ముంగిలి > శిరోభారం > పరియవసానం?

పరియవసానం?

చెప్పుకోదగ్గ వృత్తితో సంబంధం, బాగా డబ్బూ ఉన్న ఒక వ్యక్తి. అంగబలం కూడా పుష్టిగా ఉన్నది. అతనికి ఏడవ తరగతి చదివే కొడుకు. భయంకరమైన గారాబం. ఫలితంగా ఆ అబ్బాయి మహా తుంటరిగా తయారయ్యాడు. కొడుకును ఎవరన్నా ఏమన్నా అంటే ఆ తండ్రి ఊరుకోడు. ఆకతాయితనానికి ఈ అండ తోడయింది. పాఠశాలలో ఉపాధ్యాయులు ఏమన్నా అంటే, వాడు తన తండ్రికి చెప్పటం; మరుసటిరోజు ఆ తండ్రి వొచ్చి గొడవపడటం కొన్ని సార్లు జరిగి ఉన్నందున – ఆ పిల్లాడి గురించి తెలిసిన ఉపాధ్యాయులు జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు. కానీ ఒక రోజు మరీ హద్దు మీరే సరికి ఆ పిల్లాడిని శిక్షించడానికి ఒక్కటిచ్చింది – ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయని. వెళ్ళి తండ్రికి ఫిర్యాదు చేశాడు ఆ పిల్లాడు. కోపంతో ఊగిపోతూ సతీ సమేతంగా పాఠశాలకు విచ్చేసి భీభత్సాన్ని సృష్టించాడు ఆ తండ్రి. ‘ఎవర్రా నా కోడుకు మీద చెయ్యి వేసింది’ అని నోటికొచ్చిన బూతులు తిడుతూ ఊగిపోయాడు. అక్కడ ఉన్న గాజు గ్లాసులు పగిలాయి; పక్కనే ఉన్న ఎయిర్ కూలర్ తన్నులు తిన్నది. ఒక ఉపాధ్యాయుడు ఎదురుపడితే – ‘నువ్వా కొట్టింది చెప్పు’ అని అతని కాలరు పట్టుకున్నాడు. అదుపు తప్పిన కోపాన్ని గమనించిన అతని భార్య నచ్చజెప్పబోతే, అందరి ముందూ ఆవిడమీద చేయి చేసుకొని పక్కన ఉండమని గద్ధించాడు. ఈ తతంగం తెలిసి, అతడితో మాట్లాడాలని బయలుదేరిన ప్రధానోపాధ్యాయనిని ‘వొద్దు మేడమ్‍! మీరు అతని ముందుకు వెళ్ళకండి’ అని అతనితో మాట్లడటానికి వెళ్ళనీయక సిబ్బంది అడ్డుపడింది.  చాలా సేపు బూతులు తిడుతూ, అరుస్తూ నానా రభసా చేశాడు. ప్రెస్సును పిలిపిస్తాను. మీ మీద కేసులు వేస్తాను అని కొన్ని సెక్షన్లు ఉటంకించాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న పిల్లలు, సంతోషంతో చప్పట్లు చరిచారు. ఇక నుండి టీచర్లు మనల్ని ఏమీ చెయ్యలేరు అని మురిసిపోయారు.

కొసమెరుపు: ఇది జరిగింది ఏ ప్రభుత్వ పాఠశాలలోనో కాదు…కాస్తంత పేరున్న ఒక ప్రైవేట్ స్కూలులో…

ప్రకటనలు
 1. 9:32 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2013

  భావి మహానేతను తయారు చేస్తున్నందుకు గర్వించక ఇదేమి అల్లరండీ 🙂

 2. pavani nagendra prasad
  7:02 సా. వద్ద ఫిబ్రవరి 21, 2013

  ఇక్కడ గమనించాల్సింది అటువంటి తండ్రిని మందలించడం పోయి అందరూ చోద్యం చూడడం.

  • 9:16 సా. వద్ద ఫిబ్రవరి 21, 2013

   ఆడా మగా అని లేకుండా ‘నువ్వా కొట్టింది’ అని అందరి మీద మీదకి వెళ్ళి అడిగాడు. ఆ దెబ్బకు అందరు హడలిపోయి పక్కకు తప్పుకొని, నా మీద పడకపోతే చాలు అని బిక్కు బిక్కు మంటూ నిలబడిపోయారు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s