About

తెలుగు వచ్చా – అంటే వచ్చు. పాఠశాలలో ఇంగ్లీషు మీడియమ్ చదువు. రెండవ భాష హిందీ. వృత్తి పరంగా ఎట్లాగూ తెలుగుతో పెద్ద అవసరం ఉండదు. వీటి పరిణామం – నా వాడుక తెలుగుమీద కూడా చూపించటం మొదలుపెట్టింది. ఆలోచనలు కూడా ఆంగ్ల భాషలోనే! ఏమాటాకామాటే చెప్పుకోవాలి – నా మీద నాకే ఏహ్య భావం కలిగింది. ‘తెలుగు కుటుంబంలో పుట్టాను’ అని తప్ప, ‘తెలుగువాడిని’ అని చెప్పుకోడానికి ఇంకే అర్హతలూ లేకుండా పోయాయి. 2011 సంవత్సరారంభంలో నా తెలుగు వాడకాన్ని బలవంతంగానైనా పెంచుకోవాలి – అని నిర్ణయించుకొని, ఈ ‘తెలుగుభావాలు’ బ్లాగ్ ప్రారంభించాను.

ఏమి రాయాలి? గుప్పెడంత మనసు, కోకొల్లలుగా భావాలు. కొన్ని మరచి పోతాను, కొన్ని దాచుకుంటాను. ఎన్నో సంఘటనలు శిరోభారాన్ని కలిగిస్తే, కొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వేడి నెత్తురో ఏమో? కొద్దిగా కోపిష్టివాడినేనని చేప్పుకోవాలి నా గురించి. కానీ మనిషిని మంచివాడినేనండోయి. ఎవరికి వారే మంచివారనిపిస్తారని కొట్టి పారేయకండి. తెలుగులో ఇతరులకు అభ్యంతరకరం కానివి ఏవైనా రాయాలని బుద్ధి పుట్టింది. నా ఈ బ్లాగు ఏ కోవకూ చెందదు. ఆలోచనలు ఎలా వస్తే అలా రాయడమే. ఈ బ్లాగులో బహిర్గతం చేసిన కొన్ని ఆవేశపూరిత భావాలు ఎవరినీ కించ పరచడానికి ఉద్దేశ్యించినవి కావు. ఒకటి రెండు సార్లు ‘హద్దు దాటాను’ అని అనిపించిన వెంటనే కొన్ని ప్రచురించిన టపాలను నిర్మొహమాటంగా తీసేశాను.

ఇంకో కారణం – నా భావాలను “Time Capsule” లో బందించడం. కొన్నేళ్ళ తరువాత ‘ఓహో! అప్పుడు అలా ఆలోచించానా’ అని నెమరువేసుకోడానికి.

అయినంత మటుకు ఇతరుల పేర్లు ఎత్తకుండా రాయాలని ప్రయత్నం. ఒకవేళ అపార్థం చేసుకొని ఒక టపా రాసి పడేస్తే, రేపు నిజం తెలిశాక బాధ పడకూడదన్న ఉద్దేశ్యం.


2011 – మొదటి సంవత్సరం

ప్రకటనలు
 1. Suvarna
  9:48 ఉద. వద్ద డిసెంబర్ 10, 2011

  ఆర్యా….
  మీ తెలుగు అభిమానానికి నా అభిహినందనలు..
  మీ టపాలు చదివాను.. మాకు బహుభాగా నచ్చినది …
  ధన్యవాదములు..

 2. 11:34 సా. వద్ద జనవరి 17, 2012

  Hi
  I read your blog post about kaashi. It is good.
  Please see my blog post / site called http://www.baagu.net and give your valuable comments. ( Sorry I could not reply in telugu at present )
  best wishes
  Sudhakar.

 3. B.umadevi
  10:34 ఉద. వద్ద జనవరి 22, 2012

  Dear sir, mee tapasulu anukokunda vinabadi(kana aid) chaala santosham kaliginchayi. Telugu type cheyyadam nerchukoledu. Retired Telugu readerni.mee bhavavyakteekarana haayigaundi.konasaginchndi.abhinandanalu. Dr.b.umadevi.

 4. 5:41 సా. వద్ద ఫిబ్రవరి 4, 2012

  వృత్తిపరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి తెలుగు అవసరమే. పల్లెటూర్లలో చాలా మందికి ఇంగ్లిష్ గానీ హిందీ గానీ రాదు కదా. సాఫ్ట్‌వేర్ లాంటి వృత్తులలో ఉన్నవాళ్ళే తెలుగు మర్చిపోతున్నారు.

 5. 8:33 సా. వద్ద ఫిబ్రవరి 4, 2012

  వీవెన్ గారికి మీ ఆశలూ,ఆశయాలూ బహుధా ప్రశంసనీయం.తెలుగు వచ్చా! అని అంత మాట అనేశారేమిటండీ? రాకుండా ఉంటుందా? అయితే తెలుగు భాష ప్రస్తుతం సవతి తల్లి లాంటిది.పర భాష కన్న తల్లి లాంటిది.అయి కూర్చుంది మన ముచ్చటైన తెలుగు వారికి..కాదంటారా?

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s