ముంగిలి > శిరోభారం > భావ కాలుష్యం

భావ కాలుష్యం

మే 26, 2012
భావ కాలుష్యం

భావ కాలుష్యం

పైన జతచేసిన చిత్రం – ఎంత అద్భుతంగా ఉంది కదా! నేటి మన సంస్కృతిని చక్కగా ప్రతిబింబిస్తోంది! పొద్దస్తమానం పాత ఆలోచనలూ, నడువడులేనా? జీవితం మిర్చ్‌-మసాలాలతో ఇలా ఉంటేనే మజా!

‘ఆడది’ ఒక సుఖభోగ వస్తువు. ఆడపడుచులు అని, తల్లి సమానురాలని, సోదరి అని పనికి మాలిన సంభందాలు కల్పించుకొని, సుఖానికి మూలాధారాలైన ఈ భోగ వస్తువులను దూరం చేసుకోవడం పాత చింతకాయ పచ్చళ్ళు తినే వాళ్ళు చేస్తారు – ఈ తరంవారు కాదు.

ఎలాగో తల్లి ‘దినం’ – అదే Mother’s Day నాడు, ఒక గ్రీటింగ్ కార్డో లేక ఒక Wish పడేస్తే సరిపోతుందాయే. ఆ మాత్రానికి పరాయి ఆడవాళ్ళందరూ తల్లీ లేదా చెల్లీ అంటూ మడి కట్టుకు కూర్చుండిపోతే ఎలా?

భావి తరం పిల్లలు – ఈ తరం అడుగుజాడల్లో నడుస్తూ, మరింత గొప్పగా ఎదిగిపోవడానికి ఇలాంటివి ఎంతగానో తోడ్పడతాయి.

పై పోష్టరును చూసి, ఓ ఎదుగుతున్న కొడుకు “అమ్మా ఆ అంకుల్ అక్కడ తాకాలని ప్రయత్నిస్తుంటే, ఆ ఆంటీ ఎందుకు వెనక్కి వెళుతోంది? అక్కడేముంటుందమ్మా?” అని అమాయకంగా వేసిన ప్రశ్నకు, ‘అబ్బా నా కొడుకు ఎంత వేగంగా ఎదిగిపోతున్నాడో కదా‘ అని ఒక సగటు తల్లి ఎంతగా పొంగిపోతుందో కదా!

రామాయణాలు, భారతాలు, శివుడు, విష్ణువు అంటూ తమకే తెలియని చీకాకు ప్రశ్నలు ఎదుర్కొంటున్న తల్లి దండ్రులకు, ఇలాంటివి ఎంతగానో ఊరట కలిగిస్తాయి. తాము నేర్పకుండానే, పెద్దయ్యాక ఎలా నడుచుకోవాలో నేర్పించే ఇటువంటి సాంస్కృతిక సాధనాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు?

నాన్నా, వాడెవడో నా వెంట పడుతూ – సందు దొరికితే నా దగ్గిరకొచ్చి, ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడు” అని యుక్త వయస్సులో ఉన్న ఒక కూతురు ఫిర్యాదు చేసినపుడు, “ఏడిశావు! ఆ పోష్టరును చూడు! చూసి నేర్చుకో. ఇలా ప్రతిదానికీ వచ్చి పేచీలు పెట్టకు. కాలంతో పాటు మనం కూడా మారాలి” అని మార్గదర్శకత్వం చేయటానికి – ఈ పోష్టరు ఒక అద్భుతమైన సాధనం.

బాబూ! నాయనా! ఒక మంచి చిత్రం తీశాము. దయచేసి  దాన్ని ఆదరించండి” అని బ్రతిమాలుకునే ఏబ్రాసిగాళ్ళను పోషించే సంస్కారమా మనది? కాదు కాదు. మనలో వస్తున్న అత్కృష్టమైన మార్పులను, ఎదుగుదలను కళ్ళకు కొట్టొచ్చినట్టుగా ప్రబింబించగలిగే ఇటువంటి వారి సినిమాలనే కదా మనము ఆదరించాల్సినది.

“రెక్కాడితేగానీ డొక్కాడదు” వంటి అద్భుతమైన పదజాలంతో ఎరుగబడేవారిని – “Mass” అని బిరుదునామాలతో పొగిడి, వారి కోరికలకణుగూణంగా తీసిన ఇటువంటి చిత్రాలను ఆదరాభిమానాలతో పోషించాల్సిన భాధ్యత ప్రతీ ఒక్కరిది. –కాదంటారా?

ప్రకటనలు
 1. 5:46 సా. వద్ద మే 26, 2012

  చిత్రం/దృశ్యం: దరువు తీస్తున్న పరువు

  Music (ఆడియో) : నన్నేదో సేయ్యమాకు నడుము కాడ, ఆడ ఈడ…!! హే ఓ ..ఉమ్మ్ హా! (సింహాద్రి song)

  మాటలు : Almost అన్నీ beep sound లే (కాని అన్నే అర్థం అవుతాయి no doubt about it)

  సందేశం : దేశం ధరలు పెరిగిన దారిద్ర్యం లోనే కాదు, భావ దారిద్ర్యం లో మరింత వేగంగా ఉన్నది,

  హీరో/హీరోయీను : ఎవరికి నైతిక విలువల ధ్యాస, , సిగ్గు లజ్జ స్పృహ ఉండదో వారు

  దర్శక నిర్మాతలు: ఆత్మసాక్షిని పక్క నుంచి ప్రేక్షకుల కళ్ళు చేవాలు నోళ్ళతో వ్యభిచారం చేయించే నేర్పరులు.

  Ratings sites / Review blogs : భావకాలుష్య పరివ్యాప్తిలో ప్రతి ప్రశంసకుడు సమరయోదుడే.

  press meet /అవార్డులు: ఎంత గొప్పగా విప్పి చూపితే అన్నీ!

 2. 7:52 సా. వద్ద మే 26, 2012

  హతవిధి!!!! రామ రామ ..మాస్ కాదు, క్లాసు కాదు…తీసేవారికి ,చూసేవారికి
  చెయ్యలి బడిత పూజ. తీసేవారు జనాలు చూస్తున్నారు అని, చూసేవారు (చదువుకున్న వారు/ చదువు కోని వారు కూడా) ఫున్, ఫున్ అంటూ ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు చూసారు…….అదే మన దౌర్భాగ్యం.

 3. 7:14 సా. వద్ద మే 27, 2012

  ఏం చేద్దాం …ఇప్పటి యువతకు ఇటువంటి చెత్త కిక్కు లేని సినిమాలంటే రోత.దర్శకులు కూడా కలెక్షన్ల కోసం తానా తందానా అంటున్నారు..నోరు తెరుచుకుని విడ్డూరంగా చూడటం తప్పించి సగటు మనుషులం మనమేమి చేయగలం?

 4. 1:31 ఉద. వద్ద మే 28, 2012

  ‘ఎం.ఏ.’ గారు, ‘శ్రీ’ గారు, ‘ప్రియనేస్తం’ గారు: ఏదో running thoughts బ్లాగులో పెట్టా. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనో లేదా ఇటువంటివి తక్షణం ఆగిపోవాలనే ఎండమావుల్లాంటి ఆశలేవీ లేవు.

 5. 10:09 ఉద. వద్ద మే 28, 2012

  నా ఆలోచనలో దీనికి పరిష్కారం ఒకటే, మంచి పుస్తకాలని కొని ఇంట్లో పెట్టడమే, రోజూ ఒక పుస్తకాన్ని చూస్తూ ఉంటే , ఎప్పుడో ఒకసారి దాన్ని చదువుదాం, అసలు అందులో ఏముందో అన్న ఆలోచన బయలుదేరుతుంది, తరువాత మారతాడు, ఇవ్వాల రేపు ఇలాంటి పుస్తకాల గురించి మాట్లాడటమే పాపమైపోయింది. రామాయణ,భాగవతాదులు ముసలాళ్ళవై పోయాయి. ప్రతి ఒక్కరు ఇంట్లో రామాయణాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని ఉంచాలి, అప్పుడే ఈ సమాజం ఎప్పటికైనా మారుతుంది.

  • 1:54 సా. వద్ద మే 28, 2012

   ఏమో! మీరు ప్రస్తావించిన తరహా పుస్తకాలు కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారండీ?

   • 2:09 సా. వద్ద మే 28, 2012

    ఎంతో మంది ఉండరు, కారణం అవగాహన లేకపోవడం, అవసరం తెలియకపోవడం, అది తెలియచెప్పాలి. ఎలా అన్నది నాకూ తెలియదు. నాకు తోచినంతలో రామాయణం గొప్పతనాన్ని బడిపిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమో ఎంతవరకు సఫలం అవుతానో చూడాలి. “స్త్రీల రామాయణ పాటలు” అని ఒక పుస్తకం ఉంది. దానిలో పాటలు నా కూతురికి నేర్పించి యు-ట్యూబ్ ద్వారా ప్రచారం చెయ్యాల్ని కోరిక. చూద్దాం.

    • 2:12 సా. వద్ద మే 28, 2012

     Well, I too am an optimist. మీ ప్రయత్నం బహుదా హర్షనీయం మనోహర్ గారు.

 6. snkr
  1:36 సా. వద్ద మే 28, 2012

  ఎంత విమర్శిచడం కోసమైనా ఇలాంటి వాటిపై ధ్యాస పోవడం పాపమండి, తెభా గారు. 🙂 😛

  • 2:01 సా. వద్ద మే 28, 2012

   ‘snkr’ గారు: మీ వ్యాఖ్య సరిగా అర్థం కాలా! పైన జత చేసిన పిక్చర్‌, Internet నుండి సేకరించినది కాదు. అదో పెద్ద హోర్డింగ్‌. దాని ఫోటో తీసి జతచేశా. నలుగురూ తిరిగే చోట, అంత పెద్దగా ఇటువంటివాటి హోర్డింగ్‌లు పెడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో!

   • snkr
    9:05 సా. వద్ద మే 28, 2012

    oh.. I was kidding.

 7. 2:44 సా. వద్ద మే 28, 2012

  Wast for taking about that picture.

 8. kothapalli ravibabu
  10:54 సా. వద్ద జూన్ 2, 2012

  scenes like this from various films especially from malayalam sex pictures are being shown in RK’s ABN andhrajlyoti channel. the same RK tells so many goodwords to students in youngistan etc programmes in his channel. If he has any sense he must cancel the programme ” Idi mallela vela ani” at 11.30 pm and its repetition at 4.30 am everyday

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.