ముంగిలి > పిచ్చాపాటి > ఋతుపవనాలు వచ్చేస్తున్నాయ్

ఋతుపవనాలు వచ్చేస్తున్నాయ్

జూన్ 6, 2012

ఇవాళ ఆఫీసుకు వస్తుంటే, ఆకాశంనిండా మబ్బులే. ఎండ బాగానే కాస్తోంది కానీ గుబురు గుబురుగా మబ్బులు కూడా భలే చూడచక్కగా ఉన్నాయి. నాకు గుర్తుండి నేను ఇంత ఆశగా వానాకాలంకోసం ఎదురుచూస్తున్నది ఇదే మొదటిసారి. ఈసారి వేసవి మరీ పొడి పొడిగా అనిపించింది. మునుపటి సంవత్సరాలలో, అడపా దడపా జల్లుల్లు కురిసి, ఊరట కలిగిస్తుండేవి. ఈ సారే – మరీ డ్రైగా అనిపించిందీ వేసవి. మామూలు మొక్కలు పక్కన పెట్టండి, తామర కొలనులో ఉన్నా – తామరపూలు (Water lillies) కూడా ఎండ ధాటికి మాడిపోయినట్లు విచ్చుకుంటున్నాయి. నీళ్ళలో ఉండే వాటికే అంత కష్టంగా ఉంటే, మన సంగతో?

టెక్నికల్‌గా ఈ మబ్బులు ఋతుపవనాల మబ్బులు కాకపోయినా, వాటి దర్శనమే పదివేలు. ఈ నందన నామ సంవత్సరంలో – వానలు బాగా పడాలని ఆశిస్తూ…

మా ఊరి మబ్బులు - 1

మా ఊరి మబ్బులు – 1

మా ఊరి మబ్బులు - 2

మా ఊరి మబ్బులు – 2

మా ఊరి మబ్బులు - 3

మా ఊరి మబ్బులు – 3

మా ఊరి మబ్బులు - 4

మా ఊరి మబ్బులు – 4

మా ఊరి మబ్బులు - 5

మా ఊరి మబ్బులు – 5

ప్రకటనలు
 1. 2:53 సా. వద్ద జూన్ 6, 2012

  ఎక్కడున్నారు సార్! ఆంధ్రాప్రదేశ్ లోనేనా? తూ.గో.జి లో ౫౦ డిగ్రీల దగ్గర పాదరసం మరిగిపోతోంది సార్! రోజుకి దగ్గరగా ౫౦ మంది వడకొట్టి చచ్చిపోతున్నారండీ!!!ఋతుపవనాల జాడా లేదు బాబోయ్!!!

  • 3:56 సా. వద్ద జూన్ 6, 2012

   శర్మగారు – అలా అనుమానపడ్డారేంటండి! “మా ఊరి మబ్బులు” అని ఐదు ఫోటోలు తీసి సాక్ష్యాలు జతచేశాను కదా! నాదీ ఆంధ్రప్రదేశమే – కాకపోతే భాగ్యనగరం. ఓ రెండు మూడు రోజుల్లో మీ ఊరికీ వస్తాయిలెండి.

 2. 4:32 సా. వద్ద జూన్ 6, 2012

  just saw the cloudy sky at 2 PM when came out of the office AC to have lunch. So beautiful. Wish the rainy clouds will come soon.

 3. 5:29 సా. వద్ద జూన్ 6, 2012

  మా అమ్మగారు కూడా చెపుతున్నారండి చాలా ఎండలు ఉన్నాయి అని. వర్షాలు కురిస్తే బాగున్ను అని. మీరు ఆశిస్తున్నట్టు వర్షాలు పడాలని కోరుకుంటూ, త్వరలో ఇండియా ప్రయాణం పెట్టుకున్నాము. మేము వచ్చేటప్పటికి చల్లబడి పోవాలన్న అత్యాశతో ….
  మీ మబ్బుల చిత్రాలు బాగున్నాయి…

  • 6:21 సా. వద్ద జూన్ 6, 2012

   అది అత్యాశ ఎందుకవుతుందండీ? చల్లబడాలి…వానలూ కురవాలి…

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.