి దానిని అడిగితే వచ్చునని భావిమ్పని వారు
  బాల్యం లో ఇంత విచారనయున్ చేయక
  తస్కరింప పూనేదరు. ఇట్టి కార్యానికి
  (నేను అలా ఎన్నో మారులు చేసిన వాడినే, ఇక విజ్ఞత కలిగాక సొంత పెరటిలో మూడు జామ చెట్లు పెంచుకున్నాను)
  సీతను ఒక సాధ్వీ మణి గా, పరస్త్రీ గా, మాతృభావం తో చూసెడి విజ్ఞత ఉన్ననూ
  ఆతడి సంస్కార బలానికి గుణ ప్రేరణ తోడై ఆమెను ఇంద్రియ భోగ వస్తువు గా తలంచి భ్రమించి మోహించి కామించి
  అట్టి నీచ కార్యానికి పూనుకున్న రావణునికి
  పెద్ద తేడా లేదు…
  రెండింటా చపలత్వం ఇంకా భోగాపేక్షయే…!!
  ఒకటి పసి తనం లోనిది కాగా మరోది అన్ని ఎరిగిన స్థితి లోనిది.
  రెంటికి కారం “రజో గుణమే”
  హంస వలె వర్తించ వాలెన్ !
  ” గ్రాహ్య త్యాజ్యాలు ” మరియు గుణ విచక్షణ చేసిన యడల
  అతి కటోర తపము ఒనర్చ గలిగిన సామర్థ్యం,
  భక్తి ప్రపత్తులతో సాక్షాత్ కైలాస నాథుని మెప్పించ గల నిష్ఠ ,
  ఆత్మ లింగమును సంపాదించ గలిగిన ఠీవి,
  అనితర సాధ్యమైన సాధన సంపద”
  గ్రహింప తగిన ఆదర్శాలు కాగా,

  ఎంతటి సాధనా సంపత్తి యున్నను,
  కైలాసాధిపతి దర్శనం కలిగినను
  తన లోని రజస్సును గుర్తించి అదుపు చేయలేక పోవటం,
  ఇంద్రియ లోలుడై కామాపేక్ష చేత వివేక హీనుడవ్వటం
  త్యాజ్య నీయమగు అంశాలు !!

  బ్లోగోన్ముఖముగా ఎల్లరకు తెలియ జేయు విజ్ఞప్తి ఏమనగా !
  ఆధ్యాత్మ పరంగా రామయనాన్ని పరివ్యాప్తం కావిన్చటమే
  మంచిది

  ఎందుకనగా !!

  ఎవరైనా భార్య నేత్తికేలితే ఓడ మీద వెళ్లి యుద్ధం చేస్తాడ?
  లేక bridge కట్టుకుంటూ టైం waste చేస్తాడ?
  పుష్పక విమానం range లో technology ఉన్న ఆకాలం లో
  ship ని తయారు చేయటం easy నా bridge వేయటం easy నా అని నా colleague అంటే
  గూగుల్ లో రామ సేతు ని చూశాక
  నీటిపై తేలే రాళ్ళను చుసిన తరువాత
  కూడా ఈ ప్రశ్నకు బదులు ఇవ్వలేని నిస్సహాయ స్థితి నన్ను
  ఈ comment కి పురికొల్పుతుంది

  ఏమని సమాధానం చెప్పాలి?
  1 నిజంగా జరిగినది కనుకే దీనిని ” ఇతిహాసం ” అంటారని చెప్పనా?

  2 ఆ కాలం లో అందరు దైవాంశ సంభూతులు వారికి త్రికాలాలు తెలియును.
  అతి త్వరగా బాకీ తీర్చుకుంటే త్వరగా శ్రీ హరి సన్నిధానం దొరకి
  ముక్తి లభిస్తుందనే ఉద్దేశ్యం తో
  రావణుడు ఇలా చేసాడని చెప్పనా?

  3 ఇది అంత కల్పిత కట్టు కథ
  ఈ characters ఆయా సన్నివేశాల్లో ఎలా స్పందించాయి అల స్పందించటం వాళ్ళ ఎలాంటి స్థితి పొందాయో
  తెలుసుకుని ఎట్లు ప్రవర్తిస్తే ఏమి అవుతుందో గుర్తించి వర్తిన్చుకోవటం కోసమే రామాయనమని చెప్పనా?

  ఇట్లాంటి వారికి సీత అంటే మనసు రాముడంటే ఆత్మా రాముడు సీత మాయ అనే బంగారు లేడిని కోరింది, అది మయా వస్తువు అని తెలిసిన ఆమె కోరిక నెరవేర్చటం కోసం
  ఆ వస్తువు కోసం వేమ్పర్లాడు తూ వెళ్ళిన రాముడు కూడా కష్టాల పాలయ్యాడు

  ఆత్మబుద్ధి మనసు మాట వింటే ఇలా ఉంటుంది,

  కుంభ కర్ణుడు తమో గుణం తిండి నిద్ర తప్ప మరో యావలేదు,
  విభీషణుడు సాత్వికం ఆయినా ప్రారబ్ధ వశాత్తు మిగితా గుణాలు కలవారితో సహజీవనం చేయక తప్పటం లేదు
  ఇక ” రావణా బ్రహ్మ ” రజో గుణ ప్రతిరూపం
  రజో గుణం తాండవం చేసిన కాలం లో స్థితి గతులు ఎలా ఉన్నాయనేందుకే సంకేతం అని చెప్పనా?
  చెప్పిన అర్థం చేసుకునేది ఎవ్వరూ?
  పోనీ నచ్చ జెప్పిన నేనే
  ఈ comment పూర్తి కాక మునుపే గుణానికి దాసుడ నవ్వు తున్నానే ?

  హే రాం ! మే క్యా కరో భగవాన్ !

  • 1:57 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

   అచ్చుతప్పు లేదు. కుంభకర్ణుడే అన్నాడు. అలా ఓ చెంపదెబ్బకొట్టి, తప్పో వప్పో. వెధవ పని చేశేశావు. ఐనా కూడా నేను నీ వెంటే అని భరోసా ఇచ్చి, యుద్ధానికి దిగుతాడు.

 3. 1:04 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

  పండితుడైన రావణుడు స్త్రీ వ్యామోహంతో, విపరీత కాముకతతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పుట్టుకకూ — శీలానికీ… పాండిత్యానికీ — సంస్కారానికీ… సంబంధం లేదని నిరూపించాడు.

  • 2:00 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

   వినాశకాలే విపరీతబుద్ధిః
   .
   మీరన్నట్టు రావణుడే కానీ లేదా వాడిని గొప్పగా చూపించాలని ప్రయత్నిస్తున్నవారు కానీ.

 4. Snkr
  2:48 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

  బాగుంది.
  రాక్షసజాతికి రావణుడే ఆరాధ్యుడు, అదంతే! అలా కాకపోతే ఆశ్చర్యపోవాలి. అలాంటి జాతి వారి మొహాలుచూస్తే తేలిపోవట్లేదూ…

  • 3:19 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

   కుంభకర్ణుడు రాక్షసుడు – పైపెచ్చు రావణుడికి తమ్ముడు! వాడికున్నపాటి విచక్షణకూడా లేకుండా పోతోంది. పది మందీ చదువుతారనే ఇంగితం లేకుండా ఈ మధ్య కొందరు Internet లో ఇష్టంవచ్చినట్టు బరికేస్తున్న వైనం చూస్తే ఏమనాలో అర్థం కావటంలేదు.

 5. rama Brahamam
  6:35 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

  కొంతమంది మూర్ఖులు రావణుడి ఫై చేసే వితండవాదనలకు సమాదానం లేక చాలా ఇబ్బంది పడుతున్న నా లాంటి వాళ్ళకు చాలా ముఖ్యమైన సమాచారం అందించారు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు……….

  • 11:46 సా. వద్ద ఏప్రిల్ 29, 2012

   కొందరు – తమకు నచ్చనివారిని చీకాకు పరచడానికి ఏవేవో వింత కథనాలు సృష్టిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకునే ఒపికా – వనరులు లేనివారు, నమ్మీ నమ్మకుండా వాటిని మరింత వక్రించి ప్రచారం చేస్తున్నారు. మూలాన్ని వెతికితే తేటతెల్లంగా నిజాలు తెలుస్తాయి. నాకు తటస్థించిన ఒకానొక కథనం నిజానిజాలు ఏమిటో తెలియజేయడమీ ప్రయత్నం. మీకు పనికివస్తుందని తెలిసి సంతోషిస్తున్నాను.

 6. Satyanarayana Piska
  11:42 సా. వద్ద ఏప్రిల్ 30, 2012

  రావణుడు ఒకసారి నందనవనంలో రంభను చూసి బలాత్కరిస్తే, ఆమె వెళ్ళి నలుకూబరునికి చెప్పుకుంటే, అతడు రావణుడిని శపించినట్టు తెలుసు. మీరు వ్రాసినదానిలో బ్రహ్మదేవుడు శాపం ఇచ్చినట్లుగా ఉంది…… రంభారావణుల వృత్తాంతం కంకంటి పాపరాజుగారి “ఉత్తర రామాయణము” లో ఉంది.

  • 12:06 ఉద. వద్ద మే 1, 2012

   రంభ వృత్తాంతం నేనూ విన్నాను. అన్నిటి ఇతివృత్తం ఒకటే. బలవంతంగా పరాయి స్త్రీని చెనికితే, తల చెక్కలవుతుంది. నేను అందించినది వాల్మీకి రామాయణం – మూలం నుంచి.

 7. 5:35 సా. వద్ద మే 3, 2012

  ఈ పోస్ట్ ఈ రోజే చూసానండి. రావణాసురుని ఎవరు మెచ్చుకున్నారో నాకు తెలియదు కానీ, రావణాసురుడు మంచివాడని ఎవరూ మెచ్చుకోరండి. అతనికి బ్రహ్మ ఇచ్చిన శాపం కారణంగానే సీతాదేవికి హాని కలిగించలేకపోయాడు అన్నది నిజమే .

  కానీ, రావణకుంభకర్ణులు వైకుంఠంలోని జయవిజయులే. ఒక పొరపాటు కారణంగా శాపాన్ని పొంది వారు రాక్షసులుగా జన్మించారు. మిత్రులుగా ఆరుజన్మలు దూరంగా జీవించటం కన్నా, శత్రువులుగా మూడు జన్మలలో వైకుంఠానికి తిరిగివెళ్ళిపోవాలి అని కోరుకున్న భక్తులు వారు. వారికి లక్ష్మీదేవి తల్లివంటిది విష్ణుమూర్తి తండ్రి వంటివారు. ఆ జయవిజయులు రావణకుంభకర్ణులుగా జన్మించారట.

  రామాయణం జరగటానికి వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. విష్ణుమూర్తి కొంతకాలం భార్యావియోగం అనుభవించాలనే భృగుశాపం ఉంది కదా ! అందుకే రామాయణకాలంలో రాములవారు కొంతకాలం భార్యావియోగాన్ని అనుభవించారు. రామాయణంలో రావణుడు ప్రతినాయకుడిగా తన పాత్రను పోషించాడు.

  రామాయణంలో రావణాసురుడు పాత్రను ఎవరూ మెచ్చుకోరండి. అయితే రావణాసురుడు సీతమ్మకు ఏమీ హాని కలిగించడు ….. అన్నది ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన విషయం. రావణుడు జయవిజయుల్లో ఒకరని గుర్తుతేవటం కూడా అతన్ని సపోర్ట్ చెయ్యటం కోసం కాదు. అతనివల్ల సీతమ్మ వారికి ఏ హానీ జరగదని చెప్పటం కోసమే. అయినా లక్ష్మీస్వరూపిణి అయిన సీతాదేవిని ఎవరూ ఏమీ చెయ్యలేరు.

  మూడు జన్మల తరువాత జయవిజయులు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతారు . అని పెద్దలు చెప్పటం జరిగింది కూడా. రావణాసురునికి తన పూర్వజన్మ గుర్తు లేకపోవటం వల్లనే సీతాపహరణం జరిగింది.

  రావణుడికి గత జన్మ గుర్తు లేకపోయినా , సీతాదేవికి రావణుని వల్ల హాని జరగకుండా చూడటం , ఇవన్నీ ఏది ఎలా ఎంతవరకూ నడిపించాలో అలా చాకచక్యంగా కధలను నడిపిస్తారు జగన్మాతాపితరులు….

  ఇలా కధలను నడిపించి , వీరి జీవితగాధల ద్వారా లోకానికి ధర్మాధర్మాలను తెలియచేస్తారు..
  * వ్యాఖ్య పెద్దగా అయినందుకు దయచేసి క్షమించండి.

 8. Chandu
  11:18 ఉద. వద్ద మే 27, 2012

  Naaku chaalaa kotta vishayaalu telisaayandeee… nice post!
  Good writing.

  Chandu

 9. kmv
  10:57 సా. వద్ద ఆగస్ట్ 14, 2012

  Paramata sahanam peruto videshiyulani ee punya bhumi pai undanichchinanduku anubhavinchalsi vastondi. chinna chima kuda tana puttalo velu pedite kudutundi. para vastuvu(panikiranidi/pramadapu) padite bytaki parestundi.
  akhariki kadalleni mokkalu kuda vaati madya vere jati mokkalu pudite peragakunda chestayata. mana bangaru bharata bhumilo mlechchulu,tella rakkasula valla ee godavalu .

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s