ముంగిలి > శిరోభారం > ‘రేప్‌’ అన్న పదాన్ని రేప్ చేస్తున్నారా?

‘రేప్‌’ అన్న పదాన్ని రేప్ చేస్తున్నారా?

ఢిల్లీలో ఉన్న పరిచయస్తులు, వార్తా మాధ్యమాలలో రాని ఒక విషయాన్ని (గాలి వార్త) చెప్పినపుడు, ఒళ్ళు గగుర్పొడిచింది. 23 ఏళ్ళ అమ్మాయితో  జరిగినది మాన భంగమో లేక అత్యాచారం మాత్రమే కాదు; అత్యంత హేయమైన అమానుష కృత్యం. వారు నాకు తెలిపిన విషయం నిజం కావచ్చూ కాకపోవచ్చు. ఏది ఏమయినా, ఆ అమ్మాయికి జరిగినది – దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఆ యువతితో జరిగినది మరింకెవరితోనూ జరుగ కూడదు.

ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం, దేశాన్ని ఆత్మావాలోకనం చేసుకొనే దిశలో నడిపింది. తర్జన భర్జనలు మొదలు అయ్యాయి. 16 ఏళ్ళ క్రితం కేరళలో జరిగిన ఒక అన్యాయం బయటికి వచ్చింది. పరారీలో ఉన్న ఒడీషా మాజీ DGP కొడుకు విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి హర్షనీయ పరిణామాలు. ఇంతకాలం సిగ్గు విడిచి మరిచిన దురాగతాలు, ఆ అమ్మాయి పుణ్యమా అని మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఆ 23 ఏళ్ళ అమ్మాయి మృతికి ఇవి సరైన నివాళులు.

మాన భంగాలూ, అత్యాచారాలూ, హత్యలూ వంటివి ‘టైం పాస్‌’ విషయాలు కావు. అత్యంత గంభీరమైనవి. ఇలాంటివి జరుగకూడదు. కానీ సమాజం అన్నాక మనిషి రూపంలో తిరుగాడే రాక్షసులూ ఉంటారు. అప్పుడప్పుడూ తమ ఉనికిని చాటుతూ ఉంటారు. ‘ఇడిగిడిగో మనిషి వన్నె రాక్షసుడు ఒకడు దొరికాడు’ అని గుర్తించి, అలాంటి సంఘటన మరొకటి జరుగకుండా జాగ్రత్త పడగలిగితే, సమాజం మెరుగు పడుతుంది. కానీ అలా కాక ‘రేప్‌’ అన్నది ఓ సెన్సేషనల్ వార్త అని భావించి ఐన దానినీ కాని దానినీ ‘రేప్‌’ పేరిట ప్రస్తావిస్తే ఆ పదం పలుచనైపోతుంది.

ఇప్పటికే సమాజంలో కొందరు మాన భంగానికి గురైన వారిని చిన్న చూపు చూస్తుంటారు. ‘ఆఁ! ఆ అమ్మాయి అనుమతి లేకుండానే జరిగుంటుందా’ అని నోళ్ళు వెళ్ళబుచ్చుతారు. కారణం ప్రతీ సంఘటననూ మాన భంగం కింద చిత్రించడమే అని నా అభిప్రాయం. మాన భంగాల వంటివి సమాజం సిగ్గు పడవలసిన విషయాలు. అటువంటి గంభీరమైన పదాలను విచ్చలవిడిగా ప్రయోగిస్తూ దానికున్న గాంభీర్యాన్ని పలుచన చేయడం వల్ల ఇవాల్టి పూట గడిచి పోవచ్చు. కానీ రేపెన్నడో ఓ ఆడ కూతురుకు నిజంగా అన్యాయం జరిగితే, నేటి నిర్లక్ష్యం యొక్క దుష్ఫలితాన్ని తాను అనుభవించాల్సి వస్తుంది. అన్యాయం జరిగి చితికిపోయిఉన్న ఆ వ్యక్తికి ఊరట కలిగించే బదులు, సమాజం చిన్న చూపు చూస్తే – పుండు మీద కారం చల్లినట్లుంటుంది.

ఇంతకాలం నాకో కూతురు లేదే అన్న బాధ ఉండేది. కానీ వార్తా మాధ్యమాలు ఊదరగొడుతున్న విధానం వల్ల – ఉన్నట్టుండి ఆ బాధ కాస్తా ‘హమ్మయ్య! నాకు కూతురు లేదులే’ అన్న భావనలోకి రూపాంతరం చెందింది. వయసొచ్చిన కూతుళ్ళున్న తల్లి దండ్రులు ఇప్పుడు వస్తున్న వార్తలను చూసి ఎంతగా మదన పడిపోతూ ఉంటారో పాపం. ఇవాళ పొద్దున పేపరు తిరగేస్తే ఒక వార్త. నిన్న రాత్రి 11:30 PM ప్రాంతాల్లో నిర్మానుష్యంగా ఉండే ప్రదేశానికి ఒక కుర్రాడితో బైక్ మీద వెళ్ళిన అమ్మాయి ‘రేప్‌’ జరిగిందని! ఏఁవన్నా అర్థం పర్థం ఉన్నదా?!?

ఇప్పటికే మన దేశంలో ఆడ పిల్లల పెళ్ళిళ్ళకయ్యే ఖర్చుకు జడిసో లేక అరకోరగా అర్థం చేసుకొన్న విశ్వాసాల కారణంవల్లనో Female foeticide అన్నది ప్రబలంగా ఉన్నది. బాధ్యతా రహితమైన పద ప్రయోగాలతో కూడిన వార్తలను ప్రచారం చేయడం వల్ల మరో కొత్త కారణం తోడవుతుంది – గర్భంలోని ఆడశిశువుల ప్రాణాలు తీయడానికి. Every action will have an equal and opposite reaction; at times instantly and in some cases it takes time!

ఇదో అరణ్య రోదన…

ప్రకటనలు
  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు
    9:31 సా. వద్ద జనవరి 7, 2013

    ఏమిటో కొందరు కొందరు చేస్తున్న పనిని అందరూ చేస్తున్నట్టు చూపిస్తున్నారు.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s