నిల్వలు

Archive for the ‘పిచ్చాపాటి’ Category

స్వామి కార్యం స్వకార్యం

ఇవాళ వార్తా పత్రికలలో వొచ్చిన ఒక వార్త నా దృష్టిని ఆకర్షించింది. 2005 కు ముందు ముద్రించబడిన రూపాయి నోట్లు మార్చ్ 31 తరువాత వాడుకలోనుంచి తొలగించబడతాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో అటువంటి పాత నోట్లను బాంకులలో మార్చుకోవాలి. పొద్దున్నే ఈ వార్తను చదివి ఎంతోకొంతమంది గుండెలు జారిపోయి ఉంటాయి. సాంప్రదాయకమైన పద్ధతులలో నల్ల ధనాన్ని నిలువ చేసుకొనే వారు, కంటి ముందు డబ్బు కనపడుతూ ఉండాలని ఆశించే వారు, ఎక్కువ మొత్తాలలో డబ్బును (నోట్ల కట్టలు) అటూ ఇటూ సరఫరా చేసేవారికి ఈ వార్త తలనొప్పే!

ఖచ్ఛితంగా ఈ నిర్ణయం, దాని అమలూ – నల్ల ధనాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి కలపడంలో సాయం చేయగలిగినప్పటికీ, ఒకటో రెండో ప్రశ్నలు…

  1. పార్లమెంటు ఎన్నికలు రేపో మాపో! ఈ నిర్ణయం వెనుక ‘స్వామి కార్యం, స్వకార్యం’ అనే కారణాలేవన్నా ఉన్నాయా?
  2. ఈ నిర్ణయం అమలువల్ల ద్రవ్యోల్బణం, రూపాయి (డాలరు) మారకం ధర మీద దుష్ప్రభావాలు ఉండవా?

వేచి చూడాలి…

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:,