ముంగిలి > పిచ్చాపాటి > మరొక టీ.వీ. వార్తా ఛానెల్‌?!?!

మరొక టీ.వీ. వార్తా ఛానెల్‌?!?!

ఉదయాన్నే పేపరు తిరగేసినపుడు, ఒక వార్త – ముఖ్య మంత్రి గారు కొత్త వార్తా ఛానెల్‌ను ప్రారంభించారని! మరో టీ.వీ. ఛానెలా? అదీ వార్తా ఛానెలా? అసలు మనకు తెలుగులో ఎన్ని టీ.వీ. ఛానెళ్ళున్నాయా అని అనుమానమొచ్చి ఒక సారి రిమోట్‌తో అటూ ఇటూ పరిగెట్టా! మా ఇంట్లో ఉన్నది – భాగ్యనగరంలోని హాత్‌వే కేబుల్ కనెక్షన్. తెలుగులో ఉన్న ఛానెళ్ళలో సగానికి సగం వార్తా ఛానెళ్ళే కనిపించాయి. అంతర్జాలంలో మరికొన్ని కనిపించాయి. అవి ఆన్‌లైన్ ఛానెళ్ళో లేక సాటెలైట్ కనెక్షన్ ఉన్న వారికే లభిస్తాయో తెలియదు. అయినా అనవసరం. నేనూ నా కూపస్థం గనుక మా ఇంట్లోని టీ.వీ.లో ఏవి కనిపిస్తే, అవే లెక్క. సాధారణ ఛానెళ్ళలో వచ్చేవి సినిమా సంబంధిత కార్యక్రమాలే అయినప్పటికీ, కేవలం కొన్నిటిని మాత్రమే సినిమాల కోవలో పెట్టి లెక్కించాను.

వార్తలు 17 43%
సాధారణం 9 23%
సినిమా సంబంధం 5 13%
క్రైస్తవ భక్తి 4 10%
హైందవం 2 5%
ఆరోగ్యం 2 5%
పిల్లల కార్యక్రమాలు 1 3%

ఈ లెక్కన బ్లాగుల సంఖ్యను తలదన్నే విధంగా, కొన్ని రోజుల్లోనే టీ.వీ. ఛానేళ్ళ సంఖ్య పెరిగిపోతుందేమో!

ఇప్పటి టీ.వీ. ఛానేళ్ళు, కేవలం వ్యాపార ప్రయోజనాలను చేకూర్చే సాధనాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. కొంత పెట్టుబడి పెట్టాను; అక్కడి నుండి, ఇక్కడి నుండీ కొంత సిబ్బందిని సమకూర్చు కున్నాను; చెయ్యవలసినదల్లా ఏదో ఒక విషయాన్ని (Theme) ఎన్నుకొని అందుకు తగ్గ సినిమా కత్తిరింపులను (clippings) సంపాదించి ఒక ప్రోగ్రామ్ తయరు చేసి – ప్రసారం చెయ్యడమే. లేదూ వార్తా ఛానెల్ అయితే గనుక మరీ సులువు. ఒక కెమెరా, ఒక మైకును అంటగట్టి, సిబ్బందిని వార్తల వేటలో దింపడమే! అక్కడెక్కడో కోడి పుంజూ, బురద పాముల మధ్యన జరిగిన యుద్ధాన్ని కూడా Breaking News అని వేసినా అభ్యంతరం లేదు.

పైపైకి చాలా తేలికగా కనిపించినప్పటికీ, సిబ్బంది పడే అగచాట్లు తలుచుకుంటే జాలి వేస్తూ ఉంటుంది. ఎక్కడో ఏదో జరుగబోతున్నది అని ఒక చిన్న సంకేతం అందితే చాలు – ఎండలేదు, వాన లేదు; చలి లేదు, ఉక్కపోత లేదు; రాత్రి లేదు, పగలు లేదు – వార్తల వేటలో ఎన్నో అగచాట్లు పడవలసి వస్తూ ఉండవచ్చు. అందునా, అటువంటి వార్తా సిబ్బందిలో స్త్రీలు ఉంటే మరికొన్ని ఇక్కట్లు. వార్తకు కేంద్ర బిందువైన వ్యక్తి కనబడినపుడు, చిన్న స్థాయి యుద్ధాన్నే చూడవచ్చు. ఒకరితో ఒకరు పోటీ బడి ఒక్క సారిగా కెమెరామెన్‌లు, పాత్రికేయులు ఎగబడతారు. తోసుకోవడాలూ, చొచ్చుకుపోవడాలు. పోనీ ఏమన్నా ప్రత్యేకత ఉన్నదా అంటే, అదీ ఉండదు. ముఖ్యమైన ఘటనలు సంభవించినపుడు – ఏ వార్తా ఛానెల్ తిరగేసిన, అదే సంఘటన ప్రత్యక్ష ప్రసారం కనిపిస్తుంది. Exclusivity అన్నది ఉండనే ఉండదు. ఇంతటి భీభత్సమైన పోటీలో నెగ్గుకొని రావాలంటే మాటలా? ఏదో ఒక కొత్త విషయాన్ని చూబించి మార్కులు కొట్టేయాలి. కానీ అన్ని ఛానెళ్ళ సిబ్బంది అప్పటికే సిద్ధంగా కాచుకొని ఉంటారు. ఇక విలువలను పట్టించుకొనే ఓపికా, తీరికా ఎవరికి ఉంటుంది?

1. CVR health ఆరోగ్యం
2. TV7 health ఆరోగ్యం
3. ఆరాధన క్రైస్తవ భక్తి
4. కల్వరి TV క్రైస్తవ భక్తి
5. బైబిల్ TV క్రైస్తవ భక్తి
6. శుభ వార్త క్రైస్తవ భక్తి
7. ఖుషి TV పిల్లల కార్యక్రమాలు
8. 10 TV వార్తలు
9. ABN ఆంధ్రజ్యోతి వార్తలు
10. CVR News వార్తలు
11. ETV 2 వార్తలు
12. HMTV వార్తలు
13. I News వార్తలు
14. N TV News వార్తలు
15. Studio N వార్తలు
16. T News వార్తలు
17. TV 5 News వార్తలు
18. TV1 వార్తలు
19. TV9 వార్తలు
20. V6 News వార్తలు
21. Zee 24 గంటలు వార్తలు
22. జెమిని News వార్తలు
23. మహా న్యూస్ వార్తలు
24. సాక్షి టీ.వీ. వార్తలు
25. C ఛానెల్ సాధారణం
26. DD సప్తగిరి సాధారణం
27. ETV సాధారణం
28. RVS సాధారణం
29. Zee తెలుగు సాధారణం
30. జెమిని టీ.వీ. సాధారణం
31. మా Gold సాధారణం
32. మా టీ.వీ. సాధారణం
33. వనిత టీ.వీ సాధారణం
34. Xtra టీ.వీ. సినిమా సంబంధం
35. జెమిని Movies సినిమా సంబంధం
36. జెమిని Music సినిమా సంబంధం
37. మా Movies సినిమా సంబంధం
38. మా Music సినిమా సంబంధం
39. SVBC హైందవం
40. భక్తి TV హైందవం
ప్రకటనలు
 1. 11:38 ఉద. వద్ద డిసెంబర్ 15, 2012

  నలభై ఛానల్స్ లో ఒక్కటే పిల్లల కార్యక్రమాల ఛానల్ ?
  ఇక్కడో డజన్ పైగా చిన్న పిల్లల చానల్స్ ఉంటాయి.
  క్రైస్తవ భక్తి ఛానల్స్ సంఖ్య కూడా ఆశ్చర్య పరిచింది.
  వార్తా ఛానల్స్ లో నాకు అసలు నచ్చని ఛానల్ “TV9”

  • 11:03 ఉద. వద్ద డిసెంబర్ 16, 2012

   వెన్నెల గారు: పిల్లలకి ఇష్టమైనవి మూడో నాలుగో నేషనల్ లెవెల్లో ఉన్నాయి. Pogo, Cartoon Network వంటివి. అవి తెలుగు కాదు కాబట్టి లెక్కించలేదు. వార్తా ఛానెళ్ళలో నచ్చినవేమన్నా ఉన్నాయా?

 2. 1:51 సా. వద్ద డిసెంబర్ 15, 2012

  నాకు media అంటే

  టీవీ చూడటం ద్వారా touch లో ఉండటం అలవాటు, అది క్రమేపి ఇష్టం, తదుపరి అభిమానం గా మారింది, ఆపై అభిమానం కొద్ది, నాగ సూరి వేణుగోపాల్ గారు రాసే టీవీ కార్యక్రమాల రివ్యూ లను మిస్ కాకుండా

  చదివేవాడిని, నాకంటూసొంత రీసెర్చ్ చేసాను ఒకా 6 or 7 యేండ్ల క్రితం నుంచే…..

  అంతకు మునుపు

  ఓం నమః శివాయ , జై హనుమాన్ చూస్తూ ప్రశాంతం గా గడిచిన బాల్యం కొద్దికాలానికి

  జెమినీ టీవీ లో శుభోదయం, మర్మదేశం ఈనాడు టీవీ లో పాడుతా తీయగా, గుప్పెడు మనసు, రహస్యం తో వేగం పుంజుకుని సాగింది.

  ఆపై కొద్ది కాలానికి క్రమంగా ఒక్కొక్కటి చానెల్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
  ఆపై నా మైండ్ లో మీడియా పై ఆసక్తి కాస్తా నేను మీడియా కి ఎందుకు దూరంగా ఉన్నాను అనిపించి అటుగా అడుగులు వేసేలా చేసినా నా అడుగు అటుకేసి సాగలేదు.

  ఈలోపు సంస్కృతి భక్తి రానే వచ్చాయి ఒక సంవత్సరం సరిగ్గా వాటితో సహవాసం

  complete అనే పదం లో కొంతను మినహాయిస్తే నా స్వభావం ఆలోచనా సరళి లో మార్పు వచ్చేసింది.

  నడుస్తున్నాను కాస్తా నడపబడుతున్నాను అని తెలిసేది. ఇక ఆసక్తి అనగారింది ….

  కాని బ్లాగ్ ప్రపంచానికి వచ్చాక పూర్వపు వాసనలు బయటకొచ్చి

  నా బ్లాగుని ఒక టీవీ aggregator గా మార్చుకున్నాను ….

  ఇప్పుడు అన్నీతీసేసాను ఇంట్లో టీవీ కూడా ఉంచలేదు …..

  TV పుట్టాక పుట్టిన Generation కు మటుకు టీవీ అనేది కూడా పంచ భూతాలతో పాటు అదనంగా చేరిన 6వ భూతం

  ఇప్పటి వాళ్ళకైతే 7వ భూతం గా అంతర్జాలం ని అభివర్ణించవచ్చు.

  ………………………………………………………………………….
  పైన రాసినదంతా మీ పోస్టుకు సంబంధం ఉండకపోవచ్చు
  కాని సముద్రం లో ఉన్న మంచు పర్వతం పైన ఎంత ఉంటుందో దానికి 3 ఇంతలు క్రింద నీళ్ళల్లో ఉంటుందంట ….ఇది అలాంటిదే..

  comment పోస్టు చేయటానికి సదుపాయం కల్పించినండులకు కృతజ్ఞతలు.

  ఇక ఈ వార్త చానళ్ళు అంటారా…

  ఈనాడు పత్రిక కు చెందినా చానెల్ అవటం వలన ఈనాడులో వార్తలు తెలుగు వార్తల్లా అనిపించేవి దూరదర్శన్ దాటిన రొజుల్లో
  జెమినీ వార్తలతో compare చేస్తే … ఈనాడులో గంటకోకమారు న్యూస్ హెడ్లైన్స్ చదువుతుంటే.. తేజ టీవీ లో న్యూస్ headlines పేరిట crawling వచ్చేది.

  అప్పట్లో ఇప్పటి టీవీ 9 రవిప్రకాష్ గా పిలువబడుతున్న వ్యక్తి నేపథ్యం లో తేజ టీవిలో encounter అనే ప్రోగ్రాం సర్వ శ్రేష్టంగా ఉండేది.

  తరువాత టీవీ 9 క్రమంగా ETV 2 రాకతో news చానళ్ళ ఆవిర్భావం ఆంధ్రలో మొదలైంది.

  ఈ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అనేది అద్భుతమైన వ్యాపారం అనేది నా మనసుకి అర్థం అయ్యింది.

  ఈ మద్య హిందీలో వచ్చిన RUSH అనే మూవీ లో చూపినట్లు న్యూస్ చూపక పోయినా

  మన తెలుగు వార్తా చానల్లు ఏది వార్త ఏది కాదో అనే విషయాన్ని వారు మరచి పోవటం తో పాటు ప్రజలను మరిపింప చేసారు.

  మన చానల్ కు అంటూ ఒక ఎజెండా ఉంది, దేశం లో ఏమి జరిగినా సరే మనకున్న హద్దులు మనవే …

  మనం అది వార్తగా చెప్పగలగాలి, అదీను మనదైన దృష్టి లోనే చెప్పాలి

  ఉన్నది ఉన్నట్లు చెప్పనే కూడదు.

  అదేమంటే అదేదో సినిమాలో అన్నట్లు జనాలు చేంజ్ కోరుకుంటున్నారు అనేది సమాధానం.

  ఫైనల్గా ఉన్నది ఉన్నట్లు చూపేవారు తక్కువే చూసేవారు తక్కువే….

  సరైన మార్గంలో మీడియా ను వినియోగించినట్లితే ప్రజా చైతన్యం మాత్రమె కాక దేశ ప్రగతి కూడా మీడియా ద్వారా సాధ్యమే అని నా అభిప్రాయము….

  ?!

 3. Chandu
  1:15 ఉద. వద్ద జనవరి 6, 2013

  ఒక్కటంటే ఒక్కటి కూడా సైన్స్ కి సంబంధించిన ఛానెల్ లేదు. హైందవ ఛానెల్, క్రైస్తవ ఛానెల్ అవీ ఇవీ ఉంటాయి కానీ.

  ఒక్కో కులానికి ఒక్కో వార్తా ఛానెల్. మెరుగైన సమాజం కోసం అంటాదు – చేసేది మొత్తం రంకే.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s