ముంగిలి > రాజకీయం, శిరోభారం > టాపు లేపిన టార్పాలిన్

టాపు లేపిన టార్పాలిన్

నవంబర్ 13, 2012

ప్రభుత్వాన్ని ఒక టార్పాలిన్ ఆచ్ఛాదనం కూడా కూల్చగలదన్నమాట! చార్మినారుని ఆనుకొనున్న భాగ్యలక్ష్మి ఆలయం పైన కోర్టు ఆదేశ పరిధిలోనే వేసిన ఆచ్ఛాదానానికి వ్యతిరేకంగా MIM పార్టీ వారు ధర్నాకు దిగినపుడు, మజ్లీస్ MLAలను అడ్డగించినందుకు అలిగి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ ఏడుగురు MLAలు, అక్కడ ఒక MP. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారని అలిగి, తమ వ్యతిరేకతను ఇలా వెలిబుచ్చారు.

పాత నగరంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు; హిందువులు అల్ప సంఖ్యాకులు. పైపెచ్చు చార్మినార్ అనేది మతపరమైన కట్టడం కాదు. దీపావళి పండుగకు ప్రధానంగా చేసే పూజ లక్ష్మమ్మవారికే. పోనీ ఇదేమన్నా కొత్తా అంటే – అదీ లేదాయే! ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఆ ఆలయానికి భక్తులు అధికంగానే తరలి వస్తుంటారు. MIM పార్టీ వారు అలకపాన్పునెక్కడం వెనుక ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా?

వేములవాడ గుడిలో ఉన్న దర్గాను ఏమి చెయ్యాలి? కర్నూలు ఆలంపుర శక్తిపీఠంలో ఉన్న మసీదు సంగతి ఏమిటి? ఇటువంటివి ఈ MIM వారికి తెలుసునా? పదుల్లో కాదు, భారతదేశమంతటా ఇటువంటివి వందలలో ఉన్నాయి. హైందవ భక్తులు భక్తి పూర్వకంగా గుడికి వెళ్ళినపుడు ఈ దర్గాలలో, మసీదులలోకి సైతం వెళ్ళి ఓ దణ్ణం పెట్టుకు వస్తుంటారు. ఇంతటి మత సామరస్యాన్ని ప్రదర్శిస్తున్న so called అధిక సంఖ్యాకులతో మెలుగ వలసిన పద్దతేనా ఇది?

Of course, ఇప్పుడు జరుగుతున్నది కేవలం రాజకీయం మాత్రమే అయి ఉండవచ్చు. ఎన్నో ఏళ్ళగా చూస్తూనే ఉన్నాము. రాష్ట్ర (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిని పదవినుండి తొలగించాలంటే, పాత బస్తీలో అల్లర్లు మొదలు పెడతారు అని.

కాంగ్రెస్ ముఖ్య మంత్రి పదవికి పెద్దగా విలువ ఉండదని తెలుసు కానీ మరీ ఒక టార్పాలిన్‌కూడా టాపు లేపగలదని మొదటిసారి చూట్టం…

ప్రకటనలు