ముంగిలి > పిచ్చాపాటి > విక్టోరియా రాణి ఏమి పుణ్యము చేసుకొందో!?!

విక్టోరియా రాణి ఏమి పుణ్యము చేసుకొందో!?!

తిరుమల తిరుపతి దేవస్థానం వారి కాలెండరులు అద్భుతంగా ఉంటాయి. నిజానికి కాలెండరు అనేది నెపం మాత్రమే! ప్రతి నెలా ఆ తిరుమలేశునీ, ఆయన పరివార దేవతలనూ నిండుగా చూసుకొనే చక్కటి ఆవకాశన్ని కలుగజేస్తాయి. ప్రతి యేడు టీ.టీ.డీ. ముద్రించే కాలెండరు ఇంటికి తెచ్చుకొని సంతోషిస్తూ ఉంటాము.

ఈ 2013వ సంవత్సరం జనవరి మాసానికి, మలయప్ప స్వామివారి దివ్య మంగళ విగ్రహం యొక్క చిత్రాన్ని అందించారు. ఇంట్లో అటూ ఇటూ తిరుగాడుతున్నపుడు, కాలెండరు పుణ్యమా అని ఆయన దర్శనం దొరుకుతూ ఉంటుంది.

2013 జనవరి మాసం - మలయప్ప స్వామివారి మూర్తి

2013 జనవరి మాసం – మలయప్ప స్వామివారి మూర్తి

ఈ రోజు పొద్దున కాస్తంత నిశితంగా పరిశీలిస్తే, ఒక విశేషం కనిపించింది. ఆయనకు అలంకరించిన ఆభరణాలలో (బంగారు కాసుల పేరు), విదేశీ వనిత రూపు కనిపించింది.

మలయప్ప స్వామివారి ఆభరణం - బంగారు కాసుల పేరు

మలయప్ప స్వామివారి ఆభరణం – బంగారు కాసుల పేరు

ఈ రూపు ఎవరిదై ఉంటుందా అన్న ఉత్సుకత కలిగింది. ఇంటర్‌నెట్లో వెతికితే సమాధానం దొరికింది. 1837 నుండి 1901 వరకు రాజ్యాన్నేలిన రాణీ విక్టోరియా (Queen Victoria) యొక్క రూపు అది. జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్ని నాణాలమీద ఉన్న రూపులు ఒకెలా లేవు. కాస్తంత భిన్నంగా ఉన్నాయి. కారణం, అ బంగారు నాణాలు ముద్రించినపుడు ఆవిడ వయసుకుతగ్గ రూపాన్ని వాడారు. 1838 నుండి 1887 వరకు వీటిని ముద్రించారట. ఒక నమూనా యొక్క చిత్రం దొరికింది.

Queen Victoria on a Gold Sovereign

Queen Victoria on a Gold Sovereign

అహో ఏమి భాగ్యమో కదా! ఆవిడ ఏమి పుణ్యము చేసుకొన్నదో! స్వామివారిని అలంకరిస్తూ మిలమిలా మెరిసిపోతున్నాయి – ఆవిడ రూపు ఉన్న నాణాలు. వీటిని భద్రంగా చూసుకొంటునట్లే, కాళహస్తిలో కృష్ణదేవరాయలు కట్టిన గోపురాన్ని, శ్రీశైలంలో శివాజీ కట్టించిన గోపురాలనూ కూడా జాగ్రత్తగా కాపాడుకొనుంటే కూలిపోయే దురవస్థ పట్టి ఉండేది కాదేమో!

ప్రకటనలు
 1. Chandu
  1:54 ఉద. వద్ద జనవరి 12, 2013

  అదెలా సాధ్యం సార్? విక్టోరియా రాణి ఏమన్నా స్వామి గారికి సమర్పించిందా? దీని చరిత్ర తెలిసి ఉంటే చెప్పగలరు.

  “”””భద్రంగా చూసుకొంటునట్లే, కాళహస్తిలో కృష్ణదేవరాయలు కట్టిన గోపురాన్ని, శ్రీశైలంలో శివాజీ కట్టించిన గోపురాలనూ కూడా జాగ్రత్తగా కాపాడుకొనుంటే కూలిపోయే దురవస్థ పట్టి ఉండేది కాదేమో!””””
  ఈ విషయం చూసి చాలా బాధ కలిగింది. మన చరిత్ర ను, కట్టడాలనూ కాపాడుకోవాలి సార్.

 2. అనామకం
  11:28 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2013

  ఇందులో సాధ్యాసాధ్యాల తికమక ఏముంది? అప్పట్లో బంగారు నాణేలు currency గా చలామణీ అయ్యేవి. చిన్నప్పుడు, మా నాన్న దగ్గ ఉన్న collection లో వెండి (pure silver) ఒక్క రూపాయి నాణెం చూసిన గుర్తు. అంటే, ఒక్క తులం (10/12 గ్రాములు) వెండి విలువ ఒక్క రూపాయి. ఇది independence తర్వాత విషయం. ఇక 1837 అంటే… వింతేంఉంది.

 3. 3:53 సా. వద్ద ఫిబ్రవరి 10, 2013

  swamivari divyamangalaruupamu nyanaanandakaram kadukamaneeyam aadarsanaanni chinichinnigramalloni prajalaku andinchagalgithe desam subhiskshamavutundi managurinchi manasaampradayalagurinchi manabhagavanthuni goppatanamgurinchi gramallo evarikii teliyaka anyamataluvallu cheppematalku praloobhapadi entomandi matham marchukuntunnaru !! kaadu kondaru drustulu kaasulakoosamkakkurtipadi maarustunnaru dayachesi daanniaapandi amaayakapujanam nejameedotheliyaka pralobhalakugurai sontavaaru maraninchina maadivaeraematham ayyagaru velloddannarani kaneesam kadachuupukikuudanochuleka poothunnaru nijam ilaagee vadileesthe konnallaku sampradaayalu anni kanumarugavuthaayi mana deevullanu deyyaluga chuputaaru ippatike alge anusaristunnaru jai srinivasaa

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s