ముంగిలి > జిడ్డు ప్రశ్నలు, మన సంస్కృతి > రామాయణంలోని సంఖ్యాప్రమాణములు

రామాయణంలోని సంఖ్యాప్రమాణములు

జూన్ 2, 2012

శ్రీమద్రామాయణం యుద్ధకాండ 28వ సర్గలో, శుకుడు అనే ఒక గూఢాచారి, శ్రీ రామ సైన్య వైశాల్యాన్నిప్రస్తావిస్తూ, భారతీయ గణితశాస్త్రఙ్ఞుల సంఖ్యాప్రామాణములను వివరిస్తాడు.

33/1. శతం శత సహస్రాణాం కోటిమాహుర్మనీషిణః
102 x 102 x 103 = 107
నూరు లక్షలు = ఒక కోటి (billion)

33/2. శతం కోటి సహస్రాణాం శంఖ ఇత్యభిదీయతే
102 x 107 x 103 = 1012
లక్ష కోట్లు = ఒక శంఖము (trillion)

34/1. శతం శంఖ సహస్రాణాం మహా శంఖ ఇతి స్మృతః
102 x 1012 x 103 = 1017
లక్ష శంఖములు = మహా శంఖము (100 quadrillions)

34/2. మహా శంఖ సహస్రాణాం శతం బృందమితి స్మృతమ్
1017 x 103 x 102 = 1022
లక్ష మహా శాంఖములు = ఒక బృందము (10 sextillion)

35/1. శతం బృంద సహస్రాణాం మహా బృందమితి స్మృతమ్
102 x 1022 x 103 = 1027
లక్ష బృందములు = ఒక మహా బృందము (octillion)

35/2. మహాబృందసహస్రాణాం శతం పద్మమితి స్మృతమ్
1027 x 103 x 102 = 1032
లక్ష మహా బృందములు = ఒక పద్మము(100 nonillion)

36/1. శతం పద్మ సహస్రాణాం మహా పద్మమితి స్మృతమ్
102 x 1032 x 103 = 1037
లక్ష పద్మములు = ఒక మహా పద్మము (10 undecillion)

36/2. మహాపద్మసహస్రాణాం శతం ఖర్వమిహోచ్యతే
1037 x 103 x 102 = 1042
లక్ష మహా పద్మములు = ఒక ఖర్వము (tredecillion)

37/1. శతం ఖర్వసహస్రాణాం మహాఖర్వమిహోచ్యతే
102 x 1042 x 103 = 1047
లక్ష ఖర్వములు = ఒక మహా ఖర్వము (100 quattuordecillion)

37/2. మహాఖర్వసహస్రాణాం సముద్రమ్ అభిదీయతే
1047 x 103 = 1050
వెయ్యి మహా ఖర్వములు = ఒక సముద్రము (100 quindecillion)

38/1. శతం సముద్రసాహస్రమ్ ఓఘ ఇత్యభిదీయతే
102 x 1050 x 103 = 1055
లక్ష సముద్రములు = ఒక ఓఘము (10 septendecillion)

38/2. శతమోఘసహస్రాణాం మహౌఘ ఇతి విశ్రుతః
102 x 1055 x 103 = 1060
లక్ష ఓఘములు = ఒక మహౌఘము (novemdecillion)

ఒకసారి 10వ (37/2) శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించండి. “మహాఖర్వసహస్రాణాం” అని మాత్రమే ఉన్నది “శత మహాఖర్వసహస్రాణాం” అని లేదు – అంటే మిగతావాటికి భిన్నంగా ఇక్కడ ప్రతిపాదన లక్షలలో కాకుండా వేలలో మాత్రమే ఉన్నది. వాల్మీకి రామయణ అనువాదాలలో, Wikipedia లలో సైతం, ఈ శ్లోకాన్ని లక్షలలోనే భావించారు. అంచేత సముద్రం, ఓఘము ఇంకా మహౌఘముల సంఖ్యలో రెండు సున్నాలు అదనంగా పెట్టారు. తప్పు ఎక్కడ జరిగి ఉంటుంది?

ప్రకటనలు
 1. 6:16 సా. వద్ద జూన్ 2, 2012

  NICE

  🙂

 2. lokesh
  8:17 సా. వద్ద జూన్ 2, 2012

  Mee peru naaku teleedu kaani… chala adhbuthamaina visleshana tho kudina samacharanni post chestunnaru. mee blog chustunte maa guruvu garu cheppe vishayale gnapakam vostunnayi. vilaythe mee peru teliyajeyagalaru. Dhanyavadhalu…itlu Mallampalli Lokesh kumar.

  • 9:09 సా. వద్ద జూన్ 2, 2012

   మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలు. నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి.

 3. 10:11 సా. వద్ద జూన్ 2, 2012

  బావుందండి మీ టపా .ఇంతకీ శ్రీరామ సైన్యం ఎంత? రావణ సైన్యం ఎంత ?

  • 3:42 సా. వద్ద జూన్ 3, 2012

   “వేయికోట్లు, నూరు శంఖములు, వేయి మహాశంఖములు, వంద బృందములు, వేయి మహాబృందములు, వంద పద్మములు, వేయి మహా పద్మములు, వంద ఖర్వములు, నూరు సముద్రములు, వంద మహౌఘములు, కోటి మహౌఘములు – ఇట్లు ఒక మహాసముద్రమువలే అసంఖ్యాకులైన వానరసైనుకులతో…” అని రాసున్నదానిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, పై ప్రశ్న మెదిలింది. రావణుడి సైన్యం ఇంత అని తిన్నగా ప్రస్తావించినది చదువలేదు. Relative గానే చూపారు.

 4. 12:04 ఉద. వద్ద జూన్ 3, 2012

  తెలుగుభావాలు గారు..!

  బాగా రాసారండి. మీరగిన ప్రశ్నకి ఎరిగినవారెవరైనా బదులిస్తారని ఆశిస్తున్నాను.

  భారతీయ సంఖ్యమానంలో అన్నిటికన్నా పెద్ద సంఖ్య తల్లక్షణం(1 పక్కన 53 సున్నాలు) అని బళ్లో చదువుకున్న పాఠం. అది తప్పని ఈ మధ్యనే తెలిసింది. ఇక్కడ ప్రస్తావించిన మహౌఘం 1 పక్కన 60 సున్నాలు కలిగినదన్నమాట. ఇంతకీ మన సాహిత్యప్రస్తావనల్లోని అతి పెద్ద సంఖ్య ఇదేనా..? వేరేదేదైనా ఉందా.? తెలిస్తే పంచుకోగలరు.

  • 3:46 సా. వద్ద జూన్ 3, 2012

   భారతీయ సంఖ్యమానంలో, నాకు ఎదురుబడిన అతి పెద్ద సంఖ్య – ఇప్పటికి మాత్రం ఇదే. కానీ, మహాభారతంలో సైన్యాన్ని అక్షౌహిణులుగా లెక్క చూపారు. ఆ వివరాలను ఇంకా విశ్లేషించలేదు. కాబట్టి మహౌఘంకన్నా పెద్ద సంఖ్య ఉండే ఉంటుంది.

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.