ముంగిలి > శిరోభారం > బాంబులు పేలినా సరే! చోద్యం చూడాల్సిందే!

బాంబులు పేలినా సరే! చోద్యం చూడాల్సిందే!

రోడ్డు మీద ఒక ప్రమాదం సంభవిస్తుంది. చిన్నదో లేక పెద్దదో. ఆ దుర్ఘటన జరిగిన చోటు నుండి కిలోమీటరు మేర వాహనాల రాకపోకలు స్థంబించిపోతాయి. ఏ 108 ఆంబులెన్సో లేక మరో ఆంబులెన్సో కూత వేసుకొంటూ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోడానికి నానా అగచాట్లు పడుతుంది. ఆ ప్రమాదం జరిగిన చోటు వాహనాలు ఇరుక్కు పోతాయి. ప్రమాదం జరిగినందుకు కాదు, ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ ప్రదేశానికి చేరుకొన్న ప్రతీ వాహనం గతిని తగ్గించి – దాని చోదకుడు ఆత్రంగా ఏమి జరిగిందోనని తెలుసుకోవాలన్న తపన వల్ల.

కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలూ అన్నీ! దిగి సహాయం చేయాలన్న ఆలోచన ఉండదు కానీ, ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆత్రం. ఒకరిద్దరు మాత్రం మనుషులు ఉంటారు. పక్కనే వాహనాన్ని నిలిపి సహాయం చేయడానికి పూనుకొంటారు. మిగతా అందరూ తమ వాహనాల గతిని తగ్గించి తమ వంతు విఘాతము కలిగించి, ఒకో సారి ప్రాణాల మీదకే తెస్తారు. వీరి ఆత్రం పుణ్యమా అని రాకపోకల గతి తగ్గి, ఆ రద్దీలో ఆంబులెన్సు సరైన సమయానికి చేరుకోలేక ప్రమాదానికి లోనైన వ్యక్తి ప్రాణాలు పోతే?

అన్ని చోట్లా ఈ చోద్యం చూసే ప్రవర్తనే! నిన్న హైదరాబాదు బాంబు పేలుళ్ళ దృశ్యాలు టీ.వీ. లో చూస్తున్నపుడూ ఇదే తంతు. శవాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. ప్రదేశం రక్తసిక్తమయి ఉన్నది. గాస్ సిలిండర్లు చెల్లా చెదరుగా పడి ఉన్నట్టు కనిపించింది. మరింకేవన్నా పేలని బాంబులు ఉన్నాయా అనే అనుమానం. అయినా సరే. వెళ్ళి చోద్యం చూడాలి. సెల్ ఫోన్లతో ఫొటోలు తీయాలి. పోనీ ఒక సారి చూసి వెళ్ళిపోయినా అనుకోవచ్చు. అక్కడే ఉండి ఏమి జరుగుతున్నదో చూసి తీరాల్సినదే! పోలిసుల పనికీ, సహాయక చర్యలకూ అడ్డం పడుతున్నామని తెలిసినా సరే! ఉత్సుకతను మాత్రం ఆణుచుకోలేము. కీలక సాక్ష్యాలు చెరిగిపోవచ్చు. ప్రాణాలు కొన ఊపిరితో బిగపట్టుకొనున్నవారికి సహాయం అందడంలో జాప్యం జరుగవచ్చు. ఐతే మాత్రం? ఇలాంటి Terror Tourism అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా?

మనకు అన్నీ ఒకటే. సినిమా షూటింగ్ అయితేనేమి, ప్రమాదం అయితేనేమి, బాంబు పేలుళ్ళు అయితేనేమి? చుట్టూ గుమిగూడుతాం, చోద్యం చూస్తాం!

ప్రకటనలు
 1. 12:24 సా. వద్ద ఫిబ్రవరి 22, 2013

  మీరు చెప్పింది నిజం..

  నేను నిన్న TV లో చూసినప్పుడు 108 వాహనం అతి కష్టంగా ఆ traffic లో పోవడం …చాలా బాధేసింది … మన వాళ్ళు ఎవరైనె ambulance లో ఉంటె తప్ప …ఆ బాధ బయటి వారికి తెలియదు…..

  కొంత మంది మీరన్నట్టు సహాయం కోసమే వస్తారు …..Hats Off to them !

  ఈ సందర్భం లో ఇంకో విషయం చెబుతాను….నేను రోజూ వెళ్ళే దారి లో కనీసం 2 ambulance లను చూస్తాను …అవి కూత పెట్టుకుంటూ అతి కష్టంగా….traffic లో సతమత పడుతుంటాయి …వాటికి దారి ఇవ్వాలని …కనీసం దారి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలని చాల మందికి తెలియదు అంటే …ఆశ్చర్యం వేస్తుంది …కొంత మంది దారి ఇచ్చినట్టే ఇచ్చి…వాటిని folllow చేస్తారు …ఇది ఎంత ప్రమాదామో వారికి అర్ధం కాదు……

  ఇటువంటి సందర్భాలలో సగటు మనిషి ఎలా ప్రవర్తించాలి అని మన ప్రభుత్వం media సహాయంతో చూపిస్తే బాగుంటుంది….అని నా ఉద్దేశం… .. కనీసం అది చూసైనా తెలివి తెచ్చుకుంటారని అనుకుంటున్నాను ………

  • 10:16 సా. వద్ద ఫిబ్రవరి 22, 2013

   ధర్నాలలో లాఠీ చార్జ్, కొత్త సినిమా విడుదల అయినపుడు లాఠీ చార్జ్, ఏదన్నా షోరూమ్ ప్రారంభోత్సవం జరిగితే లాఠీ చార్జ్, దీని సిగదరగ – బాంబు పేలినపుడు కూడా లాఠీ చార్జ్. మంచిగా చెబితే వినే రకాలము కాదాయె. మంచి మనిషికో మాట, మంచి పశువుకో దెబ్బ అంటారు. ఈ లెక్కన మనం ఎవరమో?!?

 2. 7:10 సా. వద్ద ఫిబ్రవరి 22, 2013

  >>ఐతే మాత్రం? Terror Tourism అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా?

  Well Said

 3. 8:01 సా. వద్ద ఫిబ్రవరి 22, 2013

  మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.మనకి క్రమశిక్షణ లేదు.(no discipline).మన ప్రజలు నేర్చుకోవలసినవి,పాటించవలసినవి చాలా ఉన్నాయి.

 4. 1:22 ఉద. వద్ద ఫిబ్రవరి 23, 2013

  ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత గంటను అంటే అరవై నిమిషాలను ‘ గోల్డెన్ అవర్ ‘ అని అంటారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలలో లభించే వైద్య సహాయం ఎంతో విలువైనదే కాకుండా , ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుంది. ఈ విషయం శాస్త్రీయం గా రుజువు అయింది కూడా !
  పాశ్చాత్య దేశాలలో ( ఉదాహరణకు ఇంగ్లండు లో ) ఉగ్రవాదుల దాడి సమయం లో జరిగే వైద్య సహాయాలను ఎప్పటి కప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు !
  ప్రపంచీకరణ పేరుతో కార్లూ బైకులూ, భారత దేశం లో జనాల సంఖ్య ను మించి పోయేట్టు గా వస్తున్నాయి !
  ఉగ్రవాదుల దాడులే కాకుండా, కనీసం ఒక లక్ష మంది జనాలు, కేవలం రోడ్డు మీద , మోటారు వాహన ప్రమాదాల వల్ల ప్రతి ఏటా భారత దేశం లో మరణిస్తున్నారు ! అవును అక్షరాలా లక్ష మంది !
  ప్రమాదాలన్నీ ఘోరమే ! రోజుకు కనీసం వంద చానెళ్ళ టీవీ చూసే అవకాశమూ, ప్రతి ఒక్కరికీ సెల్ ఫోను ఉండే అవకాశమూ ఉన్నా , ఇట్లాంటి ప్రాధమిక విషయాల మీద ప్రజలకు అవగాహన స్వల్పమే ! తమ ప్రాణాలే కాకుండా , ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనదే అనే విషయం ప్రతి పౌరుడికీ ఎప్పుడూ గుర్తు ఉండాలి ! ప్రతి వ్యక్తి లోనూ చైతన్యం రావాలి !
  ట్రామా సెంటర్లు, ప్రధమ చికిత్స ఏర్పాట్లూ, ఈ గోల్డెన్ అవర్ ను దృష్టిలో ఉంచుకుని పధక రచన చేయాలి !
  ఎవరు చేయాలి ? ఎప్పుడు చేయాలి ? ఎందుకు చేయాలి ? ఎట్లా చేయాలి – ఈ ప్రశ్నలకు సమాధానాలు దేవుడికే పట్టట్లేదు ! ఇంక ” మానవులకేం ” పడతాయి ?
  ( ఇక్కడ ఉగ్రవాదుల మాట ఎత్తడం లేదు ఎందుకంటే, అమాయక ప్రజల ప్రాణాలను ఘోరం గా హరించి వేస్తున్న వారు మానవుల కోవలోకి రారు కదా ! )

  • 10:22 సా. వద్ద ఫిబ్రవరి 23, 2013

   అవును. అవి చాలా అమూల్యమైన ఘడియలు. ఆ గంటలోపల సరైన వైద్య సహాయం అందడం, అందకపోవడం ఆ బాదితుడి ప్రాణాలు నిలవడం, నిలవకపోవడాన్ని నిర్ధారిస్తాయి.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s