ముంగిలి > శిరోభారం > నేనెవరిని?

నేనెవరిని?

అక్టోబర్ 6, 2012
 • లెక్కలేనన్ని సంవత్సరాల చరిత్ర గల సంస్కృతికి వారసుడిని నేను…
 • నా ధర్మంపై అవగాహనా, తెలుసుకోవాలన్న తపనా రెండూ లేని వాడిని నేను…
 • కాస్తంత వినసొంపుగా చెబితే, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాను నేను…
 • ఎవరైనా ఇట్టే సొమ్ము చేసుకోకోగలిగిన బద్దకం, అసమర్థత, అశక్తతలున్నవాడిని నేను…
 • సినిమాలలో ఏది చూపెడితే, అదే నా సంస్కృతి అని నమ్మేవాడిని నేను…
 • ఐశ్వర్యం తాండవించే ఆలయంలో ప్రసాదాన్ని కొనుక్కోవలసిన దరిద్రాన్ని అనుభవించేవాడిని నేను…
 • క్రీస్తు పూర్వాలు, క్రీశ్తు శకాలే కానీ శాలివాహన శకం అర్థంకాని నేను…
 • పురాతనాలయాలలోని విగ్రహాలను విదేశాలకు మళ్ళిస్తుంటే, ‘నాకేంటీ?’ అని మీనమేషాలు లెక్కిస్తుంటాను నేను…
 • రాజకీయ శక్తులు నా విశ్వాసం పేరిట ఒక్క ప్రార్థనా స్థలాన్ని కూల్చి తమ పబ్బం గడుపుకున్న పాపానికి, చెరగని కళంకం ఆపాదించబడినవాడిని నేను…
 • రోమన్ మృతవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రేమికుల పండుగగా జరుపుకోవాలని తెలిసినా – గురు పౌర్ణమి, మహాలయ పక్షాల వంటి విషయాలు పట్టనివాణ్ణి నేను…
 • నా దేవాలయాలలోని ధర్మాధికార పదవులు ‘రాజకీయ కుక్క బిస్కెట్లు’ అన్న నిజానికి ముఖం చాటేస్తూ తిరుగుతుంటాను నేను…
 • ఆయన ఏడుకొండలవాడు కాదు, రెండు కొండలవాడే అని చెబితే ‘నమ్మి ఊరకుంటాడు’ అని తలపించే వాడిని నేను…
 • చదువులతల్లి నెలవులో – ఏ మాంసం తినాలో ఏ మాంసం తినకూడదోనన్న మీమాంశలో సతమతమవుటూ ఉండే భావిభారత పౌరుణ్ణి నేను…
 • ఎందరినో ఊచకోత కోసిన టిప్పూసుల్తాన్ కత్తి మీద చూపినంతగా – శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ వంటి వారు కట్టించిన గోపురాల మీద ఆసక్తి కనబరచను నేను…
 • హుండీలలో సొమ్ము చేసుకొన్న భక్తిని దేనికి వాడుతున్నారో తెలుపమని ప్రశ్నించడం చేతకానివాడిని నేను…
 • వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలోనిదైతేనేమి, ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని గోపురమైతేనేమి? కూలిపోయినా నిమ్మకు నీరెక్కనట్టుండే వాడిని నేను…
 • అధిక సంఖ్యాక వర్గానికి చెందిన అల్ప జీవిని నేను…
ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు: