ముంగిలి > పిచ్చాపాటి > విషం చిమ్మని వార్త / 1

విషం చిమ్మని వార్త / 1

ఫిబ్రవరి 8, 2013

మీడియాలో వచ్చే విష పూరిత వార్తలను భరించలేక, బ్లాగుల ప్రపంచానికి ఆకర్షితుడనై 2011 లో బ్లాగులను, ముఖ్యంగా తెలుగు బ్లాగులను చదవడం మొదలు పెట్టాను. కానీ, కొద్ది కాలంలోనే విషాన్ని చిమ్మే జాడ్యం ఇక్కడ కూడా ఉన్నదని తెలిసొచ్చింది. ఉగాది పచ్చడిలో షడ్రుచులూ ఉంటాయి – ఒక్క వేప పువ్వు మాత్రమే కాదు. అలాగే మన జీవితాలలో అన్ని అనుభూతులూ ఉంటాయి. కానీ ఎందుకో – మనుషులను కొన్ని వర్గాల కింద విడగొట్టి వారి మధ్య విభేదాన్ని పెంచే చేదు వార్తలనే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. మన చుట్టూ జరిగే మంచిని పట్టించుకోరు. ఇవాళ ‘The Hindu’ ఆంగ్ల పత్రికలో ఒక వార్త ప్రచురితమయింది. ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోరో లేక కనపడవో!

Clip from The Hindu Newspaper published on Feb 08, 2013

Clip 1 from The Hindu Newspaper published on Feb 08, 2013

Clip 2 from The Hindu Newspaper published on Feb 08, 2013

Clip 2 from The Hindu Newspaper published on Feb 08, 2013

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:,