ముంగిలి > దేవాలయాలు, మన సంస్కృతి, సందర్శన > కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం

కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం

డిసెంబర్ 3, 2012

కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాలవద్ద జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కౢప్తంగా తెలిసినది ఏమంటే – కార్తీక పౌర్ణమినాడు ఎవరు జ్వాలా తోరణం కిందనుంచి శివుని పల్లకితో ప్రయాణం చేస్తారో, వారు యమపురి ద్వార తోరణ బాధను తప్పుకొంటారు అని. మరో విశ్వాసం కూడా ప్రచారంలో ఉన్నది. క్షీరసాగర మథనం జరిగినపుడు మొట్టమొదట హాలాహలం ఉద్భవించినపుడు, లోకాలను కాపాడటానికై శివుడు దానిని మింగి తన కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడు లేదా నీల కంఠుడు అయ్యాడు. అయితే విషాన్ని మింగిన తన భర్తకు ఏ హానీ కలుగకుండా ఉంటే తాను తన భర్తతో సహా జ్వాలాతోరణంగుండా మూడూ సార్లు నడుస్తానని ఆవిడ మొక్కుకొందిట. కానీ ఈ రెండవ కారణం కేవలం ప్రచారంలో ఒక ఉన్న నమ్మకంగా మాత్రమే తోస్తున్నది. మహాదేవుడిని ఏ హాలాహలం మటుకు ఏమి చెయ్య గలదు? ఒక వేళ అనుమానంతో పార్వతీ దేవి అలా మొక్కుకొన్నది అని భావించినా, ఆవిడ మొక్కును తీర్చే దేవత మరొకరు ఉంటారా? ఏది ఏమయినా, ఈ రెండు కారణాలు నాకు దొరికాయి.

చివరిలో ఒక ఆసక్తికరమైన సంఘటన. మూడు సార్లు జ్వాలా తోరణం గుండా స్వామివారి పల్లకి, ఆ పల్లకి వెంటే భక్తులూ ప్రయాణం చేసిన వెను వెంటనే, జ్వలిస్తున్న తోరణం మీద భక్తులు ఎగబడి మిగిలిన గడ్డిని సంపాదించే ప్రయత్నం చేస్తారు. పోటీ బడి మరీ గడ్డిని లాక్కొనే ప్రయత్నం చేస్తారు. అలా దొరికిన గడ్డిని తమ పశువులు తినే గడ్డిలో కలుపుతారు. అలా చేస్తే అవి బాగా వృద్ధి చెందుతాయని వారి విశ్వాసం.

కాలం కలిసివచ్చి, మొన్నటి కార్తీక పౌర్ణమి నాడు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మురమళ్ళ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయ దర్శనభాగ్యం కలిగింది. ఆ దేవాలయంలో సాయంత్రం నిర్వహించిన జ్వాలా తోరణ విశేషాలను నా జీవితంలో మొదటిసారి చూసి, దాని గుండా స్వామి వారి పల్లకిని అనుగమిస్తూ మూడు సార్లు ప్రయాణించే అవకాశం కూడా నా భాగ్యంలో రాసి ఉన్నది.

ఆ సంధర్భంలో తీసిన ఫొటోలు…

భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం - మురమళ్ళ

భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం – మురమళ్ళ

గర్భ గుడి గోపురం

గర్భ గుడి గోపురం

ధ్వజ స్తంభము

ధ్వజ స్తంభము

కార్తీక పున్నమి చంద్రుడు, ఆలయ గోపురం

కార్తీక పున్నమి చంద్రుడు, ఆలయ గోపురం

ఎండు (వరి) గడ్డితో సిద్ధం చేసిన తోరణం

ఎండు (వరి) గడ్డితో సిద్ధం చేసిన తోరణం

లింగాకృతిలో దీపాలంకారము

లింగాకృతిలో దీపాలంకారము

వీరంగ విన్యాసము - 1

వీరంగ విన్యాసము – 1

వీరంగ విన్యాసము - 2

వీరంగ విన్యాసము – 2

వీరంగ విన్యాసము - 3

వీరంగ విన్యాసము – 3

వీరంగ విన్యాసము - 4

వీరంగ విన్యాసము – 4

స్వామివారి పల్లకి

స్వామివారి పల్లకి

తోరణాన్ని వెలిగిస్తున్న అర్చకులు

తోరణాన్ని వెలిగిస్తున్న అర్చకులు

జ్వాలా తోరణం

జ్వాలా తోరణం

మిగిలిన గడ్డి కోసం ఎగబడుతున్న భక్తులు

మిగిలిన గడ్డి కోసం ఎగబడుతున్న భక్తులు

ప్రకటనలు