ముంగిలి > పిచ్చాపాటి, శిరోభారం > కూర్చున్న కొమ్మను నరుక్కోవడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం

మే 9, 2012

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ శిక్షణతో సంబందమున్న విషయంపై అలిగి, Air India పైలట్లు సమ్మెకు దిగడం, హాస్యాస్పదం కాదు – మూర్ఖత్వం! ప్రయాణికులకు కలిగే అసౌకర్యం, వాటిల్లే నష్టాలను పక్కన పెట్టినా, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారన్న కనీస ఇంగితకూడా లోపించడం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం

వార్తా మాధ్యమాలలో లభిస్తున్న వివరాలను బట్టి, ఒకే రోజు – వంద పైచిలుకు పైలట్లు అస్వస్థత కారణంగా శెలవు పెట్టి కొంపల్లో కూర్చున్నారట. తమకు తప్ప మిగతావారెవరికీ తెలివి తేటలు లేవనుకుంటున్నారో ఏమిటో. ఢిల్లీ న్యాయస్థానం ఈ సమ్మె చెల్లదని తీర్పు చెప్పినా, బుద్ధి అనేది వస్తుందో రాదో.

ఒక వైపు నష్టాల్లో కూరుకుపోయి, ప్రభుత్వంనుంచి 30,000 కోట్ల సహాయం కోసం నిరీక్షిస్తున్న సంస్థలో పని చేస్తూ, ఇలా ప్రవర్తించడం అసహ్యం కలిగిస్తోంది. National Carrier అని చంకలు గుద్దుకుంటూ, ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం సబబు కాదు. సంస్థతో బాటు, దేశానికి కూడా కాస్తో కూస్తో సిగ్గుచేటే. ఇప్పటికే, Air India లో ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్న నాలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఎంత ఆలస్యంగా గమ్యానికి చేరుకుంటాము, ప్రయాణంలో ఎటువంటి అగచాట్లు పడతాం, అసలు ప్రయాణం చేస్తామా లేదా అన్నది మన చేతుల్లో ఉండదు; ఖర్మ కాలితే – కేవలం టికెట్టు కొనడం మాత్రమే మనం చేయగలం.

Hindustan Times లో వచ్చిన వార్తా కథనంలో, సంస్థ మూతపడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Civil aviation minister Ajit Singh on Wednesday warned the striking Air India pilots that if they continue their agitation the national carrier will be downsized. The strike by Air India pilots entered the second day on Wednesday with several flights being cancelled leaving passengers stranded amid reports that pilots may strike a deal with the government today and return to work.The government came down heavily on striking Air India (AI) pilots on Tuesday, sacking 10 of them. It also derecognised the Indian Pilots Guild (IPG), the 450-member association of erstwhile AI pilots, and sealed its offices.The government did not rule out the possibility of shutting down Air India if the crisis continued.

కానీ ఇలాంటి సోది, మునుపెన్నడో చూసినట్టుగాకూడా గుర్తు. కోట్లకు కోట్లు గుమ్మరించడం, National Carrier అని చెప్పుకుంటూ పరువు తీయడం, ప్రయాణికులతో ఆడుకోవడం కన్నా Privatise చేసి దాని మానాన దాన్ని వదిలేస్తే మేలేమో!

కానీ మనసులో ఎక్కడో ఓ మూల, చిన్న అనుమానం. ఈ సంస్థ మూతపడాలి అని పని గట్టుకొని ఎవరన్నా తెర వెనుక సూత్రదారులు ఆడిస్తున్న నాటకాలా ఇవి?

ప్రకటనలు
 1. Sri
  7:20 సా. వద్ద మే 9, 2012

  Air India లో fly చెయ్యడమంటేనే చిరాకు. పనిలో పని, మూసేస్తే సరి. (కొంప, సోది ఈ రెండు పదాలు మీరు వాడినవి చదవగానే నవ్వొచ్చింది :))

  • 8:57 సా. వద్ద మే 9, 2012

   నేను మొదట రాసిన Draft చాలా కటువుగా అనిపించింది. పబ్లిక్ బ్లాగ్ కదా అని చాలా పదాలు తొలగించాను. కానీ ఆ రెండు పదాలు మాత్రం తప్పించుకున్నాయి.

 2. 12:59 సా. వద్ద మే 10, 2012

  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అవసరం ఉండి AirIndiaప్రారంభించినట్లు జ్ఞాపకం.కొన్నాళ్ళు బాగా నడిచింది కూడా.ఐనా ప్రైవేటు విమాన సంస్థలు ఇన్ని వున్న ఈ రోజుల్లో ప్రభుత్వం విమానసర్వీసులు నడప నక్కర లేదు .విమానాశ్రయ నిర్వహణ మాత్రం చేస్తే చాలు .
  మీరు రాసినట్లు ఇప్పుడు పైలట్లు సమ్మె చేయడం కూర్చున్న కొమ్మను నరుక్కోడమే అవుతుంది.
  నా అభిప్రాయం ప్రకారం దీనికి రెండు పరిష్కారాలు ఉన్నవి.1.చివరిసారిగా అప్పులన్నీ తీర్చడానికి ధనం ఇచ్చి వీటిని స్వతంత్ర కార్పొరేషన్ కి అప్పజెప్పి ప్రభుత్వ,రాజకీయ ,జోక్యం లేకుండా ఏర్పాటు చేయడం.2.ప్రభుత్వ ఎయిర్ లైన్స్ సంస్థల్ని,రద్దుచేసి యావత్ సిబ్బందికి న్యాయమైన ,పరిహారం సెటిల్ చేయడం.పై నిర్ణయాలవలన ప్రభుత్వానికి పెద్ద యెత్తున ఖర్చు తగిలినా ,ప్రతీ సంవత్సరం నష్టాలు భరించవలసిన అవసరం తీరిపోతుంది.
  ప్రఫుల్ పటేల్ విమానశాఖమంత్రిగా ఉన్నప్పుడు అనవసరంగా విమానాలు కొనిపించి AirIndia ,Indian Airlines కి నష్టాలు కలిగించే చర్యలు తీసుకొన్నాడని అంటారు.ప్రభుత్వంలో కొందరు పెద్దలకి వీటిని ప్రైవేట్ పరం చేసే పరిస్థితి కల్పించే ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తోంది.దానికి పైలట్లు మొదలైన సిబ్బంది వైఖరి దోహదం చేస్తున్నది.

  • 8:38 సా. వద్ద మే 10, 2012

   సరిగ్గా చెప్పారు. Air India మొదలు పెట్టింది Tata Group వారు. తరువాత లైసెన్స్ రాజ్‌లో దానిని ప్రభుత్వం నియంత్రణలో తీసుకున్నది.

 3. 4:12 ఉద. వద్ద మే 23, 2012

  Hello సర్,
  BUSY గా వున్నారా? 10 రోజుల నుండీ posting ఏమీ చేయటం లేదు?
  ….
  ఈ post పరంగా నాకు అవగాహన లేదు, మీరు చెప్పిన విషయం అర్థం అయ్యింది,
  అందుకే ఏ comment చెయ్యలేక ఈ no comment చేస్తున్నాను..
  కర్మ లో అకర్మలా అనుకోండి 🙂

  As usually, please come with a good & interesting post

  thanks
  Shiva
  ఏ నావదే తీరమో ?!
  http://endukoemo.blogspot.in/

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.