ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > సీతమ్మ శ్రీరాముని కన్నా వయసులో పెద్దదా లేక చిన్నదా?

సీతమ్మ శ్రీరాముని కన్నా వయసులో పెద్దదా లేక చిన్నదా?

ఆగస్ట్ 8, 2012

ఎందుకో – సీతమ్మ శ్రీరాముడికన్నా వయసులో పెద్దది అనే ప్రచారం ఉన్నది. దీనికి కారణం ఏమయి ఉంటుందో! వాల్మీకి రామాయణంలో ఈ విషయం గురించి, ఒక సంధర్భంలో తేటతెల్లంగా వివరాలు దొరుకుతాయి.

అరణ్యకాండ 47వ సర్గ. యతి వేషంలో రావణాసురుడు సీతాదేవి వద్దకు వచ్చినప్పటి సంధర్భం. తానెవరని యతి వేసిన ప్రశ్నకు సమాధానంగా తన వివరాలు చెబుతుంది సీతమ్మ. ఆ సర్గలో పదవ శ్లోకం…

మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః |
అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||

అర్థం: మిగులు పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి* వయస్సు ఇరువదిఐదు సంవత్సరములు. నా వయస్సు పదునెనిమిది సంవత్సరములు.

* ‘అప్పటి’ – అంటే తాము అరణ్యవాసానికి బయలుదేరినప్పటి వయసును అమ్మవారు తెలిపారు.

శ్రీరాముడు సీతమ్మకన్నా వయసులో ఏడేళ్ళు పెద్ద వాడు. ఇందులో అనుమానమే లేదు. వనవాసంలో పదునాల్గవ సంవత్సరం మొదలుకావస్తున్నందున, యుద్ధం జరిగినప్పటికి వారి వయసును లెక్క కట్టవచ్చు. రామరావణ యుద్ధం జరిగినపుడు శ్రీరామునికి 39వ సంవత్సరం నడుస్తుంటే, అమ్మవారికి 32 నడుస్తున్నాయి.

సీతా రాములు

సీతా రాములు

యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి |
నిందితస్స జనో లోకే స్వాఽఽత్మాప్యేనం విగర్హతే ||

ఈ టపాలో మీకు ఏదన్నా తప్పుగా విశ్లేషించినట్లు అనిపిస్తే, దయచేసి ప్రతిపుష్టి పుట ద్వారా తెలియజేయగలరు.

ప్రకటనలు
 1. 11:14 ఉద. వద్ద ఆగస్ట్ 8, 2012

  రామరావణ యుద్ధం జరిగినపుడు శ్రీరామునికి 39వ సంవత్సరం నడుస్తుంటే, అమ్మవారికి 32 నడుస్తున్నాయి

  It’s Wrong

  Correct 25+1, 18+1.

  • 12:01 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

   అర్థం కాలా. ఏ లెక్కన 25+1, 18+1 అంటున్నారు?

   • 1:08 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

    మిరియాలవారూ,
    మీ అభిప్ర్రాయం ప్రకారం సీతాపహరణం జరిగే నాటికి సీతమ్మ వయస్సు 18 సంవత్సరాలు అనుకుంటున్నారు. టపా రచయిత స్పష్టం గానే సీతమ్మ వయస్సు అరణ్యవాసారంభ సమయానికి 18 సంవత్సరాలు అని చెప్పారు కదా. గందరగోళం యేముంది.

    శివధనుర్భంగం చేసే నాటికి రాముని వయస్సు 15 సంవత్సరాలు. ఆపైన అయోధ్యలో కొన్నేళ్ళున్నాక కదా అరణ్యవాసం మొదలయింది. అప్పటికి రాముని వయస్సు 25 సంవత్సరాలు. రావణవధతో రాముని అరణ్యవాస పరిమితి 14 సంవత్సరాలు కూడా ఒకటి రెండు రోజులు మాత్రం మిగిలింది. కాబట్టి, రామరావణ యుద్ధం జరిగినపుడు శ్రీరామునికి 39వ సంవత్సరం నడుస్తుంటే, అమ్మవారికి 32 నడుస్తున్నాయి.

   • 1:36 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

    సీత రావణుని వద్ద ఉన్నది 1 సంవత్సరము మాత్రమే 14 కాదు

    • 2:00 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

     అవును మహాప్రభో! మరి గడిచిపోయిన 13 ఏళ్ళ వనవాసాన్ని ఏమి చెయ్యాలి?

     • 2:14 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

      మీరు పెట్టిన * గుర్తు చూడలేదు.

      • 2:16 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

       రామునికి పెళ్లి 12 ఏళ్ల వయసు లో జరిగింది అంటే 12-13 ఏళ్ల పాటు అయోధ్య లో ఉన్నారన్న మాట. interesting.

      • Sparrow
       7:02 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2012

       కూడికలు తీసివేతల్లో అన్నామలై యూనివర్సిటీ ఆన్లైన్ డిప్లొమా కోర్స్ వుంది, చేస్తారా?

 2. 10:13 సా. వద్ద ఆగస్ట్ 8, 2012

  స్టారు కండీషన్ లు పెడితే, కండీషన్లు అప్లై అని చిన్నగా రాయాలి. అయినా తెలుగు భావాలు గారు పెద్ద గానే రాసారు.

  మిరియాల వారు , మీ ‘రియ్యాల’ (మీరివ్వాళ) కాస్త మిరియంపుకాయ సైజు స్టారు చూడకుండా పోవడం వల్ల మొత్తం మీద ఇంత వివరణ నడిచిందన్న మాట

  చీర్స్
  జిలేబి.

 3. Kiran
  12:21 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

  మరి అన్ని సంవత్సరాలు ఇద్దరి మధ్య శృంగారం జరగలేదా ? అప్పట్లో వేరే విధమైన ఆచారం ఏమైనా ఉన్నదా ?.. కుశలవులు సెకండాఫ్ లో పుడతారు కద ?

  • 1:25 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

   స్త్రీ పురుషుల మధ్యనుండే సంబంధం కామం మాత్రమేనంటారా?

   కేవలం శ్రీరామునికే కైక వనవాసం కోరింది. అంటే అంతరార్థం బ్రహ్మచర్యసహిత తపోవ్రతం. వనవాసం గురించి తెలిపి ఒంటరిగా వెళ్ళిపోవాలని వేంచేసిన రామయ్యతో సీతమ్మ “ఓ మహావీరా! నియమ నిష్ఠలతో బ్రహ్మచర్యమును పాటించుచు నేను నిత్యమూ మీకు శుశ్రూషలు చేయుచుందును” అని బ్రహ్మచర్యసహిత తపోవ్రతానికి అనుకూలంగా చెబుతుంది. ఇది అయోధ్యకాండ 27వ సర్గలో 13వ శ్లోకంలో ఉన్నది. ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల అర్థం, వాటి వెనుకనున్న గాంభీర్యం అర్థం అయితే బహుశః ఇంత వక్రమైన ప్రశ్న తలెత్తి ఉండేది కాదేమో!

  • 9:27 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

   శ్రీరామచంద్రులవారు పదునొకండువేల సంవత్సరాలు భూలోకంలో ఉన్నారు.
   రావణవధ చేసే నాటికి ఆయన వయస్సు 39సంవత్సరాలు మాత్రమే.
   ఆ తరువాత పదివేల సంవత్సరాలు గడిచాక సీతాపరిత్యాగం చేసారు.
   పరిత్యక్త అయేనాటికి సీతామహాదేవి అంతర్వత్ని.
   కుశలవజననం తరువాత 12 సంవత్సరాలు గడిచాక సీతామహాదేవి భూదేవిలో ఐక్యం అవుతుంది.
   ఆ తరువాత రమారమి వేయేండ్లు గడిచాక శ్రీరామచంద్రులు స్వధామం చేరుకున్నారు.

 4. Kiran
  12:24 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

  సీత సిగ్గుపడి.. వయసు తక్కువ చెప్పిందేమో ?..

  • 1:27 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

   You are speculating. I have provided proofs.

  • Sparrow
   6:55 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2012

   ఏమో, ఏఏఏఏమో! అదేమో!, ఇదేమో! కాదేమో! అవునేమో! రోకలి తలకు చుట్టాలేమో!!!

 5. Kiran
  2:01 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

  నేనడిగింది అరణ్యవాసం లోని సంవత్సరాలు కావు.. పెళ్ళయ్యాక వనవాసం పోయే ముందరి సంవత్సరాల గురించి.. పూర్తి సహజమైన, స్వతంత్ర్యమైన ప్రశ్న.. వక్రపు ఆలోచన నుండి పుట్టినది కాదు.అందుకే ప్రశ్న ఉదయించటానికి నా కుతూహలానికి కారణమైన “అప్పట్లో వేరే విధమైన ఆచారం ఏమైనా ఉన్నదా ?” ప్రస్థావించాను.

  ప్రూఫ్ అని అంటున్న దానినే సహజమైన సిగ్గు వల్ల చెప్పిన .. దారిన పోయే భిక్షువు కు పూర్తి వివరాలు (అంటే అతి చిన్న విషయాలు) చెప్పనవసరం లేదు కదా.. పూర్తి సహజంగా పుట్టిన సందేహం..

  సీతారాములు ఆదర్శ వంతులని అంగీకరిస్తాను.. నేను విష వృక్షాన్ని కనీసం చదవదల్చుకోలేదు..

  • 9:29 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2012

   కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే ఆధారం చేసుకొని చూస్తే, అరణ్య వాసానికి ముందు సీతా రాములు అన్యోన్యంగా గడిపారని మాత్రం తెలుస్తుంది. ఇంతకు మించి వారి ఆంతరంగిక జీవితాలపై ఏ వ్యాఖ్యా కనబడదు. ఉత్తరకాండ 42 సర్గను బట్టి, అమ్మవారు ‘దశవర్ష సహస్రాణి’ అంటే 10000 ఏళ్ళ కాపురం తరువాత గర్భం ధరించారు.

   ఇక రెండవ ప్రశ్న. భిక్షువు రూపంలో రావణుడు ఆ మహారణ్యంలో నివసించడానికిగల కారణం అడిగాడు. భిక్షువు అని నమ్మి ఆవిడ సంక్షిప్తంగా వారి వృత్తాంతాన్ని చెబుతుంది. అంత సిగ్గు పడవలసిన అవసరం ఉంటే వయసు ఎంత అని specificగా వాడు ఆడుగలేదుగనుక ఆ విషయాన్నే ఆవిడ దాటేయవచ్చు.

 6. Kiran
  7:50 సా. వద్ద ఆగస్ట్ 9, 2012

  నాకు ఏమనిపిస్తుందంటే, శరీరం ఆధిపత్యం చేయగలిగినపుడు శృంగారపు ఆలోచన మొదలవడానికి ఆస్కారం ఉంది. సంపూర్ణంగా స్వచ్చమైన పసి వారిలా మనసు కల వారు, సాత్వికంగా జీవనం గడిపే వారు, కళలలోనే నిమగ్నమమైన వారి జీవనం గాలిలో విహరించినట్లే కదా.. అపుడు వారికి శృంగారం పై ధ్యాస మళ్ళకపోవటం లో వింతేముంది.. ? మనసు గెలవాలని ఉండే తపన, పూర్తి స్వాధీనంలో ఉన్న మానసిక పరిణతి, దైవత్వపు పరిణతి బోధింపడ్డ మనిషి సరైన దారి వదిలి క్షణకాలపు సుఖాలకు ఎలా ప్రాధాన్యం ఇస్తాడు. ?

  • Sparrow
   6:58 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2012

   యథాబుద్ధి తథో మనః
   ఏమో మనకెలా అనిపిస్తుందో అందరికీ అలానే అనిపిస్తుందేమో అని అనిపిస్తుందేమో!

 7. Edge
  5:48 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2012

  తెలుగు భావాలూ గారు,

  కొన్ని వందల (వేల??) సంవత్సరాలనాడు రాయ (చెప్ప) బడిన గ్ర్నంధాన్ని irrefutable evidence గా మీరు quote చేస్తున్నారు కదా.

  అది ఆనాటి సమాజం మరియు గ్రంధకర్త యొక్క ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తున్న కల్పిత (పూర్తిగా/చాలావరకు/కొంతమేరకు) గాధ అయ్యుండే possibility గురించి ఎప్పుడైనా consider చేసారా?

  గమనిక:
  నేను రంగనాయకమ్మ గారి అభిమానిని కాదు/ఆమె పుస్తకాలేమీ చదవలేదు. Marxist నో communist నో అంతకన్నా కాదు. Christian /muslim లేదా మరే ఇతర మతస్తుడనో కూడా కాను. నా opinions మరియు decisions మాత్రం వీలైనంతవరకు logic & reason మీద ఆధార పడేట్లుగా ప్రయత్నిస్తాను.

  • 8:34 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2012

   సీతమ్మా-రామయ్యల వయసు మీద ఒక అపోహ ఉన్నది. “ఠాట్‍… అది తప్పు! ఎందుకంటే నేను చెబుతున్నా కాబట్టి” అని టపా రాశాననుకోండి – ఎవరన్నా చదువుతారంటారా? పోనీ – అబాండాలు వేసే వారు దేనిని ఆధారం చేసుకుంటుంటారో మీకేమన్నా తెలుసా?

   మీ Disclaimer అదే ‘గమనిక’ అవసరం లేదులెండి. మీరు ఏ కోవకు చెందినా – as long as your comment is based on logic and is reasonable; I should have no objection.

 8. 9:56 సా. వద్ద ఆగస్ట్ 14, 2012

  రామాయణంగురించి కొన్ని సందేహాలు వెలిబుచ్చినవారంతా రంగనాయకమ్మ విషవృక్షాన్ని సమర్థిస్తున్నారని అనుకోనక్కరలేదు.మన పురాణాలు,ఇతిహాసాల సారాంశం ముఖ్యం.అందులో కొన్ని కల్పనలూ,అసంగతవిషయాలూ,అతిశయోక్తులూ ఉండవచ్చును.కాని రామాయణంలో భిక్షు వేషంలో వచ్చిన రావణుడితో సీతాదేవి అరణ్యవాసానికి వచ్చినప్పుడు శ్రీరాముని వయస్సు 25సం; ,తనవయస్సు 18సం;అని చెప్పినట్లు ఉన్నది.దానికి 14 సం’కలిపితే రామపట్టాభిషేకానికి వారి వయస్సు తెలుస్తుంది.కాని రాముడు,10 వేలసం;,దశరథుడు 60వేల సం;రాజ్యం చేసారన్నది అతిశయోక్తి అని నా అభిప్రాయం.ఈమధ్య రచన మాసపత్రికలో సైంటిస్టు కవనశర్మగారు రామకాండ అనే పేరుతో రామాయణంగురించి పరిశోధించి రాస్తున్నారు.ఆయనమాటల్లో ” ఈ రచనని నేను రామాయణం ఒకప్పుడు జరిగిన చరిత్రకి సాహిత్య రూపం అన్న స్పృహతో రాస్తున్నాను.రామాయణంలో అభూత కల్పనలుంటే వాటిని తొలగించి చూడాలనే స్పృహతో రాస్తున్నాను.”

  • 11:07 సా. వద్ద ఆగస్ట్ 14, 2012

   M.V.Ramanarao: “రామాయణంగురించి కొన్ని సందేహాలు వెలిబుచ్చినవారంతా రంగనాయకమ్మ విషవృక్షాన్ని సమర్థిస్తున్నారని” ఎవరు అనుకుంటున్నారు?

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.