ముంగిలి > మన సంస్కృతి > ఎక్కడి మానుష జన్మంబెత్తిన…అన్నమయ్య కృతి

ఎక్కడి మానుష జన్మంబెత్తిన…అన్నమయ్య కృతి

కాకతాళీయంగా యూట్యూబ్‍లో అన్నమాచార్యులవారి కృతి “ఎక్కడి మానుష జన్మంబెత్తిన…” ఎదురుబడింది. ఆ కృతికి ప్రియా సిస్టర్స్ గాత్రం తోడై ఒక అద్భుత అనుభూతికి లోను చేసింది. ప్రియా సిస్టర్స్ CDలు ఇంచుమించుగా అన్నీ సేకరించినప్పటికీ, ఈ కృతి నా వద్ద లేనందున మొదటిసారి వినడం. ప్రతి మనిషీ ఈ కృతిలోని భావనలకు ఎన్నడో ఒకనాడు లోనై ఉంటాడు.

నేనెన్నో తప్పులు చేస్తున్నాను అని చెబుతూనే అంతా నీ మాయ అని ఆ స్వామివారిని తన పరిస్థితికి కారణంగా అద్భుతమైన రీతిలో కొనియాడారు. నిజమే, శ్రీమద్భగవద్గీతలో ‘నా మాయ దాట శక్యం కాద’ని ఆ గీతాచార్యుడే చెప్పాడాయె!

:: శ్రీమద్భగవద్గీత – విజ్ఞాన యోగము ::
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ 14 ॥
దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యము కలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నా యొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. అయినను ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారు ఈ మాయను దాటివేయగలరు.

ప. ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది,
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను.
చ. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము,
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ.
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము,
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ.
చ. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు,
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయ.
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును,
విడిచెద ఆచారంబును విష్ణుడ నీ మాయ.
చ. తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధంబుల,
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా.
అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై,
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ.
ప్రకటనలు
 1. 8:50 సా. వద్ద ఆగస్ట్ 28, 2013

  చాలా కాలంతరవాత టపా రాశారు. బాగుంది.

  • 12:04 ఉద. వద్ద ఆగస్ట్ 29, 2013

   అవునండీ. ఈ మధ్య విపరీతమైన పని వొత్తిళ్ళ వల్ల పిచ్చాపాటిగా రాయలేకపోతున్నాను. పైపెచ్చు Divine names లో రోజుకొక నామం చొప్పున రాసుకొంటున్నందున ఉన్న కొద్ది సమయం కూడా దానికే కేటాయించడం జరుగుతోంది.

 2. 9:47 ఉద. వద్ద ఆగస్ట్ 29, 2013

  అన్నమాచార్యులవారి ఈ కీర్తన ఇదే చూడటం. బాగుంది సహజంగా.
  ఒక చిన్న సూచన: బ్లాగు కామెంట్లలో లింకులు ఇవ్వాలంటే ఇలా చేయండి:

  ఉదాహరణకు మీ లింకు అడ్రసు http://www.y2do.blogspot.com అనుకోండి. అలాగే ఆ పేజీ పేరు Blogging Basics. అనుకోండి అప్పుడు ఇలా కామెంట్లో టైప్ చేస్తే సరిపోతుంది. Blogging Basics. అనే పేరుతో మీ లింకు కనిపిస్తుంది.

  Blogging Basics.

 3. 10:40 ఉద. వద్ద సెప్టెంబర్ 15, 2013

  తెలుగు భావాలు బావున్నాయి

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s